অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కుజ గ్రహయానం – మంగళ్ యాన్

కుజ గ్రహయానం – మంగళ్ యాన్

ఆకాశం హద్దులు దాటితే వచ్చేదే అంతరిక్షం. ఆ అంతరిక్షంలో ఎన్నెన్నో వింతలు మరెన్నో అద్బుతాలు. అది మానవుని నుంచి ఆధునిక మానవుని వరకు ఆకాశం వైపు చూస్తే ఎన్నెన్నో ప్రశ్నలు. ప్రశ్న ఎప్పుడు జవాబు కొరకు చూస్తుంది. తెలియనిది ఎల్లప్పుడు తెలుసుకోవాలనే తృష్ణను రగిలిస్తుంది. ఈ తృష్ణే చైతన్యానికి పునాది. ఆ ఆగని చేతన్యమే శాస్తం. తన చుట్టూ ఉన్న విషయాన్ని నిర్ధారణ చేసుకున్న మానవులే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రగతికి బాటలు వేస్తున్నారు.

నిన్చంన్నంగా ఇది అంతరిక్షయుగం. ఎందుకంటే ప్రాచీన మానవుని ఖగోళ అంచనాలను - సిద్ధాంతలను పరిగణలోనికి తీసుకొని పోలిస్తే ఈ యాభైయేళ్లలో జరిగిన, జరుగుచున్న పరిశోధనలను పరిశీలిస్తే రోధసిని జయించే మహోజ్వలమైన నవీన యుగానికి నాంది పలుకుచున్నాడు కాబట్టి.

ఏమిటీ మంగళయాన్? భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంగారక గ్రహయాన్ కార్యక్రమానికి పెట్టిన పేరు మంగల్యాన్, ఈ ప్రాజెక్టును మామ్ (MOM - Mars Orbitary Mission) అని పిలుస్తుంటారు. 2013 నవంబర్, 05వ తేదీ శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C25 ఉపగ్రహ వాహక నౌక ద్వారా మంగళ్ యాన్ ను కక్ష్యలోని ప్రవేశపెట్టినప్పటి నుంచి అంతరిక్ష ప్రేమికుల నోటిలో ఈ పదమే నానుచున్నది. మంగళ్ యాన్ కక్ష్య దిశను మార్చారు, కక్ష్యా వ్యాపార్ధాన్ని పెంచారని, భూకక్ష్యలో ప్రవేశించిందని ఒక రోజు, సూర్య కక్ష్యలోనికి ప్రవేశించిందని మరొక రోజు ఇలాంటి వార్తలను వింటూనే ఉన్నాం. ఈ నెల 24వ తేదీ మంగళ్ యాన్ రోధసి నౌక అంగారక గ్రహకక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

ఎందుకీ మంగళ్ యాన్? మరో నివాసం కోసం. భవిష్యత్ తరాల అవసరాల కోసం. ఇంట్లో ఒంటరిగా ఉండి గుబులుగా ఉంటే మనమేం చేస్తాం. కాలక్షేపానికి పొరుగింట్లో ఎవరైనా ఉన్నారేమోనని చూస్తాం లేదా దగ్గర్లో ఉండే స్నేహితుని ఇంటికైనా వెళ్తాం. అంతే కదా? ఇప్పుడిదే పనిని మన అంతరిక్ష పరిశోధకులు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మన నివాసం (భూమి) కూడా ఒంటరిదే కనుక. మరో నివాస యోగ్యమైన ఆ భూమి కొరకు వెతుకులాట కొరకు. మరి మన ఇరుగు పొరుగు ఎవరు? శుక్రగ్రహం మన ఇరుగు అయితే కుజగ్రహం మన పొరుగు.

కోటాను కోట్ల నక్షత్రాలున్న ఈ అసంత విశ్వంలో కోటాను కోట్ల గ్రహాలున్నాయి. వాటిలో భూమిలాంటి గ్రహం ఎక్కడైనా ఉందా? జీవం ఉన్న గ్రహం మరొకటి ఉందా? మనలాంటి మనుషులున్న గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? మనకన్నా అభివృద్ధి చెందిన గ్రహంతరవాసులు ఉన్నారా? ఇతర గ్రహాలలో ఉండే సహజ వనరులు భూవాసులకు అందుబాటులోకి తెచ్చుకోవచ్చా? ఇతర గ్రహాలను నివాసయోగ్యంగా మార్చుకోవచ్చా? వంటి ఇతరాద్రి ప్రశ్నలకు శాస్త్రవేత్తలు జవాబులు వెతికే ప్రయత్నంలో భాగమే MOM లాంటి ప్రాజెక్టులు.

ఇదేమంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అంతరిక్షంలో నక్షత్రాల మధ్య, గ్రహాల మధ్య అంతులేని దూరాలుంటాయి. పొరుగింటికి పోయినంత సులభం కాదు ఇతర గ్రహాలకు వెళ్లి రావడం. ప్రయత్నిస్తేనే కదా ఫలితాలు వచ్చేది. మంగళయాన్ కూడా ఆ కోవకు చెందినదే.

మాక్స్: భూమికి పొరుగునే సగటున 227987155కి.మీ. దూరంలో ఉన్న గ్రహమే మాక్స్. దీనిని అంగారక గ్రహమని, కుజగ్రహమని, అరుణ గ్రహమని కూడా పిలుస్తుంటారు. భారతీయ పురాణాల ప్రకారం కుజ అంటే భూమి పుత్రుడని అర్థం. భూదేవి-విష్ణుమూర్తిల సంతానమే కుజుడు. కుజుడుని లోహితాంగుడు (అంటే ఎర్రని వాడని) అని కూడా పిలుస్తుంటారు.

sep05.jpgగ్రీకులు కుజుడుని “ఏరీస్" అని పిలుస్తారు. ఇతడు జూన్ కుమారుడు. యుద్ద దేవునిగా కీర్తింపబడినాడు, ఏరీస్ మహా భయంకరుడు, క్రూరుడు. ఏరీస్ రోమన్లు “మాక్స్” అని పిలిచారు. మాక్స్ పేరుమీదే వారాలలో ఒక వారానికి మంగళవారమని, ఒక నెలకి మార్చి అని పేరు పెట్టారు.

భూమితో పోలిస్తే!: భూ ద్రవ్యరాశిలో 10%, ఘన పరిమాణంలో 15%, సగటు సాంద్రతలో 71%, పలాయన్ వేగం 45%, మధ్యరేఖా వ్యాసార్థంలో 53% కుజగ్రహం కలిగియుంది.

కుజ గ్రహ పరిభ్రమణ కాలం 687 రోజులు, భూ పరిభ్రమణ కాలానికి 1.88 రెట్లు. కుజరోజుకి 24.65 గంటలు. మన రోజు కంటే 37 ని.లు మాత్రమే ఎక్కువ. కుజగ్రహానికి ఫోబస్ (Fear), డీమోస్ (Terror) అనే రెండు చంద్రులున్నాయి. కుజాకర్షణ శక్తి భూమ్యాకర్షణ శక్తి లో 37వ వంతు ఉంటుంది. కుజునిలో ప్రాణవాయువు విడిగా లేదు. నేలలో కలిసి ఉంటుంది. 3/5 వంతు నేల ఎర్రగా తుప్పు పట్టినట్లుంటుంది. అందుకే ఎరుపు రంగులో గ్రహం కనిపిస్తుంది.

భూమికి సమీపంగా అంటే 75000000కి.మీ దగ్గరగా వస్తుంది. అప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దూరంగా అంటే 375000000కిమీ ఉంటుంది అప్పుడు కాంతిహీనంగా కనిపిస్తుంది. అంగారకుడు సాయంత్రాన్నే ఉదయిస్తాడు సాయంకాలపు సమయంలోనే అస్తమిస్తాడు. పగటిపూట ఉష్ణోగ్రత 7°F, కనిష్టంగా -100°F ఉంటుంది. భూమి మాదిరే 25" వాలు కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి ఋతుబేధాలుంటాయి.

అంగారక గ్రహయానానికి ఆద్యులు మనవేనా? కాదు. 1969లో మొట్టమొదట మారినర్ అనే రెండు రోదసీ నౌకలను అమెరికా ప్రయోగించింది. కుజగ్రహానికి 2000 మైళ్ల దగ్గరగా మారినర్ ప్రయాణించి చిత్రాలు తీసాయి. 1976లో వైకింగ్ శ్రేణి పేరిట రోదసీ నౌకలను పంపి కుజోపరితలంపై దించింది. ప్రస్తుతం “మావెన్” పేరిట ప్రాజెక్టులు చేపట్టియుంది. అమెరికానే కాకుండా రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ క్రొత్తగా భారత్ లకు అంగారక యానం క్రేజ్ గా మారింది.

MOM లక్ష్యాలు: అంగారక గ్రహ వాతావరణాన్ని, అయనోస్పియర్, ధూళి, తుఫానుల, గ్రహ అయస్కాంత క్షేత్రాన్ని, ఉష్ణోగ్రతలను, తేమశాతాన్ని అధ్యయనం చేయడం. నీటి ఆనవాళ్లును వెతకడం మొదలైన అంశాలు లక్ష్యాలుగా MOM చేపట్టారు. మంగళ్ యాన్ ప్రయాణకాలం 98 నెలలు. ఖర్చు మూడు బిలియన్లు.

మామ్ (ISRO) - మావెన్ (NASA)ల మధ్య తేడా: మావెన్ భూమి నుంచి నేరుగా మార్స్ కి ప్రయాణిస్తుంది. మంగళయాన్ తొలుత భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, కక్ష్యా వ్యాసార్థాన్ని మార్చుకుంటూ, వేగాన్ని పెంచుకుని అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. మావెన్ లో వినియోగించిన బూస్టర్ 99000 న్యూటన్ల ధ్రస్ట్ ని . కలిగియుంటే మంగళయాన్ కేవలం 440 న్యూటన్ల ఈస్ట్ ఉన్న బూస్టర్లను వినియోగిస్తున్నారు. మంగళయాన్ మొత్తం 9 నెలల పాటు 43 కోట్ల కి. మీ. ప్రయాణించి కుజుని చేరుకుంటుంది.

కుజదోషం : మన పూర్యుల నవగ్రహాలలో ఒక గ్రహం కుజుడు. కుజునికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రముఖ స్థానం ఉంది. జాతక చక్రంలో 7వ గృహంలో కుజుడు ఉంటుంది. మిగిలిన గృహాలలో కుజుడు కనిపిస్తే కుజదోషం ఉందని చెప్తారు. కుజదోషం ఉన్న వారు కుజదోషం ఉన్న వారినే వివాహం చేసుకోవాలి. లేనట్లయితే ఆ జంటలో ఒకరు చనిపోతారు. ఈ నమ్మకం ఎందరో యువతుల జీవితాలను బలితీసుకుంటున్నది.

కుజదోష నిర్ధారణకు ఎటువంటి ఆధారాలు లేవు. నిర్జీవ ఖగోళవస్తువులలో కొన్ని మంచి చేసే గ్రహాలు, కొన్ని హాని తలపెట్టే గ్రహాలు అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆనాటి వారికి గ్రహాల గురించి పూర్తి అవగాహన లేక అపనమ్మకాలను ఏర్పరుచుకుంటే నేటికి ఆ అంధవిశ్వాసాలు కొనసాగుచుండడం దురదృష్టకరం. అస్థిరమైన పరిస్థితులు ఉన్న చోటే అత్యంత ఆందోళనలో ఉంటాం. మాసనిక నియంత్రణ కోల్పోయి భయాలకు లోనౌతాం. అటువంటప్పుడే జాతకాలు, జ్యోతిష్యాలు, దొంగస్వాములు మన జీవితాలలోని సులభంగా ప్రవేశిస్తారు. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే మనం మోసపోతూనే ఉంటాం.

మన మంగళయాన్ ప్రయోగం ఇటువంటి వాటిని వటాపంచలు చేసే శాస్త్రీయ ఆలోచనను పెంపొందిస్తుందని ఆశిద్దాం. మంగళయాన్ విజయవంతం కావాలని కోరుకుందాం. శాస్త్రవేత్తలకు అభినందనలు.

ఆధారం: షేక్ గౌస్ భాష.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate