অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గురు పూజోత్సవం

గురు పూజోత్సవం

sep9పాత్రలు: విద్యార్థులు ఏడు లేక ఎనిమిది మంది.

మధు: ఏరా విశ్వనాథ్, ఈ రోజు నీవు పాఠశాలకు రావడం లేదా? విశ్వనాథ్: లేదురా మా ఇంటికి బంధువులు వచ్చారు. అందుకని అమ్మకు సహాయంగా ఉండాలని అనుకుంటున్నాను. అయినా, నీవు ఇంత త్వరగా బడికి వెళ్తున్నావేమి?

ఆలీ: ఈ రోజు మన పాఠశాలలో గురు పూజోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. అందుకే మేము ముందుగా వెళ్తున్నాం. విశ్వనాథ్: అవునురా, మరిచేపోయాను. ఈ రోజు సెప్టెంబర్ ఐదవ తేదీ గదూ! నేను కూడా బడికి వచ్చి తప్పక ఆ వేడుకల్లో పాలు పంచుకుంటాను.

మధు: మంచిదిరా వెల్దాం పదండి. మన స్నేహితులు వస్తున్నట్లున్నారు చూడండి.

ఆలీ: అదుగో... వచ్చేశారు. ఏమిరా ఇంత ఆలస్యం చేశారు?

పాల్: గురుపూజోత్సవ ప్రాముఖ్యం గురించి టివిలో వచ్చిన ప్రోగ్రాం చూచి వస్తున్నాను.

మధు: ఆ ప్రోగ్రాంలో ఏ విషయాలు చెప్పారు శేఖర్?

శేఖర్: ఈ రోజు కీ.శే. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా దేశమంతా గురుపూజ్యోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు.

విశ్వనాథ్: రవిశంకర్, శ్రీ రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని గురుపూజోత్సవంగా ఎందుకని జరుపుకుంటున్నామో చెప్పారా? రవిశంకర్: ఎందుకు చెప్పలేదు?! ఆయన గురువులకే గురువైన గొప్ప ఆచార్యులు. అందువల్లనే మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం అని చెప్పారు.

ఆలీ: ఈ రోజు మనం మన పాఠశాలలో శ్రీ రాధాకృష్ణన్ ఉన్నత వ్యక్తిత్వాన్ని గురించి చర్చించబోతున్నాం గదా! ఇప్పుడు కొంత సేపు శ్రీ రాధాకృష్ణన్ జీవిత విశేషాలను గూర్చి మాట్లాడుకుందాం.

రవిశంకర్: శ్రీ రాధాకృష్ణన్ 1888 సం. సెప్టెంబర్ 5వ తేదీ మద్రాసు సమీపంలోని 'తిరుప్తని'లో జన్మించారు.

సాహుల్: ఆయన విద్యాభ్యాసమంతా తిరుపతి, నెల్లూరు, మద్రాసులలోని మిషనరీ సంస్థలలో జరిగింది.

మధు: 1909 సం.లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వ శాస్త్ర విభాగానికి ప్రధానాచార్యులైనారు.

పాల్: 1921 సం.లో కలకత్తా విశ్వవిద్యాలయం మనస్తత్వ నైతిక శాస్త్ర విభాగాలకు ప్రధానాచార్యులైనారు.

శేఖర్: రవీంద్రనాథ్ ఠాగూర్ కవితా వైభవంపై ఆయన రచించిన గ్రంథం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

రవిశంకర్: 1927లో ప్రచురింపబడిన ‘ఇండియన్ ఫిలాసఫీ’ వారి కీర్తికి ఖండాంతర వ్యాప్తిని కల్గించింది.

సాహుల్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా వారు విశ్వవిద్యాలయాన్ని విశిష్టంగా తీర్చిదిద్దారు.

మధు: వివిధ దేశాలలో విద్వత్ సదస్సులలో పండిత పరిషత్లలో విశ్వవిద్యాలయాలలో ఉపన్యాసిస్తూ వారు తాత్వికాచార్యునిగా, మహావక్తగా, బహుగ్రంథకర్తగా నాలు దశాబ్దాల జీవితం గడిపారు.

విశ్వనాథ్: మాతృదేశ దాస్య విమోచనం కోసం జరుగుతున్న మహాయజ్ఞంలో తానూ ఒక సమిధలైనారు. బ్రిటిష్ పాలకుల దమననీతిని తీవ్రంగా ఖండించి వారిచ్చిన 'సర్' బిరుదును త్వజించారు.

ఆలీ: స్వాతంత్ర్యనంతరం ఉన్నత పదవులు వారిని వెతుక్కుంటూ వచ్చాయి. 1952లో ఉపరాష్ట్రపతిగా 1962లో రాష్ట్రపతిగా వ్యవహరించారు.

సాహుల్: రాష్ట్రపతిగా ప్రభుత్వ విధానాలకు అవసరమైతే విమర్శించడానికి వెనుకాడలేదు. అవినీతి, అసమర్థతా, జాతీయ వనరుల దుర్వినియోగాన్ని విమర్శించారు.

పాల్: 1967 సం.లో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశారు. జాతీయ అంతర్జాతీయ సమస్యల పై ఉపన్యసించడమే గాక సర్వమానవ సౌభ్రాతృత్వం సాధించాలని ఆశించారు.

రవిశంకర్: అంతటి మహామనిషీ, విద్యాభాస్కరుడు, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు అయిన ఆ ధృవతార 1975 సం.లో విశాలగగనంలో నక్షత్రరాశి అస్తమించినట్లు ప్రశాంతంగా కన్నుమూశారు.

మధు: ఆ మహనీయుని జీవితాన్ని స్మరించడం మన విద్యుక్త ధర్మం.

రవిశంకర్: అందుకే ప్రతి సంవత్సరం మనం గురుపూజోత్సవాన్ని జరుపుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం.

విశ్వనాథ్: స్మరించుకున్నంత మాత్రాన చాలదు.

ఆలీ: అయితే ఏమి చేయాలంటావు?

పాల్: ఆ మహనీయుని ఉన్నతాశయాలను నెరవేర్చడంలో భావి పౌరులుగా నేడు మనం కంకణబద్దులం కావాలి.

శేఖర్: గురువే మన ప్రత్యక్షదైవం. అందుకు గురుపూజోత్సవం నాడు మన ఉపాధ్యాయులను స్మరించడమే గాదు. ఉపాధ్యాయుల మాట జవదాటక క్రమశిక్షణతో సత్ర్పవర్తనతో మనం మెల్గినప్పుడే మన సమాజము ప్రగతి మార్గాన పయనించగలదు.

మధు: కుల, మత, వర్గ బేధాలు మరిచి వసుధైక కుటుంబ సభ్యులుగా మనోవాక్కాయకర్మల ప్రవర్తించగలనాడే మన భారతావని గురించి డా. రాధాకృష్ణన్ గారు కన్న కలలు నిజం చేసి, వారి ఉన్నతాశయాలను నెరవేర్చిన వారం కాగలము.

ఆలీ: అందరం ఒక్కసారి మన గురువులను స్మరిద్దాం రండి.

అందరు కలిసి నిష్క్రమిస్తారు.

ఆధారం: సి. శారద© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate