పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మంచుగడ్డలతో మంట పుట్టించవచ్చు

మంచు తో పుట్టించిన మంటలు.

ప్రయాణికులంతా మైనస్ 48 సెం. చలిలో చిక్కుబడి పోయారు. కెప్టెన్ కు దిక్కు తోచడం లేదు. నిప్పు చెయ్యడానికి కనీసం భూతద్దం కూడా లేదాయె. చిక్క మొహంతో డాక్టర్ క్లబినీ వైపు చూచాడు. డాక్లరుగారు మాత్రం నింపాదిగా సూర్యుడీకేసి చూస్తునారు.

మనం పచ్చి మాంసం తినల్సిందేనా? అసహానంతో కెప్టెన్ నిర్వెదాన్ని జోడించి వాపోయాడు. ఎందుకు మనం ఓ భూతద్దం చేసుకొంటే సరిపోతుందిగా డాక్టరుగారి సమాధానం.

ఏమిటి జోక్ చేస్తూన్నారా డాక్టరు గారూ!

లేదండి కెప్టెన్ గారూ మంచుగడ్డ ఉందిగా ఆ భరోసాతో అంటున్నా. ఇంతలో ఎదురుగా ఓ పెద్ద మంచుగడ్డ మీద అందరి దృష్టి పడింది. గొడ్డలి తీసుకోని బయలుదేరారూ. ఒక అడుగు వ్యాసం ఉండే మంచుముక్కను గొడ్డలితో, కత్తితో చెక్కి పాలిష్ పెట్టి పట్టుకోచ్చారు. డాక్టరుగారు క్షణాల్లో భూతద్దం తయారు చేసి సూర్యకిరణాలతో నిప్పు చేసి మంట వెలిగించేశాడు.

ఇది జుల్వెర్న్ నవల అడ్వంచర్స్ ఆఫ్ కెప్టెన్ హట్టెరాస్ లోని ఒక ఘట్టం. ఈ ఘట్టం కొంచెం అతిశయోక్తి కావచ్చుగానీ మంచుతో భూతద్దం చెయ్యడం మాత్రం చాలా సులభం. సరైన ఆకారంలో గల పాత్రలో నీళ్ళుపోసి గడ్డ కట్టించి తర్వత దాన్ని వెలికి తీస్తే భూతద్దం లక్షణంగా తయారవుతుంది. మంచు పారదర్శకంగా ఉండి కుంభాకార కటకంగా పనిచేసి మంట పుట్టిస్తుంది. ఇలాంటప్పుడు మంచు వేడెక్కి కరగదు కూడా. 1763 నాటికే ఈ రహస్యం ఇంగ్లండు కంతా తెలుసు.

జూల్స్ వెర్న్ రహస్యదీవులు నవలల్లోని ఓ ఘట్టం ఇప్పుడు చూద్దాం. కధానాయకుడు రాబిన్ సన్ క్రూసో ఎడారిలో చిక్కుకొనిపోతాడు. అగ్గిపుల్లగానీ చెకుముకి రాయిగానీ దగ్గర లేవు. ఇంతలో ప్రమాదవశాత్తు మెరుపు ఒకటి చెట్టుకు తగిలీ నిప్పు రాజుకొంటుంది. కానీ ఇంజనీరు అప్పటికి నిప్పు చేసి చలి మంట వేసుకొని హయిగా కూనిరాగాలు తీస్తుంటాడు. మరి ఇంజనిరుకు నిప్పేలా వచ్చిందంటే సూర్యుడి సాయంతో నంటాడు. సూర్యుడి సాయంతోనా? మీ వద్ద భూతద్దం ఉందా ఇంజనీరు గారూ! లేదు బాబు నేనొకటి తయారు చేసుకోన్నా.

ఈ ఎడారిలో భూతద్దం తయారు చేశారా? చేశానండి చేశా అంటూ ఇంజనీరు తనది తన స్నేహేతుడు అరిపోర్టురుది గడియారాల అద్దాలు రెండూ తీసి వాటి మధ్య నీళ్ళు పోసి, అద్దల్ని ఒకదానికొకటి అతికించి తయారు చేసుకొన్న కటకాన్ని ప్రదర్శిస్తాడు. దానితో సూర్యరశ్మి పాడినాచు మీద కేంద్రికరించేప్పటికి క్షణంలో అంటుకొంటుంది!

రెండు అద్దాల మధ్య నీళ్ళు పొయ్యదమెండుకని మిరడుగుతారు. వాటి మధ్య గాలి ఉన్నా వని జరుగుతుందా అని కూడా మీరు ప్రశ్నిస్తారు. కాని గాలితో అని జరగదు. గడియారపు అద్దం వంకరగా ఉన్నా మందం మాత్రం ఒకేలాగా వుంటుంది. అటువంటి తలాల నుంచి ప్రసరించే కాంతి దిశ మారదని భౌతిక శాస్త్రం చెపుతుంది. కాంతి రెండవ అద్దం నుంచి బయటికి వచ్చేపుడు కూడా దాని దిశ మారదు. కాబట్టి కిరణాల్ని కేంద్రికృతం చెయ్యడం సాధ్యంకాదు. అలా జరగాలంటే అద్దాల మధ్య ఖాళీ జాగాలో పారదర్శకమైన ద్రవాన్ని నింపాలి. అది కాంతిని బాగా వక్రిభావింపజేస్తుంది. మన ఇంజనిరుగారి భూతద్దపు రహస్యం ఇదే! నీళ్ళు నింపిన గుండ్రటి బంతి లాంటి గాజుపాత్ర ఎదయినా భూతద్దంలా పనిచేస్తుంది. ఈ విషయం మన ప్రచినులకు ఎప్పటినుంచో తెలుసు. కిటికిలో అనాలోచితంగా వదిలేసిన గుండ్రటి గాజు పాత్రల వల్ల కిటికీ తెరలు టేబిల్ గుడ్డలు అంటుకొని పోయిన సందర్భాలు మందుల దుకాణాల్లో అలంకారం కోసం రంగునిళ్ళు నింపి పెట్టుకొన్న పెద్ద గాజు గోళాలు అగ్ని ప్రమాదాలు తెచ్చి పెట్టాడాలు వారికి కోకొల్లలుగా తెలుసు!

అంతేగాదు 12 సెం.మీ వ్యాసం మాత్రమే ఉండే చిన్న గాజుబుడ్డిలో నిల్లునింపి దాన్ని భుతద్దంగా వాడి చిన్న గాజుమూకుడులోని నీరు మరిగించవచ్చు. 15సెం.మీ దూరంలో మాత్రమే ఉంచి 120 డిగ్రీల వరకు వేడి పుట్టించవచ్చు. దానితో సిగరెట్ కూడా ముట్టించవచ్చు.

విచిత్రం ఏమంటే అద్దాలను, భూతద్దాలను కనుగోనడానికి వెయ్యి సంవత్సరాలకు ముందే గ్రీకులకు గాజు కటకంతో నిప్పు పుట్టించడం తెలుసు.

feb24.jpgతివిరి ఇసుమును తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు అన్నంటుంది గదూ!

అవును నిత్యం జీవితం నుంచి నేర్చుకొన్న పాటాలు, వెలికి తీసిన నిజాలు, చేసిన అన్వేషణలు చేధించిన ప్రకృతి రహస్యాలు ఇలానే ఉంటాయి మరి! విజ్ఞాన శాస్త్రం పుట్టిల్లు ఇక్కడే మరి!

ఆధారం: యాకోవ్ పేర్మలాన్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు