অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రబ్బరు

రబ్బరు

రబ్బరు గాజులు, రబ్బరు గాజులు, రబ్బరు గాజులు తెస్తాను... అనే ఓ సినిమాపాట. గాజులు మాత్రమేనా? రబ్బరు వాడని రంగమంటూ లేనేలేదు. రబ్బరు శబ్దం కదలికలను అరికట్టే వాషర్లుగా, చేతిగ్లాసులాగా, బొమ్మలు, బెలూన్ల తయారీలలో వాడుతారు. మరియు అతకడానికి (adherise) బంకలాగా చెరపడానికి ఎరేజర్గా ఎలోస్టిక్ తయారీలో రబ్బరును వాడతారు. మరి ఇంతగా లాభాలున్న రబ్బరు అసలు ఎలా తయారవుతోంది? దాని కథా కమామీషు ఏమిటో చూస్తామా.

రబ్బరులో సహజ రబ్బరు (Natural Rubber), కృత్రిమ రబ్బరు (Artificial Rubber) అని రెండు రకాలు వున్నాయి. సహజరబ్బరును గం రబ్బరు (Gum Rubber)అని, కృత్రిమ రబ్బరును సింథటిక్ రబ్బరు (Synthetic Rubber)అని అంటారు. సహజ రబ్బరును రబ్బరు చెట్ల నుండి సేకరించి తయారుచేస్తారు. దీనిని ఇండియా రబ్బరు లేక కట్చక్ (Cautchouc) అని అంటారు.

mar016.jpg

ఈ ఫోర్బియేసియో (Euphorbraceae) కుటుంబానికి చెందిన హెూవియోబ్రాసిలెన్సిస్ (Hevea brasiliensis) శాస్త్రీయనామం కల పారరబ్బరు చెట్టు లేక షారింగా చెట్టు నుండి రబ్బరు పాలను (latex) సేకరిస్తారు. ఈ పాల నుండి రబ్బరు తయారుచేస్తారు. ఈ విధానాన్ని అంచెలంచెలుగా తెలుసుకుందాం.

పారా రబ్బరు చెట్లు తొలినాళ్లలో అమెజాన్ వర్షాధార అడవులలో మాత్రమే పెరిగేవి. క్రీ.శ. 1839లో వల్కనైజేషన్(రబ్బరు, గంధకం(సల్ఫర్)తో వేడి చేయుట) విధానము కనుగొన్న తరువాత రబ్బరు వాడకం పెరిగి రబ్బరు చెట్ల తోటల పెంపకం మొదలైంది. 1770లో ఇంగ్లండులో జోసెఫ్ ప్రిస్టీ రబ్బరు ముక్క పెన్సిల్ గీతలను చక్కగా చెరిపి వేయడానికి (To rub) ఉపయోగపడుతుందని కనుగొన్నాడు. అందుకే దానిపేరు రబ్బరుగా స్థిరపడింది. 1876లో పారా రబ్బరు యొక్క విత్తనాలు ఇండియా, సిలోన్ (నేటి శ్రీలంక), ఇండోనేషియా, సింగపూర్, బ్రిటిష్మలయా (నేటి మలేషియా) దేశాలకు పంపబడ్డాయి. మలేషియా రబ్బరు తోటల పెంపకంలో మొదటి స్థానాన్ని పొందింది. 1876లో భారతదేశంలో బొటానికల్ గార్డన్, కలకత్తాలోను తరువాత 1902లో కేరళలోని తట్టెకాడు'లో రబ్బరు చెట్ట పెంపకం ప్రారంభమైంది.

mar018.jpgరబ్బరు పంట: రబ్బరు చెట్టు నాటినప్పటినుండి పెరిగి 7 సంవత్సరాల తరువాత రబ్బరుపాలను 25 సంవత్సరాలపాటు ఇస్తుంది. రబ్బరు తోటల పెంపకం కోసం సెటిమెంటరీ ఎర్రటి (alluvial) నేల కావాలి. వర్షపాతం సంవత్సరంలో 250 సెం.మీ. మేరకు వుంటూ వాన 100 రోజులలో వుండాలి. ఉష్ణోగ్రత 20° సెంటీగ్రేట్ నుండి 40 సెంటీగ్రేడు వరకు మాత్రమే వుండాలి. గాలిలో తేమ 80% (humidity) వుండాలి. ప్రతిరోజు 6 గంటల పాటు ఎండపడుతూ వుండాలి. బలమైన గాలులు వీచకూడదు. పై విధంగా వాతావరణం అనుకూలంగా వుంటే రబ్బరు తోటలు బాగా పెరుగుతాయి. వీటితోపాటు అధిక దిగుబడిని ఇచ్చే రబ్బరు వంగడాల పెంపకం వలన ఒక సంవత్సరంలో ఒక హెక్టారుకు 2000 కిలోగ్రాముల రబ్బరు దిగుబడి అవుతుంది.

రబ్బరు చెట్ల నుండి పాలను (latex) సేకరిస్తారని తెలుసుకున్నాం కదా. ఈ పాల సేకరణ కోసం రబ్బరు చెట్టుకాండంపై బెరడుకు గాటు పెట్టి ఆ రంధ్రం దగర కలబంద ఆకును తూములాగా అమర్చి దానిక్రింద ఓ కుండను చెట్టు కాండానికి కట్టి గాటు గుండా కారే రబ్బరు పాలను సేకరిస్తారు. ఈ విధానాన్ని టాపింగ్ (tapping) అంటారు. కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కువ కనుక కొబ్బరి చిప్పలను ఈ పాల సేకరణకు వాడుతారు. గాటు పెట్టిన 4 గంటల పాటు రబ్బరుపాలు చిప్పలోకి కారుతుంది. తరువాత రబ్బరు కారే చోట గడ్డకట్టి (coagulates) కారేపాలను అవుతుంది. అంటే కొంత రబ్బరు పాలు చిప్పలో, కొంత చెట్టుపై గట్టకట్టి, కొంత పాలు క్రింద కారినేలపై గడ్డకడుతుంది. ఈ మూడింటిని సేకరించి శుద్ధిచేయడానికి పంపుతారు. రబ్బరుపాలు చిప్పలలో పూర్తిగా గడ్డకట్టే లోపల ఫ్యాక్టరీకి పంపుతారు. దీనికై రబ్బరు పాలను గంధకం (sulfur), పెరాక్సైడ్ లేక బిస్పెల్ (Bisphenol) తో కలిపి కొయాగులేషల్ టాంకులలో రవాణా చేస్తారు. దీని వలన రబ్బరు వెంటనే గడ్డకుండా రబ్బరు వెంటనే గడ్డకట్టకుండా వుంటుంది.

రబ్బరు చెట్లు దట్టమైన అడవులలో 100 అడుగులు (30 మీ) ఎత్తుకు పెరుగుతాయి. పాలకోసం చెట్టు బెరడుపై ఏటవాలుగా (క్షితజ సమాంతరానికి 30° కోణంలో) గాట్లు పెడతారు. రబ్బరు తోటలలో మాత్రం ఈ చెట్లను 78 అడుగులు (24 మీ.) ఎత్తుకు మాత్రమే పెంచుతారు. చెట్ల వయస్సు పెరిగేకొద్దీ పాల దిగుబడి పెరుగుతూ వుంటుంది. రబ్బరు చెట్లకు అధిక వర్షపాతం వుండాలి కానీ గాలిలో తేమశాతం తక్కువగా వుండాలి. (without frost) వేడి ఎక్కువ అయితే రబ్బరు బిగుసుకుని పగిలిపోతుంది.

రబ్బరు లక్షణాలు: రబ్బరుపాలు బంకబంకగా పాలరంగులో వుంటుంది. దీనిని శుభ్రపరచి (refining) వ్యాపార వినియోగం కోసం రవాణా చేస్తారు. రబ్బరు పక్క సహజగుణాలైన సాగతీత (Stretch Ratio) ఇతిస్థాపకత Silence నీవలన తడవకపోవడం (water proof) లాంటి లక్షణాల వలన రబ్బరును అనేక రంగాలలో అనేక విధాలుగా వేరుగా లేక ఇతర పదార్థాలతో కలిపి వాడుతారు. రక్ష్బారు ప్రత్యేకమైన (physical) రసాయన (chemical)లక్షణాలను కలిగి వుంది. ఇది ప్రతిచర్య-వికృతి (Stress-Strain) లక్షణాలు, మల్లిన్స్ ఫలితం (Muslims effect) లను చూపిస్తుంది. దీనిలో గల ద్విబంధనం (double bond) వలన వనైజేషన్ సులభంగా చేయవచ్చును.

కానీ దీనివల్లనే ఓజోన్ (Ozone) పొరను దెబ్బతీసే లక్షణం కూడా రబ్బరు కలిగివుంది. టర్పంటైన్, (Petrolium) లలో రబ్బరు కరుగుతుంది. రబ్బరుపాలు కోయాగులేషిన్ చెందకుండా అమ్మోనియా ద్రావణాన్ని కలుపుతారు.

స్థితిస్థాపకత (Elasticity): రబ్బరు స్థితిస్థాపక లక్షణాలను కలిగి వుంది కదా. కాబట్టి రబ్బరును ఎలాస్టిక్ గా తయారుచేసి వస్త్రపరిశ్రమలో ఎక్కువగా వాడుతారు. లోహప్రింగులలో (స్థితిస్థాపకత కలిగినవాటిలో) బలాన్ని ఉపయోగిస్తే వాటి అణువుల మధ్య బంధనం సాగబడి శక్తి అంతా స్థిరవిద్యుత్తు రూపంలో (Electrostatical) నిలువ వుంటుంది. కానీ రబ్బరులో స్థితిస్థాపకత ఉష్ణశక్తిగా నిలువవుంచబడుతుంది. రబ్బరు త్వరగా పాడుకాకుండా వుండేందుకు, ఎలాస్టిక్ లక్షణాలను పెంచేందుకు, గంధకంలో కలిపి వేడి చేస్తారు. రెండవ పంచయుద్దంకు ముందు వాహనాల టైర్లకు "ఒరబ్బరును వాడేవారు. ప్రస్తుతం అన్ని రకాల టైర్ల చరీకి సింథటిక్ రబ్బరు (కృత్రిమమైన)ను పాడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 25 మిలియన్ టన్నుల రబ్బరు తయారవుతోంది. ఇందులో 42% సహజరబ్బరు (చెట్ల నుండి తీసినది) మిగిలిన 52% సింథటిక్ రబ్బరు (కృత్రిమ రబ్బరు), మేలిరకమైన రబ్బరును డాక్టర్లు వాడే చేతి తొడుగులు (గ్లాసులు), బుడగలు(బెలూన్లు) మరియు ఇతర ఖరీదైన వస్తువుల తయారీకి వాడుతారు.

సహజ రబ్బరు పాలలో ఆర్సినిక్ సంయోగ పదార్థమైన ఐసోప్రిన్ (Isoprene) యొక్క పాలిమర్స్, ఇతర మలినాలు, నీరు వుంటుంది. ఇతర రకాలైన కొన్ని చెట్లు కూడా రబ్బరు పాలను ఇస్తాయి. కానీ వాటి సేకరణ పారా రబ్బరు చెట్ల అంత సులభం కాదు. అవది గుట్ట పెర్చా (palaquin gutta), పనామా రబ్బరు (Castilla elestica) చెట్టు మొదలైనవి.

రబ్బరు వలన అనేక విధాలుగా లాభాలు వున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా వున్నాయి. రబ్బరు టైర్లు రోడ్లపై వేగంగా పరుగెడుతున్నపుడ మరియు బ్రేకులు వేసినపుడు టైర్లు తిరిగి రబ్బరుదుమ్ము (Rubber dust) గాలిలో కలుస్తోంది. ఎక్కువ రద్దీగా రోజుకు 25000 వాహనాలు తిరిగే రోడ్డులో రోజుకు కిలోమీటరుకు దాదాపు 8 కిలోగ్రాముల రబ్బరు దుమ్ము తయారవుతోంది. ఈ దుమ్ములో ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలు వున్నాయి. ఇవి నీటిలో నివసించే జలచరాలకు చాలా ప్రమాదకారి. మరియు మనము వీటిని పీల్చినపుడు ఊపిరితిత్తులలో చేరి చాలా జబ్బుకు కారణం అవుతోంది.

అలాగే రబ్బరు టైర్లను కాల్చడం చాలా ప్రమాదం. రోడ్లపై రకరకాల కారణాల వలన రబ్బరుబైర్లను కాల్చుతున్నారు. పర్యావరణంపై మక్కువ వున్నవారు దీనిని అరికట్టాలి. భోగి మంటలలో రబ్బరు వస్తువులను కాల్చకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి.

ఆధారం: యుగంధర్ బాబు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate