অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చంద్రునితో చెలిమి

చంద్రునితో చెలిమి

పాత్రలు : చంద్రమోహన్, శశికాంత్, చంద్రిక, చంద్రబోస్, శశిరేఖ, సాయి ఐతిక.

cm1చంద్రమోహన్ ఇల్లు. రాత్రి వేళ. అన్నమయ్య కీర్తన వినిపిస్తోంది....... చందమామ రావో, జాబిల్లి రావో...

శశికాంత్: (గట్టిగా) అబ్బా. రోజూ ఇదే పాట. అమ్మా, వేరే పాటే దొరకదా. లాభం లేదు. రేడియో పెడతా. (రేడియో ఆన్ చేసిన చప్పుడు)

రేడియో: చందమామతో ఒక మాట చెప్పాలి .... (సినిమా పాట వస్తోంది)

శశికాంత్: (విసుగ్గా) అబ్బబ్బ. ఇక్కడా అదే. అసలు ఈ మనిషికీ ఆ చంద్రుడికీ ఏమిటి సంబంధం? ఏమిటి అనుబంధం?

(రేడియో ఆఫ్ చేసిన చప్పుడు) (ఇంతలో స్కూటర్ ఆగిన చప్పుడు)

చంద్రమోహన్: ఏమిట్రా? అంత విసుగ్గా ఉన్నావ్. ఏమైందీ?

శశికాంత్: అబ్బ. ఏం లేదు నాన్నా ! ఈ అమ్మ రోజూ పాడే పాత పాట వినలేక పోతున్నా. సరే అని రేడియో పెడితే, దాన్లోకూడా అదే.

చంద్రమోహన్: ఇంతకీ అంత విసుగు కలిగించే ఆ పాట దేని గురించిరా?

శశికాంత్: చంద్రుణ్ణి గురించి. అమ్మేమో చందమామ రావో.. అని పాడుతోంది. రేడియో పెడితే అందులోనూ చందమామతో ఒక మాట అంటూ సిన్మా పాట… ఈ మనిషికీ ఆ చంద్రుడికీ ఏమిటి అనుబంధం?

చంద్రమోహన్: ఈ మనిషికీ ఆ చంద్రుడికీ చాలా పెద్ద అనుబంధమే ఉంది. చంద్రుడ్ని చూడగానే కలిగే ఆ హాయి, చల్లని వెన్నెల ఇచ్చే ఆనందం - ఇంతా అంతా కాదు. అంతెందుకు మనింట్లో అందరి పేర్లూ గమనించావా?

శశికాంత్: అరె. నిజమే. నీపేరు చంద్రమోహన్, అమ్మ పేరు చంద్రిక. ఇక నా పేరు శశికాంత్.

చంద్రిక: చంద్రుడంటే అందరికీ ఎంతో ఇష్టంరా. నాన్న ఫ్రెండ్ పేరు కూడా చంద్రబోస్.

శశికాంత్: నిజమే. వాళ్లమ్మాయి పేరు శశిరేఖ. మీరంతా కలిసికట్టుగా చంద్రుడినించే దిగారా ఏం?

చంద్రమోహన్: దిగలేదు కానీ, ఎప్పటికైనా ఆ చంద్రుడిపైకి వెళ్లి షికారు చేసి రావాలనుంది.

చంద్రిక: మేమెలాగూ పెద్దవాళ్లమై పోయాం. కనీసం నీవూ, శశిరేఖా అన్నా సాధిస్తారేమో చూడాలి.

శశికాంత్: అరే. మళ్లీ మొదలెట్టావూ....

(అంటూ టీవీ పెడతాడు)

టీవీలో: 2025 నాటికన్నా చంద్రుడిపై భారతీయులు అడుగెపుడతారనీ, అలనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్న మాటలు... (ఫేడౌట్...)

శశికాంత్: (ఠక్కున టీవీ ఆఫ్ చేసి)... ఇక లాభం లేదు. ఈ చంద్రుడి గురించి తేల్చుకోవాలి.

చంద్రమోహన్: అది తర్వాత తేల్చుకొందువులే గానీ, ముందు ఏ కోర్సులో చేరతావో నిర్ణయించు. .

శశికాంత్: ఐతే, ఒక పని చేద్దాం నాన్నా. ముందు నేను ఎందుకు ఇంజనీరింగ్ చేయాలనుకొంటున్నావో చెప్పు. ఆ తర్వాత ఆలోచిస్తా.

చంద్రమోహన్: ముందే చెప్పా కద. చంద్రుని గురించి పరిశోధనలు చేయాలి. చంద్రుడ్ని చుట్టి రావాలి అని.

శశికాంత్: ఐతే, సరే. ముందు చంద్రుడి గురించి చెప్పు. ఆ తర్వాత ఆలోచిస్తా.

చంద్రమోహన్: చంద్రుడు భూమికి ఉపగ్రహం. దాని పరిమాణం భూమి పరిమాణంలో నాలుగోవంతు. అంటే చంద్రుడి వ్యాసం 3470 కిలోమీటర్లు.

చంద్రిక: చంద్రుడు భూమికి సగటున సుమారు 3లక్షల 79వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడట. నిజమా?

చంద్రమోహన్: నిజమే. భూమి చుట్టూ ఒక సారి చుట్టి రావడానికి చంద్రునికి 27.3 రోజులు పడుతుంది.

చంద్రిక: చంద్రుడు తన కక్ష్యలో తిరగడానికీ అంతే సమయం తీసుకొంటాడు. చంద్రుడు సూర్యుడినించి కాంతిని తీసుకొని మళ్లీ వెదజల్లుతాడు.

శశికాంత్: అంటే వేడిని తీసుకొని చల్లదనాన్నిస్తాడన్నమాట. మరి మనకు చంద్రుడు ప్రతి 15 రోజులకీ పెరుగుతున్నట్లూ, తరుగుతున్నట్టూ కనిపిస్తాడే అదేంటీ..

చంద్రమోహన్: భూమి, సూర్యుడు, చంద్రుడు - అందరూ వారి

వారి కక్ష్యల్లో తిరుగుతూంటారు కదా.

శశికాంత్: అర్థమైంది. చంద్రుడిపై ఏ మేరకు సూర్యకాంతి పడితే, ఆ మేరకే మనకు కనిపిస్తుందన్నమాట.

చంద్రమోహన్: చక్కగా అర్థం చేసుకొన్నావ్. మరేమో...

చంద్రిక: లేవండిద్దరూ, ముందు భోం చేసి, ఆ తర్వాత కబుర్లు చెప్పుకొందురు.

(సీను డైనింగ్ టేబుల్ దగ్గరకు మారుతుంది. కుర్చీలు జరిపిన చప్పుడు)

శశికాంత్: నాన్నా, చూస్తుంటే ఇదేదో ఆసక్తికరంగానే ఉంది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుంది.

చంద్రమోహన్: మంచిదే. ఉండు. ఇపుడే బోస్ కు ఫోన్ చేస్తా.

చంద్రిక: ఇంత పొద్దుపోయా? రేపు సాయంత్రం వెళ్లండి.

శశికాంత్: లేదు లేదు. ఇప్పుడే వెళ్తాం. ఇదిగో నాన్నా, మొబైల్. (మొబైల్ కీ పాడ్ చప్పుడు)

చంద్రమోహన్: హలో. బోస్. ఆర్ యూ ఫ్రీ నౌ? రావచ్చా... ఓకె. ఇదిగో, నేనూ మావాడూ అరగంటలో మీ ఇంటికొస్తున్నాం.

cm2చంద్రమోహన్: బోస్. బోస్. ఎక్కడున్నావయ్యా...

చంద్రబోస్: ఇక్కడే ఉన్నా. అరె. హఠాత్తుగా రెండో చంద్రుడూ నీతో వచ్చాడు. ఏంటి సంగతి.

చంద్రమోహన్: అసలు వచ్చింది చంద్రుడి గురించే.

శశికాంత్: ఏం లేదంకుల్. చంద్రుడి గురించి తెలుసుకొందామని...

చంద్రబోస్: ఏమైతేనేం. మొత్తానికి మీనాన్నను మా ఇంటికి తీస్కొచ్చావయ్యా. ఇపుడే శశిరేఖ కూడా ఇదే చర్చ మొదలెట్టింది. శశిరేఖా. ఒకసారి ఇలారా!

శశిరేఖ వచ్చి కూర్చొంది.

శశికాంత్: ఎపుడు చూసినా, ఎక్కడ విన్నా చంద్రుడి పేరే. అటు వివిధ దేశాల వారు చంద్రుడిపై కాలు మోమంటారు. ఇంట్లో చూస్తే అమ్మ చంద్రుని గురించే పాట.

రేడియోలో అదే పాట.

మా నాన్నా అంతే. ఇంజనీరింగ్ చెయ్స్. సైన్సు చదువు. చంద్రుడ్ని చుట్టిరా అంటూ గోల.

శశిరేఖ: చంద్రుడి మీద వచ్చినన్ని పాటలు మరెవ్వరిమీదా లేవు. చంద్రుడిలో నీరూ, వాతావరణమూ లేదు.

శశికాంత్: అక్కడ గురుత్వాకర్షణా అంతంత మాత్రమే. ఐనా, చంద్రుడన్నా, ఆ వెన్నెలన్నా మనిషికిష్టం.

చంద్రబోస్: అర్థమైంది. శశికాంత్. నీవూ, శశిరేఖా ఒకే పడవలో ఉన్నారు. మీరిద్దరూ ఎలాగైనా చంద్రుడి పైకి వెళ్లి రావాల్సిందే. అక్కడి వెళ్ళితే ఎవరి బరువైనా తగ్గిపోతుంది.

శశికాంత్: నా బరువు 60 కిలోలు అంకుల్

చంద్రబోస్: చంద్రుడిపై నీ బరువు కేవలం 10 కిలోలే తెలా?

చంద్రమోహన్: ఇక్కడ నీవు ఎంత ఎత్తుకెగరగలవూ?

శశికాంత్: మహా ఐతే, 5 అడుగులు పైకి ఎగరగలను.

చంద్రబోస్: కదా, అక్కడ సునాయాసంగా దాదాపు 20 అడుగుల ఎత్తుకెగరగలవు.

శశిరేఖ: అయ్యయ్యో. ఐతే నేను చంద్రుడి పైకి వెళ్లను. అక్కడ నేను ఐదు కిలోల బరువే ఉంటా.

శశికాంత్: అక్కడ నుంచి ఆకాశం ఎలా కనిపిస్తుంది అంకుల్ నీలంగానా, తెల్లగానా?

చంద్రబోస్: రెండూ కాదు. అక్కడ వాతావరణమే లేదు కాబట్టి నల్లగానే కనిపిస్తుంది. సూర్యోదయం అయినట్టూ తెలీదు. సూర్యాస్తమయం అయినట్టూ తెలీదు. అందుకే పగటిపూటా నక్షత్రాలను చూడవచ్చు. ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది.

శశిరేఖ: మరైతే, అక్కడి కెళితే 24 గంటలూ లైట్లు వెలుగుతూండాల్సిందే.

శశికాంత్: మరి అక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటుందీ?

చంద్రబోస్: పగటిపూట 550 డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటుంది. రాత్రుళ్లు బాగా చలిగా ఉంటుంది.

శశికాంత్: అది ఓకె. అంకుల్. అసలు ఈ చంద్రుడిపైకి తొలిసారిగా అమెరికావాళ్లు ఎపుడెళ్లారు?

చంద్రబోస్: చంద్రుడి పైకి తొలిసారిగా నాటి సోవియట్ యూనియన్ ఒక రోదసీనౌకను పంపింది. అది చంద్రుడిపైకి దిగి ఎన్నో పరిశోధనలు చేసి, వెనక్కి

వస్తూ అక్కడినించి రాళ్లూ, మట్టి తెచ్చింది.

చంద్రమోహన్: వాటిమీద ఎన్నో పరిశోధనలు జరిపారు కదా. ఆ వివరాలేవీ మనకు అందుబాటులో లేవు.

చంద్రబోస్: ఎపుడైతే చంద్రుడిపై అమెరికా కాలు మోపిందో, పరిస్థితులే మారిపోయాయి.

శశికాంత్: ఇంతకీ అమెరికా, రష్యా దేశాలలో ఏ దేశం తొలిసారిగా చంద్రుడిపై కాలు మోపిందంకుల్?

శశిరేఖ: చంద్రుడి పైకి తొలిసారిగా రోదసీనౌకను రష్యా. పంపింది. తొలిసారిగా అడుగెపుట్టింది అమెరికా, కద నాన్న?

cm3చంద్రబోస్: చాలా కరెక్టుగా చెప్పావ్. 1969 లో చంద్రుడిపై తొలి అడుగు పెట్టింది అమెరికాకు చెందిన నీల్ ఆమ్ స్ట్రాంగ్.

చంద్రమోహన్: అసలు దీనికి అమెరికాకు కెన్నెడీ అధ్యక్షుడిగా ఉన్నపుడు అంకురార్పణ జరిగింది.

చంద్రబోస్: సరిగ్గా గుర్తు చేశావ్. శాస్త్రజ్ఞులకు స్ఫూర్తినిచ్చిన కెన్నడీ ప్రసంగం నాదగ్గర టేపుల్లో ఉంది. వినిపిస్తా,వినండి.

చంద్రబోస్: ప్రసంగం అంతా కాదు. చివరి రెండు వాక్యాలు వినిపించు. (టేప్ రికార్డర్ ఆన్ చేసిన చప్పుడు)

కెన్నడీ ప్రసంగంలో చివరి వాక్యాలు వినిపిస్తాయి

చంద్రబోస్: చూశారా! లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడమంటే అదీ.

శశిరేఖ: ఈ ప్రసంగం ఎప్పటిది నాన్నా?

చంద్రబోస్: ఇపుడు మీరు విన్నది 1962లో కెన్నడీ చేసిన ప్రసంగం. దాని తర్వాత 5 ఏళ్లకి, అంటే 1967లో తొలి సారిగా చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రయత్నం జరిగింది. దానిపేరే అపోలో 1.

చంద్రమోహన్: డ్రెస్ రిహార్సల్ జరిగే సమయంలో అపోలో 1 పేలి పోయింది.

చంద్రబోస్: ఔను. నిర్గల్ ఐ గ్రిస్సోం, ఎడ్వర్డ్ హెచ్ వైట్, రోజరి బి చాఫీ అని అపోలో -1కు చెందిన ముగ్గురు వ్యోమగాములు డ్రెస్ రిహార్సల్ జరిగేటపడే జరిగిన పేలుడులో భూమిపైనే మరణించారు.

శశిరేఖ: అరెరె. ఎంత ఘోరం. నాన్నా.

చంద్రబోస్: ప్రయోగాల్లో, పరిశోధనల్లో ఇవన్నీ మామూలే. ఆ ప్రమాదానికి కారణాలు కనుగొన్నారు. మళ్లీ అలాటి పొరబాట్లు జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు.

చంద్రమోహన్: 1968లో అపోలో-7 ప్రయోగించారు. అందులోనూ ముగ్గురు వ్యోమగాములు వెళ్లారు. వాళ్లే వ్యాలీ ఎం. షిర్రా, ఎయెసిల్, వాల్టర్ కన్నింగ్ హామ్. తొలిసారిగా భూకక్ష్యలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చాడు షిర్రా.

చంద్రబోస్: మొదట్లో షిర్రా వెళ్లడానికి ఇష్టపడలేదట. ఆ మధ్య ఒక వ్యాసం రాశాడు. అందులో చెప్పాడు.

శశికాంత్: అరె. చాలా తమాషాగా ఉందే. ఏం రాసాడంకుల్

చంద్రబోస్: 'ఎపుడైతే కోతుల్నీ, చింపాంజీలనీ ముందుగా పంపారో, అపుడే నాకు ఆసక్తి పోయింది. కానీ ఫైటర్ పైలట్గా నా కర్తవ్యాన్ని నెరవేర్చాలిగా. అందుకే భూమిని వదిలి కక్ష్యలో మూడుసార్లు ఎగిరి వచ్చాను.”

శశిరేఖ: అంటే మొదట్లో మనుష్యులకు బదులు కోతుల్ని పంపారా?

చంద్రమోహన్: ఔనమ్మా, కోతి బతికితే మనిషి బతకగలడనీ

చంద్రబోస్: షిర్రా రాసిన ఆ జ్ఞాపకాల్లో భూమిని గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు. భూమి అనేదే ఒక అంతరిక్ష నౌక. దాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లలేం. దీన్ని కాపాడుకొందాం' అన్నాడు.

శశికాంత్: అంకుల్. మరి ఆ తర్వాతేమైంది?

చంద్రబోస్: ఆ తర్వాత 3 ప్రయోగాలు జరిగాయి. డిసెంబర్ 21, 1968లో అపోలో -8 రోదసిలోకి విజయవంతంగా వెళ్లింది. చంద్రుని కక్ష్యలోకి వెళ్లి తిరిగి భూమికి వచ్చింది.

శశిరేఖ: అందులో మనుష్యులే లేరన్నమాట.

చంద్ర బోస్: బూనార్ సద్యుల్ 1969 జూలై 20వ తేదీన చంద్రుడిపై దిగడం, నీల్ ఆమ్స్రాంగ్ చంద్రుడిపై కాలు మోపడం - ఇవన్నీ ప్రపంచాన్ని వింత ఉద్వేగంలోకి తీసుకెళ్లింది.

చంద్ర మోహన్: నీకు గుర్తుందా! ఇది జరిగినప్పుడు మనం చిన్న వాళ్లం. దేవుడికి అపచారం జరుగుతోందనీ, ఏదైనా ఉత్పాతం జరుగుతుందని కూడా గోల పెట్టారు.

చంద్ర బోస్: ఔనౌను. నాకు బాగా గుర్తుంది. వినాశకాలం దాపురించిందన్నవారూ లేకపోలేదు.

శశిరేఖ: మరి అలాటి విపత్తులేవైనా కలిగాయా నాన్నా?

చంద్ర బోస్: అబ్బే. అలాటివేమీ జరగలేదు.

శశికాంత్: అంకుల్, మరి ఆపైన ఏం జరిగింది?

చంద్ర బోస్: ఏమీ కాలేదు. మరిన్ని ప్రయోగాలు చేశారు. విజయాలు సాధించారు.

చంద్ర మోహన్: ఔనౌను.

చంద్ర బోస్: అపోలో 11 తర్వాత అమెరికా 6 వరస ప్రయోగాలకు శ్రీకారంచుట్టింది.

చంద్ర మోహన్: ఐతే వీటిలో అపోలో - 13 ఘోర ప్రమాదాన్ని తప్పించుకొంది.

చంద్ర బోస్: ఔనౌను. ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్ల ఆ ప్రమాదం జరిగింది. కానీ దానిలో వెళ్లిన ముగ్గురూ క్షేమంగా భూమిని చేరారు.

శశికాంత్: మరి ఆ ప్రమాదం తర్వాత ప్రయోగాలు ఆపేశారా?

చంద్ర బోస్: అపోలో - 13 వైఫల్యం చెందినా నిరాశ పడలేరు. అపోలో - 14ను 1971లో ప్రయోగించారు, జనవరి 31 నాడు అది జైత్రయాత్ర సాగించింది.

చంద్ర మోహన్: ఆ యాత్ర 1971 ఫిబ్రవరి 9వ తేదీ దాకా సాగింది. అంటే మొత్తం దాదాపుగా 10 రోజులు.

చంద్ర బోస్: అలాన్ బి షెపర్డ్, స్టార్ట్ ఏ రూసా, ఎడ్గర్ మిచ్చెల్ దానిలో వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు.

శశిరేఖ: మరి అపోలో - 14 తర్వాత ఏం జరిగింది నాన్నా?

శశికాంత్: అపోలో 15, 16 ప్రయోగాల గూర్చి చెప్పండి. అపోలో - 15 ను 1971 జూలై లో, అపోలో - 16ను 1972 ఏప్రిల్ లో ప్రయోగించారు. ఈ అపోలో - 15 లో వెళ్లిన ముగ్గురు వ్యోమగాములూ వారితో “ఒక కారును” కూడా తీసికెళ్లారు.చంద్రుడిపై నడపడానికి.

cm4శశికాంత్: మామూలు కారా అంకుల్? అదైతే ఇక్కడినించి తీసికెళ్లడానికే చాలా బరువు కదా.

చంద్ర బోస్: మామూలు కారు కాదు. దాన్ని ప్రత్యేకమైన తేలికైన లోహంతో, బరువు బాగా తక్కువుండేలా తయారు చేశారు. దానికి లూనార్ రోవర్ -1 అని పేరు.

శశిరేఖ: అది సరే. బరువు చాలా తక్కువంటుంన్నావ్, ఎంత బరువుండేది నాన్నా?

చంద్ర బోస్: రోవర్ - 1 బరువు కేవలం 462 పౌండ్లు.

శశికాంత్: అంటే, చంద్రుడి పైకెళ్లే సరికి 77 పౌండ్లన్నమాట దాని బరువు,

చంద్ర మోహన్: కరెక్ట్.

చంద్ర బోస్: ఆ రోవర్ లో ఎక్కి చంద్రుడి పై తిరుగాడిన కమాండర్ డేవిడ్ స్కాట్, తోటి పైలెట్స్ ఆల్ఫ్రైడ్ వార్డెన్, జేమ్స్ ఇర్విన్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

శశిరేఖ: కార్ రేసులో పాల్గొన్న ఫీలింగ్ కలిగిందా నాన్నా?

చంద్ర బోస్: సరిగ్గా అదే అనుభూతికి లోనయ్యారు.

చంద్ర మోహన్: చూశావా నాయనా శశికాంత్. చంద్రుడంటే అందరికీ ఎంత ఇది ఎందుకో అన్నావ్. ఇప్పుడు నీవే వదల్లేకపోతున్నావ్.

చంద్ర బోస్: మీరిద్దరూ తర్వాత వాదులాడుకోండి మోహన్ నన్ను చెప్పనివ్వు.

చంద్ర మోహన: అలాక్కానీయ్.

చంద్ర బోస్: 16వ తేదీ ఏప్రిల్ 1972 నాడు అపోలో - 16ను ప్రయోగించారు. దీనిలో జాన్ డబ్యూ యంగ్, థామస్ కి మాటిస్లీ, ఛార్లెస్ ఎం డ్యూక్ అనే ముగ్గురు ప్రయాణించారు. దీనిలో వాడిన లూనార్ మాడ్యూల్ పేరేంటో తెల్సా?

చంద్ర మోహన్: నాకు బాగా గుర్తుంది. దాని పేరు ఓరియన్. బాగా తేలికైన, గట్టి, పల్చని రేకుతో తయారైంది.

చంద్ర బోస్: కరెక్ట్ అది ఎంత పల్చగా అంటే, అంగుళంలో 250వ వంతు పల్చన

శశిరేఖ: మరీ అంత పల్చనా? ఎందుకూ?

శశికాంత్: ఎండుకేంటి రేఖా, మీ నాన్న ఇందాకే చెప్పారుగా, మరీ బరువైతే రాకెట్లో ఎలా తీసుకెళతారూ?

cm5చంద్ర బోస్: అంతరిక్షంలో అది తేలికగానే ఉన్నా, చంద్రకాంత్ అన్నట్లు, మరీ బరువైతే రాకెట్లో తీసుకెళ్లడం కష్టం. పైగా మిగిలిన తిండీ, అదీ తీసుకెళ్లడానికి వీలుకాదు కదా. అందుకే దానికో ప్రత్యేకమైన లోహాన్ని వాడారు. ఆ తర్వాత అపోలో - 17 ప్రయోగం అదే ఏడు డిసెంబర్, ఏడో తేదీనింది 19వ తేదీ దాకా కొనసాగింది. దీనిలో జాన్ ఏ సెర్నాన్, రోనాల్డ్ ఈవాన్స్, హరిసన్ స్మైంట్ అనే ముగ్గురు పాల్గొన్నారు.

శశికాంత్: అంకుల్ నాకో సందేహం. ఈ అపోలో ప్రయోగాలన్నిటిలో ప్రతిసారీ ముగ్గురు వ్యోమగాములే ఉండటం ఏమన్నా సెంటిమెంటా?

చంద్ర బోస్: అలాంటిదేమీ లేదు. కానీ, రాకెట్లో స్థలం కూడా ఉండాలిగా.

శశిరేఖ: నాన్నా, అపోలో - 17 వ్యోమగాముల ప్రత్యేక అనుభూతి ఏమిటి?

చంద్ర బోస్: ప్రత్యేక అనుభూతి అంటే ఏమీ లేదు కానీ, 3 రోజులు చంద్రుడి పై గడిపాక బాగా అలసిపోయాడట సెర్నాన్. ఆ అలసట దెబ్బకి మొఖం నిండా చంద్రుని పైని దుమ్ముతో నిండిన సెర్నాన్ నిద్రపోయాడట సుబ్బరంగా,

చంద్ర మోహన్: ఈ సెర్నాన్ లెగ్గు మహాత్యం. మళ్లీ అమెరికా చంద్రుడిపైకి మళ్లీ ఎవర్నీ పంపలేదు..

శశిరేఖ: అంటే నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తిగా నిలిచిపోతే...

శశికాంత్: ఈ సెర్నాన్ ఆఖరివాడిగా చరిత్రపుటల్లో ఎక్కాడు. అంతే కదా అంకుల్.

చంద్ర బోస్: ఎగ్జాక్ట్లీ సెర్నాన్ తర్వాత మళ్లీ ఎవరూ వెళ్లలేదు.

చంద్ర మోహన్: కారణాలేమై ఉండొచ్చంటావ్ బోస్?

చంద్ర బోస్: నాకూ ఆట్టే ఐడియా లేదు. బహుశా డబ్బులు వృధా అవుతోందన్న కారణం కావచ్చు.

శశిరేఖ: కరెక్ట్ ఇప్పటిదాకా మనిషి చంద్రుడిపైకి ఇన్ని యాత్రలు చేశాడు. ఏం సాధించాడు నాన్నా? డబ్బు ఖర్చు తప్ప.

చంద్ర బోస్: ఇప్పటిదాకా 380 కిలోల శిలలు తెచ్చారు. వారిపై ఎన్నో పరిశోధనలు సాగించారు. ఐతే, దానివల్ల ఏం ఒరిగిందీ అంటే, దానికి నేను ఏం సమాధానం చెప్పనూ! నా విదేశీ మిత్రులను అడగాల్సిందే.

చంద్ర మోహన్: మన పిల్లలు అడిగేదానిలో నిజం లేకపోలేదు బోస్. ఈ అపోలో ప్రయోగాలకు వెచ్చించిన దానిలో కొంత భూగోళ మ్మీద ఖర్చు పెట్టి ఉంటే ఎంతో బాగుండేదేమో,

చంద్ర బోస్: కానీ, ఒక్కటి మాత్రం చెప్పగలను. మానవుడు నిత్యాన్వేశి. అంతరిక్షం మీదా, చంద్రుడి మీదా అతనికుండే ఆసక్తి, కుతూహలమూ మానపుణ్ణి స్థిమితంగా ఉందనీలేదు.

శశికాంత్: నాన్నా. ఇక బయల్దేరాలి. టైం చూడు తొమ్మిదిన్నరైంది.

చంద్ర బోస్: ఇదిగో శశికాంత్. ఈ సీడీ చూడు.

శశిరేఖ: చూసి మళ్లీ జాగ్రత్తగా తిరగివ్వాలి శశికాంత్. ఒకే.

చంద్ర మోహన్: (నవ్వుతూ..) అలాగే ఇస్తాడు లేమ్మా.

శశికాంత్: తప్పకుండా ఓకే. బై బై అంకుల్.

చంద్ర మోహన్: వస్తాం బోస్.

చంద్ర బోస్: ఓకే, గుడ్ నైట్.

శశికాంత్: నాన్నా ఒక సందేహం. రష్యాకు అమెరికా దేశాలు తప్ప, వేరే దేశాలేవీ ప్రయత్నించలేదా?

చంద్ర మోహన్: అంటే?

శశికాంత్: ఐ మీన్ మన భారతదేకు లాంటి అభివృద్ధి చెందిన.

చంద్ర మోహన్: మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకానొక మీటింగ్లో దీని గురించి ప్రస్తావించారు. ఐతే ఇందాక అనుకొన్నట్టు దానికి చాలా డబ్బులు కావాలి గదా.

శశికాంత్: ఈ అపోలో జైత్రయాత్రలూ, చంద్రుడితో మానవుడి చెలిమీ - ఇవన్నీ విన్నాక నాకూ చంద్రుడితో చెలిమి చేయాలనిపిస్తోంది. చంద్రుడిపై మన దేశం జెండా ఎగరేయాలని అనిపిస్తోంది.

చంద్ర మోహన్: మంచిదే. ఆల్ ది బెస్ట్.

శశికాంత్: అలాగే మాటల్లోనే ఇంటి దగ్గరికొచ్చేశాం.

సిడిలో డా.సాయి బతీక

సా.ఐ: రండి. మీకు వ్యోమగాముల ఫోటోగ్యాలరీ చూపిస్తాను. ఇదిగో... ఇది అపోలో 7లో వెళ్లిన షిర్రా ఫోటో, భూకక్ష్యలోకి వెళ్లి విజయుడిగా వెనక్కి వచ్చాడు.

ఇద్దరు: ఆ దుస్తులూ అవీ భలే థ్రిల్లింగ్ గా ఉంది చూడటానికి.

సా.ఐ: అదిగో, అది ఆలన్భీన్ ఫోటో. అపోలో 12కి లూనార్ పైలెట్. పెయింటింగ్ చేయడం అంటే అతనికి మహాపిచ్చి. అతను వేసిన పెయింటింగ్ లన్నీ వ్యోమగాములవే. చంద్ర మండలాని. అలా వేసే, వేసీ దివరికి, ఏకంగా ఆ చంద్రుడి పైకి వెళ్లి వచ్చాడు.

శశికాంత్: ఐతే, అతని పెయింటింగ్లకి మరింత గిరాకీ వచ్చుండాలే.

సా.ఐ: యస్, బాగా గిరాకీ ఏర్పడింది. ఇదిగో ఈ ముగ్గురూ స్కాట్, స్వీకర్ట్ మెక్డెవిట్ వీళ్లే అపోలో 9లో వెళ్లి వచ్చిన వ్యామగములు. భూమి నుంచి 140 మైళ్లు పైకి ఎగిశాక వారికి భూమి నీలంగా కనిపించిందిట. అది అపోలో 18 కోసం తయారైన శాటర్న్ వి అనే రాకెట్ అంతా సిద్దం అయ్యాక తిరిగి అపోలో ప్రయోగం ఎప్పటికీ చేయలేదు. దాంతో ఈ హూస్టన్ అంతరిక్ష కేంద్రంలో ఒక షో పీన్ గా మారిపోయింది. దీని పొడవు 111 మీటర్లు,

శశిరేఖ<: అంటే మిలియన్ల డాలర్లు వృధా అయిపోయినట్టే.

సా.ఐ: దీనిని తయారు చేయడానికి అప్పట్లో అయిన ఖర్పు 225 మిలియన్ డాలర్లు.

శశికాంత్: అయ్య బాబోయ్.

శశిరేఖ: అరెరే. అదేదో దూసుకొస్తూంది. శశికాంత్ జాగ్రత్త. (ఝుమ్మంటూ శబ్దం)

శశికాంత్: అబ్బా! (అని పెద్ద కేక పెట్టి పడిపోతాడు). (పక్కునించి కింద పడ్డ చప్పుడు. ఇంతలో తల్లి చంద్రిక)

చంద్రిక: ఏమైందిరా. లే.లే. ఏమిటా గావు కేకలు. పీడకల గానీ వచ్చిందా ఏం?

శశికాంత్: లేదులే. (తనలో తాను) ఈ కల గురించి నాన్నకు చెప్పాలి. (గట్టిగా) నాన్నా,..నాన్నా..

చంద్రిక: మొదలెట్టావూ, ముందు మొహం కడుక్కురా, కాఫీ తాగుదూ గానీ.

శశికాంత్: నాన్నా అద్భుతమైన కల. నేనూ, శశిరేఖా నాసాకు శిక్షణ కోసం మనదేశం నుంచి వెళ్లాం. మీ ఫ్రెండ్ ట కలిశాం. ఇంతలో మెలకువ వచ్చేసింది.

చంద్రిక: ఇదిగో పేపర్,

చంద్ర మొహన్: (పేపరందుకొని) అలే, శశికాంత్, నీకల నిజమయ్యేలా ఉందే. ఈ పేపర్లో హెడ్లైన్స్ చూడు

శశికాంత్: అరె. చంద్రమండలం పైకి వెళ్లేందుకు ఇండియా సిద్ధమౌతోంది. ఆ ప్రాజెక్ట్ పేరు చంద్రయాన్.

చంద్రిక: (టీవి పెడుతుంది) ఇదిగో చూడండీ.... (టీవీలో వార్తలొస్తున్న మాటలతో ... ఫెడిన్).

టీవిలో: రాబోయే రెండు, మూడేళ్లలో చంద్రుడి పైకి వెళ్లే ఉద్దేశంతో భారతదేశం చంద్రయాన్ అనే ప్రాజెక్టును చేపట్టింది. చంద్రుడి పైకి మనుష్యుల్ని పంపడం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇస్రో తెలిపింది.

శశికాంత్: నాన్నా రాత్రి బోస్ అంకుల్ దగ్గరికెళ్లామా, ఆ తర్వాత కలలోనూ అదే. ఇప్పుడు అవే నిజమయ్యేలా ఉన్నాయి.

చంద్రమోహన్: తప్పకుండా నీ కలలు నిజమవుతాయి. అందుకే ఐన్స్టీన్ ఏమన్నాడో తెల్సా...' ఫాంటసీ అనేది నా టాలెంట్ కన్నా, నా వ్యక్తి గతంగా ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే అది పాజిటివ్ జ్ఞానాన్ని ఆకర్షించే వీలును కల్పించింది. ఐతే, ఆ కనే కలేదో పెద్ద కలనే కనండి' అన్నాడు,

ఆధారం: వి.వి. వెంకటరమణ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate