অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గ్రీసు, రోముల్లో సామాజిక పరిస్ధితులు

గ్రీసు, రోముల్లో సామాజిక పరిస్ధితులు

పిల్లలూ! ఈ రోజు ప్రాచీనకాలంలో జరిగిన శాస్త్ర విజ్ఞాన విజయాలు గ్రీను, రోమ్ సమాజాలపై ఎలాంటి ప్రభావాలు కలిగించాయో తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయ అభివృద్ధి ప్రభావం, రైతులను మోసం చేయడం, దాని వలన వ్యవసాయం పతనం జరిగిన విధానాన్ని తెలుసుకుందాం. సంహితా! నువ్వు చెప్పు అన్నారు మాస్టారు.

అలాగే మాస్టారూ! సంహిత చెప్పడం మొదలెట్టింది. వెరుగైన వ్యవసాయ విధానాలు అవలంబించడం కారణంగా వ్యవసాయం అభివృద్ధి అయింది. కాని అందులో ఎక్కువ భాగం రాజుల బొక్కసాలకు, అవినీతి పరులైన ప్రభుత్వోద్యోగుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రభుత్వోద్యోగుల్లో లంచగొండితనం ఎంత దారుణంగా వ్యాపించిందో ఆనాటి పత్రాలు తెలియజేస్తున్నాయి. సామాన్య

ప్రజలకు ఏం మిగిలాయంటే అధికపన్నులు, జవులు, చెరసాలలు, చట్టాన్నుంచి తప్పించుకోవడానికి ప్రజలు పారిపోయేవారు. క్రీ.పూ. 196 లో చెక్కబడిన రోసెటా శిలాఫలకం యీ పరిస్థితిని, దానిని చక్కదిద్దడానికి తీసుకోబడిన చర్యలను

వివరిస్తుంది అంది సంహిత.

తమ సమస్యల పరిష్కారానికి ఆనాటి రైతుల ఒక ఆయుధం కనిపెట్టారు. ఆ ఆయుధం ఏమిటి ? చెప్పగలవా అడిగారు మాస్టారు.

  • ఆ ఆయుధం పేరు సమ్మె మాస్టారూ! రైతుల తమ పనిని వదిలి పెట్టి, మూకుమ్మడిగా ఒక దేవాలయంలోకి వెళ్ళిపోయి, దారుణమైన తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు బయటకు వచ్చేవార కాదు. అంటే సమ్మెచేసి తమ సమస్యలు పరిష్కరించుకు వారన్నమాట. అయితే ఆనాటి రాజులు, రైతులకు సమే చేసే హక్కు లేకుండా కౌలు పత్రాలు రాసేట్లుగా చట్టాలు రూపొందించారు. రాజులకు, రాచరికానికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించబడ్డాయి అని చెప్పింది సంహిత.

అలాంటి విధానాల ఫలితాలేమిటి? అడిగార మాస్టారు. ఆ విధానాల కారణంగా కౌలు రైతులు కూలీలు గ్రామాలలో వ్యవసాయాన్ని వదిలి పారిపోయారు. ఇందువలన వ్యవసాయం చేసేవారు తగినంతమంది గ్రామాలలో దొరకని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం క్షీణించింది, ఆనకట్టలు, కాలువలు శిథిలం అయ్యాయి. పల్లెల సగటు జనాభా 140 నుంచి 40 కి తగ్గిపోయినట్లు ఆనాటిపత్రాలలో ఆధారాలు దొరికాయి” అన్నది సంహిత. చరిత్రలోని ఈ అంశం చెప్పే గుణపాఠం ప ఏమిటో తెలుసా?

ప్రభుత్వాలు, ధనికులకు మాత్రమే అనుకూలించే చట్టాలు చేస్తే, సామాన్య ప్రజలలో చెలరేగే అసంతృప్తి ఏ రూపం తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలంమౌతుంది అన్నారు మాస్టారు. మరల వాణి మాస్టారే కొనసాగించారు. నైలునదీ ముఖద్వారంలో ఏ స్థాపించబడిన అలెగ్జాండ్రియా నగరం కొన్ని శతాబ్దాల పాటు విజ్ఞానకేంద్రంగా విలసిల్లింది. జాన్! దాని మికీ వివరాలన్నీ నీవు చెప్పు అన్నారు. అలెగ్జాండరు బ్రతికుండగానే ప్రపంచ అత్యు సామ్రాజ్యానికి రాజధానిగా ఉండే ఒక నగరాన్ని ఓ నిర్మించాలని కలలుగన్నాడు మాస్టారూ?

అది నైలునదీ తకి ముఖద్వారంలో ఉండాలని దాని స్థలాన్ని కూడ వా నిర్ణయించాడు. అంతేకాదు, ఆ నగరం పేరు, తన పేరు ముక మీద అలెగ్జాండ్రియా అని ఉండాలని కూడ నిర్ణయం చేశాడు. కాని క్రీ.పూ. 323 లో అలెగ్జాండరు ఆ చనిపోయాడు. ఆయన తదనంతరం ఆయన ఈజిప్టు భాగానికి వారసుడైన టోలమీ, అలెగ్జాండ్రియాను - నిర్మించాడు. దానిలో విజ్ఞానశాస్త్రాల వ్యాప్తి కోసం, ప్రస్తుతకాలపు విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. టోలమీ క్రీ.పూ. 238 లో చనిపోయాడు. ఆయన తర్వాత 2వ టాలమీ అధికారానికి వచ్చాడు. తన పూర్వీకుల కలలను సాకారం చేయడానికి అతడు అలెగ్జాండ్రియాలో బ్రహ్మాండమైన లైబ్రరీని నెలకొల్పాడు. దానిని స్థాపించిన మొదటి 40 సంవత్సరాలలోనే 4 లక్షల వ్రాతప్రతులను సేకరించి ఉంచాడు. అందువలన చరిత్ర కారులు ఆ గ్రంథాలయాన్ని ప్రాచీనకాలపు ఏడు వింతలలో ఒకటిగా పేర్కొన్నారు. అది విజ్ఞానశాస్త్రాలకు 2 వ టాలమీ చేసిన అపూర్వమైన సేవ, కాని ఆ లైబ్రరీ క్రీ.శ. 390 లో ఆర్బిబిషప్ ధియోఫిలస్ పాక్షికంగా నాశనం చేశాడు.

క్రైస్తవ మతానికి చెందిన ఆర్బిబిషప్ విజ్ఞాన శాస్త్ర భాండాగారాన్ని నాశనం చేయించాడా? కారణమేమిటి ఆశ్చర్యంగా అడిగాడు రాజశేఖర్.

అవును క్రైస్తవ ఆర్బిబిషప్పే దానిని చాలావరకు నాశనం చేయించాడు. దానికి కారణాన్ని హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే గ్రంథంలో ఆర్.వి.జి. మీనన్ చక్కగా వివరించాడు. క్రైస్తవ మతం ఆనాడు జీవితానికి ఒక కొత్త అర్థాన్ని సూచించింది. వారి

భవిష్యత్తు స్వర్గంలో ఉంది. ఇహలోక జీవితం, భవిష్యత్తులో ఎప్పుడో రాబోయే జీవితానికి ఒక సన్నాహక ప్రయత్నం లాంటిది. ఇలాంటి గ్రంధాలెన్నో ఆ గ్రంధాలయంలో అశాస్త్రీయతను నింపుకొని ఉండేవి. ఇలా వారు విజ్ఞానశాస్త్రాన్ని, శాస్త్రజ్ఞులను ద్వేషిస్తున్న కారణంగా వారి నాయకుడు ఆర్బిబిషప్ ధియోఫిలస్అలెగ్జాండ్రియాలోని లైబ్రరీని పాక్షికంగా నాశనం చేయించాడు ఆ లైబ్రరీకి సంపూర్ణ వినాశనం క్రీ.శ. 642 లో ఖలీఫా ఒమర్ నాయకత్వంలో జరిగింది. ఆ సంవత్సరంలో మహ్మదీయులు అలెగ్జాండ్రియాను జయించారు. లైబ్రరీని ధ్వంసం చేయడానికి కారణాన్ని తెల్పుతూ ఒమర్ ఈ గ్రంథాలు దేవుని

పుస్తకం అయిన ఖురాన్ లో ఉన్న విషయాలనే తెల్పితే, ఇంక ఖురాన్ కన్న వేరే గ్రంథాలెందుకు? అవి అనవసరం, వాటిని తగలేయండి. ఆ పుస్తకాలలో ఖురాన్ కు విరుద్ధమైన అంశాలంటే, అవి హానికరం. అందువలన వాటిని నాశనం చేయాల్సిందే అన్నాడు. అలా విజ్ఞాన శాస్త్ర వ్యతిరేకుల చేతుల్లో ప్రాచీన కాలపు ఏడు వింతల్లో ఒకటి సర్వనాశనమైపోయింది. అని ముగించాడు జాన్. వెరీగుడ్! ఆనాడు మతోన్మాదులు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తగలబెట్టడమే కాదు, శాస్త్రవేత్తలను తీవ్రంగా హింసించి చంపివేశారు. అలాంటి వారిలో హైపేషియా ఒకరు.

సిరీ! హైపేషియాను గూర్చి నీవు చెప్పు అన్నారు మాస్టారు.

హైపేషియా క్రీ.శ. 360 ప్రాంతంలో పుట్టింది మాస్టారూ! ఆమె సాహిత్యంలోనూ, సైన్సులోనూ గొప్ప విజ్ఞానవంతురాలు. ఆమె హుందాతనానికీ, పవిత్రతకూ అందరూ ముగ్గులయి ఆమెను గౌరవించేవారు. ఆమె తండ్రి పేరు ధియాన్. ఏథెన్స్ లో విద్యాభ్యాసం అయిన తర్వాత ఆమె అలెగ్జాండ్రియాలో నియోప్లేటోనిక్ స్కూఎలల్ ఆచార్యపదవిని అధిష్టించి విద్యార్థులకు తత్వశాస్త్రం ఖగోళశాస్త్రాలను బోధిస్తుండేది. అయితే ఆమె విజ్ఞానానికి అసూయపడిన కొందరు కైస్తవ మతోన్మాదులు ఆమెపై

కక్షగట్టి, ఆమెను బలవంతంగా వీధులలో లాగుకొని వెళ్ళి, బట్టలను చించివేసే పెంకుముక్కలతో చర్మాన్ని గిరి, కండలను కోసి చంపివేశారు. ఈ దారుణమారణకాండ క్రీ.శ 415 జరిగింది. అంటూ ముగించింది సిరి.

బాగా చెప్పావమ్మా ఇవీ ప్రాచీనకాలంలోని గ్రీకు, రోమన్ శాస్త్రవేత్తల జీవిత విశేషాలూ, వా పరిశోధనా ఫలితాలూ, ఆనాటి సామాజిక పరిస్థితులు వచ్చే క్లాసులో భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభావిశేషాల తెలుసుకుందాం అంటూ ఆ రోజు క్లాసును ముగించా సైన్సు మాస్టారు శ్రీనివాస్.

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate