অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తెలివైన తీర్పు

తెలివైన తీర్పు

చాలాకాలం కిందట మాట ఒక వ్యాపారి తన వీపుపై పట్టుదారపు కండెలను మోసుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఈ పట్టుకండెలు ఓ యాభైకి పైగా వుండటంతో చాలా బరువుగా ఉన్నాయి. దీనికి తోడు ఎండనిప్పులు చెరుగుతూ అతడ్ని మరింత అలసటకు గురిచేస్తోంది.

దారిలో ఈ వ్యాపారికి ఓ చోట ఒక పెద్ద బుద్ధవిగ్రహం కన్పించింది. ఈ విగ్రహం నీడలో కొంచెం సేపు సేద తీరుతాను అనుకుంటూ తన పట్టుకండెలను కిందికి దించాడు. వాటిని నేలపై వరుసగా పేర్చి, వాటి పక్కనే మేను వాల్చాడు. పాపం బాగా అలసిపోయాడేమో, ఇలా కళ్ళు మూసిమూయగానే అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. కొన్ని గంటల తరువాత అతను నిద్రలోంచి బయటపడి, కళ్ళు తెరచి చూస్తే ఇంకేముంది. అక్కడ ఒక్క పట్టుకండె కూడా కన్పించలేదు. వ్యాపారికి గుండె గుభేలుమంది. లబోదిబోమంటూ జరిగిన దొంగతనం గురించి రక్షకభటులకు తెలియజేశాడు.

ttoneఆరోజుల్లో ఓకా అనే ఓ గొప్ప న్యాయమూర్తి వుండేవాడు. ఎంత జటిలమైన సమస్యలనైనా, వివాదాలనైనా అతను చక్కగా పరిష్కరిస్తాడనే పేరు వుంది. ఈ వ్యాపారి సమస్యకు కూడా ఆయన దగ్గరకే వచ్చింది. వ్యాపారిని కొంచెం సేపు విచారించి విషయం తెలుసుకున్న ఓకా ఏదేమైనప్పటికీ ఏ బుద్ధ విగ్రహం దగ్గర ఇతను పడుకున్నాడో ఈ బుద్దవిగ్రహమే ఇతని కండెలను దొంగిలించిందని నేను భావిస్తున్నాను. అన్నాడు. అంతటితో ఊరుకోకుండా అమాయక ప్రజల వస్తువులను కాపాడవలసిన బాధ్యత పూర్తిగా ఆయనదే. కాని ఈ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. అందుకని ఇలా నిర్లక్ష్యంగాను బాధ్యతా రహితంగానూ ప్రవర్తించిన నేరానికి బుద్ధ భగవానుడి విగ్రహాన్ని బంధించి తేవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. అన్నాడు.

న్యాయధీసుడి నుండి ఆ ఆజ్ఞన వెలువడడమే ఆలస్యం., కొందరు భటులు వెళ్ళి ఆ విగ్రగాన్ని పెలికించుకుని వచ్చారు.

జనంలో విపరీతమైన కలకలం మొదలయ్యింది. ఏమిటది మనమందరం భగవానుడిగా భావించే బుద్దుడి విగ్రహాన్ని బంధించడమో ఇదెక్కడి చోద్యం ... ఏమిటి తను? ఈ బుధ్ధ విగ్రహానికి కూడా శిక్ష వేస్తాడా? ఎలాంటి శిక్ష వేస్తాడు? ఈ బుద్ధ భగవానుడి విగ్రహాన్ని ఖైదు చేస్తే ఆ అమాయకుడి దారపుకండెలు దొరుకుతాయా? ఓకా ఏమిటి ఈసారి ఇలా చేస్తున్నాడు?.... ఇలా జనం ఒకరిచెవులు ఒకరు కొరుక్కోవడం. మొదలుపెట్టారు. బుద్ధుడి విగ్రహాన్ని బందించారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల జనమంతా అక్కడికి చేరుకున్నారు. దాంతో అంతా గొడవగొడవగా తయారయ్యింది.

tttwoమధ్యలో కొంచెం సేపు ఎక్కడికో వెళ్ళిన ఓకా తిరిగి వచ్చి తన ఆసనం మీద ఇలా కూర్చోగానే జనం మీద విరుచుకుపడ్డాడు. “ఇలా పిచ్చిపిచ్చిగా నవ్వేందుకు, చెవులు కొరుక్కునేందుకు, న్యాయస్థానం ఇచ్చే తీర్పు గురించి ఎగతాళిగా మాట్లాడేందుకు మీకు ఏం అధికారం వుంది? ఇలా ప్రపర్తించడం ద్వారా మీరంతా సభాగౌరవాన్ని మంటగలిపారు. ఈ న్యాయస్థానాన్ని అవమానపరిచారు. ఈ నేరానికి పాల్పడినందుకుగానూ మీ అందరికీ ఈ న్యాయస్థానం జరిమానాను, బంధికానా శిక్షను విధిస్తుంది.”, అన్నాడు ఓకా తీక్షణంగా

అంతే జనం హడలెత్తిపోయారు. ఇదేమిట్రా దేవుడా, అలా వచ్చి ఇలా చుట్టుకుంది. అని బిత్తరపోయారు. అయితే వెంటనే, తమను క్షమించమని న్యాయాధీసుడ్ని మరీమరీ ప్రార్థించారు.

కొంచెం మౌనంగా ఊరుకున్న ఓకా, “ఏదేమైనా తప్పు చేసునందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ శిక్ష అనుఙవించాల్సిందే. అయితే మీరింతగా ప్రాధేయపడుతున్నందువలన మీకో అవకాశాన్ని ఇస్తాను. మూడు రోజులుగా మీలో ఎవరెవరు ఒక పట్టుదారపు కండెను ఈ న్యాయస్థానానికి సమర్పించారో వారందరినీ క్షమించి వదిలేస్తాను. మిగతా వారందరూ బందిఖానాలో ఉండక తప్పదు.”, అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

న్యాయధీశుడి దొంగకు కారాగార శిక్షను విధించాడు. ప్రజలందరినీ ఎవరి దారపు కండెను వారు తెలివిగా వ్యవహరించాడో గుర్తించిన ప్రజలు అతన్ని కొనియాడుతూ సంతోషంగా ఇంటి ముఖం పట్టారు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate