অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బంగారం

బంగారం

goldకాశి నుండి తమ గ్రమానికి వచ్చిన ఓ స్వామీజీని కలిసి తన కష్టాలు చెప్పుకోవాలనుకున్నాడు భద్రయ్య. అనుకున్నట్టే ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్వామీజీ దగ్గరకు వెళ్లి... “నేను రోజంతా కష్టపడతాను. కానీ నా జీనితంలో ఆనందం లేదు. రష్టాలన్నీ నాకే వస్తాయి ఎందుకు?” అని అడిగాడు. ఆ మాటలు విన్న స్వామీజీ భద్రయ్యను మర్నాడు అదే వేళకు గుడికి రమ్మని చెప్పాడు. స్వామీజీ చెప్పినట్లే మర్నాడు భద్రయ్య గుడి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయానికి అక్కడికి సుమారు వంద మంది వరకూ గ్రామ ప్రజలు వచ్చి ఉన్నారు. వారందరికి తనలాంటి సమస్యే ఉందని భద్రయ్యకు అర్ధమైంది. కాసేపటికి స్వామీజీ వచ్చి ఒక చేతిలో బంగారం నాణెం, మరో చేతిలో కాగితం పట్టుకొని చూపించాడు. “మీ జీవితంలో ఈ రెండింటిలో దేనిలా ఉండాలనుకుంటున్నారు?” అని అడిగాడి. అంతా ‘బంగారు నాణెంలా’... అని గట్టిగా చెప్పారు. తర్వాత స్వమీజీ బంగారు నాణేన్ని నేలకేసి గట్టిగా కొట్టి విరగొట్టడానికి ప్రయత్నంచాడు. మంటలో వేశడు. కానీ అది చెక్కు చెదరలేదు. తర్వాత కాగితాన్ని తీసి ముక్కలు చేసి మంటలో వేశాడు. కాగితం బూడిదగా మారింది. చూశారు కదా. బంగారు నాణెంలాంటి జీవితమంటే... ఎలాంటి కష్టమెుచ్చినా కుంగిపోకుండా స్ధిరంగా ఉండటమే. కానీ మీరు ప్రతి చిన్న కష్టానికి భయపడుతూ బాధపడుతూ కాగితంలా కాలి బూడిద అయిపోతున్నారు. నిజానికి సమస్యలు లేని మనిషంటూ ఎవరూ ఉండరు. సమస్య ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి పరిష్కార మార్గం కోసం ఆలోచిస్తే బంగారం లాంటి జావితం మీ సొంతమవుతుంది’ అని వారందరికి వివరించాడు స్వామీజీ.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate