অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రంగయ్య గొడ్డలి

రంగయ్య గొడ్డలి

decs4ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి కట్టెలు కొట్టి జీవనం సాగించేవాడు. అతనికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు వారిది చాలా బీద కుటుంబం. రంగయ్య కట్టెలు కొట్టుకొని వచ్చి పట్నంలో అమ్మితే ఆ వచ్చిన డబ్బుతో సంసారం సాగించే వారు. అయితే ఒక రోజు రంగయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి ఒక నది ప్రక్కన ఆనుకుని ఉన్న చెట్టు మీద కూర్చుని కట్టెలు కొట్టుతున్నాడు. అయితే తన గొడ్డలి చేయిజారి నదిలో పడిపోయింది. అతను చెట్టు దిగి కిందికి వచ్చి అయ్యో నా గొడ్డలి నదిలో పడిపోయింది. ఇంకా నేను కట్టెలు దేనితో కొట్టాలి? నా భార్య పిల్లలు నేను కట్టెలు కొట్టుకొని వచ్చి పట్నంలో అమ్మీ డబ్బులు తెచ్చి వంట సామాగ్రి కొరకు ఎదురుచూస్తున్నారు కావొచ్చు అని రంగయ్య బాధపడుతూ, ఓ జల దేవత, నీవు నా గొడ్డలి నాకు ఇవ్వరాదా? అనుచు ప్రార్ధిస్తున్నాడు. అప్పుడు జల దేవత ప్రత్యక్షమై ఏమైంది రంగయ్య ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగింది. అప్పుడు అతను జరిగిన విషయం అంతా చెప్పాడు. అయితే సరే నీ గొడ్డలి నీకు ఇస్తాను కాని నీవు బాధపడకు అంది. దేవత నదిలోకి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చి రంగయ్య ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అప్పుడు అతను కాదు తల్లీ కటిక బీదవాణ్ని అయిన నాకు బంగారు గొడ్డలి ఎక్కడిది, నాది కాదు అన్నాడు. సరే అని జలదేవత మరల నదిలోకి వెళ్ళి ఒక వెండి గొడ్డలి తెచ్చింది. అయితే రంగయ్య అది కూడా నాది కాదు తల్లి. నాది ఇనుముతో చేసిన గొడ్డలి అని ఏడుస్తూ చెప్పాడు. అయితే జల దేవత ఇనుము గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది అప్పుడు సంతోషిస్తూ అవును తల్లి ఇది నాది అన్నాడు. రంగయ్య నిజాయితీని మెచ్చి దేవత బంగారం, వెండి, ఇనుముతో చేసిన గొడ్డళ్ళను రంగయ్యకు ఇచ్చింది. దాన్ని తీసుకుని రంగయ్య సంతోషంతో ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డలకు జరిగిన సంగతిని అంతా చెప్పాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తరువాత ఒక రోజు బంగారు గొడ్డలి గురించి రంగయ్య తన భార్యకు చెప్పుతుండగా ఇంటి పక్కన వున్న బీమయ్య విన్నాడు. వెంటనే అడవికి వెళ్ళి నది ప్రక్కన లో ఉన్న చెట్టు మీద కూర్చొని కట్టెలు కొట్టుతూ కావాలని ఆ నదిలో తన గొడ్డలిని పడేశాడు. చెట్టు మీది నుంచి కిందికి వచ్చి నది దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు అప్పుడు జల దేవత ప్రత్యక్షమై భీమయ్య ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది . అని అడిగింది. అప్పుడు భీమయ్య తల్లీ నా గొడ్డలి నీ నదిలో పడిపోయింది. నా గొడ్డలి నాకు ఇవ్వమని అని అడిగాడు అప్పుడు జల దేవత భీమయ్య గొడ్డలిని తెచ్చి చూపిస్తూ భీమయ్య ఇదే కదూ నీ గొడ్డలి తీసుకోఅన్నది. అప్పుడు భీమయ్య ఇది కాదు తల్లీ నాది బంగారు గొడ్డలి అని చెప్పాడు అప్పుడు జల దేవతకు కోపం వచ్చి మాయమైపోయింది. భీమయ్య తన తప్పు తెలుసుకుని వెళ్ళిపోయాడు.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate