অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తరం తరం నిరంతరం

తరం తరం నిరంతరం

నాన్న: ఇంట్లో ఎవరూ లేరు. అందరూ ఎక్కడికెళ్ళారమ్మా?

బుజ్జీ: పిన్నికి కాస్త ఆయసంగా ఉంది. నొప్పులు వచ్చేట్లున్నాయి అంది. వెంటనే అమ్మ, బాబాయి, పిన్నిని తీసుకొని భారతీ నర్సింగ్ హోంకీ వెళ్ళారు.

నాన్న: నేను రాగానే ఎందుకు చెప్పలేదు?

31బుజ్జీ: ఒక్కేసారే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింతర్వాత చెపితే ఆశ్చర్యపోతావు గదా అనుకున్నా. అయినా విడవకుండా ప్రశ్న మీద ప్రశ్న అడిగి విషయం తెలుసుకున్నావుగా. (ఫోన్ మోగింది) హల్లో బాబాయ్! ఆ! ఏంటీ! కాంగ్రాచ్యులేషన్స్. ఆ! నాన్న ఇక్కడే వున్నాడు. అంతా క్షేమమేగా. సరే గుడ్! నాన్న నేను హాస్పిటల్ కి వచ్చేస్తాము... సరేనా, కాంగ్రాచ్యులేషన్స్ నానా! నువ్వు పెదనాన అయ్యావు. నేను అక్కయ్యనయ్యాను.

నాన్న: వెపీనైస్. పాప? బాబా?

బుజ్జీ: ఎవరో, చెప్పుకో చూద్దాం!

నాన్న: ఎవరైనా పర్వాలేదు. ఎలాగూ మనింట్లో ఆడపిల్లవి నువ్వు వున్నావుగా. ఇంకా నాకు పిల్లలు అవసరం లోదు కాబట్టి మీ బాబాయికి బాబు పుడితే బావుంటుంది.

బుజ్జీ: అయ్యే నాన్న -  నీ ఆశ తీరలేదు. పిన్నికి పాప పుట్టిందట!

నాన్న: అలాగా, పర్వాలేదు. అయితే మనింట్లోకి కొక పాప వచ్చిందన్న మాట. సరే, త్వరగా తయారవు. హాస్పిటల్ కి వెళ్దాం.

బాబాయి: మీ పిన్నికి సిజేరిన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసారు. పిన్ని మత్తుగా పడుకుని వుంది.

బుజ్జీ: చెల్లి అప్పుడే నవ్వుతున్నట్టు మొబం పెట్టిందే... కళ్లు అచ్చం పిన్నిలాగే కానీ, బాబాయ్ కి, పిన్నికి లేని గరాల డుట్టు పాపకు వచ్చింది అదెట్లా?

నాన్న: కొన్ని లక్షణాలు వారసచ్వంగా తల్లిదండ్రుల దగ్గర్నుంచి శిశువుకు సంక్రమిస్తాయి. కొన్ని లక్షణాలు సంక్రమించకపోవచ్చు కూడా.

డాక్టర్: ఏంటండీ శేఖర్ గారు! మీ తమ్ముడి పాప లావుంది/

నాన్న బావుంది డాక్టర్. మా అమ్మాయి ఏదో అడుగుతుంది. మీరు కాస్త చెప్పండి.

బుజ్జీ: అదేం లేదండీ. మా చెల్లి కన్నులు అంచ్చంగా మా పిన్ని కన్నులే. కాని, పిన్నికిలేని గరాల జుట్టు మా చెల్లికి ఉంది. అదెల సాధ్యం?

డాక్టర్: మన శరీరంలో జన్యువులుంటాయి. వాటినే ఆంగ్లంలో జీన్స్ అంటారు. ఈ జన్యువులే అనేక లక్షణాలు నిర్థారిస్తాయి.

బుజ్జీ: జన్యువులు, జీన్స్ అంటే ఏమిటి?

డాక్టర్: మన ఇల్లు ఇటుకలతో కట్టుకున్నట్లు చిన్న చిన్న జీవ కణాలు కలిసి మన శరీరాన్ని ఏర్పరుస్తాయి. ఈ జీవకణాల్లో దారం పోగుల వంటి నిర్మాణాలనే క్రోమోజోములు అంటారు.

బుజ్జీ: క్రోమోజోమ్స్

డాక్టర్: అవును. క్రోమోజోములు. క్రోమోజోముల్లో జిఎన్ఎ, డిఆక్సీరైటో న్యూక్లియక్ ఏసిడ్ వుంటుంది. ఇది జన్యువులను ఏర్పాటు చేస్తుంది. కంటి రంగుని, జుట్టు రంగుని, శరీరం రంగుని పొట్టిపొడుగు ఇలాంటి అనేక లక్షణాలను ఈ జన్యువులే నిర్ధారిస్తాయి. ఇవి మన శరీరంలో వేల కొలది వుంటాయి.

బుజ్జీ: జీన్స్ వేల కొలది ఉంటాయా?

డాక్టర్: అవును. దాదాపు 30వేల జీన్స్ వరకు ఉంటాయి.

బుజ్జీ: సరే, పిన్ని నల్లని కళ్ళు పాపకు వచ్చాయి. మరి ఆ ఉంగరాల జుట్టు మా పిన్నికి, బాబాయికి లేదే.

32డాక్టర్: జన్యువులు ఒకతరం నుండి మరోతరం శిశువులకు అందజేయబడినప్పటికీ కొన్ని బయటకు కనిపిస్తాయి మరి కొన్ని బయటకు కనిపించవు.

బుజ్జీ: అంటే, మీదంటున్నదేమిటంటే ఉంగరాల డుట్టు కలగజేసే జన్యువులు మా పిన్నిలో వున్నాయి కాని, అవి మనకు బయటకు కనపడలేదనేగా.

డాక్టర్: ఔను కరెక్టే. అవి ఎప్పుడో పాప శరీరంలోకి సంక్రమించాయి. కాని అవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి.

బాబాయి: మా అత్తకు ఉంగరాల జుట్టు వుండేది. అయితే ఈ జన్యువులు ఆమె నుండి వచ్చి వుంటాయి.

డాక్టర్: అవును అదీ నిజమే... చూడండి, శేఖరం గారు. మీ అమ్మాయి అన్ని విషయాలు తెలుసుకోవాలని కూతాహలం చూపిస్తూంది. ఆమె ప్రఖ్యాత శాస్త్రవేత్త మెంజల్ గుర్చి, ఆయన పరిశోధనల గూర్చి చెప్పండి, ఇప్పుడుక పాపను నర్స్ చేతికివ్వండి. నర్స్ పాపను ఉయ్యాలలో పడుకోబెడుతుంది. పాపకు విశ్రాంతి అవసరం.

నాన్న: బుజ్జి బాబాయి పిన్నిని స్పెషల్ రూంలోకి మార్చినంక వస్తాడు. కాని మనం ఇంటికి పోదాం పద. మళ్ళీ సాయంకాలం రావచ్చు.

బుజ్జీ: నాన్న... డాక్టర్ గారు నాకు మెండల్ పరిశోధనల దూర్చి చెప్పమన్నాడు కదా. ఆయనెవరూ?

నాన్న: బుజ్జీ... గ్రెగర్ మెండల్ ఆస్ట్రీయా దేశానిక చెందిన క్రైస్తవ మాతాచాక్యుడు. ఆయనే మెట్టమెదటి సారిగా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయని కనుగొన్నాడు. (డోర్ బెల్ మోగింది. తలుపు తీసిన చప్పుడు0

గోపాల్: హలో శోఖరం. మీ తమ్ముడికి పాప పుట్టిందని విన్నాను. My heartiest congratulations. తల్లీ బిడ్డలు ఎలా వున్నారు?

నాన్న: వాళ్ళు బాగున్నారు గోపాల్. మేమింతకు ముందే హాస్పిటల్ నుండి వచ్చాం. వచ్చిందగ్గర్నుంచి మా బుజ్జి ప్రశ్నలతో చంపుతుంది. కాస్త గ్రెగర్ మెండల్ గూరించి చెప్పు. వారసత్వ లక్షణాల గురించి డాక్టరు గారు మా అమ్మాయితో ప్రస్తావించారు.

గోపాల్: ఏం బుజ్జి. పాపను చూడగానే మీ చెల్లికి ఎలాంటి లక్షణాలు వస్తాయోనని దిగులు పట్టుకుందా? నిన్నేం ఇబిబంది పెట్టదులే.

బుజ్జీ: అవి కాదంకుల్, నెండల్ ఆస్ట్రీయాలో ఒక క్రైస్తవ ఫాదర్ గా ఉండేవాడని నాన్న చెప్పాడు. మతాచార్యులకు సైన్స్ పట్ల ఆసక్తి కలగడం ఆశ్చర్యంగా ఉంది. భగవంతుడే అన్ని నక్షణాలు  ఇస్తాడని అనుకోవల్సిన వ్యక్తి ఆ లక్షణాలు ఎలా వచ్చాయని పరిశోధన చేయడమే విచిత్రం కదూ...

గోపాల్: అది నిజమే.  తాత ముత్తాతల నుండి, తల్లిదండ్రుల నుండి నేక లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తాయని అంతకు ముందు ఎవ్వరికీ తెలియని విషయాన్ని గ్రెగర్ మెండల్ మొదటిసారిగా 1860లో కనుగొన్నాడు. కానీ అప్పట్లో ఈ విషయాలు చాలా మందికి హాస్యాస్పదంగా కనపడ్డాయి.

మెండల్: తోటమాలీ, బఠాణీ మొక్కల పువ్వులన్నింటినీ పేపర్ కవర్తో మూయాలి.

తోటమాలీ: ఎన్ని మొక్కల పువ్వుల్ని పేపర్ తో చుట్టాలో చెప్పండి.

మెండల్: నువ్వు చాలా కష్టపడి పని చేస్తావు. నేనిక్కడా చాలా రకాల బఠాణీ మొక్కల్ని నాటాను. వాటన్నింటిని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశావు. పువ్వులు పూస్తున్నాయి ఇప్పుడు.

తోటమాలీ: ఫాదర్, నెనోమాట అడగవచ్చా?

మెండల్: నిర్భయంగా అడుగు.

తోటమాలీ: ఫాదర్, సాధారణంగా ఎవ్వరైనా బఠాణీ గింజల మొక్కలు నాటుతారు. కాని, మీరు చేస్తున్న పనేం నాకు అర్థం కాకుండా ఉంది.

33మెండల్: ఔను, ఈ వరసులో మొక్కల పూలు కాండం చిన్నగా పూస్తాయి. ఈ వరుసలో బఠాణీ విత్తణాలు గుండ్రంగా వుంటాయి. అదిగో... ఆ వరుస బఠాణీ మొక్కల గింజలు కాస్త ముదురు ముడతలుగా వుంటాయి. ఆ దూరంగా వరుసల్లో కొన్ని పొట్టి మొక్కలు, కొన్నివరస పొడుగు మొక్కులున్నాయి. వాటి మధ్య పెళ్ళి చేస్తే పుట్టే మొక్కలు పొట్టిగా వుంటాయా, పొడుగ్గా వుంటాయా చూడాలి.

తోటమాలీ: పెళ్ళా? (నవ్వి) ఫాదర్, అయినా మొక్కలకు పెళ్ళేంటి?

మెండల్: మొక్కలకు పెళ్ళి అంటే వాటి మద్య సంకరం చేయడమన్నమాట. అప్పుడు వచ్చే గింజలు ఎటువంటి లక్షణాలు ఏర్పడ్డాయో చీసి మనిద్దరం కలిసి ఈ పని చేద్దాం.

తోటమాలీ: అర్థం అయింది ఫాదర్. మొక్కలకు కూడా మనలాగా ప్రాణం జివితాలుంటాయి.

మెండల్: సరిగ్గా అర్థం చేసుకున్నావు. సరే పద. వాటి పెళ్ళి ప్రయత్నాలు చేద్దాం. పువ్వులన్నింటినీ చక్కగా పేపర్ తో చుట్టు. క్రిమి కీటకాలు, గాలి చేరకుండా చూడూ. సరేనా.

తోటమాలీ: సరే ఫాధర్.

గోపాల్: అదమ్మా సంగతి. గ్రెగర్ మెడల్ వృత్తిరిత్యా క్రైస్తవ మతాచార్యుడైనప్పటికీ ప్రవృత్తిరీత్యా పరిశోధకుడు. మెండల్ ని విజ్ఞాన శాస్త్రం జన్యుశాస్త్ర పితామహుడిగా పరిగణిస్తుంది. ఆస్ట్రీయా దేశంలో హజ్డార్ఫ్ అనే గ్రామంలో పుట్టడం వల్ల అందరూ అతడ్ని మెండల్ అని పిలిచేవారు. ఆయన తన తండ్రికి వ్యవసాయం పనుల్లో సాయపడేవారు. బహుశా అదే అతడ్ని మొక్కల పెంపకం వైపు మరల్చింది. అతడు చదువు కొన్న తర్వాతమతాచార్యుడయ్యాడు. రోమన్ కేథలిక్ క్రైస్తవుల్లో మతాచార్యులైన వారు జీవితాంతం బ్రహ్మచారిగానే వుండాలి. ఆయన బ్రూన్ అనే పట్టణంలో సెయింట్ ఆగస్టన్ మొనాస్ట్ లో తన మతసేవను మొదలుపెట్టాడు. అప్పుడే అతడికి గ్రెగర్ అనే పేరు చేర్చబడింది. అప్పటినుంచి ఆయనను గ్రేగర్ యోహాన్ మెండల్ అని పిల్చేవారు.

బుజ్జీ: మరి అతడికి మొక్కల పెంపకం వైపు ఆసక్తి కలిగినప్పుడు బఠాణీ మొకల్నే ఎందుకు ఎంచుకున్నాడు?

గోపాల్: ఎందుకంటే బఠాణీ మొక్కల జీవిత కాలం తక్కువ. పరిశోధనలు ఆ మొక్కలపై చేయడానికి అనువుగా ఉంటాయి. తన మోనాస్ట్రీ అంటే మతాచార్యుల శిక్షణాకేంద్రం ఆవరణలో అనేక బఠాణీ మొక్కల లక్షణాలు తర్వాత తరానికి ఎలా సంక్రమిస్తాయో తెలుసుకోవాలని అనుకున్నాడు.

బుజ్జీ: అయితే బథాణీ పువ్వులకు పెళ్ళి చేశాడన్నమాట.

గోపాల్: అవును. ఒక పువ్వు మకరమదాన్ని మరో పువ్వుకు చేర్చడం పెళ్ళిలాంటిదే. ఫాదర్ గ్రాగర్ మెండల్ 8 సంవత్సరాలు ఈ పరిశోధనలు చేశాడు.

బుజ్జీ: 8 సంవత్సరాలా?

నాన్న: అవును. 8 సంవత్సరాలు. ఒక మనిషి పట్టుదల, కుతూహలం ఉంటే తను తల్చుకున్న పని సాధించడానికి ఎమ్మేళయిన కృషి చేస్తాడు. నీకు తెలుసా బుజ్జీ, ఆయన దాదాపు 80 వేల బఠాణీ మొక్కల మీద ఈ 8 సంవత్సరాలు ప్రయోగాలు నిర్వహించారు.

గోపాల్: అవును శేఖరం, శ్రమ పడేవారికి ఫలితం వుంటుంది. గ్రేగర్ మెండల్ బఠాణీ మెక్కలకు ఎంచుకోవడానికి వాటి జీవిత కాలం ఒక్కటే కారణం కాదు. బఠాణీ పూల మకరందం ఇతర జాతుల పువ్వుల మకరందంతో కలవదు. అంటే పువ్వులు కలుషితం కావు. హైబ్రిడ్ కావన్నమాట. ఉదాహరణకు గాడిదకు, గుర్రానికి సంకరణం చేయవచ్చు. జాతి కలచర గాడిదవుతుంది. కాని బఠాణీ పూల మకరందం బఠాణి పూల మకరందంతోనే కలుస్తుంది.

నాన్న: ఔనౌను. ఎర్రని పూల నుండి వచ్చే మొక్కలు ఎప్పుడూ ఎర్రని పూలే పూస్తాయి. అలాగే తెల్లనిపూలు పూచే బఠాణీ మొక్కలు ఎప్పుడూ తెల్లని పూలే పూస్తాయి.

గోపాల్: ఫాదర్ మెండల్ మాత్రం వాటి గింజల రూపాలు, పువ్వులు మొక్కపై పూసే ప్రదేశం ఇటువంటి విషయాలపై తన పరిశోధనలలో దృష్టి నిలిపాడు. వీటి సంబంధాలను పరిసోధనలలో దృష్టి నిలిపాడు. వీటి సంబందాలను పరిశీలించి ఆశ్చర్యపోయి ఆ తర్వాత తన పరిశోధనా ఫలితాలను బ్రూక్స్ నేచర్ సైన్స్స్టడీ కమిటీ ముందుంచాడు.

(సంగీతం)

(అంతా గడబిడిగా వుంది. అందరూ మాట్లాడుకుంటాన్నారు)

వ్యక్తి 1: ఫాధర్ మెండల్ – గుడీవినింగ్.

వ్యక్తి 2: ఈరోజు 8 మార్చి. ఈరోజు మీరు చదివిన పరిశోదనా పత్రం మాకు విచిత్రంగా ఉంది.

మెండల్: విచిత్రం ఏముంది ఇందులో? నిజానికి ఇది చాలా సులభతరమైన గణితపు లెక్కలు. జాగ్రత్తగా వినివుంటే మీరు ఇష్టపడి వుండేవారు. నేను కొన్ని ఆసక్తికరమైన సంబంధాల గూర్చి చర్చించాను.

వ్యక్తి 1: ఏమిటీ సంబందాలు?

వ్యక్తి 2: ఏముంది. బఠాణీ పిల్ల మొక్కల సంభంధాలు,

మెండల్: బఠాణీ మొక్కలు ఒకే తరం నుండి మరొక తరానికి రావడం గుర్చి మాట్లాడాను.

వ్యక్తి 1: పనిలేని వాడు పిల్ల తల గొరిగినట్లు తీరిగ్గా మొక్కలను పరిశీలించడం ఒ పరిశోధన అనుకుంటున్నాను.

వ్యక్తి 2: ఈ పని చేయడానికి విసుగువుట్టాడు? అయినా ఈయనా 1856 నుండి అదే పనిగా బఠాణీ మొక్కలను పరిశీలిస్తున్నాడన్నమాట.

వ్యక్తి 1: అంటే గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారన్నమాట.

వ్యక్తి 2: ఇదేం నమ్మశక్యంగా లేదు.

వ్యక్తి 1: నేను నమ్మను.

వ్యక్తి 2: అవునా, పోయిన ఫిబ్రవరి 8వ తారీఖు కూడా సమావేశంలో మాట్లాడదట గదా, నువ్వులేదా? కానీ అక్కడున్న వాళ్ళెవ్వరూ అంత పెద్ద ఆసక్తితో వినలేదని విన్నాను. పూలరంగు తర్వాత తరానికి సంక్రమిల్తుంది గింజలు గుండ్రంగా ముజుతలుగా... పెద్ద జోక్ గా వుంది.

మెండల్: ఒక్కసారి వినండి, నా పరిశోధనా పత్రం సరిగ్గా అర్థం కాకుంటే సంక్షిప్తంగా మరోసారి చెప్తాను. 8 సంవత్సరాలుగా కృషి ఫలితం ఇది. వివిధ రకాల బఠాణీ మొక్కలు పరిసీలించాను. వాటి మధ్య ఒక పువ్వు మీద చేర్చడం వలన వేల సంక్రమణాలు చేశాను. నీటన్నింటిని రికార్డు చేశాను. దాని ద్వారా ఒక ముఖ్య విషయాన్ని కనుగొన్నాను.

(సమావేశంలో తిరిగి గడబిడ)

వ్యక్తి 1: హూ! 8 సంవత్సరాలు టైం వేస్టు.

వ్యక్తి 2: ఫలితాలు మరోసారి చెప్పు ఫాదర్.

మెండల్: విషయం ఏమిటంటే తల్లిదండ్రుల లక్షణాలు వారి పిల్లలకు సంక్రమిస్తాయి. ఈ లక్షణాలు ల్లప్పుడూ జతలు జతలుగా సంక్రమిస్తాయి. ఉదాహరణకు ఒక పొట్టిమొక్క పూలకు పొడుగు మొక్క పువ్వుతో జత కజితే పొట్టి, పొడుగు మొక్క పువ్వుతో జత కడితే పొట్టి, పొడుగు రెండు లక్షణాలు పిల్ల మొక్కలకు సంక్రమిస్తాయి. కానీ ఇందులో ఒక లక్షణం దామినేటింగ్ గా వుంటుంది.

వ్యక్తి 1: డామినేటింగ్ అంటే?

మెండల్: అంటే ఒక లక్షణమే బహిర్గతం అవుతుంది. పెండవ లక్షమం బహిర్గతంగా వుంటుంది. ఇలా పొట్టి పొడుగు మొక్కలు సంకరణం జరిగితే 3:1 నిషపత్తిలో మొక్కల లక్షణాలు అంటే 3 పొట్టి మొక్కలైతే 1 పొడుగు మొక్క, లేక 3 పొడుగు మొక్కలైతే 1 పొట్టిమొక్క ఇలా పిల్లమొక్కలు పుట్టే గింజలు తయారవుతాయి.

వ్యక్తి 1: ఇదంతా హంబగ్.

వ్యక్తి 2: విను, విను, ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.

మెండల్: ఇంకా రెండు లక్షణాలు కాకుండా నాలుగు లక్షణాలు తీసుకుంటే ఈ మొక్కలు 9:3:3:1 గా తయారవుతాయి. ఉదాహరణకు పొడుగు, పొట్టి, గింజలు గుండ్రం, గిండలు ముడతలుగా వున్నవి తీసుకుంటే, 9 పొడుగు, గింజలు గుండ్రం మొక్కలు 3 పొడుగు గింజలు ముడుతలుగా వున్న మొక్కలు, 3 పొట్టి, గింజలు గుండ్రంగా వున్నమొక్కలు, పొట్టి గింజలు ముడుతలుగా వున్న మొక్కలు తయారవుతాయి.

వ్యక్తి 1: చూశారా, ఫాదర్ చిన్న పిల్లలకు చెప్పినట్లు లెక్కలు చెపుతున్నాడు.

వ్యక్తి 2: నాకేం అర్థం కాలేదు. నువ్వయినా లెక్కలు నేర్చుకో.

మెండల్: నా పరిశోధనా ఫలితాలు శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు.

గోపాల్: నిజం చెప్పాలంటే ఫాదర్ గ్రెగర్ మెండల్ ను తోటి మతాధిపతులు, ప్రజలు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ శాస్త్రవేత్తగా ఆయన నైపుణ్యాలను గుర్తించలేకపోయారు.

నాన్న: అవును. ఫాదర్ మెండల్ కూడా అప్పుడప్పుడూ అంటుందేవాడట. నా సమయం కూడా ఎప్పుడో ఒక్కప్పుడు వస్తుంది. అని. తల్లిదండ్రుల, తాతముత్తాతల లక్షణాలు పిల్లలకు ఎలా సంక్రమిస్తాయో అతడు తెలుసుకున్న అధ్భుతమైన విషయం కానీ, అతడు చెప్పిన మాటలను ఎవడూ పట్టిచుకోక పోవడమే విచారించాల్సిన విషయం.

గోపాల్: అవును. బ్రూన్స్నేచురల్ సైన్స్ స్టడీస్ కమిటీ వాల్ళు ఎవరూ కూడా అతడి పరిశోధనలపై శ్రద్ద కనబరచలేదు. అయినా ఎప్పుడో ఒకసారీ తన పనిని ప్రజల గుర్తిస్తారని ఆయన నమ్మేవాడు. చివరకు అదే జరిగింది. ఫాదర్ మెండల్ కీర్తిశేషులైన 35 సంవత్సరాలకు ముగ్గురు వృక్షశాస్త్రవేత్తలు అతడు చేసిన పని ధృవీకరించారు.

బుజ్జీ: నాన్నా, ఎవరా ముగ్గురూ శాస్త్రవేత్తలు.

గోపాల్: నేను చెబుతాను. ఒకరు హాలెండుకు చెందిన కార్ల్ఫ్రెండ్ జోసెఫ్ కారెన్స్, మరొకరు ఆస్ట్రీయాకు చెందిన ఎరిక్ సెర్మాన్ వాగన్ సెన్సెంగ్. అయితే ఇందులో హ్యూగో డిస్రలీ ఈవెనింగ్ స్ట్రెమ్ రోజ్ అనే మొక్కమీద 25 సంవత్సరాలు పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధనా ఫలితాలు 35 సంవత్సరాలు క్రితమే గ్రెగర్ మెండల్ వెలువర్చారనిడని తెలిసి బోలెడు ఆశ్చర్యపడ్డాడు.

బుజ్జీ: నాన్నా.. మేమే ఈ పరిశోధన చేశామని ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు చెప్పుకోలేదా?

గోపాల్: లేదమ్మా, ఈ ముగ్గురి శాస్త్రవేత్తల నిజాయితీ శాస్త్రచరిత్రలో చిరస్తాయిగా నిలబడిపోతుంది. 24 మార్చి 1900 సంవత్సరంలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనా ఫలితాలు గొప్పతనాన్ని ఫాదర్ మెండల్ కే ఆపాదించారు.

బుజ్జీ: ఇది నిజంగా గొప్ప విషయమే.

నాన్న: అవును మరి. తాము చేయని పనికి కూడా తమకు కీర్తి దక్కాలని, చివర్లో చేసిన పని తాము సాధించినట్లుగా చెప్పుకునే మనుషులున్న ఊ కాలంలో ఈ విషయం ఒక అధ్భుతమే. గ్రెగర్ మెండల్ నమ్మినట్లు అతడి సమయం వచ్చింది. అతడు చేసిన ప్రయోగాల వల్లనే విజ్ఞాన శాస్త్రంలో జన్యుశాస్త్రం అనే విభాగం ఏర్పడింది.

గోపాల్: సరే బుజ్జీ, ఈరోజు నీకు చెల్లి పుట్టింది కదా, మరి తమ్ముడెందుకు పుట్టలేదు?

బుజ్జీ: ఏమో అంకుల్, ఊ... బహుశా ఇందులో కూడా క్రోమోజోముల జోక్యం వుందేమో...

34గోపాల్: నిజమే బుజ్జీ, ఇందులో క్రోమోజోముల ప్రాతినిధ్యం వుంది. ప్రతి మని,లో 46 క్రోమోజోములుంటాయి. వీటిలో ఒక జత క్రోమోజోముల్ని XY క్రోమోజోములని పిలుస్తారు. ఈ జత క్రోమోజోములే లింగత్వ నిర్ధారణ తేస్తాయి. పురుషుడు XY క్రోమోజోములు జత కడితే, స్త్రీ రెండు XX క్రోమోజోములు జతకడితే స్త్రీ, పుట్టబోయే శిశువుకి తండ్రి నుండి ఒక క్రోమోజోము, తల్లి నుండి మరో క్రోమోజోము సంక్రమిస్తాయి. ఇవి జత కట్టినప్పుడు XY క్రోమోజోములు జతకడితే మగపిల్లవాడు, XX క్రోమోజోములు జతకడితే ఆడపిల్ల పుడ్తారు.

బుజ్జీ: అంటే లింగత్వ నిర్ధారణ మగవాడి మూలంగానే జరుగుతుందన్నాము.

గోపాల్: గుడ్ ఎందుకలా అన్నావో చెప్పు.

బుజ్జీ: పురుషుడి వద్ద మాత్రమే XY క్రోమోజోములున్నాయి. స్త్రీ దగ్గర రెండు X క్రోమోజులే వున్నాయి. కాబట్టి పురుషుడి నుండి Y క్రోమోజోము వస్తేనే మగపిల్లవాడు పుడతాడు.

గోపాల్: కరెక్ట్, సరిగ్గా చెప్పావు. కానీ ఈ విషయం మీద అవగాహన లేని వాలందరు సమాజంలో స్త్రీ యే మగపిల్లవాడికి గానీ, ఆడపిల్లకు గానీ బాధ్యత వహించాలని అనుకుంటారు. అది సరియైంది కాదు.

నాన్న: అయినా నేటి ఆధునిక యుగంలో ఆడపిల్ల చేయలేని పని ఏముంది? నేను ఇద్దర్నీ సమానంగానే భావిస్తాను. అందుకే ఒక ఆడపిల్లతోనే నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను.

గోపాల్: నువ్వు ఆధునిక తరానికి ప్రతినిధిని శేఖరం.

అందరూ నవ్వుతారు.

రచన: పైడిముక్కల ఆనంద్ కుమార్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate