অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రకృతి వనరుల కథలు

ప్రకృతి వనరుల కథలు

natureరాజేష్, సుభాష్ అనామిక, సానియా, జాఫర్, పీటర్, రమేష్, సువర్చల, దినకర్, శ్రీలత నెలూరు జిల్లా విద్యానగర్లో కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు. ఆ రోజు శలవుదినం. వాళ్ళు ముందే ప్లాన్ వేసుకొని దగ్గరలో ఉన్న గూడలి గుట్టమీదకు వెళ్ళాలని నిర్ణయించుకొన్నారు. గూడలి ఒక చిన్న గ్రామం లాంటిది. గూడలి గుట్ట క్రింద ఆ గ్రామం ఉంటుంది. ఆ గ్రామం ప్రక్కనే సువర్ణముఖీనది పారుతుంది. గూడలి గుట్ట చాలా సాదాసీదా చిరు పర్వతం. మహా అయితే సముద్ర మట్టం నుంచి 500 అడుగులు ఉంటుంది. ఆ గుట్టపై ఓ దేవాలయం, సత్రం ఉన్నాయి. చాలా మంది విద్యానగర్లో చదివే బి.టెక్ విద్యార్థులు డిగ్రీ కళాశాల విద్యార్థులు, వాకాడు విద్యార్థులు కేంద్రీయ విద్యాలయం విద్యార్ధులు తరచుగా ఆ గుట్ట మీదకు విహారయాత్రకు వెళుతుంటారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం దేవాలయ దర్శనం కన్నా ఆ గుట్ట నుంచి చూస్తే చాలా దూరం మేరకు నేల ప్రాంతాలు కనిపిస్తాయన్నమాట. అక్కడ నుంచి చూస్తే బంగాళాఖాతం సముద్రం కూడా కనిపిస్తుంది. ఆ సరదా కోసమే మన మిత్రులు ఆ శలవురోజున బయలుదేరారు. గూడలిలో కొన్ని చాక్లెట్లు, బరానీలు, మిర్చిబజ్జీలు కొనుక్కొన్నారు. తమ వెంట నీళ్ళ బాటిళ్ళు పట్టుకెళ్ళారు. (పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యాభ్యాస సమయంలో ఈ రచన రచయిత ఆ గుట్టమీదకు కనీసం 50 సార్లయినా వెళ్ళి ఉంటాడు) .

రమేష్: ఒరే యింకా ఎన్ని వెంటు ఎక్కాలి? ఆయాసం వస్తోంది.

పీటర్: అక్కడ తిరుపతిలో ఏడుకొండల స్వామి దర్శనానికి నీకన్నా పెద్దవయసోళ్ళు యీ గూడలి గుట్టకన్నా 10 రెట్లు ఎక్కువ ఎత్తున్న కొండల్ని ఎక్కుతున్నారు. నీకేమయిందోయ్!

సువర్చల: రమేష్, నీకన్నా మేమే మెరుగు. చూడక్కడ అనామిక నాలుగయిదు మెట్లు మన కన్నా పైన నడుస్తోంది.

రాజేష్: మాట్లాడకండిరా, మాట్లాడితే ఆయాసం ఎక్కువ వుంటుంది.

జాఫర్: శ్రీలత కొన్ని నీళ్ళీవ్వు ఆయాసం వస్తోంది.

దినకర్: మనం యిక్కడ చిన్న గుట్టనెక్కడానికే అపసోపాలు పడుతున్నాం. ఆ మధ్య వరంగల్ అమ్మాయి ఒకరు హిమాలయా పర్వతం ఎక్కింది తెలుసా..?

సానియా: అబ్బాయిలు మాటలకే గాని ఆలోచిస్తే చిన్న కొండలు ఎక్కడానికే బేజారు అవుతారు.

సువర్చల: మన సంగతేమో గాని అలా చూడు సుభాష్ భారీకాయాన్ని ఎలా దొర్లించుకొన్నట్లు నడుస్తున్నాడు.

సుభాష్: కొండపైకి చేరేప్పటికి నేను మీలాగే సన్నబడ్డం ఖాయం.

(అందరూ నవ్వకున్నారు. కొండపైకి చేరాక తెల్సింది. అక్కడ అప్పటికే వాళ్ళ టీచర్ సౌదామిని తన యిద్దరు పిల్లలతో అక్కడ ఉంది. మేడమ్ను చూడగానే అందరూ నమస్తే చెప్పారు!)

సౌధామిని: ఏంటి అందరు కట్టగట్టుకుని గుట్టమీదికి వచ్చారు!

శ్రీలత: మీరెప్పడు వచ్చారు మేడం? మీ పిల్లలు చాలా చిన్నవాళ్ళు కదా. కొండ ఎక్కడంలో ఇబ్బంది పడలేదా?

సౌధామిని: వాళ్ళు వేగంగా పైకి ఎక్కుతుంటే ఎక్కడ సిప్ అవుతారని నేనే హైరానా పడ్డా. వాళ్ళు చకచకా నడుచుకుంటూ పైకి వచ్చేశారు. (ఓ అరగంట పాటు అటూ యిటూ తిరిగాక గుళ్ళకి వెళ్ళి అందరూ బయటికి వచ్చి అక్కడ ఉన్న అరుగుల మీద కూర్చున్నారు. దూరంగా చిన్న పేకముక్కల్లాగా భవనాలు, దూరంగా ఆకాశంలోకి కలుస్తున్న బంగాళాఖాతం చూశాక మన విద్యార్థి బృందానికి చాలా డౌట్లు వున్నాయి)

సానియా: మేడం, మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. అడగమా!

సౌధామిని: సెలవురోజు కూడా నాచేత పాఠం చెప్పినున్నారా. సరే అడగండి. మీరడగబోయేది ఈ దేవాలయు పుట్టుపూర్వోత్తరాల గురించేనా! నేనంటే ఎక్కడా పూజలు అవీ చేయను. సరదాగా కాస్త ప్రశాంతత ఉన్న ప్రాంతాలు కాబట్టి యిలా వస్తుంటాను.

రాజేష్: కాదు మేడం. మాకు గుట్టలు, పర్వతాలు, కొండల గురించి తెలుసుకోవాలనుంది. వీటి గురించి అడగమా?

సౌధామిని: అడగండి. నాకు తెలిస్తే చెబుతాను.

అనామిక: వేుడం, భూమ్మీద యిలా గుట్టలు ఎందుకుండాలి. నేలంతా ప్లాట్గా, మైదానం లాగా ఉండవచ్చును కదా!

సౌధామిని: సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి సౌరమండలంలో ఓ గ్రహంగా ఆవిర్భవించింది. అవుడు ద్రవరూపంలో ఉన్న భూమి క్రవేువీ చల్లబడి ఘనీభవించింది. కొన్ని ప్రాంతాల్లో ద్రవం భగభగ కుతకుత ఉడికి పొంగుకురావడం వల్ల ఎత్తు పల్లాలు ఏర్పడ్డాయి. భూభాగంలో ఎత్తున్న ప్రాంతాలను కొండలని పల్లంలాగా ఉన్న ప్రాంతాల్ని మైదానాలని అన్నారు. కొండల మధ్య ఉన్న ఇరుకు మైదానాల్లో నీరు ప్రవహించి నదులయ్యాయి. కొండల క్రింద లావా అగ్ని బుగ్గలు పైకి వచ్చి కొండల ఎత్తులు పెరిగాయి. ఖండాంతర చలనం (Plate etonics) కూడా కొండలు పర్వతశ్రేణులు (Mountain Ranges) ఏర్పడేలా చేశాయి.

సుభాష్ : మేడం! ప్రపంచంలో అత్యధిక పెద్ద పర్వతాలు ఎక్కడున్నాయి?

సౌదామిని : నేలమట్టం నుంచి శిఖరం వరకు ఉన్న ఎత్తునే పర్వతపుటెత్తుగా పరిగణిస్తాం. పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు అడుగుభాగం నుంచి పర్వతపు శిఖరం వరకు 4,027 మీటర్ల (సుమారు 4 కి.మీ) ఎత్తుకు ఎదిగిన అగ్నిపర్వతం మౌనాకీ (Mauna Kea) పర్వతమే ప్రపంచంలోకెల్లా పెద్దది, దీని నుంచి వెలువడే అగ్నిలావా ఆ పర్వత శిఖరం నుంచి సుమారు 6000 మీటర్లు (6 కి.మీ) ఎగిసి పడి పసిఫిక్ మహాసముద్రపు నీటిమట్టంపై తెట్టుగా ఒక ద్వీపంలాగా ఏర్పడుతుంది. అంటే మౌనాకీ నికర ఎత్తు సుమారు 10 కి.మీ ఉంటుంది. మనకందరికీ తెలిసిన ఎవరెస్తు శిఖరం ఎత్తెంత చెప్పండి?

జాఫర్ : మేడం, దాని ఎత్తు సుమారు 8 కి.మీ. దాని తర్వాత కాంచన గంగ. ఈ రెండు నేపాల్. భారతదేశం, చైనా సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించిన హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి.

సౌధామిని: గుడ్, వాస్తవానికి ఎవరెస్టు ఎత్తు 9 కి.మీ. ఖచ్చితంగా చెప్పాలంటే 8,848 మీటర్లు, నువ్వు హిమాలయ పర్వతాల గురించి చెప్పావు కదా? ప్రపంచలో సుమారు 100 పర్వతాల సగటు ఎత్తు 7 కి. మీ పైబడి ఉంటే అందులో 99 పర్వతాలు హిమాలయాల్లోనే ఉన్నాయి.

రాజేష్ : మేడం, కొన్ని కొండలు కూసుగా, మరికొన్ని బల్లపరుపుగా, మరికొన్ని గోపురం లాగా ఉంటాయి. కదా? తవ్వితే ఎక్కువ మట్టి లేదా రాళ్ళు వచ్చే పర్వతం ఏది?

సౌధామిని : దాన్నే వునపరిమాణం అంటారు. ఘనపరిమాణం ప్రకారం అయితే దుబ్బగా, బలుపుగా పదార్థ ఘనపరిమాణంలో ఉన్న పర్వతం పసిఫిక్ మహాసముద్రంలో ఉండే మౌనాలో (Mauna Loa) ఇది హవాయి దీవుల్లో వుంది. భూవైశాల్యం ప్రకారం కూడా ఇదే ప్రపంచంలో ఎక్కువ విస్తారాన్ని ఆక్రమించింది. దీని వునపరిమాణం సుమారు 75,000 వున కి.మీ దీని భూవైశాల్యం (base area) సుమారు  5000 చ.కి.మీ ఉంటుంది. అంటే మన నెలూరు జిల్లా మొత్తం వైశ్యాలంలో సుమారు 70 శాతమన్నమాట.

సువర్చల: మేడం, పర్వతాలు, గుట్టలు, కొండలు అని వేర్వేరు పదాలున్నాయి కదా? శాస్త్రీయంగా వీటన్నింటి అర్థం ఒకటేనా?

సౌదామిని: కాదు. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పర్వతాలంటే ఏమిటో నిర్వచనం ఉంది. కనీసపు ఎత్తు 2.5 కి.మీ ఉండాలి. లేదా ఎత్తు 1 కి.మీ మేర ఉన్నయితే ఆ పర్వతాల అంచుల వాలు (Slope) 2 నుంచి 5 డిగ్రీల కోణంలో ఉండాలి. ఇంతకన్నా తక్కువ ఎత్తు ఉన్నట్లయితే  వాటి నిడివి (భూమి మీద ఏదో దిశలో) కనీసం 7 కి.మీ. ఉండాలి. ఈ నిర్వచనాలకు నిలవని ఎత్తయిన ప్రాంతాలన్నీ కొండలు లేదా గుట్టలు మాత్రమే. మనం యిపుడుంటున్నగూడలి గుట్ట పర్వతం కాదు, కొండా కాదు. ఇది జస్ట్ ఒక గుట్ట మాత్రమే!

సానియా: మేడం అసలు పర్వతాల వల్ల మనకు లాభమేమిటి? వీటిని ప్రకృతి వనరులని భావించ వచ్చా?

సౌదామిని: పర్వతాలు ఎన్నో ప్రకృతి వనరుల్లాగే ఓ ప్రత్యేకమైన ప్రకృతి వనరు. మనం వాడే ఎన్నో కట్టడ పదార్ధాలు (building materials) కొండల త్రవ్వకాల ద్వారానే వస్తున్నాయి. వర్నపు నీటిని నదులుగా మార్చే తొలి నిర్మాణాలు పర్వాతాలే. పర్వతాలే లేకుంటే, భూమి గుండ్రంగా నునుపుగా ఉండినట్లయితే భూమి ఎపుడో ఎండిపోయి ఉండేది. సముద్రపు నీటిపై తేలియాడే తెప్పల్లాగా ఖండాలు ఉండేవి. జీవానికి, వృక్ష సంతతికి అవకాశం ఉండేది కాదు. వాతావరణపు ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిచడంలో బహుశా పర్వతాలు కీలక పాత్రపోషిస్తాయి. నేల కేవలం ఒకవైపునే ద్విమితీయంగా ఎక్స్పోజ్ అయి ఉంటే పర్వతాల నేల భాగం అన్నీ ప్రక్కలకు త్రిమితీయంగా ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. కాబట్టి ఉష్ణ ఉద్గారం (Thermal emission) బాగా చేసి భూమి (నేల) ఉష్ణోగ్రతను, వాతావరణ ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తాయి. ఋతుపవనాలను అడ్డుకొని అవి వర్షించేలా సహకరిస్తాయి. ఎందుకంటే పర్వతాల మీద ఉష్ణోగ్రత, నేలమీద కంటే తక్కువ ఉంటుంది. అందుకే కదా! ఎండకాలం Hill Station కి అందరు విహారయాత్ర చేస్తారు.

దినకర్: నాపరాళు, చలువ రాళ్లు అన్నీ కొండల్లో దొరుకుతాయి కదా మేడం?

సౌదామిని: దాదాపు అంతే దినకర్! మనం వాడే ఎన్నో విధాలయిన బండలు, రాళ్ళ , ఇసుక మట్టికి ప్రధాన వనరు కొండలే. కొండలను త్రవ్వి ఖనిజ లవణాలను వేరుచేస్తారు. కొండలు మీద నుంచి జారి నదీ ప్రవాహంలో చిన్న చిన్న రేణువులుగా వూరి ఇసుక ఉద్భవిస్తుంది. భూమిలో పగుళ్లు రాకుండా కొండలు అడుపడుతాయి. భూకంపాలు రాకుండా కొండలు, పర్వతాలు కుషన్ లాగా, షాక్ అబ్సార్బర్స్ లాగా పనిచేసి వాటి వైపరిత్యాన్ని లేదా అవకాశాన్ని తగ్గిస్తాయి. కొన్ని కొన్ని కొండలు కలవడం వల్ల మధ్యలో ఉండే ఖాళీ ప్రాంతాలు సహజ సరస్సులుగా మారి బ్రహ్మండమైన జీవావరణ వ్యవస్థకు మార్గం సుగుమం చేస్తాయి. పర్వతాలు, కొండలు మీద ఎన్నో విధాలైన వృక్షజాతులు పెరుగుతాయి. వాటి మీద ఆధారపడి పక్షి తదితర జంతుజాతులు ఉండగల్లుతున్నాయి. ఆ విధంగా ప్రతి కొండ ఓ జీవావరణ వ్యవస్థకు కొండంత అండగా ఉంటోంది. నదుల మీద ఆనకట్టలకు అటుఇటు అడ్డంగా నిలబడి స్థిరత్వాన్ని ఇస్తాయి. శ్రీశైలం డ్యాము, పొలవరం డ్యాము, కిన్నెరసాని డ్యాము మన తెలుగు రాష్ట్రాల్లోని ఉదాహరణలు.

పీటర్: కొండల్లో గుహలు కూడా ఉంటాయా మేడం?

సౌదామిని: గుహలు చూసి భయపడకు పీటర్ గుహలు కొండలు పేలి వేగంతో చేసే రక్షిత నిర్మాణాలు. వాటి వల్ల పర్వతాలు బాగా చల్లబడుతాయి. గాలి విసరణకు ఉపకరిస్తాయి. ఎందరో కొండ జాతులు ఆ గుహల్లనే ఉండేవారు. అక్కడి నుండే మానవ పరిణామం మొదలైంది. ఇపుడు ఎక్కువగా సమాచార టవర్లు, నీటి ట్యాంకరు పవన విద్యుత్ జనరేటరు నిర్మిస్తున్నారు. కొండలు అడవులకు ఆధారం. సాధారణ మైదానాల్లో ఉండే అడవులు, పొలంకోసమో, వ్యాపార నిర్మాణాల కోసమో, ఆవాసాల కోసమో, రోడ్ల విస్తరణ కోసమో, పరిశ్రమల కోసమో నరికివేతకు గురి కాబడ్డ కొండల మీదున్న అడవులు.... అవకాశం ప్రమాదం తక్కువ. కాబట్టి అడవులు అనే మరో ప్రకృతి వనరుకు కొండలు, పర్వతాలు వనరులను కల్పిస్తున్నాయి. పైగా మంచు పర్వతాలు కరగడం వల్లే వరాలు లేకున్నా ఎండాకాలంలో కూడా గంగా, యమునా, సింధు వంటి నదులు జీవనదులుగా ఉంటున్నాయి. కొండల పై పెరిగే ఎన్నో మొక్కల నుంచి అరుదైన ఔషధాల్ని సుగ్రంధ ద్రవ్యాల్ని పొందుతున్నాం.

ఆధారం: ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్, సెల్. 8332969504© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate