অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రంగమ్మ కల

రంగమ్మ కల

కోనపల్లెలో నివసిస్తున్న రంగన్న ఓ మామూలు కూలి. భార్య రంగమ్మ అంటే తనకు ప్రాణం. ఉన్నంతలో బాగానే చూసుకుంటుంటాడు. చదువు లోకున్నా మంచితనంతో ఒద్దికగా ఉంటారు. వారికిద్దరు సంతానం. ఏడేండ్ల కొడుకు రాజు, మరో నాలుగేండ్ల పాప రాధ, రాజు మూడో తరగతి చదువుతున్నాడు.

రంగమ్మకు సీరియళ్ళ. పిచ్చి టీవీలో యాంకర్లను, సినిమాల్లో యాక్టర్లను చూసినప్పడల్లా, ఆ... నా కూతురు గూడా అట్టా సెయ్యాల, ఇట్టా సెయ్యాల...” అంటూ అమ్మలక్కలతో సంబరపడుతూ చెప్పేది. రంగయ్య మాత్రం ఇందుకు వ్యతిరేకం. "ఆడపిల్ల అంటే ఎప్పటికైనా ఆళ్ళపిల్లే కానీ, ఈడ మనింట్లో పిల్ల ఎప్పటికీ కాలేదు. ఇంటిపని, వంటపని నేర్పించి, పెద్దమనిషి కాగానే, ఓ అయ్య చేతిలో పెట్టాల. ఓ రెండు లచ్చలు కట్నమిచ్చినమనుకో. వాడే మారాణిలాగా జూసుకుంటడు. నేను నా రంగిని చూసుకున్నట్లు. అంతే." అంటూ తోటి వాళ్ళ దగ్గర దబాయించేవాడు.

రెండేళ్ళు గడిచాయి. రాధను బడికి పంపాలని అడిగింది భర్తను.

కానీ, రంగన్న మాత్రం," ఏందే పంపేది? ఏమన్నా మొగపిల్లోడా! బడికి పంపడానికి? ఆడపిల్లను సదివితే, చదువుకున్న మొగుణ్నిదేలేకనేజావాలె. నీదేం బోయింది. పైగా ఆడపిల్లను సదివించడం మా ఇంటా, ఒంటా లేదు. నోర్మూసుకో” అని కోపంతో పనికి వెళ్ళిపోయాడు.

రంగమ్మకు కోపం వచ్చింది. విసుగ్గా, విసురుగా పోయి మంచంలో పడుకుంది. ఆలోచనలో పడింది. గతంలో అమ్మలక్కలతో తన కూతురు గురించి అన్న మాటలే గుర్తుకొస్తుంటే తల తీసేసినట్లనిపించింది. పట్టుదల మొదలైంది. నిద్ర పోతున్న కూతురు రాధ తల నిమురుతూ, ఇక ఊరుకుంటే ఇనేలా లేడు. ఎలాగైనా సరే! కూతుర్ని బడికి పంపాల్సిందే’ అని నిర్ణయించుకుంది.

చీకటి పడ్డాక, ఇంటికి వచ్చిన రంగయ్యకు, రోజుటిలాగా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. స్నానానికి నీళ్ళు తోడలేదు. వీపు రుద్దనూ లేదు. టవలు ఇవ్వనూలేదు. భార్య అలక రంగయ్యకు అర్థమయ్యింది. ఏమనకుండా, తానే కంచంలో అన్నం పెట్టుకుని తిన్నాడు. రంగమ్మ మాత్రం తినలేదు. "పోవే! " అనుకుని రంగన్న పడుకున్నాడు. పిల్లలు నిద్రపోయారు. కానీ, రంగమ్మ అన్నం తినకపోగా ముక్కు చీదుతోంది. తనకేమో... నిద్ర పట్టడం లేదు.

'ఇదెప్పుడూ ఇలా చేయలేదే? ఏంటి దీనికింత పటుదల?ఇప్పదేమంటే ఏమో?? అని మనసులో అనుకుంటూ, " ఏమేవ్? బువ్వ దినుపో," అన్నాడు. పలకలేదు. “నిన్నేనే? అంటూ లేచి దగ్గరకెళ్ళి పట్టుకోబోయాడు. రంగయ్య చేతిని విసిరేసింది. ఆ విసిరివేతలో తన పట్టుదల పవర్ కనపడింది.

" సరే! ఇల్లలకగానే పండగవుతుందా?ఇప్పుడు దీంతో గొడవెందుకు? " అనుకున్నాడు. దీని మాట ప్రకారమే బడికి బంపదం. ఊర్లో ఎట్టాగూ పెద్ద బడి లేదు. బడి అయిపోయేసరికి పిల్లకు పెళ్లీడు వస్తుంది. అప్పడు జూసుకోవచ్చు" అని మనసులో అనుకుంటూ, “సరేలేవే. నీమాటెందుకు కాదనాలి. పిల్లను బడికి పంపుకో పో " అన్నాడు.

ఇంత తేలిగ్గా ఒప్పకుంటాడని కలలో కూడా ఊహించని రంగమ్మ అనుమానంతో, “నిజంగానే అంటున్నావా. ఏదీ నామీద ఒట్టెయ్" అని తనపై ఒట్టు వేయించుకుంది. " నీ మీద ఒట్టు. నిజంగానే పంపవే" అన్నాడు. లేచి ఆనందంతో అన్నం తిని పడుకుంది.

రాధను బడిలో చేర్చింది రంగమ్మ ఇరుగు పొరుగు వారికి మాత్రం, ఆడపిల్లను చదివించడం అంటే, అంతెతు ఎగిరే రంగయ్య పిల్లను బడికి పంపించడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు.

girlరాధ బడిలో వెుదట ఏడ్చినా, తరువాత వుంచి క్రమశిక్షణతో ఉంటున్నది. తరగతి పెరిగే కొద్దీ చదువుతో పాటు ఆటల్లో, పాటల్లో, మంచి పేరు సాధిస్తున్నది. మూడో తరగతికి వచ్చింది. ఇంటి వద్ద కూడా అందరితో బాగా కలిసి మెలిసి ఉంటున్నది. అమ్మకు చిన్న చిన్న పనుల్లో సాయం చేసేది. సినిమా పాటలతో, మాటలతో అలరించేది. తోటి పిల్లలతో చక్కగా గొడవ పడకుండా ఆడేది. చిన్నపిల్లలను కూడా బాగా ఆడిస్తున్నది. వారంతా “అక్కా! అక్కా!” అని,రాధ చుట్టూ తిరుగుతున్నారు. రాధ ప్రవర్తన చూస్తుంటే, రంగమ్మకు తన కల నిజమైనట్టే భావించేది. అందరితో ఇంకా గొప్పలు చెప్పకునేది. రంగయ్య మాత్రం మనసులో, “ కానీయ్, కానీయ్... ఇంకెన్నాళ్ళులే ఈ ముచ్చట“, అనుకునేవాడు.

కాలం గడిచింది. ఇప్పడు రాధ 5వ తరగతి. రాజు, 5 కి.మీ. దూరంలోని రావిపాలెం హైస్కూలులో 7వ తరగతి. నాన్న కొనిచ్చిన ఓ పాత సైకిలుపై వెళ్లి వస్తున్నాడు. ఊర్లో ఈ సారి నుంచి 6, 7 తరగతులు కూడా పెడుతున్నారని తెలిసింది. రంగయ్యకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అయినా, "ప్చ్.. ఆఁ..." అనుకునేవాడు. రాధ 5వ తరగతి పూర్తి చేసింది. ఆరులో చేరింది. రంగయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు. రోజులు గడిచాయి. కొన్నాళ్ళకు రాధ పెద్దమనిషయింది. ఫంక్షను కూడా ఉన్నంతలో గొప్పగా చేసేదాకా రంగమ్మ ఒప్పకోలేదు. రంగయ్యకు ఇవన్నీ కొరుకుడు పడడంలేదు. “ఈ పిల్ల ఇట్టాగే చదువుతే నాకు తిప్పలే“ అనుకున్నాడు. తన మాట నెగ్గించుకోవాలనుకున్నాడు. భార్యకు చెప్పకుండానే సంబంధాలు వెతకడం ప్రారంభించాడు.

ఇంతలో ఉన్నట్నండి ఒకనాడు రంగమ్మకు టైఫాయిడ్ జ్వరం వచ్చి, అనుకోని పరిస్థితులలో మరణించింది. ఊహించని పరిణామూనికి రంగయ్యకు దిక్కు తోచలేదు. కొన్నాళ్ళకు తేరుకున్నాడు. ఇంటి పనుల కోసం రాధను బడికి మాన్పించాడు. తోటి పిల్లలు, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ కలిసి, రాధను బడికి రప్పించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. రాధంటే పిల్లలకూ, పెద్దలకూ అందరికీ ఇష్టమే. తల్లి లేని రాధ పరిస్థితి చూసిన ఇరుగు పొరుగు "పాపం రాధ! వాళ్ళమ్మ రంగమ్మ ఎన్నికలలు కన్నది?" అనుకుని, చేసేది లేక బాధపడేవారు. రాధకు కూడా చదువుపై ఇష్టం. అమ్మతో పాటు తను కూడా టీవీలో కనపడాలని ఆశ పడేది. కానీ, తన ఆశ నెరవేరడానికి ఏం చేయాలో తెలియదు.

ఒకనాడు ,రంగయ్య రాధకు ఒక సంబంధం తెచ్చాడు. పిల్లవాడు ఓ వ్యవసాయ కూలీ. చదువులేదు. అయితేనేం? ఆస్తి బాగా ఉన్నది. మరలా రోజులు గడిస్తే ఏమవుతుందోనని సంబంధం ఖాయం చేసుకున్నాడు రంగయ్య. ఓ వారంలో పెళ్లి, రాధకు దిగులు పెరిగింది. కానీ, ఏడవడం తప్ప ఏంచేయలేక పోయింది. ఎవరైనా తన పెళ్లి ఆపితే బాగుండనుకునేది. బడిలో ఉపాధ్యాయులు కూడా బాధతో రాధ పెళ్ళి ఆపడం గురించి చర్చించుకోసాగారు. 1098 కు ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారని అనుకుంటున్నారు. కానీ, ఎవరు చెప్పాలి? తర్వాత మనం ఫోన్ చేసిన విషయం తెలిస్తే, మనకు తిప్పలు. ఎందుకొచ్చిన గొడవ? పుణ్యానికి పోతే పాపం ఎదురౌద్ది అని ఊరుకున్నారు.

ఇవన్నీ వింటున్న రాధ తరగతి బాలబాలికలకు 1098 గురించి అర్థమయింది. " ఒరేయ్! సారోళ్ళనుకున్నట్లు 1098 కి ఫోన్ చేద్దాంరా! పాపం అక్క ఎంత మంచిదో!? " అని ఒకడన్నాడు.

"ఆ..అపుడు పెళ్లాగుతుంది. అక్క చదువుకుంటది." అన్నాడు మరొకడు. " అయ్యా! మనం ఫోన్ చేసినట్టు తెలిస్తే .. అప్పడుంటది మనకు? సారోల్లే భయపడి ఊరుకుంటుంటే..?” మరొక అమ్మాయి డైలాగ్. దాంతో 'అయ్యబాబోయ్! వదులేరోయ్!" అనుకుని గప్-చిప్ అయ్యారు అందరూ,

ఆరోజు బడినుండి ఇంటికి వెళ్ళిన రమేష్ కు మాత్రం రాధ అక్కే గుర్తుకు వస్తున్నది. ఏదైతే, అదైంది? అనుకున్నాడు. చాటుమాటుగా వాళ్ల నాన్న ఫోన్ తీసుకుని గోడ చాటుకు వెళ్ళి 1098 కు ఫోన్ చేశాడు. రింగ్ అవుతోంది. తన గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. "హలో" అన్న పిలుపు వినపడింది. భయపడి రపీమని ఫోన్ కట్ చేశాడు.

తరువాతి రోజు బడి ఇంటర్వెల్ లో మహేష్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళమ్మ ఫోన్ కనబడింది. గభాలున ఆలోచన వచ్చింది. గప్-చుప్ గా ఫోన్ తీసుకుని మిద్దెక్కాడు. 1098 కు రింగ్ చేశాడు. ఫోన్ రింగవుతుంటే గుండెల్లో దడ పడుతోంది "హలో ఎవరూ" అవతలి గొంతు. "సార్! మా అక్కకు పెళ్లీ...” అని, భయమేసి గభాలున ఫోన్ కట్ చేశాడు. పరిగెత్తుకుంటూ క్రిందికి వెళ్లి, ఫోన్ ఇంట్లో పెట్టి బడికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఇలా ప్రసాద్, శ్యామ్, కమల, సుందర్ లు కూడా ప్రయత్నం చేశారు. కానీ, భయపడి ఎవరూ ధైర్యం చేసి 1098 వారికి విషయం చెప్పలేకపోయారు. ఆరోజు రాధ పెళ్ళి తంతు జరుగుతోంది. ఓ గంట ముహూర్తం ఉందనగా ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగింది. అందులోనుండి ఇద్దరు వ్యక్తులు దిగారు. వారి వెంట ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఎవ్వరికీ విషయం అర్థం కావడంలోదు. అందులో సాగర్ అనేటతడు పెళ్లి కుమార్తెగా ఉన్న రాధ దగ్గరకి వెళ్లాడు. " ఏమ్మా! నీ వయసెంత? " అన్నాడు. రాధ నీళ్ళు నములుతూ తండ్రి వైపు చూసింది.

marriage" నీకీ పెళ్ళి ఇష్టమేనా?” మరొకతని ప్రశ్న “నీకేం భయంలేదు. మేమున్నాం, చెప్పు" వెనుకనున్న పోలీసుల ప్రశ్న ఇవన్నీ విన్న రంగయ్యకు భయమైంది. పెళ్ళి ఆగుతోందని ఊహించిన రాధకు ఆనందం పొంగింది. వెంటనే అక్కడున్న రాధ అభిమానులు అయిన ఆడవాళ్ళు తనకు సపోర్టుగా మాట్లాడారు.

దాంతో వచ్చిన ఆఫీసర్లు రంగయ్యకు, “ ఈ పెళ్ళీ చేశావంటే నీకు తిప్పలు తప్పవు" అని వార్నింగ్ ఇచ్చారు.

రాధతో, "ఇంకేం భయంలేదమ్మా! నీవు ఇక సంతోషంగా చదువుకోవచ్చు. ఏదన్నా మీ నాన్న వినకుంటే మాకు ఫోన్ చేయ్... ఆ... తెల్సిందా?" అన్నారు.

కానీ, అక్కడుంటే తనకు ఎప్పడైనా పెళ్లి చేస్తారని భయపడ్డ రాధ తానిక్కడ ఉండనంది. తప్పని పరిస్థితులలో సాగర్ టీమ్ , రాధను తమతో తీసుకెళ్ళారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు.

వరుసగా వచ్చిన ఫోన్లన్నీ ఒకే ఊరినుండి రావడం, అన్నీ పిల్లల గొంతులే కావడం. అందులోనూ ఒకడు, "మా అక్క పెళ్ళి... " అని అనడంతో అనుమానపడ్డాడు ఆఫీసర్ సాగర్, వెంటనే, ఆ ఫోన్లన్ని ఎక్కడి నుండి వచ్చాయో? బ్రేస్ అవుట్ చేశాడు. అవన్నీ ఒకే ఊరి ప్రాంతం నుండి వచ్చినట్లు తేలాయి. దాంతో తన అనుమానం బలపడింది. పోలీసులతో వెళ్లి, బాల్యవివాహమును అరికట్టినాడు. ఎంతో తెలివితో ఒక బాల్యవివాహాన్ని అరికట్టిన ఆఫీసర్ సాగర్ ను ప్రభుత్వం అభినందించింది.

అలా ప్రభుత్వ సాయంతో రాధ పై చదువులు చదువ సాగింది. చదువుకునేటప్పడే, చదువ సాగింది. చదువుకునేటప్పుడే, బడిలో జరిగే ప్రోగ్రాములలో తన ప్రతిభ కనబరిచేది. అక్కడక్కడా పాఠశాల తరుపున జరిగిన పోటీలలో తానే ఫస్టు వచ్చేది. యాంకర్ గా, నటిగా తన ప్రతిభ చూపించి మంచి బాల కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. మీడియా ద్వారా పలువురి సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఒక బాల నటిగా కొన్నాళ్ళకు బుల్లితెరపై స్థానం సంపాదించింది. అమ్మ కలను నెరవేర్చినందుకు ఆనందపడింది.

రచన: మద్దిరాల శ్రీనివాసులు, సెల్: 9010619066© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate