অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తలపై భారం

తలపై భారం

మనం రోడ్డు మీద నడుస్తున్నపుడు, గ్రౌండులో ఆడుకుంటున్నప్పుడు, మనం ఏం చేస్తున్నా మన చుట్టూ ఉన్న వాతావరణం అందులోని గతి మన మీద ప్రభావం చూపుతుంది. గాలి అంటే అందులో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడు మరియు ఇతర వాయువులుంటాయి.

మన వాతావరణం భూమి ఉపరితలం నుండి దాదాపు 1000 కి.మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. మీకు తెలుసా? వాతావరణంలోని ఈ గాలికి కూడా బరువు ఉంటుంది. మరి మన మది వెయ్యి కిలోమీటర్ల వరకు ఉన్న అంతే గాలి బరువు మనందరి మీద ఉన్నది కదా? అయినా మనకు ఎందుకు భారంగా అనిపించడం లేదు. ముందు ఈ గాలి బరువును ఎలా కొలవాలో తెలుసుకుందామా?

1643వ సంవత్సరంలో ఇవాంజలిస్టా టోరిసిల్లి (Evangelista Torricelli) అనే ఇటలీ గణితవేత్త ఒక పరికరాన్ని తయారుచేశాడు. దాన్ని బోరోమీటర్ అంటారు. బోరుమీటరులో ఒక గాజు గొట్టం ఉంటుంది. ఈ గొట్టంలోంచి గాలిని తీసేసి దాన్ని శూన్యం చేస్తారు. ఈ గజుగొట్టాన్ని ఒక పాత్రలో పాదరసం మీద బోర్లిస్తారు. వాతావరణంలోని గాలి పాదరసం మీద వత్తిడి కలిగిస్తుంది. ఈ వత్తిడి వల్ల పాదరసం గాజు గొట్టంలోకి వెళు తుంది. ఎంత పాదరసం గాజు గొట్టంలో వెళుతుందో అంతే వత్తిడి గాలి కలిగించిందని నిర్ధారిస్తారు. దీనిని వాతావరణ పీడనం అంటారు (గాలి పీడనం). దీన్ని ఇంచిల్లో (Inches) కొలుస్తారు. పర్వతం పైన, ఈ పీడనం తక్కువగా ఉంటుంది. సముద్రమట్టం వద్ద ఈ వత్తిడి 29.7 ఇంచులు (Inches) ఉంటుంది. అంటే 76 సెంటీమీటర్లు అన్నమాట. వాతావరణ పీడనాన్ని ఒక ప్రదేశంలో ఒక సెంటీమీటర్ ఏరియాపై గాలి (వాతావరణం) కల్గించే వత్తిడి అని చెబుతారు (Atmostsphere pressure in amount of weight of air on small area such as a centimetre). దీన్ని సాధారణంగా ఒక Inchటి 6.6 కిలోగ్రాములుగా గుర్తిస్తారు. అంటే మనం మన శరీరం మీద ప్రతి ఇంచి..మీద 6.6 కిలోగ్రాముల బరువు ఉంటుందన్నమాట. ఐతే ఈ బరువును మనం ఎందుకు గుర్తించడం లేదో తెలుసా? అంటే వత్తిడి మన ఎముకల్లోంచి గాలి మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడర్ధం అయిందా?

ఆధారం: సి.ఆనంద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate