অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భలే చీమలు

భలే చీమలు

285.jpgమీ పెరట్లో ఏదైనా ఒక ప్రదేశంలో కొంచెం చక్కెర (పంచదారం) వేసి చూడండి. ముందుగా ఒక చీమ ఎలాగోలా అక్కడికి చేరుకుంటుంది. చక్కెరను రుచి చూస్తుంది. ఆ తరువాత ఒక చక్కెరను రుచి చూస్తుంది. ఆ తరువాత ఒక చక్కర రేణువును తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది.

ఇలా వెళ్తున్న చీమకి దారిలో వేరే చీమ ఎదురైనప్పుడు, అది ఓ క్షణం ఆగి, తన తలతో దాని తలను కలిపి, ఆ తరువాత మళ్ళీ తన దారిన తాను ముందుకు సాగిపోతుంది. ఇంకేముందు. అలా సంగతిని తెలుసుకున్న రెండో చీమ కూడా చక్కెర పడివున్న ప్రదేశానికి పరుగులు తీస్తుంది. కొద్దిసేపటికి, ఒక పెద్ద చీమల దండు ఆ ప్రదేశంలో మీకు కల్పిస్తుంది.

ఒక్కసారి ఓ పెద్ద మనిషి చీమలు ఏం చేస్తాయో చూద్దామని గోడకున్న ఓ పొడవాటి మేకుకు చక్కెర సంచీని వేలాడదీశాడు. ఓ గంట దాకా చెప్పుకో విశేషం ఏదీకనిపించలేదు. ఏవో ఓ నాలుగైదు చీమలు సంచీ లోపల బయటా తిరుగుతూ కన్పించాయి. కాని ఆ తరువాత పరిస్థితిలో క్షణాలలో మార్పు వచ్చింది. కన్పించే దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. రెండు పెద్దపెద్ద చీమల దండ్లు పనిలో నిమగ్నమై ఉన్నాయి. అందులో ఒకదండులోని చీమలు చక్కెర సంచీ లోపల నుండి ఒకో రేణువునీ తీసి సంచీ అంచునుంచీ నేలమీదకు పడేస్తూ ఉన్నాయి. కాగా, నేలమీద పనిచేస్తున్న రెండో దండులోని చీమలు, కిందపడిన చక్కెర రేణువులను తమ నోటిలో కరచి పట్టుకుని చకచకా అక్కడి నుంచి తీసుకుపోతున్నాయి.

మొదట్లో ...ప్రతి చీమ ఒక రేణువుని పట్టుకుని నిలువుగా ఉన్న గోడపై నుంచి కిందికి దిగడం చాలా కష్టంగా అన్పించింది. పదేపదే అలా చేయడం,286.jpg జారి పడటంతో ఎలాగైతేనేం చివరకు చీమలకు ఒక మంచి ఉపాయం తట్టింది. అయితే కేవలం ఓ ఉపాయం తట్టినంత మాత్రాన చాలదు కదా. దాన్ని ఏ విధంగా అమలు చేయాలో, అందుకై ఎవరెవరు ఏ పనిని చేయాలో కూడా నిర్ణయించకోవలసి ఉంటుంది. ప్రతి దండులోని ప్రతి చీమ తను చేయాల్సిన పని గురించి తెలుసుకోగలగాలి. అందుకోసం చీమల మధ్య చక్కటి సమాచార పంపిణీ ఉండి తీరాలి. అందుకని చీమలు ఒకదానిలో ఒకటి ఏదో ఒక పద్ధతిలో తప్పక మాట్లాడుకుంటూ ఉంటాయి. కాదంటారా..

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/4/2022



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate