పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రేడాన్ (Rn)

పిల్లలూ మనం ఆవర్తన పట్టికలోని ఆరవ పీరియడ్ లోని చివరి మూలకం గూర్చి తెల్సుకుందామా. ఈ మాలకం పేరు రేడాన్. దీని సంకేతం Rn. ఇది ఆవర్తన పట్టికలో ఆరవ పీరియడ్ లోనూ మరియు “O” గ్రూపులోను వుంటుంది. ఈ గ్రూపు మూలకాలన్నింటిని కలిపి జడవాయు మూలకాలు లేదా ఉత్కృష్ఠ వాయు మూలకాలు అంటారు. ఈ గ్రూపులోని రేడాన్ తో సహా అన్ని మూలకాలు కూడ వాయువులే. కాకపోతే రేడాన్ మాత్రము రేడియోధార్మికతను ప్రదర్శించును. ఈ గ్రూపు మూలకాలను జడవాయు మూలకాలు అని అనడానికి కారణం ఇవి రసాయన చర్యలలో పాల్గొనకపోవడమే కాని ఇప్పుడు ఈ గ్రూపులోని కొన్ని మూలకాలు ఆర్గాన్ మరియు జీనాన్ రసాయన చర్యలలో పాల్గొని అనేక సమ్మేళనాలను ఏర్పరుచుచున్నవి. కాబట్టి ఈ గ్రూపులోని కొన్ని మూలకాలు జడవాయు మూలకాలకు బదులుగా ఉత్కృష్ఠ వాయు మూలకాలు అనడం సరియైనది.

1785 సం.లో కావెండ్ శాస్త్రవేత్త ఈ గ్రూపుమూలకాలు గాలిలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ తో పాటు కలిసి యుంటాయని తెలిపెను. ఈ గ్రూపుమూలకాలను గాలి నుండి వేరు చేసిన శాస్త్రవేత్తలు మరియు రేడాన్ మూలకాన్ని 1902 సం.లో రూథర్ ఫర్డ్ మరియు సోడి శాస్త్రవేత్త మొదటి సారిగా గుర్తించి రేడాన్ అని నామకరణం చేసినారు. ఈ మూలకం పరమాణు సంఖ్య 86. వాలెన్సి ఎలక్ట్రాన్ విన్యాసం 6S2 6P6. ఈ గ్రూపుమూలకాలన్ని తమ బాహ్య కర్పరం 8 ఎలక్ట్రానులతో నిండి యుండడం ద్వారా ఆక్టెట్ సిద్ధాంతాన్ని పాటించి స్థిరత్వాన్ని పొందియున్నది. ఈ మూలకం రేడియోధార్మిక ధర్మాలను ప్రదర్శించును. కాబట్టి దీనికి స్థిరత్వం తక్కువ దీని అర్దాయువు 3.824 రోజులు ఒక గ్రాము Ra 226 30 రోజులలో విఘటనం చెంది 0.64 సెంమీ3 రేడాన్ ను ఏర్పరుచును. ఈ మూలకానికి ఒకటే సమస్థానీయం కలదు. దీని పరమాణుభారం 222. ఇది గాలిలో నామ మాత్రంగా యుంటుంది. కాని భూపటలంలో 1.7x10-10 పిపియం వరకు యుంటుంది. దీని ప్రథమ అయనీకరణ శక్యము విలువ 1037 కిలోజౌల్స్ / వెశాలు). దీని కరుగు ఉష్ట్రోగ్రత -62ºC మరియు మరుగు ఉష్ట్రోగ్రత -71ºC. సాంద్రత 9.73 మి.గ్రా,, సెంమీ.-3 ఈ మూలకంను క్యాన్సర్ వ్యాధి నివారణలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మూలకం జడవాయు మూలకం మరియు రేడియో ధార్మిక మూలకం కాబట్టి దీని యొక్క రసాయన సమ్మేళనాలు అసలు లేవని చెప్పవచ్చు.

రచయిత: డా. కె, లక్ష్మారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్.ఐ.టి.వరంగల్.

2.99774266366
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు