অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బొగ్గు కథ

బొగ్గు కథ

aug21బొగ్గు నల్లగానే ఉన్నా తెల్లని వెలుగుల్ని ప్రపంచానికిచ్చే పదార్థాలలో అదే మొదటిదనడంలో ఆశ్చర్యం లేదు. బొగ్గులో ఉండే ప్రధాన పదార్ధం కార్బన్ మూలకం. బొగ్గు ఖనిజరూపంలోనే అధికంగా దొరుకుతుంది. కర్రముక్కల్ని పరిమితమైన గాలి సమక్షంలో మండించి వంటబొగ్గును తయారుచేస్తారు. ఇది చాలా తక్కువ మోతాదులోనే సహజపుతునికిలో ఉంది. వంట, ఇటుక బట్టీలు, చాకలి ఇస్త్రీ పెట్టె, కంసాలి ఇనుప బొగ్గుల కొలిమి, నిప్పుల నడక మొదలయిన సాధారణస్థాయి ప్రయోజనాల కోసము వంట బొగ్గును వాడతారు. ఇది కర్రల్ని కాలిస్తే వస్తుంది. కాబట్టి దీనిని ప్రకృతిసిద్ధంగా దొరికే బొగ్గుగా పరిగణించడం సబబు కాదు. ప్రపంచంలో అధికస్థాయిలో వాడే బొగ్గు కోల్ (coal). ఇది భూమిపొరల్లో విస్తారంగా కిలోమీటర్ల మేర పరచుకున్న ఘనపదార్థంగా లభ్యమవుతుంది. బొగ్గు గని కార్మికులు బొగ్గు ఖనిజం దొరికే గనుల ప్రాంతంలో సొరంగాలు త్రవ్వి బొగ్గు నిల్వల్ని తొలుచుకుంటూ నేలపైకి పంపుతారు. ఈ బొగ్గును పలువిధాలయిన భౌతిక రసాయనిక మార్పులకు లోనుచేసి ఉపయుక్త బొగ్గుగా మారుస్తారు. ఇలా తయారయిన శుద్దమయిన బొగ్గును కోక్ (coke) అంటారు. రాపము కోకోవాళ్ళ కోక్ కూ బొగ్గు నుంచి వచ్చే కోక్ కు సంబంధం లేదు. బొగ్గు నుంచి వచ్చే కోక్, కోకోకోలా కోక్ కన్నా విలువయింది. శక్తిని ఇస్తుంది. బొగ్గు ఖనిజాన్ని వెలికితీసి తద్వారా శక్తిని సాధించడం మానవ చరిత్రలో విప్లవాత్మకమైన ఘటనగా చరిత్రకారులు పేర్కొంటారు. పారిశ్రామికీకరణకు, ఉత్పత్తి రంగాల్లో ఆధునీకరణకు దారితీసిన వునత బొగ్గు నిల్వల్ని గుర్తించి, బొగ్గు గనుల్నించి బొగ్గును వెలికి తీసి దాన్ని కోక్ గా మార్చి అందులోంచి విద్యుచ్ఛక్తిని, యాంత్రికశక్తిని, ఉష్ణశక్తిని రసాయనిక శక్తిని సాధించడం నాగరికత అభివృద్ధికి దారితీసిన ప్రధాన దశ.

బొగ్గు ఖనిజం ఎలా ఏర్పడింది?

sug22కోటానుకోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద చాలా విస్తారంగా అడవులు ఉండేవి. పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. మైదాన ప్రాంతాలంతా అడవుల పచ్చదనం నిండుకుని ఉండేది. గడ్డి పొదలు, చిన్న మొక్కలు, చెట్లు, వృక్షాలు, మహా వృక్షాలు ఇలా అన్ని రకాల చెట్ల జాతులు, వాటి మీద ఆధారపడ్డ జంతుజాతులు విస్తారంగా ఉండేవి. ఉల్కాపాతం ద్వారాను, తుఫానుల ద్వారాను, భూకంపాల ద్వారాను, ఖండాంతర చలనంలో కలిగిన సహజ భూభౌతిక ప్రక్రియ (geophysical process) ద్వారాను పలు ప్రాంతాల్లో అడవీప్రాంతాలు భూమి పొరల్లోకి వెళ్ళిపోయాయి. అక్కడ ఉన్న అధిక వేడి, భూమి ఒత్తిడి, గాలి లేని పరిస్థితులలో చెట్లలోను, జీవజాతులకు ఉండే సెల్యులోజ్ తదితర కర్బన పదార్థాలలోని వాయురూప మూలకాలయిన ఆక్సిజన్, హైడ్రోజన్, క్లోరిన్, నైట్రోజన్లు వెళ్ళిపోగా తనరూవ మూలకమయిన బొగ్గు (కర్బనం) మిగిలిపోయి తేటుగా ఏర్పడింది. కర్బనంతో పాటు ఘనరూప మూలక మలినాలయిన గంధకం, భాస్వరం, ఇనుము తదితర లోహాలు కూడా కొద్దో గొప్పో ఉండేవి. మహావృక్షాలు యింకా మొదలయిన రోజుల్నించే భూమిలో బొగ్గు నిల్వలున్నట్లు భూగర్భ పరిశోధనలు ఋజువు చేశాయి. షుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితమే బొగ్గు ఖనిజపు ఆనవాళ్ళు దొడ్డికాయి. దీన్నిబట్టి అర్ధమయ్యేదేమిటంటే భూమిపై జీవపరిణామ క్రమంలో రూపొందించడిన తొలి జీవకణాలయిన వైరస్, ఆల్గే, ప్రోటోజోవన్లు, క్లామిడోమోనాలు తదితర జీవరాశు లు కూడా బొగ్గు నిల్వల ఏర్పాటుకు ప్రధాన ముడి పదార్థాలుగా పేర్కొంటున్నారు. ఆ తదుపరే వృక్షాలు కూడా తోడయ్యాయంటారు.

sep2ఏది ఏమైనా బొగ్గు ప్రస్తుతం ఓ ప్రధాన శక్తి వనరు. ప్రకృతి ప్రసాధించిన ముఖ్యమైన ఇంధనం. బొగ్గు నుంచి నేడు ఎన్నో ఇతర పదార్థాలను వెలికితీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు షుమారు 90 వేల కోట్ల టన్నుల వరకు లభ్యమయ్యే స్థితిలో ఉంది. బొగ నుంచి ఏయే పదార్థాలను వెలికితీయగలుగుతున్నారో పటంలో చూడండి. మరిన్ని వివరాలు పై సంచికలో తెలుసుకుందాం.

ఒక గ్రాము పదార్థాన్ని సరిపడినంత ఆక్సీజన్ సమక్షంలో ఆక్సీకరణం చేస్తే విడుదలయ్యే ఉష్ణశక్తిని ఆ పదార్థపు కెలోరిఫిక్ విలువ (Calorific value) అంటాము. ఇదే ఒక గ్రాము మోలు స్థాయికి సరిచూస్తే విడుదలయ్యే శక్తిని మోలార్ కంబషన్ ఎనర్జీ (Molar Heat of Combustion) అంటాము. శుద్ధమైన బొగ్గుకు ఈ విలువ షుమారు 390 కిలోజాళ్ళు ఉంటుంది. ఇలా ఆక్సీజన్ సమక్షంలో లేదా ఇతర పదార్థాలతో రసాయనిక చర్య ద్వారా తగు మోతాదులో శక్తిని విడుదల చేసే పదార్ధాలను రసాయనిక ఇంధనాలు (fuels) అంటాము. ఈ కోవలో హైడ్రోజన్ కు అన్నింటికన్నా ఎక్కువ ఇంధన స్వభావం ఉంది. దాని దహనోష్ణం (Heat of Combustion) విలువ సుమారు 282 కి.జోళ్ళు (కిలోరిఫిక్ విలువ ప్రకారం చూస్తే బొగ్గుకన్నా షుమారు 5 రెట్లు ఎక్కువ).

sep31000 అంతకన్నా ఎక్కువ మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా షుమారు 20 దేశాలున్నాయి. అందులో మన భారత దేశానిది 5వ స్థానం కాగా మొదటి స్థానంలో అమెరికా ఉంది. అయితే బొగ్గును సాలీనా వెలికితీసి వాడే దేశాల్లో చైనా మొదటి స్థానంలోను, భారతదేశం మూడవ స్థానంలో ఉన్నాయి.

చాలా దేశాల్లో బొగ్గును ప్రధానంగా విద్యుదుత్పత్తికి వాడుకొంటున్నారు. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 8 ఉష్ణవిద్యుత్ కేంద్రాలున్నాయి. ఇందులో కొన్ని యిప్పటికి విద్యుదుత్పత్తి చేస్తుండగా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. షుమారు 18000 మెగావాట్ల శక్తి సామర్థ్యాన్ని యిచ్చేలా వీటి ప్రణాళిక ఉంది. కొన్ని జాతీయ అజమాయిషీలో, మరికొన్ని రాష్ట్ర అజమాయిషీలో పని చేస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 చోట్ల బొగ్గు ఆధారిత ఉష్ణ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం షుమారు 11000 మెగావాట్లు మాత్రమే. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలతో కలిపితే మొత్తం విద్యుదుత్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా షుమారు 18000 మెగావాట్ల సామర్థ్యం ఉన్నట్లే.

sep4రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉష్ణవిద్యుత్ కేంద్రాల వివరాలు పట్టికల్లో చూపాను. బొగ్గు ప్రకృతిరీత్యా మూలకం రూపంలోనే ఉన్నా అది జీవనానికి పరమోత్తమ మౌలిక మూలకం. అందుకే కార్బన్ రసాయనిక శాస్త్రాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. ఆర్గానిక్ అంటే జీవనంబంధమని అర్థం. భూమిలో ఉన్న అత్యంత అధిక మోతాదుల్లో ఉన్న మూలకాలల్లో కర్బనానికి 15వ స్థానం. విశ్వంలో హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్ తర్వాత స్థానం కర్బనం మూలకానిదే! ఎన్నో ప్లాస్టికులు, పాలీమర్లు, సేంద్రీయ పదార్థాల్లో కర్బన శృంఖలాలు ఉన్నాయి. కర్బన పరమాణువుకున్న అంతర్భంధ ధర్మం (Catenation) వల్ల ఏ యితర మూలకానికి లేనన్ని వేర్వేరు సంయోగ పదార్థాలనిచ్చే గుణం కర్భనానికి ఉంది. ఒకే విధమైన మూలక సంఘటనం (Elemental Chemical Composition) ఉన్నా వివిధ ధర్మాలున్న అణువులనిచ్చే ఐసోమర్ల తత్వం కూడా కర్భనానికి ఉన్నట్లుగా మరే యితర మూలకానికి లేదు. కర్బన మూలకపు యితర లక్షణాలను ప్రయోజనాలను, విస్తరణ గురించి ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు గారి మూలకాల కథల శీర్షికలో చదువుతున్నారని భావిస్తాను. ఏ యితర మూలకం లేకున్నా జీవం ఉంది గానీ కర్బన పరమాణువులేని జీవి ఏదీ జీవంతోనే ఉన్న దాఖలాలు లేవు

TELANGANA STATE

Name

Organisation

Place

Total Plan Capacity (Mega Watts)

Kakatiya TPP

TSGENCO

Bhupalapalli, Warangal

1100

Kothagudem TPS

TSGENCO

Paloncha, Khammam

2500

Ramagundam TPS

TSGENCO

Ramagundam, Karimnagar

63

NTPC Ramagundem

NTPC

Ramagundam, Karimnagar

2600

Singareni TPP

SCCL

Jaipur, Adilabad

1800

Bhadradri TPP

TSGENCO

Manuguru, Khammam

1080

Telangana Super TPP

NTPC

Ramagundem, Karimnagar

4000

Yadadri TPP

TSGENCO

Damaracherla, Nalginda

4000

TPP: Thermal Power Plant, TPS: Thermal Power Station, NTPC: National Thermal Power Corporation, TSGENCO: Telangana State (Power) Generation Corporation (Limited); SCCL: Singareni Collieries Company Limited

 

ANDHRA PRADESH STATE

Name

Organisation

Place

Total Plan Capacity (Mega Watts)

Sindhura Super TPP

NTPC

Parawada, Visakhspatnam

2000

Dr. Narla Tatarao TPS

APGENCO

Ibrahimpatnam, Krishna

1760

Rayalaseema TPS

APGENCO

Muddanur, Kadapa

1050

Sri Damodaram Sanjeevaiah TPS

APPDCL

Krishnapatnam, Nellore

1600

Vizag TPS

HNPCL

Gajuwaka, Vishakapatnam

1040

Simhapuri TPS

SEPL

Krishnapatnam, Nellore

600

Meenakshi TPS

MEPL

Krishnapatnam, Nellore

300

Pynampuram TPS

TPCIL

Krishnapatnam, Nellore

1320

Sembcorp Gayathri TPS

SGPL

Krishnapatnam, Nellore

660

TPP: Thermal Power Plant, TPS: Thermal Power Station, NTPC: National Thermal Power Corporation, APGENCO: Andhra Pradesh State (Power) Generation Corporation (Limited),  APPDCL: Andhra Pradesh Power Distribution Company Limited. HNPCL: Hinduja National Power Corporation Limited, SEPL: Simhapuri Energy Private Limited, MEPL: Meenakshi Energy Private Limited, TPCIL: Thermal Powertech Corporation India Limited, SGPL: Sembcorp Gayatri Power Limited

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate