অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పెళ్లిగౌను కరిగిపోయింది

పెళ్లిగౌను కరిగిపోయింది

jan35.jpgఅనగఅనగా ఒక దేశం. ఆ దేశానికో రాజు. ఆ రాజుకు కాస్త తిక్క ఎక్కువ. రాజుకోక అలోచనోచ్చింది. అలాంటి ఇలాంటి ఆలోచన కాదు. రాజుకదా మరి ప్రపంచంలో అంతవరకూ కనివిని ఎరుగని, ఎవరూ ప్రదర్శించాలని. ఇంకేముంది ఆలస్యం చేయకుండా దేశంలోని దర్జీలందరినీ, అదేనండి టైలర్లనందరిని పిలిపించి వారిలో నుంచి ఓ ఉత్తమమైన దర్జీని ఎంపిక చేశాడు. దర్జీ ఎలాంటి వాడనుకుంటున్నారు? పరమ సోమరి. దుస్తుల తయారికి అవసరమైన పట్టు, నూలు దారాలు తయారికి అవసరమైన పట్టు, నూలు దారాలు, బంగారం వెండి పోగులు, ముత్యాలు, వజ్ర వైడుర్యాలు, ఇలా ఏమేమి కావాలో అన్ని ఇచ్చి ఓ నెలలోఓఅక దుస్తుల తయారు కావాలని గడువు పెట్టాడు. గడువు లోపల తయారు కాకపొతే రాజు ఎం చేస్తాడో మీకు తెలుసు కదా! సోమరి దర్జీ దుస్తులు తయారీ మరచి రాజుగారిచ్చిన ధనంతో తన అవసరాలు తీర్చుకుంటూ కాలం వెళ్లబూచ్చుతుంటాడు. దుస్తుల తయారీ ఎంతవరకు వచ్చిందో పరీక్షిద్దామణి దర్జికి కబురేడైడు రాజు. వార్త విన్న దర్జీ తత్తరపాటుకు గురై ఎం చెయాలబ్బా అని ఆలోచిస్తుంటే ఓ గమ్మత్తయిన ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చిందే తడవు పనివారినందరిని పిలిచి రాజుగారోచ్చినపుడు అందరూ పనిలో నిమగ్నమైనట్లు నటించమని చెప్పాడు. రాజుగారు వచ్చి చూచి ఆశ్చర్యపోతాడు. అల్లుతున్నట్లుండు చేతిలో దారాలుండవు. మడతలేస్తూన్నట్లుంటాడు కాని చేతోలో గుడ్డ ఉండదు. రాజుగారికి అర్ధం కాక దర్జీని అడుగుతాడు. పనిలో నిమ్మగ్నమై మిమ్మల్ని చూడలేదు మన్నించండి రాజు గారంటూ!! మికోరకు దేవతా వస్త్రాలు తయారు చేస్తున్నాము. పూర్తికావచ్చింది. ఈ దుస్తులు అందరికి కనిపించవు. ఉత్తమమైన వ్యక్తులకు మాత్రమే కనిపించే విధంగా తయారు చేస్తూన్నామని చెప్పాడు. చుడండి రాజా అని చూపిస్తున్నట్లు నటిస్తాడు. రాజాగారికి ఏమి కనిపించదు. కాని కనిపించట్లేదు అంటే తను ఉత్తమ పురుషుడు కాదనుకుంటారేమోనని అమేఘం, అద్భుతం, ఆహా-ఓహే అని అంటాడు మంత్రిని ఎలా ఉందని ప్రశ్నస్తాడు. మంత్రిగారు కూడా తలగోక్కుoటూనే బాగుబాగు అంటాడు. మధారాజా తధా మంత్రికదా!

రాజుగారు నూతన వస్త్రాలు ధరించి పురవీధుల్లో ప్రదర్శన గా వస్తారని నగరంలో చాటింపు వేయిస్తారు. రాజుగారి దేవతా వస్త్రాలు చూడటానికి తండోపతన్దాలుగా ప్రజలు పురవిదుల్లోకి వస్తారు. రాజేమో మొండిమొలతో అంటే వంటి పై నూలు పోగులు లేకుండా గుర్రమెక్కి దివిగా ఊరేగుతుంటాడు. అతని తిక్క చేష్టలకు భరించలేని ప్రజలు రాజుగారని ఎం చేస్తుంటారో చెప్పండి. ఈ కధ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా! రాజుగారు మన సైస్సుక్లబ్ల్ లో సభ్యుడైయుండియుంటే శాస్త్రయంగా అలోచించి ఉండేవాడు ఇలాంటి తిప్పలు పైడిఉండేవాడు కాదు కదా ఇంతంకి ఈ కధకి మన పెళ్ళిగౌనుకు సంభంధం ఏమిటి అనే కదా మీ ప్రశ్న సంబంధం లేదా అంటే లేదు అని చెప్పలేను ఉందా అంటే ఉందని చెప్పలేను కాని ఉండే ఉందన్నట్లుంది. మన పెళ్లిగౌను గురించి తెలుసుకుందాం. క్రిస్టియన్ మతస్ధులు ముఖ్యంగా విదేశాలలో పరిపాటి ఈ వెడ్డింగ్ గౌన్ల క్రేజ్ ఈనాటిది కాదు 1840 లో క్విన్ విక్టోరియా తెల్లటి గుబురైన పొడవాటి గౌను ధరించి చక్రాల పల్లకి పై నిల్చోని వివాహ మండపానికి వచ్చినప్పటినుంచి క్రేజ్ వచ్చింది. రంగురంగుల గౌన్లు ధరించే సాంప్రదాయం తెల్లని గౌన్లు వైపు మళ్లింది అప్పటి నుంచే తెలుసా! తెల్లని గౌను ప్రాధాన్యతను వివరిస్తూ కవిత్వాలు కూడా వచ్చాయి. నలుపు ధరించే వధువు నిర్ణయం వరుడు నుంచి ముప్పు తప్పదని అదే తెలుపు గౌను ముప్పు తప్పదని అదే తెలుపు గౌను ధరించిన వధువు నిర్ణయం భేషైనదని ఇలా రంగులకు , జివితాలకు సంబంధం కపోయినా వ్రాసేవారు.

దశాబ్దాలు గడిచేకొలది అన్ని రంగాలు మార్పులకు గురైనట్లే గౌన్లు కూడా పరిణామం చెందాయి. మొదటి ప్రపంచయుద్దం ప్రజాజీవితంలో పెనుమారుపులు తెచ్చింది. విశాలమైన భవనాల స్ధానే ఇరుకు గృహాలు చిన్నచిన్న నివాసాలు వచ్చాయి. అలగే పొడవాటి గౌన్ల పొట్టిగౌన్లుగా మారాయి. బిగుతుగా ఉండే గోన్లు వచ్చాయి. రెండవ ప్రపంచయుద్దం యింకా మార్పులు తెచ్చింది. ఖరీదైన గౌన్లు వాడకం మొదలైంది. అద్దేకు గౌన్లు ఇవ్వడం మొదలైంది. పెళ్లి తరువాత గౌన్లను చిన్నచిన్న మార్పులతో నిత్యావసరానికి వాడుకోవడం మొదలైంది. ఎ వృత్తిలో ఉన్నవారు పెళ్లి చేసుకోవడం సంబంధించిన దుస్తులతో పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా ఆరంభమైనాయి.

1950 తరువాత ఆర్ధిక స్దితిగాతులలో వచ్చిన మార్పుల కారణంగా, వివాహానికి డబ్బు తగలేయ్యడం ఆరంభమైంది. ఖరీదైన అంటే వేలు లక్షల ఖరీదు చేసే గౌన్లను తయారు చేయించుకొని వివాహ సమయంలో వేసుకోవడం. ఆ తరువాత దాచిపెట్టుకోవడం ప్రారంభమైంది. ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది? ఏంటది? భారి, భారి గౌన్లును వివాహానంతరం జాగ్రత్తగా దాయడం ఇంతకీ వేలకు వేలు పెట్టి కొన్న గౌను మహా అంటే పెళ్లిరోజు ఒక పూట ధరిస్తారు. ఆ తరువాత అది చూచుకోతనికే గాని వేసుకోటానికి పనికిరాదు. వార్డ్ రోబ్ లో అదొక పెద్ద అద్దంకిగా మారింది. అలా అని దానిని ఊరికె వదిలి పెట్టలేదు. నిజంగానే సమస్యకదా!

సమన్యాలు మనుషులకు కాక ఇంకేవరికి వస్తాయి చెప్పండి మానవులకు వచ్చే సమస్యలకు పరిస్కారాలు మానవులే తెలుసుకుంటారూ. మనిషి తనకొచ్చిన నమంయకు తన ఆలోచనలను తన అనుభాలకు జోడించి పరిష్కారం తెలుసుకుంటూ చైతన్యంతో ముందదుగు వేస్తుంటాడు.

అద్దంకిగా మరిని పెళ్లి గౌన్లకు పరిష్కారం లభించింది. యునైటేడ్ కింగ డమ్ కు చెందిన షేఫిల్డ్ హాల్లమ్ విశ్వవిద్యాలయ విద్యార్ధులు పెల్లిగౌన్లుపై కొంత పరిశోధన చేశారు. వివాహ గౌను కొరకు సగటున 20000 పౌన్ల ధనం వినియోగిస్తూన్నారని. ఇంట ఖరీదైన గౌనును వదిలించుకోలేక మానసికంగా ఇబ్బంది పడ్తున్నారని గుర్తించారు. పరిశోధించి ఓ వినూత్నమైన క్రొత్తగౌనును విద్యార్దుల బృందం రూపొందించింది. దీని ప్రత్యేకతెంతో తెలుసా? ఈ గౌనును నీటిలో వేస్తె అది నీటిలో కరిగిపోతుంది! ఆశ్చర్యం కదా! గౌనేంటి నీళ్ళలో కరిగి పోవడమేమీటి? అవును నిజమే. అలాగని ఏదో పిండితో తయారు చేసిన గౌను కాదు. నీరు తగలకుంటే చాలా గట్టి, చినిగిపోని గౌనత. లాండ్రి సంచులలో డిటర్జెంట్లోతో వినియోగించే ఓ ప్రత్యెక పలివినైల్ ఆల్కహాల్ పదార్ధంతో దారాలు రూపొందించి దాంతో బట్టను అల్లి గౌన్లు రూపొందించారు. ఈ పదార్ధనికి బయోడిగ్రేడ్బుల్ స్వభావమున్నది. దీనిని సంస్కృతి – శాస్త్ర సాంకేతిక రంగాల మిలితంగా విద్యార్ధులు అభివర్ణించారు. వచ్చే మాసంలో దీనిని మార్కెట్ లోకి ప్రవేశపేట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఈ గౌను ధరించినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గౌను పై నిళ్లు పడినా లేదా వాన చినుకులు పడినా పూర్తిగా కరిగిపోయి దేవతా వస్త్రంలా తయారౌతుంది. అందుకే ఈ గౌను రూపకర్తలు గౌనుతో పాటు గొడుగు తప్పనిసరి అంటున్నారు. నూతన వధువరులకు ఈ గౌను ఎంతో రిలిపును అందిస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి.

మన దేశంలో కూడా పనికి రాని వాటిని అంటే ఖాళీ కవర్లను పాత సంచులను, బిగుతైపాయిన దుస్తులను , ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, టివిలలో వచ్చే అత్తా పెట్టలను మొ.న వాటిని దాచుకునే స్వభావం ఉంది. వాటి వలన నివాసం ఇరుకైపోవడం బొద్దింకలు లాంటివి చేరడం, దుమ్మచేరి అలర్జిలు రావడం లాటివి జరుగుతున్నాయి. అందుకని వీటిని కూడా వదిలించుకొనే ఉపాయం ఆలోచించాలి. మీరు అందరూ ఈ విషయమై అలోచిస్తారు కదూ! ఆలోచించండి పరిష్కారం సూచించండి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate