పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పోలోనియం

రేడియో దర్మికత దాని చరిత్ర .

ఇపుడు మనం ఆవర్తన పట్టికలోని చాల అస్థిరమైన మూలకం గూర్చి తెలుసుకుందాము ! ఈ మూలకం పేరు పోలోనియం. దీని సంకేతం Po ఈ మూలకం మరియు దీని తర్వాత వచ్చే మూలకాలు రేడియో ధార్మిక ధర్మాలను ప్రదర్శిస్తాయి. ఈ మూలకాన్ని 1898 లో మేడమ్ క్యూరీ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నది. ఈ మూలకానికి రేడియో ధార్మికత కలదని తెలియజేసింది. అందుకుగాను 1911 లో మేడమ్ క్యూరీకి నోబెల్ బహుమతి లభించింది. అంతకుముందు కూడా 1902 సం.లో మేడమ్ క్యూరీకి రేడియో ధార్మికతను వివరించినందుకు హెన్రీ బెక్వరల్ ఆమె భర్త అయిన పి. క్యూరీతో కలిసి సంయుక్తంగా నోబెల్ బహుమతి లభించింది. ఈ మూలకాన్ని మేడమ్ క్యూరీ కనుగొనినందున ఆమె దేశమైన పోలాండ్ పేరు మీద “పోలోనియం” అనే పేరు పెట్టారు. ఇది ప్రకృతిలో చాలా తక్కువగా 3x10-10 పి.పి.యం. వరకు మాత్రమే లభిస్తుంది. ఒక టన్ను యురేనియం మూలకములో 0.1 మి.గ్రా పోలోనియం ఉంటుంది. ఈ మూలకం ఆవర్తన పట్టికలో VI గ్రూపులోను 6వ పిరియడ్ లోను వుంటుంది. ఈ VI A గ్రూపును ఆక్సీజన్ గ్రూపు లేదా చాల్కోజనులు అని కూడా అంటారు. ఈ గ్రూపులోనున్న లోహం పోలోనియం మాత్రమే. ఈ మూలకానికి మొత్తం 27 సమస్థానీయాలు వున్నను అన్ని కూడా అస్థిరమైనవే. అందులో PO210,PO209,PO208 ముఖ్యమైనవి. వీటి అర్ధాయువులు వరుసగా 138.38 రోజులు, 102 రోజులు మరియు 2.9 రోజులు. PO210 లోపాన్నిBi209 ను న్యూట్రాన్ తో సమయోగం చెందించినప్పుడు లభిస్తుంది.

Bi209 + n ـ > Bi210 ـ > PO210

83 83            84

ఈ లోహం వెండిలాగా తెల్లగా వుంటుంది. ఈ లోహానికి రెండు రూపాలు కలవు. అవి (1) గామా(2) బీటా రూపాలు. ఈ మూలకం వాలెన్సీ ఎలక్ట్రాన్ విశ్వాసము (Xe)4f14 50,10 6S2 6P4 ఈ మూలకం పరమాణు వ్యాసార్ధం 164pm ఈ మూలకం రసాయన చర్యలలో రెండు లేదా నాలుగు ఎలక్ట్రాన్ లను కోల్పోయి +12 +4 ఆక్సీకరణ సంఖ్యలను ప్రదర్శించును. దీని అయనీకరణ శక్క్యము విలువ 813 కి.ఔ. /మోల్సు. దీని రుణ విద్యుదాత్మకత 2,0, సాంధ్రత 9.142 గ్రా. సెంమీ-3 దీని మరుగు ఉష్ణ్రోగ్రత 246º సి. మరుగు ఉష్ట్రోగ్రత 962º సి. విద్యుత్ నిరోధకము 2x10-5 వోమ్స్ సెం.మీ. ఈ మూలకము మరియు దీని సమ్మేళనాలు విషధర్మాలను చూపును. కాబట్టి ఈ మూలకాన్ని మానవులు 7x10-12 గ్రాములకన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఇది H2 తో చర్య జరిపి H2 P0 అనే సమ్మేళనాన్ని, హోలోజన్ లతో చర్యజరిపి టేట్రా హైలైడ్ లను ఏర్పరుచును. ఇది మెర్క్యూరీ, కాడ్మియం, లాంథనైడులతో చర్య జరిపి వాని మిశ్రమలోహాలను ఏర్పరుచును. ఈ లోహం B కణాన్ని దీనిని శక్తి ధాతువుగా థర్మల్ పవర్ స్టేషన్ లో ఉపయోగిస్తారు. దీనిని న్యూట్రాన్ ధాతువుగా కూడా ఉపయోగిస్తారు. –

రచయిత: డా . కె.లక్ష్మారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్.ఐ.టి, వరంగల్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

3.00449438202
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు