অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

దంత సౌభాగ్యం

దంత సౌభాగ్యం

teethమామయ్యా! బాలు ఏడుస్తున్నాడు ఏదో పుస్తకం చదువుకుంటున్న సురేష్ దగ్గరకు వచ్చి చెప్పింది మహిత. ఏమైంది? అని సురేష్ అడిగేలోగానే బాలూ వచ్చేసాడు. బుగ్గల మీద నుంచి కన్నీళ్ళు ధారగా కారుతున్నాయ్. ఏడుస్తునే చెప్పాడు. నాకు పెట్టకుండా సాయి బావ ఒక్కడే ఐస్ క్రీం తింటున్నాడు. ఏరా సాయి! నువ్వు 6వ తరగతికి వచ్చావ్ యుకేజీ పిల్లవాడినని ఏడిపించవచ్చా? చిన్న వాడికి పెట్టకుండా తినడం తప్పుకదూ అంటూ జ్ఞానోబోద మొదలు పెట్టిన సురేష్ కు అసలు విషయం చెప్పాడు సాయి. కాదు మామా! అందరం చెరొక ఐస్ క్రీం కొనుక్కున్నాం. బాలు గాడు వాడిది త్వరగా తినేసి నాది కావాలని అడుగుతున్నాడు. నేనివ్వనంటే నాకు కటిఫ్ చెప్పి ఏడుస్తున్నాడు. ఇంతలో బాలుగాడి నాయనమ్మ వచ్చి వాడి ఏడుపు మాన్పించే ప్రయత్నం మొదలు పెట్టింది. చివరకు తన ఏడుపు ఆపాడు బాలు.

సురేష్ ఓ దంతవైద్యుడు. వేసవి సెలవులకు పిల్లలంతా సురేష్ వాళ్ళు ఊరు వచ్చారు. ఆ రోజు రాత్రి భోజనాల తర్వాత పిల్లలందరినీ చుట్టూ కుర్చీ పెట్టుకున్నాడు సురేష్. ఏరా బాలూ సాయిబావతో కటిఫ్ ఐపాయిందా? లేదు బాబాయ్, ఇంకెప్పుడు కటిఫె బుంగమూతి పెట్టి చెప్పాడు బాలు. నువ్వు కటేఫ్ చెప్పాల్సింది సాయి బావకి. కాదురా ఐస్ క్రీంకి కూల్ డ్రింక్స్ కి. వాటి వలన నీ పళ్ళు పుచ్చిపోయి నెప్పి వస్తుంది. అప్పుడు ఈ రోజు కంటే ఎక్కువ ఏడుస్తూవ్. బాలుకి బాబాయ్ చెప్పేది నిజమేనా? అనే భయం ఒకేసారి కలిగాయి. “ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్” అంటే ఇష్టం. లేదు. చాక్లెట్స్ తింటే ఇంకా నష్టం. ఏవైనా తియ్యటి పదార్ధాలు తిన్నపుడు అవి పంటి మీద పళ్ళ మధ్యలో ఇరుక్కుంటాయి. వాటి పైన సూక్ష్మజీవులు చేరి యాసిడ్లు, ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ యాసిడ్లు కారణంగా పంటి పైన ఉండే గట్టి పింగాణి పొర దెబ్బతింటుంది. దీనినే పన్ను పుచ్చిపోవడం లేదా పిప్పి పన్ను అంటాం. ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ కంటే చాక్లెట్లు, పేస్ట్రిలు, కేకులు ఎక్కువ జిగురుగా ఉంటాయి. కనుక ఎక్కువ సేపు పంటి మీద ఉంటాయి. సురేష్ చెప్తూ ఉండగా సాయి కల్పించుకొని ఉంటే సూక్ష్మజీవులు ఎక్కువ సేపు యుసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పింగాణి పొర ఎక్కువగా దెబ్బతింటుంది. అంతేనా మామా? భూమ్యాకర్షణ రహస్యం కనుక్కున్న న్యూటన్ లా  ఫోజు పెట్టాడు సాయి. ఔన్రా.... కరెక్ట్ గా చెప్పావు అన్నాడు సురేష్, పొ మామయ్య నువ్వు అన్నీ తినోద్దంటావ్ చాక్లెట్లు తినోద్దన్నందుకో, సాయిని మెచ్చుకున్నందుకో గాని మహితకు కోపంగా ఉంది. “ఏమీ తినోద్దని ఎందుకు అంటాను? మామిడి, జామ, సపోటా, లాంటి తాజా పండ్లను తినొచ్చు. కారట్, దోస, కిరా వంటి తాజా కూరగాయలు తినొచ్చు. ఇవి తింటే దంతాలకు మంచిది, వీటిలో నీరు, పిచు పదార్ధాలు, విటమిన్ లు ఉండడం వలన మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మంచిది.” వివరించాడు మామయ్య. “రోజుకు ఒక్క కూల్ డ్రింక్ తాగొచ్చు కదా బాబాయ్” బాలు ఆరా తీసాడు.

చిన్న పిల్లలు కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. దాని బదులు పండ్ల రసాలు నిమ్మకాయ రసం, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ త్రాగడం ఆరోగ్యానికి మంచిది. ఐతే ఏమి తిన్నా వెంటనే నీటితో శుభ్రంగా పుక్కిళించాలి. కుల్ డ్రింక్స్ లో  చక్కెర  ఉండడమే కాకుండా తీవ్రమైన ఆమ్లాలు ఉంటాయి. అవి పింగాణి పొరను కరిగించివేస్తాయి. ప్రతిరొజూ ఒక్కసారి కూల్ డ్రింక్ తాగితే ప్రతి రొజూ పింగాణి పై ఈ దాడి జరుగుతూ ఉంటుంది.”

మరి చాక్లెట్ లో యాసిడ్స్ ఉండవు కదా! రోజుకు ఒక్కసారి తినొచ్చా?” ఆశ అడిగింది మహిత. “చాక్లెట్స్ లో యాసిడ్స్ ఉండనిమాట నిజమేకానీ అవి జిగురుగా ఉండడం మూలంగా ముందే చెప్పినట్లు. సూక్ష్మజీవులు ఎక్కవ సేపు ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి. చక్లేటు, స్వీట్లు, పేస్టిలు, కేక్ లు వంటివి తినడం దంతాలుకే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా ప్రమాదం. వీటిలో ఉండే కొవ్వు పదార్ధాలు చిన్న పిల్లలు లావుగా అయ్యేందుకు కారణమవుతున్నాయి. లావుగా ఉండే పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ళు మిగతా పిల్లల్లా చురుగ్గా అడుకోలేరు. మీరంతా మంచి పిల్లలు కదా! కాబట్టి ఇవ్వన్ని తినడం మానేయాలి. ఒక్కసారిగా మానేయడం కష్టమనిపిస్తే రోజుకు ఒక్కసారే స్వీట్ తినాలి. అది కూడా మద్యాహ్న భోజనంతో లేదా సాయంత్రం టిఫిన్ తో పాటుగా తిని వెంటనే నోరు శుభ్రం చేసుకోవాలి” వివరించాడు సురేష్.

“ఏం మామయ్యా? రాత్రి పూట తినకూడదా? అడిగాడు సాయి. “మన నోటిలో ఎల్లప్పుడూ స్రవించే లాలాజలం మన దంతాలను సుక్ష్మజీవుల బారినుంచి యాసిడ్లు బారినుంచి కాపాడుతుంది. రాత్రి పూట మనం నిద్రపోయే సమయంలో లాలాజలం తక్కువగా స్రవిస్తుంది. అంటే మన దంతాలకు రక్షణ తగ్గిపోతుంది. సురేష్ ఇంకా ఏదో చెప్పబోతుండగా మహిత అంది,” “అంటే దంతాల పై అతుక్కుని ఉన్న చాక్లెట్స్ నుంచి సుక్ష్మజీవులు ఎక్కువ యాసిడ్స్ తయారు  చేసి పింగాణిని ఫినిష్ చేసేస్తాయి. అంతే కదా మామా?”

“ఔను సరిగ్గా చెప్పావ్. అందుకే రాత్రిపూట స్వీట్లు తినకుండా భోజనంలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అంతే కాకుండా పడుకునే ముందు బ్రష్ చేసుకొని ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ తో సున్నితంగా నాలుక శుభ్రం చేసుకొంటే మన దంతాల పై పింగాణి ఫినిష్ అవ్వకుండా చక్కగా ఉంటుంది.” “ ఔను మామా మా టేచర్ కూడా రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకొంటే మన టీత్ ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. ఎందుకో ఇప్పుడు అర్ధం అయింది” అంటూ సాయి ఫ్లాష్ బ్లాక్ లోకి వెళ్ళాడు.

“ఒరేయ్ ఇంక పిల్లల్ని వదిలెయ్యరా. వాళ్ళని నిద్ర పోనియ్యకుండా బుర్ర తింటున్నావు కదరా” అంటూ వచ్చింది సురేష్ వాళ్ళ అమ్మ.

“లేదు మామ్మా బాబాయ్ స్వీట్స్ కి కూల్ డ్రింక్స్ కి, ఐస్ క్రిమ్స్ కి కటిఫ్ చెప్పి, ఫూట్స్ కి, వెజిటేబుల్స్ కి దోస్త్ చెప్పమని చెబుతున్నాడు.” అంటూ బాబాయ్ ని వెనకేసుకోచ్చాదు బాలు. “సర్లేరా, ఇక వచ్చి పడుకొంది ఆలస్యమవుతుంది.” అంటూ హడావుడి పడుతున్న బామ్మను చూస్తూ వచ్చేస్తాం మమ్మా ఫైవ్ మినుట్స్ బ్రష్ చేసుకొని వస్తాం. రా సాయి బావా” అంటూ సాయి చేయి పట్టుకొని కాదిలాడు బాలు.

“అదేంటి బాలూ! మళ్ళి చేయి పట్టుకున్నావే” అంటూ దీర్ఘం తీసింది మహిత. “ఇక నుంచీ ఐస్ క్రీం కి కటిఫ్ సాయి బావతో దోస్తీ ” అంటూ టూట్ బ్రష్ తీసుకన్నాడు బాలు. “నెను కూడా చాక్లెట్స్ కి, స్వీట్స్ కి కటిఫ్ , ఫూట్స్ కి , వెజిటేబుల్స్ కి దోస్తీ” అంటూ తను కూడా బ్రష్ కోసం చేయి చాపింది మహిత.

ఆధారం: సోషల్లీ ఆండ్ ఎథికల్లీ అవేర్ డెంటల్ స్టూడెంట్స్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate