অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రైతు బిడ్డలు

రైతు బిడ్డలు

అనగనగా ఒక రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు ఒక రోజు వాళ్ళ అమ్మ ఆ కుమారులను ఎక్కడికైనా వెళ్ళి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తేనే మిమ్ముల్ని ఇంట్లోకి రానిస్తా లేకపోతే ఇంట్లోకి రానివ్వను అని వాళ్ళకు పెరుగన్నం చద్దిమూట కట్టి ఇచ్చింది. వాళ్ళు ఆ చద్దిమూటను తీసుకొని పొరుగూరుకు బయలు దేరారు. దారిలో వాళ్ళకు బాగా నీరసం వచ్చింది. వాళ్ళు చద్దిమూటను చెట్టుకు పెట్టి చెట్టు క్రింద పడుకున్నారు. ఆ చెట్టు మీద రాక్షసి ఉంది. ఆ చెట్టు మీద రాక్షసిఉన్నదని తెలిసి ఆ దారిన ప్రజలు వెళ్ళటం లేదు. ఆ దారిన వెళ్ళిన వారిని చంపి తింటున్నదని ఆ దారిన ఎవ్వరూ వెళ్ళటం లేదు. ఆ వాళ్ళు వెళ్ళి ఆ రాక్షసి ఉన్న చెట్టు క్రింద పడుకున్నారు.

feb0015.jpgఆ రాక్షసి చద్దిమూటను విప్పి ఒక ముద్ద తిన్నది అది నచ్చింది, మొత్తం తినేసింది. నేను వీళ్ళకు ఉంచకుండా మొత్తం తినేశానని దాంట్లో ఒక కుండ పెట్టింది. వాళ్ళకు మెలుకువ వచ్చింది. బాగా ఆకలిగా ఉన్నదని ఆ చద్దిమూట తీసేసరికి దాంట్లో అన్నం లేదు. వాళ్ళకు బాగా ఆకలిగా ఉంది. దీంట్లో ఏముందని ఆ కుండను విసిరి కొట్టారు. దాంట్లోనుంచి రాక్షసి వచ్చింది. ఏమి కావాలని అడిగింది. మాకు పరమాన్నం, పులిహోర, పాయసం, పులగం కావాలని వేడుకున్నారు. రాక్షసి అవన్నీ ఇచ్చింది. అవన్నీ తిని వాళ్ళు ఆ కుండను తీసుకొని పోయారు. అమ్మ ఏమి తెచ్చారని వాళ్ళను అడిగింది. వాళ్ళు కుండ తెచ్చామని ఆ కుండను చూపించారు. ఆ కుండలో ఏముందని చూసి, ఏమీ లేకపోవడంతో కోపంతో ఆ కుండను విసిరి కొట్టింది. ఆ కుండ నుంచి రాక్షసి వచ్చింది. రాక్షసి ఏమి కావాలని అడిగింది. వాళ్ళ అమ్మ “అడిగినది ఇస్తావా?” అన్నది. అవసరం వస్తే అడగండి అని రాక్షసి మాయం అయిపోయింది.

వాళ్ళు ఆ కుండ సహాయంతో అన్నదానం చేశారు. “వీళ్ళు చాలా పేదవాళ్ళు తినడానికి తిండి కూడా లేదు అన్నదానం ఎలా చేశారు?” అని పుల్లయ్య అనే పిసినారికి అనుమానం వచ్చింది. అతడు వచ్చి వాళ్ళను మీకు తినడానికి కూడా ఎల్లదు, ఊరి వాళ్ళందరికి అన్నదానం ఎలా చేశారని అడిగాడు. వాళ్ళు అతడికి జరిగినదంతా చెప్పారు. అతడు కూడా పెరుగు అన్నం చద్దిమూట తీసుకొని వెళ్ళి ఆ రాక్షసి ఉ ముం న్న చెట్టు క్రింద పడుకున్నాడు. చద్దిమూటను విప్పి ఆ రాక్షసి ముద్ద తిన్నది దానికి అది నచ్చలేదు విసిరి ఏం కొట్టింది. అతనికి మెలుకువ వచ్చింది. రాక్షసి దాంట్లో కుండను పెట్టింది. అతడు ఆ కుండను తీసుకొని వెళ్ళి మ్య ఊరి వాళ్ళందరిని పిలిచి అన్నదానం చ్చి చేయాలనుకున్నాడు. కుండను తీశాడు దాంట్లో నుంచి ఊరి కొంత మంది కట్టెలు పట్టుకొని వచ్చారు. ఊరి వాళ్ళందరిని కొట్టారు. అన్నానికి పిలిచి కొట్టిస్తావా? అని అందరూ తిట్టారు, కొట్టారు.

ఆధారం: ఎం. లిఖిత.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate