অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాముల్లో రకాలు – పాము కాటుకు నివారణ

పాముల్లో రకాలు – పాము కాటుకు నివారణ

భారతదేశంలో ప్రతి సంవత్సరం పాముకాటు వల్ల 25 వేల మంది మరణిస్తున్నట్లు అంచనా. ఈ మరణాలలో 95 శాతం విష్మ్కంటే అనవసర భయాందోళన వల్లే మరనిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో న్యూజిలాండ్, ఐర్లాండ్ లో తప్ప మిగిలిన దేశాలలో పాములు ఉన్నాయి. ఇవి అధికంగా ఉష్ణమండల దేశాలలో విస్తరించి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సర్పాలలో అధిక శాతం విషం లేనివే. చాలా తక్కువ శాతం మాత్రమే విషసర్పాలు. విష సర్పాలలో ముఖ్యమైనవి.

నాగుపాము: రెండు మీటర్ల పొడవు గలిగి గోధుమ లేదా నలుపు రంగులో తలపైన సున్నా వంటి గుర్తును కలిగిన విష సర్పాలు.

కట్లపాము: శిరిరం పైన షట్కోణాకృతిలో పొలుసులు ఉంటాయి. కట్లపాము నాగుపాము కంటే విషపూరితమైనది.

రక్తపింజర (రక్తపొడ): పృష్ట తలంలో మూడు వరుసల డైమండ్ ఆకారపు మచ్చలు ఉంటాయి. తలపైన ‘B’ ఆకారమును కలిగి వెనుకకు తిరిగిన పొడవైన కోరలు ఉంటాయి.

రాచనాగు: అయిదు మీటర్ల పొడవు గిలిగా పసుపు లేదా నలుపు రంగులో ఉంటుంది. వీటిలోని కొన్ని రకాలలో వలయాకారపు చారలు ఉంటాయి. వీటి పడగను పోలి ఉండి అడవులలో ఉంటాయి.

పాము కాటుకు ప్రధమ చికిత్స: పాము కరిచిన వ్యక్తి కాటును పరిశీలిస్తే విషసర్పం కరిచిన ప్రదేశంలో రెండు రంధ్రాలు ఉండి వీటి నుండి రక్తం కారుతూనే ఉంటుంది. విశారహిత పాము కరిచిన అనేక రంధ్రాలుంటాయి.

కాటుకు గురైన వెంటనే కాటుకు గురైన అవయవం పై భాగంలో తాడుతోగాని, గుడ్డతో గాని రక్త ప్రసరణ జరగకుండా గట్టిగా కట్టాలి. కాటుకు గురైన భాగాన్ని పొటాషియం పర్మాంగానెట్ తో కడిగి ఆ భాగంలో సుమారు రెండు సెంటిమీటర్ల లోతు గాడిపెట్టి రక్తం పిండి వేయాలి. తరువాత కాటు పై భాగంలో నుండి వేడి నీటిని పోస్తు ఉంటె చాలా వరకు విషము బయటకు పోతుంది. తరువాత పాము కాటు ప్రదేశంలో పటిక ముక్కను ఉంచి నిముషం తరువాత ఆ ముక్క తొలగించి మరో ముక్కను ఉంచాలి. భాదితున్ని కదలకుండా ఉంచి వేడి టి గాని , కాఫీ గాని, పాలు గాని ఇవ్వాలి. ఒక వేళ భాదితుని శ్వాసక్రియ ఆగిపోతే కృత్రిమ శ్వాస క్రియ కల్పించాలి. కాటువేసిన పాము ఏదో తెలిసిన యాంటివెనం సిరం ఇవ్వాలి. తెలియనపుడు పాలివోనమ్ సిరమ్ ఇవ్వాలి.

విష సహిత, విష రహిత పాములను గుర్తించడం కొంచెం కష్టమైన పనే ! ముందుగ తోకను పరిశిలించాలి, తోకను ఉభయ పార్మ్వాలు నొక్కబడి తెట్టు లాగా ఉంటె విషసర్పంగా గుర్తించవచ్చు. తోక పొడవుగా ఉదరతలం పోలుసులను పరిశీలించాలి, ఉదరతలంలో సన్నని, చిన్న పొలుసులు ఉంటె అవి విషరహిత సర్పాలు. ఉదార తలంలోని పొలుసులు అడ్డంగా పెద్దవిగా ఉంటె అవి విష రహితం లేదా విష సర్పాలు కావచ్చు. తోక గుండ్రంగా ఉండి పోనుపోను సన్నగా ఉదరతలంలో పొలుసులు ఒక చివరి నుండి రెండో చివరకు వ్యాపించినప్పుడు తలమీద పోలుసులను లేదా ఫలకాలను పరిశీలించాలి. తల త్రిభుజాకారంలో ఉండి చిన్న చిన్న పొలుసులతో కప్పబడి ఉండిన వాటిని పొడ పాము లేదా రక్త పింజరిగా గుర్తించవచ్చు. ఇవి రెండు రకాలు. ఒకటి గుంత ఉన్న పొడ పాము. రెండు గుంట లేని పొడ పాము. తలపైన చిన్న పొలుసులు ఉండి గుంట లేక పొతే అధోపుచ్చయ పోలుసులను పరిశిలించాలి. అదోవుచ్చుయ పొలుసులు ఒక వరుసలో ఉండి దాని తలపైన బాణం గుర్తు ఉండిన దాన్ని విష సర్పంగా గుర్తించ వచ్చు. పాము తలపైన పెద్ద పలకలుంటే దాన్ని విషరహిత సర్పంగా గుర్తించవచ్చు . ఈ లక్షణాలు గల పాము యొక్క పృష్ట మధ్య భాగములోకి కశేరు పోలుసులను పైశిలించిన అవి షట్ కోణాకారములో ఉండిన దానిని విషసహిత కట్ల పాముగా గుర్తించవచ్చు.

లాకిసిసి పాము శరీరం గోధుమ రంగులో ఉండి, మెడ మీద గుర్రపు నీడ ఆకారంలో మచ్చ ఉండును. తలపైన పొలుసులు ఉండును. ప్రకాళపు సర్పాలు చిన్నవిగా ప్రకాశవంతంగా ఉండి పొట్ట మీద మచ్చలు కలిగి ఉంటాయి. ఇవి విష సర్పాలైనప్పటికి వీటి వలన మానవులకు ఎక్కువ ప్రమాదం ఉండదు.

ముఖ్యమైన విషరహిత సర్పాలు

mar18.jpgపసరికి పాము ఆకు పచ్చ రంగును కలిగి ఎక్కువగా చెట్ల మీద సంచరిస్తూ ఉంటుంది. గుడ్డి పాము వాన పామును పోలి ఉండును. దీని కళ్ళు పొలుసులతో కప్పబడి ఉంటాయి. ఇవి చదలను ఆహారంగా తీసుకొంటాయి.

యురోపెలిటిస్ అనే పాము ఎక్కువగా తెమగల ప్రదేశాలలో ఉండును. దీని శరీరము స్తంభకారముగా ఉండి చిన్న కళ్ళను పొట్టి తోకను కలిగి ఉండును. వ్యాస్ అనే పాము శరీరము గోధుమ, ఆకుపచ్చ మిశ్రమ రంగులో ఉండి తెలుపు గోధుమ రంగు మచ్చలను కలిగి ఉండును . ఇది వేగంగా పరిగేతును,. దీని ప్రధాన ఆహారము ఎలుకలు.

కొండ చిలువ అని రకాల పాముల కంటే పెద్దది. పడి మీటర్ల పొడవు, నూట పది కిలోల బరవు ఉండును. ఇది జంతువులను చుట్టుకొని పెనవేసి ఊపిరాడకుండా చేసి చంపుతుంది.

కెక్స్ జానై అనే సర్పం రెండు తలలను కలిగిఉండును. దీని శరీరము మట్టి రంగులో ఉండి ఒకటి నుండి రెండు మీటర్లు పొడmar19.jpgవు ఉండును . తోకచిన్నగా మొద్దుగా ఉండును. ఒక వేల కశేరు పొలుసులు చిన్నవిగా ఉంటె పై దవడ అంచుగా ఏర్పడిన ఫలకాలను పరిశీలించాలి. మూడవ అది ఒష్ఠ ఫలకము పై వైపున ఉన్న కాంటి ఫలకాన్ని రెండవ వైపున నాశికా ఫలకాన్ని తాకి ఉండిన పామును నాగుపాము లేదా ప్రవాళపు సర్పముగా గుర్తించవచ్చు. పాడగా పైన మచ్చ ఉండిన సాగుపాముగా దేహము పైన మచ్చలు ఉండిన ప్రవాళపు పాముగా గుర్తించవచ్చు. ఇవి రెండూ విష సర్పాలు ఈ విధంగా గుర్తించడం సాధారణ ప్రజలకు కష్టమే కాని చదువుకున్న వాళ్ళు తేలికగానే గుర్తించవచ్చు.

పాములు అన్ని ప్రదేశాలలో తిరుగుతూ ఉంటాయి. వీటిలో 90 శాతము విష రహిత సర్పాలు. విష రహిత సర్పాలను చూసి కూడ అందరూ భయపడతారు. పాములు ఏదైనా కన్నంలోనికి వెళ్తే ఆ రంధ్రములో అరకిలో ఉప్పుపోస్తే ఆ పాము బయటకు వచ్చి పారిపోతుంది.

విష సర్పాలన్ని విష యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. విషయంత్రాంగం ఉండదు. విష సర్పాలలో కోరలు సాధారణంగా వెనుకను వంగి ఉంటాయి. కాటు వేసినపుడు దవడ కండరాలు నొక్కడం వల్ల విష గ్రంధులు నుండి విష కోరల ద్వారా కాటుకు గురైన జివి శరీరంలోనికి చేరుతుంది. పాముల విషము స్వచ్చంగా ఎండు గడ్డి రంగులో ఉంటుంది. పాములు గురించి అవగాహన ఉండుట వలన మరణాలను తగ్గించవచ్చు.

ఆధారము: డా.ఎ.మారుతీ రావు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate