హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / సైన్స్ పదనిసలు / జీవవైవిద్య సంరక్షణకు విత్తనాల సేకరణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవవైవిద్య సంరక్షణకు విత్తనాల సేకరణ

ఆయుర్వేదం గురించి లిఖితపూర్వకంగా రాసి భద్రపరిచి, భవిష్యత్తు తరాలకి అందించాలని రచయిత ఆశ.

dec29భారతదేశం ఒక గొప్ప దేశం, అతి ప్రాచీన దేశం. విశాలమైనది. కొన్ని వ్యాధులకి ఆయుర్వేద వైద్యం అందించిన దేశం. అడవుల విస్తీర్ణం తగ్గి నేడు విలువైన మొక్కలు కన్పించకుండా పోయాయి. అరుదైన మొక్కలు, జంతువులు నశించాయి.

అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న మానవుడు తన ప్రక్కనున్న పర్యావరణాన్ని మరిచిపోతున్నాడు. మానవ మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ఫలితంగా కాలుష్యం పెరగటం, జీవవైవిధ్యం నాశనం జరుగుతున్నది..

నాకు పాఠశాల స్థాయి నుండి జీవశాస్త్రంపై మక్కువ ఎక్కువ. అందువల్లనే నేను ఇంటర్ లో బైపిసి గ్రూపు తీసుకున్నాను. ఆ సమయంలోనే నేను మొదటిసారిగా జీవవైవిధ్యం అన్న పదం విన్నాను. అప్పుడే హైదరాబాద్ లో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చారు. జీవవైవిధ్యం నశించడానికి గల కారణాలు అభివృద్ధి పరచటానికి తీసుకోవాల్సిన చర్యల గూర్చి చర్చలు జరిపారు. ఇదంతా ప్రచార సాధనాలు, మా వృక్షశాస్త్ర అధ్యాపకులు రాజేందర్ గారి ద్వారా మరింత తెలుసుకున్నాను.

జీవవైవిధ్యాన్ని రక్షించడానికి నా వంతు కృషిగా ఏదైనా చేయాలనుకున్నాను. అంతరించిపోతున్న మొక్కలను రక్షించడానికి విత్తనాలను సేకరించాలనుకున్నాను. దీనివల్ల కొంత వరకు జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చునని ఉద్దేశ్యం.

మాది వ్యవసాయ కుటుంబం కావడంతో కళాశాల సెలవుల్లో పశువులని మేపడానికి వెళ్ళినప్పుడు, పొలం పనులకి వెళ్ళినప్పుడు విత్తనాలను సేకరించసాగాను. మొదట చిన్న కాగితాలలో విత్తనాలని భద్రపరిచాను. తర్వాత ప్లాస్టిక్ కవర్లో విత్తనాలను ఉంచి వాటి సాధారణ నామాలను, శాస్త్రీయ నామాలని రాశాను. నాకు తెలియని మొక్కల విత్తనాలను స్థానిక రైతుల ద్వారా వారు వాడే వ్యవహారిక నామాలని తెలుసుకున్నాను. విత్తనాలను సేకరించు సమయంలో ఎవరు అందుబాటులో లేకపోతే ఆ మొక్కను తీసుకొచ్చి చూపించేవాన్ని, పెద్ద చెట్లయితే చరవాణితో ఫోటోలు తీసి చూపించి వాటి పేర్లు తెలుసుకునేవాన్ని, రైతులు పిలిచే సాధారణ నామాలకి మా వృక్షశాస్త్ర అధ్యాపకులు ద్వారా శాస్త్రీయ నామాలు తెలుసుకొన్నాను. మొక్కల హర్బేరియం చేసి సార్క్ చూపించి శాస్త్రీయ నామాలు రాసేవాన్ని. తడిగా వున్న విత్తనాలని అరబెట్టటం, జాగ్రత్తగా భద్రపరచటం ప్రజల నుండి నేర్చుకుని ఇప్పటి వరకు 42 రకాల విత్తనాలని సేకరించాను.

నేను సేకరించిన విత్తనాలలో దాదాపు అన్ని రకాలున్నాయి. ఆహార ధాన్యాలు, పశుగ్రాసాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, కలుపు మొక్కలు, కలప మొక్కలు, ఆయుర్వేద ఔషధ మొక్కలు, పల్కాల విత్తనాలు, విషపూరిత మొక్కల విత్తనాలున్నాయి. కుమ్మెర, ఆర్నికల్ సమీపంలోని గుట్టప్రాంతం, ఉమామహేశ్వరం ఆలయానికి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం, మున్ననూరు దగ్గర నల్లమల అడవి నుండి విత్తనాలు సేకరించాను. నా సేకరణలో అరుదుగా లభించే తెల్ల గురిగింజ, అడవి ఆముదం, పవిడి ప్రత్తి, అడవి గోకరకాయ, అటవి వంకాయ, అడవి కాకర, తెల్లవాడైం, అడవి వడ్లు (మొండిపట్లు), సీల్ల గింజలు, విషపూరిత సిరంజి విత్తనాలు, తెల్లగంధం విత్తనాలు మరికొన్ని సాధారణ నామాలు తెలియని అరుదుగా లభించే ప్రత్యేక లక్షణాలున్న విత్తనాలు సేకరణలో ఉన్నాయి.

గ్రామాలలో కొందరు పెద్దలు స్థానికంగా  ఉండే మొక్కల సహాయంతో కొన్ని వ్యాధులని నయం చేస్తుంటారు. నేటి ఆధునిక విధానంలో వీటిని ఉపయోగించేవారు కరువయ్యారు. ఫలితంగా మందు తయారు చేసేవారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. కావున నేను గ్రామంలోని వృదులను కలసి వారు ఏ వ్యాధికి ఏ మందును, ఏ మొక్క భాగాన్ని ఉపయోగించి తయారు చేస్తారో అడిగి తయారు చేసినప్పటి నుండి ఎంత కాలం పనిచేస్తుందో, ఏ సమయంలో ఆ మందుని ఉపయోగించాలో, ఉపయోగించు సమయంలోని ఆహారపు అలవాట్లని విపులంగా, లిఖితపూర్వకంగా రాసి భద్రపరుస్తున్నాను. భవిష్యత్తు తరాలకి అందించటం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను.

ఆధారం: రమేష్, ఓ.యూ.పి.జీ. కాలేజి

3.00304878049
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు