অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మందు మొక్కలు – మనజాతి సంపద

feb1.jpgగడచిన 2010 సంవత్సరం అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా జరుపుకున్నాం. మానవులకు జంతు జతులంన్నింటికి ఆహారం జీవ వనరులనుండే నమకురుతుంది. ముఖ్యంగా మొక్కలు, రకరకాల అటవీ ఉత్పత్తులు కలవగా వంట చెరకుగా ఉపయోగపడటమే గాక మనిషి మనుగడకు అత్యవసరమై ఔషధాలను సైతం అందిస్తాయి. ప్రాచీన ఆయుర్వేదం నుండి నేటి ఆధునిక వైద్యం వరకు ఎన్నో రకాల మందులు మొక్కల్ను౦చే వచ్చాయంటే ఆశ్చర్యం వేస్తుందా? ఇది నిజం. మొక్కలేని మనిషి మనుగడను ఊహించలెం!

మందు మొక్కలు ప్రజల ఆరోగ్యాన్ని అనాదిగా నిలబెడుతున్న కల్ప తరువులు. మనిషి తన అనుభవంలో రకరకాల మొక్కలతో ప్రయోగాలు చేసి, తనకు వచ్చే వ్యాదులనుండి కాపాడుకునే విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. అలా అభివృద్ధి చెందినదే మన భారతదేశంలో ఉన్నవైద్య విధానాలు ఆయుర్వేదం, యునాని, సిద్ధ. విధానం ఏదైనా ! అన్నింటిలోనూ వాడేది మొక్కను మాత్రమే. ప్రపంచంలో దాదాపు 8వేల పైగా మందు మొక్కలను వినియోగిస్తుండగా, భారతదేశ వైద్య విధానంలోనే రండు వేల పైగా జాతుల మొక్కలు వాడుకలో ఉన్నావి. ఇవి కేవలం పుస్తకాల్లో నమోదైనవి మాత్రమే. ప్రజల వాడుకలో ఉన్నవి లెక్కలేనన్ని. ఒక లెక్క ప్రకారం ఇవి 7500 జాతుల మొక్కలని అంచనా.

గ్రామీణులకు ఆధునిక వైద్యం అందని ద్రాక్షలా ఉండి. దాన్ని భరించే శక్తి కూడా వారికి లేదు. ఎ చిన్న కష్టమొచ్చినా ముందుగా ఆధారపడేది ఈ ఓషధ మొక్కల మీదే. మరి ఈ మందు మొక్కలు మీదే. మరి ఈ మందు మొక్కలు ఎక్కడుంటాయి? ఎలా ఉంటాయి? వీటిని తెలుసుకోవటం ఎలా? ఇలాంటి సందేహాలు రాకపోవు? ఒకప్పుడైతె మన పెద్దలో తాతముతైతలో ఫలానా చెట్టు, పలానా జబ్బుకు బాగా పనిచేస్తుందని చెప్పేవాళ్లు. గ్రామాలు గ్రామీణ వాతవరణం మారిపోతున్న మనం మన చుట్టూ ఉన్న వాతావరణం మన పరిసరాలు, మన మొక్కలు మన పంటలు ఇలా ఒకటొకటి అన్ని పిల్లలు తెల్సుకొనే వీలులేని మన బడులు వస్తున్నాయి.

అందుకే మన్న చెకుముకి నేస్తాల కోసం మానవ జీవితం ఎంతో విలువైన మండుమోక్కల గురించి వివరిస్తూ ఇంతటి విలువైన మందు మొక్కలు ఎన్నో అంతరించి పోయే ప్రమాదంలో పడ్డాయన్నది కూడా తేలియజేయటం, తద్వారా జివవైవిద్య సంవత్సర లక్ష్యాలను- జీవ వనురులను పరిరక్షించే దిశగా మందు మొక్కల పరిరక్షణకు పూనుకోనేలా ప్రొత్సహించడం. జివవైవిధ్య లక్ష్యాల కొనసాగింపుకు సృజనాత్మకంగా ఉండే ఉపాయాలను ఈ 2011 ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్భంగా కనిపెట్టి ఆచరించే విధంగా మన సైన్సు క్లబ్బులలో కార్యక్రమాలను చేపట్టవచు.

మందు మొక్కలు

మందు మొక్కలంటూ ఎక్కడో లేవు. అవి మన చుట్టూనే వున్నాయి. ఆ మాటకొస్తే ప్రతి మొక్క ఉపయోగకరమైందే అది దేనికి ఉపయోగపడతుందో మనం తెల్సుకున్నపుడు మనం దాన్ని ఫలానా జబ్బుకు మందుగా పనిజేస్తుందనుకుంటాం. మనం తెల్సుకున్నపుడు మనం దాన్ని ఫలానా జబ్బుకు మ్నడుగా పనిజేస్తున్దనుకుంటాం. మన పెరడులో పెరిగే మొక్కల్లోనే పదులకొద్దీ ఔష్ధ గుణాలున్న మొక్కలు దొరకవచ్చు. దోషం మనది కాని మొక్కది కాదు. మనం తెల్సుకుంటే, మొక్కను గుర్తుపడితే ఆ మెక్కను జాగ్రత్తగా నష్టపర్చకుండా పెంచుకుంటాం. లేదంటే పంకి రానిదనుకొని పోగొట్టుకుంటాం. ఇలా మన అజ్ఞానంతో పోగొట్టుకున్న జీవ సంపద ఎంతుందో!

నేల ఉసిరి (ఫిల్లా౦ధస్ నిరూరీ)

feb3.jpgఇది పదినుండి 60సెం.మీ ఎత్తు వరకూ పెరిగే చిన్న మొక్కగా పెరుగుతుంది. మన దేశంలో ఉత్తరాప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర బీహార్, ఒరిస్సా, బెంగాల్ కేరళ కర్నాటక, తమిళనాడుతో పాటు మన రాష్ట్రంలో ఎక్కువ పెరుగుతోంది. మొక్కలో ప్రతి భాగం కూడా మందుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాలేయ సంబంధ వ్యాధుల నివారణలో హైపటైటిస్-బి వైరస్ అరికట్టడంలో బాగా పనిచేస్తుంది. బాక్టీరియం, శిలింధ్ర నాశకంగా పనిచేసే గుణాలున్నాయని, క్యాన్స్ ర్ నిర్మూలనా లక్షణాలున్నాయనీ కూడా కనుగొన్నారూ.

ఈ మొక్క శాస్త్రీయ నామం: ఫిల్లాంధస్ అమరస్ లేదా ఫిల్లాంధస్ నిరూరీ (Phyllanthus amarus ఓర Phyllanthus niruri)

ఇది యుఫర్చియేసి (Euphorbiaceue) కుటుంబానికి చెందిన పుష్చి౦చే మొక్క దీని పూలు తెలుపు కలిసిన ఆకుపచ్చ రంగులో చాలా చిన్నగా ఉంటాయి. దీని ఆకుల్లో ఉండే రాసాయనాలు దీని ఓషధ గుణానికి కారణం. ఆ రసాయనాల్లో ముఖ్యమైనవి రెండు:

1. ఫిల్లాంధిస్ (Phyllanthin).

2. హైపొ ఫిల్లాంధిన్ (Hypo Phyllanthin)

ఇవి కాక మరెన్నో రకాల ఆల్కలాయిడ్లు కూడా ఉండటంతో నేల ఉసిరి వైద్యంలో బహుళ ఉపయోగకారిగా పేరుపొందింది. నేల ఉసిరి చూర్ణంలాలేక ముద్దలా చేసి మజ్జిగతో తిసుకోవటం కామెర్లు తగ్గటానికి ఉపయోగిస్తుంది. ఈ మొక్క ఎన్నో రకాల మందులలో విరివిగా వాడుతున్నారు. మరి మీరు ఈమోక్కను ఎప్పుడైనా చూశారా? మీ పరిసరాల్లో ఇంట మంచి మొక్కు ఎన్ని ఉన్నాయి? మీ స్కూల్ జీవ వైవిధ్య ప్రాజెక్టులు మందు మొక్కలను అధ్యయనం చేస్తారు కదూ! ఈ విలువైన మొక్కల్ని కాపాడుకోవడం వృక్ష సంపదను ఎలా కాపాడుకునే వారు? ముందు ముందు తెలుసుకుందాం!© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate