অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విజ్ఞాన శాస్త్రంలో భారతదేశ ప్రగతి

విజ్ఞాన శాస్త్రంలో భారతదేశ ప్రగతి

హేలీ : ప్రొఫెసర్ గారూ, మిమ్మల్ని చాలా రోజులుగా ఒక ప్రశ్న అడగాలుకొంటూ ఉన్నాను.

రమా : తప్పకుండా అడగవయ్యా. పరిశోధక విధ్యార్థిగా అది నీ హక్కు.

సతీష్ : మనం ఎందుకు విజ్ఞాన శాస్త్ర పరంగా వెనకబడ్డాం సార్?

రమా: చాలా పొరబాటు, మనం ఎందుకు, ఎలా విజ్ఞానశాస్త్ర పరంగా వెనుకబడ్డా? చెప్పు!

హేలీ : ఐతే, మనం ప్రగతిపథంలో నడుస్తున్నామా అండీ?

రమా : ఔను. అంతర్జాతీయంగా నేడు వైజ్ఞానిక రంగంలో భారతీయులు ఎన్నో విజయ కేతనాలు ఎగురవేస్తున్నారు. ఐతే, భారతదేసంలోనే ఉంటూ పరిశోధనలు చేస్తున్నవారు ఎన్నో రంగాల్లో ఉన్నారు. రాణిస్తున్నారు కూడా. స్వాతంత్ర్యం వచ్చి 64 ఏళ్లైంది. ఈ 64 వసంతాల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. నీకు తెలియదా?

హేలీ : ధాంక్స్ సార్. సార్ 1933లో ఎప్పుడో ఎఫ్ఎం రెడియో సౌకర్యం వస్తే, మన దేశానికి అది రావడానికి దాదాపు 44 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రగతి అంటే నవ్వు వస్తోంది.

రమా : కొంతవరకు నీ మాట కరెక్టే. అది గతం. ఇప్పుడు ఎలాంటి పరిజ్ఞానమైనా అన్నీ దేశాలతో సమానంగా ఇండియాలోనూ ఒకే సమయంలో ప్రవేశ పెడుతున్నారు.

సతీష్ : సార్, ఈ స్నాక్స్ కొత్తగా జొన్నతో చేశారట. అక్కడ ఎవరో ఫ్రీ శాంపిల్ ఇచ్చారు.

రమా : అరె. ఇది మన వాళ్లు కనిపెట్టిందేనయ్యా. చెరకు జొన్న రకంతో తయారైన స్నాక్స్. ఆరోగ్యానికి మంచిది కూడా.

హేలీ : సార్, ఈ చెరకు జొన్న ఏంటి?

j1రమా : ఇది జొన్నలో ఒక రకం. హైద్రాబాదులో ఈ చెరకు జొన్నపై పరిశోధనా సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ చెరకు జొన్నలో ఎన్నో పోషక విలువలున్నాయనీ కనుక్కొంది. అంతేకాదు, చెరకుతో కన్నా దీంతో తయారయ్యే బెల్లం మంచిది. దీనినించి ఎథనాల్ ఇంధనాన్ని కూడా తయారు చేయచ్చని కనుగొన్నాడు.

సతీష్ : బయో ఇంధనంగా పనికొస్తుందన్న మాట.

హేలీ : సార్, మరి జట్రోపా, పొంగామియా చెట్లనుండీ బయో ఇంధనం తయారు చెయవచ్చు. ఇందులో ఏది సరైన ఇంధనం?

రమా : ఐట్రోపా పెంపకం, కాల వ్యవధి – ఇవన్నీ కొంత సమస్యగా ఉంది. పొంగామియా అంటే కానుగ చెట్టు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఐతే, వీటన్నింటికన్నా చెరకుజొన్నలో ప్రయోజనాలు ఆశాజనకంగా ఉన్నాయి.

హేలీ : సార్, నెషనల్ ఇన్య్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎలాంటి పరిశోధనలు చేశారు?

రమా : ఆ సంస్థ ఆరంభించి దాదాపు 90 ఏళ్ల పైమాటే. దాదాపు 580 భారతీయ వంటకాల్లో ఎలాంటి పోషక విలువలున్నాయో పరిశోధించి తెలియజేసింది. పోషక విలువ గురించి ఇంకా ఎన్నో పరిశోధనలు చేస్తోంది.

సతీష్ : వ్యవసాయ రంగంలో పరిశోధనలు జరుగుతున్నాయి కదా. దాదాపు 33 ప్రధానమైన పంటల డిఎన్ఎ లను గుర్తించారని చదివాను. నిజమా?

రమా : ఆ నిజమే. 2215 రకాలకు, భూజాతులకూ కూడా డిఎన్ఎ ప్రింటింగ్ చేశారు మన భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు. గత 15 ఏళ్లలో ఎన్నో నాణ్యమైన కొత్త వంగడాలను కూడా సృష్టించారు.

హేలీ : సార్, ఔషధీయ మెక్కల గురించి కూడా పరిశోధనలు జరిగాయా?

రమా : జరిగాయి. జరుగుతున్నాయి. దాదాపు 300 పైచిలుకు మిశ్రమాలను 461 మొక్కల సారాలను తయారుచేసి పేరు పొందారు మనవాళ్లు.

సతీష్ : సారాలంటే... ?

రమా : ఆ... సారా కాదు, సారం. వీటిల్లో 90కి పైగా ఔషధీయ, సుగంధ సంబంధ మెక్కలనించి తీశారు. వాటికి వైద్య, కాస్మెటిక్ ఉత్పత్తుల్లో మంచి గిరాకీ ఉంది. అలాగే 118 మోక్కల సజీవ జీన్ బ్యాంక్ ని నిర్వహిస్తున్నారు.

హేలీ : ఈ పరిశోధనా సంస్థలన్నీ ప్రభుత్వ రంగానికి చెందినవేనా... ?

రమా : అవును కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఆండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చీ – సిఎస్ఐఆర్ కింద ఈ సంస్థలన్నీ పనిచేస్తున్నాయి.

సతీష్ : స్టెమ్ సెల్, జీన్స్ వంటి అంశాల్లో కూడా మనవాళ్లు పరిశోధనలు సాగిస్తున్నారా?

రమా : సిఎస్ఐఆర్ అనుబంధంగా పనిచేసే 40 పరిశోధనశాలల్లో సెంటర్ ఫర్ సెల్యూలర్ ఆండ్ మాలిక్యూలర్ బయాలజీ అనే సంస్థ. జీనోం విశ్లేషణ, ప్రోటీన్, న్యూక్లిక్ యాసిడ్ పరంపర విశ్లేషణ – ఇలా కీలకమైన అంశాలపై పరిశోధనలు చేస్తోంది. గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నాయి.

సతీష్ : మరి ఇవి సఫలమవుతే క్యాన్సర్, పెచ్ఐవిలకు చికిత్సలు సుగమం అవుతాయి.

హేలీ : (ఆశ్చర్యంగా) ఔనా సార్? 40 పరిశోధనాలయాలున్నాయా?

రమా : ఔను... దేశంలోని సహజ వనరులను ఉత్పత్తులను గుర్తించడం, కొత్త పద్ధతులను కనుక్కోవడం, నిర్వహించడం – ఇవి ఈ పరిశోధనాశాలల లక్ష్యాలు.

సతీష్ : సాగర గర్భంలో ఎన్నో వనరులున్నాయంటారు, మరి ఆ రంగంలో మనవాళ్లే చేస్తున్నారు?

రమా : దార్లోకొస్తున్నావయ్యా... ఆ పని మన శాస్త్రవేత్తలు ఎప్పుడో ఆరంభించారు. సాగర కన్య, సాగర సంపద వంటి పరిశోధనాత్మక నౌకలు ఈ పనుల్లోనే ఉంది.

హేలీ : బయోటెక్నాలజీ, ఓషనోగ్రాఫీలలో ఇంత చక్కని పరిశోధనలు జరుగుతున్నాయి. మరండీ భూగర్భ సంబంధ వనరుల గురించి ఎవరూ పరశోధనలు చేయడం లేదా?

రమా : ఎందుకు లేదూ, చేస్తున్నారు. నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చి సంస్త పనే అదైతేనూ.

సతీష్ : ఈ సంస్థ వైజ్ఞానికులు అంటార్టికాలో పరిశోధనలు చేస్తున్నారని చదివాను.

రమా : అక్కడికి ఎవరూ వెళ్లలేరని ప్రపంచమంతా భావించే వేళ, మనవాళ్లు వెళ్లడమే కాదు, అక్కడ శాశ్వత ప్రాతిపదికపై ఒక పరిశోధనాకేంద్రాన్నే స్థాపించారు.

హేలీ : గంట సేపు ఎంత వేగంగా గడిచిపోయిందో, కదా సతీష్.

సతీష్ : ఔనూ.

రమా : అదుగో ప్రొఫెసర్ ఉమాశంకర్ గారూ. పక్కనే వారి స్టూడెంట్లా ఉంది. హల్లో ప్రొఫెసర్. ఎన్నో రోజులైంది మిమ్మల్ని చూసి.

కొత్త వ్యక్తి : నమస్తే. నా పేరు జాన్ పీటర్. జాన్ అంటారంతా.

రమా : (ఆశ్చర్యంగా) ఈ అబ్బాయి ఎవ్వరండీ?

ఉమా : ఓ చెప్పలేదు కదూ యూఎస్ లో మా ప్రొఫెసర్ శర్మగారు తెలుసుగా. ఆయన పంపితే, ఇక్కడ రీసెర్చి కోసం వచ్చాడు. నాతో ఉండటానికని తెలుగు కూడ నేర్చుకున్నాడు.

రమా : (నవ్వుతూ) మీరెంత గొప్పవీరైనా తెలుగు వచ్చి ఉండాలని షరత్తు పెట్టారన్నమాట. ప్రొఫెసర్ మావాళ్లిద్దరూ ఇండియాలో అణురంగం, ఉపగ్రహాలు, రాకెట్ల అంతరిక్షరంగంలో ఎలాంటి ప్రగతిని సాధించామో తెలుసుకోవాలని కుతూహల పడుతున్నారు.

ఉమా : ఓ సరిగ్గా ఇదే జాన్ కూడా ఇందాక విమానం దిగుతుంటే అడిగాడు. గెస్ట్ హౌస్ కెళ్లి కాస్త రిఫ్రెష్ అయి చర్చిద్దాం.

ఉమా : అప్పటికీ ప్పటికీ దేశంలో ఎన్ని మార్పులొచ్చాయో కదూ. అసలు ఆ ఆసియా క్రీడల తర్వాతే దేశంలో రంగుల టీవీ ప్రసారాలూ, టెలికాం రంగంలో అభివృద్ధి అన్నీ వచ్చాయి.

రమా : ఔనండీ, నేడు ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్ ద్వారా సౌకర్యాలు, విడియో కాన్ఫెరెన్సింగ్, శాటిలైట్ టీవీ సౌకర్యాలు – ఇలా ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి.

ఉమా : నేడు మన టెలుకాం వ్యవస్థ ప్రపంచంలోకల్లా పెద్ద వ్యవస్థలో 7వది. అసలు 1980 దశకం ఈ రంగంలో విప్లవాక్మకమైన మార్పులను తెచ్చింది. గుర్తుందా కాంత్, 1984లో సెంటర్ ఫర్ డెవలెప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ఆరంభించారు.

హేలీ : ఆ సంస్థ వల్లే నేడు సుదూర గ్రామాల్లో కూడా టెలికాం సేవలున్నాయంటారు గదండీ?

ఉమా : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గ్రామీణ తెలిఫోన్ ఎక్స్ఛెంజీలను తయారుజేశారు. అసలు చెప్పాలంటే, నేడు ప్రపంచంలోకెల్లా అతి చవకగా టెలికాం సేవలు మనదేశంలోనే లభిస్తున్నాయి.

సతీష్ : (ఆశ్చర్యంగా)ఔనండీ?

రమా : ఔను అసలు మన దేశంలో నేడు ఫైబర్ ఆఫ్టిక్స్, వయర్లెస్ వైఫై, త్రీజి – ఏ పరిజ్ఞానం లేదూ, అన్నీ ఉన్నాయి. అన్నింటినీ సమర్తవంతంగా వాడుకొంటున్నాము కూడా.

జాన్ : సర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్న మాటలు గుర్తొస్తున్నాయి... “ఇండియాకు టెక్నాలజీయే బలం! బలవంతులు బలవంతుల్ని మాత్రమే గుర్తిస్తారు, గౌరవిస్తారు!” అని ఒక సందంర్భంలో అన్నారు. ఇదిగో, నా డైరీలోను రాసుకున్నా.

రమా : శర్మగారు నిజంగా గొప్ప విద్యార్తిని పంపారండీ...

జాన్ : వీరు మా ప్రొఫెసర్ శర్మగారికి ఆప్తులు. ఆ మద్య ఒక కాన్ఫెరెన్స్ కు ఆయన యుఎస్ రావడం నన్ను మా ప్రొఫెసర్ పరిచయం చేయడం జరిగింది. నేను మాటల్లో ఇండియాలో పరిశోధన చేయాలనుందని చెప్పా. దానికోసం తెలుగు నేర్చుకున్నా.

సతీష్ : గ్రేట్, జాన్, నీ శ్రద్ధకు మా జేజేలు. ఇంతకూ నీ రిసెర్చ్ ఇంట్రెస్ట్ ఏమిటి?

జాన్ : అంతరిక్ష రంగం. కాని అణురంగం మక్కువ.

ఉమా : ఐతే, మంచిది. అణు రంగం, అంతరిక్ష రంగం – ఈ రెండిటిలో భారత్ ప్రగతి గురించి తెప్పాలి. అంతే కదూ...

రమా : ఔన్సార్, ఆ రెండు విషయాలు మీరైతేనే బాగా వివరిస్తారని నా నమ్మకం.

సతీష్ : కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశ పెట్టాలనే ఆలోచన ఎవరిది సార్?

ఉమా : జాన్ అసలు 1869 లో కదూ తొలి ఫిక్షన్ వచ్చింది...

జాన్ : ఎడ్వర్డ్ ఎవెరెట్ హేలీ అనే రచయిత ;ది బ్రిక్ మూన్; అనే నవలలో తొలిసారి ఉపగ్రగాలను ప్రస్తావించాడు. దాని తర్వాత జూల్సవెర్న్ 1879లో ‘బేగమ్స్ విలియమ్స్’ అనే రచనలో చెప్పాడు. ఆ త్రావత 1945లో ఆర్థరే క్లార్క్ ఒకానొక రచనలో మాస్ కమ్యూనికేషన్లకు మానవులు శాటిలైట్లను ప్రయోగిస్తారని రాశాడు.

సతీఫ్ : జాన్, నీవు చాలా విషయాలు సేకరించావే.

3ఉమా : జాన్ చాలా పొందికైన మాటల్లో చెప్పాడు. ఆ రచయితల కలలకు నాటి సోవియట్ రష్యా రూపాన్నిచ్చింది. స్పుత్నిక్-1 రష్యా ప్రయోగించిన తొలి ఉపగ్రహం. 2007 నాటికి రష్యా దాదాపు 1398 హేలోడ్స్ ను ప్రయోగించింది. ఆ తర్వాత అమెరికా రకరకాల ఉపగ్రహాలను ప్రయోగించింది. 2007 నాటికి 1042 పేలోడ్స్ ప్రయోగించింది.

రమా : మన దేశం 1975లో ఆర్యభట్ట అనే తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

ఉమా : ఔను. నేటికి మన దేశం 34 పేలోడ్స్ ని కక్ష్యలో ఉంచింది.

హేలీ : సార్, మన దేశంలో ఈ అంతరి5 కార్యక్రమాలు ఎలా మెదలయ్యాయి?

ఉమా : బారతీయ అంతరిక్ష కార్యక్రమాలకు స్పూర్తిదాత డాక్టర్ విక్రం సారాబాయ్. టీవిని వాడి ప్రజలను విద్యావంతులుగా చేయవచ్చని ఆనాడే చెప్పాడు. 1966 ప్రాంతాల్లో నాసాలో కలిసి వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడాయన. ఆయన వల్లే ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ – ఇస్రో ఏర్పడింది.

జాన్ : సర్, ఆ తర్వాతే కదా, ఇస్రో ఇన్శాట్ వ్యవస్థకు రూపకల్పన చేసింది...

ఉమా : ఔనయ్యా, 1970 లో ఇన్శాట్-1 సిరీస్ రూపకల్పనలో అమెరికా సాయం చేసింది. 1972లో పూనె దగ్గర ఒక భూ కేంద్రాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు.

సతీష్ : అంటే, ఆ తర్వాత 1975లో ఆర్యభట్టను ప్రయోగించారన్నమాట. దీనిని ఎక్కడనించి ప్రయోగించారు సార్?

రమా : ఆర్యభట్ట ప్రయోగానికి నాటి సోవియట్ రష్యా సాయం చేసింది. మన ప్రాచీన ఖగోళ, గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరుతో ప్రయోగించిన ఈ ఉపగ్రహం బరువు 360 కిలోలు.

హేలీ : చాలా బరువే. దాని తర్వాత ఏమైంది?

ఉమా : ఆర్యభట్ట విజయవంతంగా ప్రయోగించాక, 1979లో భాస్కర-1 అనే దాన్నీ, 1981లో భాస్కర-2 అనే దాన్ని, 1980లో ఎస్.ఎల్.వి రాకెట్ ని ప్రయోగించారు. అన్నీ విజయవంతమయ్యాయి.

జాన్ : సర్, 1981లో ఆపిల్ ఉపగ్రహాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సాయంతో ప్రయోగించారు కదా?

సతీష్ : ఆపిల్ అంటే... ?

ఉమా : (నవ్వి) ఏరియానే పాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనడానికి క్లుప్తంగా ఎపిపిఎల్ఇ అన్నారు. దీన్ని బరువు 672 కిలోలు. దీని విడయం ఇన్శాట్-2 రూపకల్పనకు స్పూర్తినిచ్చింది.

జాన్ : సర్, ఇన్శాట్-1 అంటే ఒకటో తరం ఉపగ్రహాలలో ఏబిసిడి అని నాలుగు పంపారు కదండీ.

ఉమా : ఔను. వాటిలో 1ఏ, 1డి అనేవి విఫలమయయ్యి. ఆ తర్వాత రెండోతరం, అంటే ఇన్శాట్-2 సీరిస్ లో ఏ, బి, సి, డి, ఇ అని 5 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. వీటిలో 2డి అనేది విఫలమయ్యింది. ఆ తర్వాత 3 సిరీస్ ఆరంభమయ్యింది.

రమా : సర్, 2-ఏ కూడా అనుకొన్న దానికన్నా కన్నా తక్కువ రోజులే పని చేసింది కదా.

హేలీ : అంటే వీటికి కాల వ్యవధి ముందే నిర్మయిస్తారాండీ?

ఉమా : ఔను ఇన్శాట్-1 కాల పరిమిటి 7 ఏళ్లు, అదే ఇన్సాట్-3 జీవిత కాలాన్ని 10 ఏళ్లుగా నిర్దారించారు.

జాన్ : సర్, సతీష్ దావన్ గారి గిరించి చెప్పనేలేదు.

ఉమా : సరిగ్గా గుర్తిచేశావయ్యా, విక్రం సారాభాయ్, సతీష్ ధావన్ – వీళ్లిద్దరూ మన దేశ అంతరి7 కార్యక్రమానికి మూల స్థంభాల్లాంటి వారు.

రమా : సర్, అబ్దుల్ కలాం, రొడ్డాం నరసింహ, యువిరావు, కస్తూరి రంగన్ వంటి ఎందరినో సతీష్ ధావన్ దుర్తించి వెలికితెచ్చాడంటారు?

ఉమా : ఔను. నిజమే. ఎంతో గొప్పవాళ్లు గనకే, అటు తిరువనంతపురంలోని కేంద్రానికి విక్రం సారాభాయ్ పేరూ, ఇటు శ్రీహరి కోటలోని కేంద్రానికి సతీష్ ధావన్ పేరూ పెట్టారు.

హేలీ : సర్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలంటే ఏమిటి?

ఉమా : దేశంలో ఉండే భూగర్భ, జల, హరిత, ఖనిజ వనరులను గుర్తించేందుకు ప్రయోగించారు. వీటినే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లనీ, ఐఆర్స్ అనీ అంటారు.

రమా : సర్, రోహిణి అనే దాన్ని కూడా ప్రయోగించారు కదా.

ఉమా : ఔను, 150 కిలోల బరువుండే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం గల ఏ.ఎస్.ఎల్.వి అనే లాంచింగ్ రాకెట్ లను ఇండియా తయారు చేసింది. 1994లో అలాంటి ఏ.ఎస్.ఎల్.వి తోనే ఈ రోహిణిని ప్రయోగించారు. అది విడయవంతమైంది కూడా.

సతీష్ : సర్, మరి పి.ఎస్.ఎల్.వి అంటే ఏమిటి, ఎప్పుడు ప్రయోగించారు?

2జాన్ : పి.ఎస్.ఎల్.వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని అర్థం. ఇది 1994లోనే రూపుద్ద్దుకుంది. దీంతో 800 కిలోల ఐఆర్ఎస్-పి2 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఆ తర్వాత 2001లో బెల్జియంకు, చెందిన ప్రోబా, జర్మనీకి చెందిన బిరా అనే ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో.

ఉమా : ఔను. కరెక్ట్ గా చెప్పాడు జాన్.

హేలీ : అంటే 2001 నుంచి వేరే దేశాల ఉపగ్రహాలను కక్ష్యలోకి పెట్టే స్థాయికెదిగామన్నమాట.

ఉమా : ఔను. అసలు 1994లో ఐఆర్న్ ఉపగ్రహాన్ని లాంచ్ చేయడంతోనే ప్రపంచంలో మనదేశం టాప్ 6 దేశాల్లో ఒకటిగా నమోదయ్యింది.

రమా : ప్రొఫెసర్, ఈ ఐఆర్ఎస్ తీసిన చాయాచిత్రాలు ఎంతో నాణ్యతతో ఉండడంతో పలుదేశాలు వారి దేశానికి సంబంధించిన ఛాయాచిత్రాలు మననుంచి కొనుక్కుంటున్నాయి.

ఉమా : నిజమే. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏడెన్సీ అనేది భారత ప్రభుత్వ సంస్థ. ఇది రిమోట్ సెన్సింగ్ రంగంలో గణనయమైన ప్రగతిని సాధించింది. ఉపగ్రహాలు అందించే ఛాయాచిత్రాలను శోధించి, వర్గీకరించి, దానికి విలువైన సమాచారాన్ని జోడించి అవసరమైన రీతిలో విలువైన సమాచారాన్నిస్తోంది.

సతీష్ : సార్, మన దేశంలో అంతరిక్ష పరిశోధన లెక్కడెక్కడ జరుగుతున్నాయి?

జాన్ : నే చెబుతాను. అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చీ లాబొరెటరీలో, తరువనంతపురంలోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీలోను జరుగుతున్నాయి. ఇస్రో సంస్థకు చెందిన ఉపగ్రహ కేంద్రం బెంగళూరులో, రాకెట్ లాంచింగ్ సౌకర్యం శ్రీహరికోటలోను ఉన్నాయి.

ఉమా : తిరుపతి సమీపంలో రాడార్ కేంద్రం ఉంది.

జాన్ : ఆ రాడార్ కేంద్రం కూడా అంతరిక్ష పరిశోధనల్లో కీలకమని చెప్పవచ్చు.

రమా : ప్రొఫెసర్, ఏమైనా చెప్పండి. డాన్ చక్కని విద్యార్థి.

సతీష్ : సార్ చంద్రయాన్ ఎందుకు? అమెరికా, రశ్యా లాంటి దేశాలే చంద్రమండల ప్రయోగాలను కొనసాగించడం లేదు కదా.

ఉమా : మంచి ప్రశ్న. చంద్రయాన్-1 గురించిన ప్రస్తావన తెచ్చావ్. చంద్రుడి పైకి పంపిన భారతీయ నౌక చంద్రయాన్-1.

రమా : ఇప్పటికీ అమెరికా 360 కిలోల పైగా చంద్రుడినించి రాళ్లు తెచ్చి ప్రయోగలు సాగిస్తున్నాయి కదండీ.

ఉమా : ఇది మన దేశం తౌలి యత్నం, ఐటి వంటి ఎన్నో రంగాల్లో మనవాళ్ళు విడయవంతం అయ్యారు ఇప్పటికే. అమెరికా వంటి దేశాలు శిలలు తెచ్చి ప్రయోగాలు చేయడం – ఇవన్నీ ఒక ఎత్తు. చంద్రయాన్ ఒక ఎత్తున నేను బావిస్తున్నాను.

జాన్ : మునెపెన్నడు లేనివిదంగా ఇందులో 11 ప్రయోగాలు ఒకేసారి జరిగాయి.

ఉమా : ఈ చంద్రయాన్-1 అనే నౌక చంద్రుడి పైకి వెళ్లి ఈ 11 పేలోడ్ లను పనిలోకిదిపింది. ఈ 11 పేలోడ్స్ లో 5 మనవి, 6 విదేశాలవి.

హేలీ : (ఆశ్చర్యంగా) 6 విదేశాల పేలోడ్లా?

ఉమా : ఈ 6 రేలోడ్లలో అమెరికావే రెండు మిగిలినవి స్వీడన్, యుకె, బల్గేరియా మొదలైన దేశాలవి. 2007లో దీనిని ప్రయోగించారు.

ఉమా : మీకో సంగతి తెలుసా, అసలు భారతీయ విద్యా ప్రమాణంలెంతో న్నతమైనవి. వాటిని కొందరు వ్యాపార దృష్టితో చూస్తున్నారు. తానీ, సరైన సౌకర్యాలున్న సంస్తల్లో ఎంతో నాణ్యమైన విద్యయే అందుతోంది. ఇవన్నీ డూశారు గనకే, నేడు అమెరికావంటి దేసాల్లో న్నాళ్లకు మన డిగ్రీలకు గుర్తింపు లబించింది.

జాన్> : అప్పుడు హేలీ. క్కడ టెక్, డాక్టరేట్ లకు అక్కడ గుర్తింపు ఉంది.

రమా : ప్రొఫెసర్, విషయంగా మా విశ్వవిద్యార్థులకు నీరు ప్రత్యేకంగా ఒక టాక్ ఇవ్వాలి.

ఉమా : అలాగే. ఆ. క్కడున్నాం. చంద్రయాన్-1 కదూ, చంద్రునిపై ఉన్న వాయువుల గురించి పరిశోధనలు చేయడం, అక్కడ ఖనిజ సంపదను, మూలకాలను గుర్తించడం – ఇలా విలక్షణమైన ప్రయోగాలను చేశారు. 2007లో దీనిని ప్రయోగించారు.

హేలీ : సర్ ఐతే, భవిష్యత్తులో మన మనుషులూ అక్కడికి వెల్లో అవకాశం ఉందన్నమాట.

జాన్ : సార్, ఆ విషయంగా కూడా అబ్దుల్ కలాం గారు ఒక కలని ఆవిష్కరించారు. 2014లో బారతీయ వ్యోమగాములు అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లి విజయవంతంగా వెనక్కీ వస్తారని 2025 ఆగ,టు 15 నాటికి చంద్రుని మీద భారతీయులు కాలు పెడతారని ఆయన ఒక సభలో చెప్పారు కూడా.

ఉమా : అవును జాన్. చక్కగా గుర్తు పెట్టుకున్నావ్. ఆ జైత్రయాత్ర ముగించి వెనక్కి వచ్చే ప్రధాని, రాష్ట్రపతి – వీళ్లతో బాటు తానూ ఉంటాననీ కూడా ఆయన చెప్పడం మనకెంతో బలాన్నీ, శక్తినీ ఇస్తోంది.

జాన్ : సర్, ఇంతకూ మన పరిశోధనా విషయమైనా అణురంగంలో భారత్ సాధించిన ప్రగతి గురించి మాటైనా చెప్పలేదు మీరు.

సతీష్ : ఔన్సార్. నాకు అణురంగంపై చాలా ఆసక్తి.

రమా : అణుశక్తి గురించి మాట్లాడే ముందు మన తొలి ప్రధాని నెహ్రు ఆలోచమను మీకు చెప్పాలి. మనం అణుశక్తిని విద్యుచ్ఛక్తి ఉత్పాదనకు వాడుకోవాలి. ఎందుకంటే విద్యుచ్ఛక్తి మన దేశ అభివృద్ధికి కీలకం అన్నదే ఆయన ఆశయం.

ఉమా : అది నిజం చేశారు కదా మన వైజ్ఞానికులు. 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పండమెంటల్ రిసెర్చి – టీఇఎఫ్ఆర్ ను ముంబైలో ఆరంభించారు. ఆ ఏర్పాటే నేటి తరానికి, అణురంగానికి పునాది.

జాన్ : భారతీయ అణురంగానికి డాక్టర్ హోమీ జహంగిర్ బాబా ఆద్యుడు. 1948లో అణుచట్టం వచ్చింది. 1950లో ఇండియా రేర్ ఎర్త్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు.

ఉమా : ఆరె, జాన్... చెప్పడానికి నాకూ కాస్త అవకాశం వ్వు. కరెక్టుగా చెప్పావ్. 1954లో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లి,మెంట్ అనేది ఏర్పాటైంది.

హేలీ : అయ్యబాబోయ్... దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట.

సతీష్ : సర్, మరి బాబా టామిక్ రీసెర్చి సెంటర్ అనేది ఏమిటీ?

రమా : బాబా చనిపోయాక అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్నెంట్ కు బాబా అటామిక్ రిసెర్చి సెంటర్ అని పేరు మార్చారు.

సతీష్ : సార్, మనదేశంలో 70 వేల టన్నులకు పైగానే సహజ యురేనియం నిలవలూ, 4 లక్షల టన్నుల థోరియం నిలవలూ ఉన్నాయంటున్నారు కదా. నిజమా?

ఉమా : ఔను, నిడమే. వాటిని వాడి అణుశక్తిని తయారుచేసి ఆ శక్తిని శాంతియుత ప్రయోజనాలకు వాడుకోవడం, దానిద్వారా సంయుంసమృద్ధి సాధించడమే మన ఉద్దేశ్యం.

రమా : నేడు దాదాపు 22 అణు కేంద్రాలను విజయవంతంగా ఏర్పాటు చేసి నడపింద గలుగుతున్నారు.

హేలీ : సర్, కొంచెం వివరంగా చెబుతారా?

ఉమా : తప్పకుండా. 1985లో తొలి ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ను ఏర్పాటు చేసి అమెరికా, యూకె, ఫ్రాన్స్, జపాన్, సోవియట్ రష్యాల సరసన డియా పేరు ప్రపంచంలోని టాప్ 6 దేశాల్లో ఒకటిగా నమోదైంది.

జాన్ : భారత్ యూరేనియం – ప్లుటోనియం ఇంధనాలను తయారు చేసింది. 1962 లోనే భారజలం ప్లాంటును సంగల్ లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ట్యుటికొరన్, మణుదూరు వంటి పలు చోట్ల ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

ఉమా : ఇవన్నీ స్వదేశీ పరిజ్ఞాణంతో ఏర్పాటైనవే. 1970లో యూరేనియం శుద్ధికీ, అణుకేంద్రాలకు కావలసిన పరికరాలను తయారు చేయడానికి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లక్స్ ను హైద్రాబాద్ తో ఏర్పాటు చేశారు.

రమా : భారజలంతో పనిచేసే కేంద్రాల్లో వాడేసిన ఇంధనం నించి ప్లుటోనియంని పొంది, దాన్ని తిరిగి శుద్ధి చేసి తిరిగి ప్లూటోనియం ఇంధనంగా పొందడం అంటే మాటలు కాదు. ఈ ఇంధనాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో వాడుతున్నారు.

ఉమా : చాలా చక్కగా చెప్పావు.

హేలీ : సర్ మరి విద్యూత్ ఉత్పత్తి ఒక్కటేనా మన అణురంగం సధించిన ప్రగతి?

ఉమా : ఎంతమాట. బయో వ్యర్థాలను మంచి ఎరువుగా తయారుజేసే బయే డైజెస్టర్లనూ, కాయగురలను ఎక్కువ కాలం నిలిచేలా చూసే ఇర్రేడియేషన్ సామాగ్రిని కూడా బార్క్ సంస్త తయారుచేసింది.

జాన్ : వాటినే పోటాన్ రేడియేటర్లమటారు. కదండీ. అలాగే, క్యాన్సర్ రోగులకు ఉపశమనాన్నిచ్చే దిశలో పనిచేస్తుంది.

ఉమా : కరెక్ట్. దేశంలోని 19 క్యాన్సర్ కేంద్రాలను అనుసంధించి తగిన సలహా, సహాయ సహకారాలను అందిస్తోంది. రేడియోషన్ థెరఫీ కోసం బాబాట్రాన్ అనే అద్భుతమైన పరికరాన్ని కూడా రూపొందించారు. ఇది పూర్తి కంప్యూటరైస్డ్ పరికరం. అటు రోగికి ఇటు డాక్టర్ కి కూడా చాలా సౌకర్యంగా ఉంది.

సతీష్ : సార్, మా నెల్లూరు క్యాన్సర్ కేంద్రంలో ఇటీవలీ ఈ బాబాట్రాన్ ను ఏర్పాటు చేశారు.

రమా : గుడ్ మంచి విషయం చెప్పావ్.

హేలీ : మరి ఇంకా ఏఏ రంగాల్లో బార్క్ పరిశోధనలు సాగిస్తోందండీ.

ఉమా : రోబోటిక్స్ రంగంలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించింది. బార్క్ సంస్థ. ఒక్క బార్క్ మాత్రమే కాదు, ఐఐఠిలు, ఐఐఐటిలు, ఐఐఎస్సి – ఇలా పలు సంస్థలు ఈ రంగంలో ఎంతో ప్రగతి సాధించాయి.

రమా : అన్నట్టు, పిల్లలూ, సెమిలింగ్ బుద్దా అనేదేంటో తెలుసా?

సతీష్ : అది 1974లో పోఖ్రాన్ లో జరిపిన తొలి అణు పరీక్షకు సంకేత పదం అది. ఆరోజు బుద్ధ జయంతి. ప్రయోగం విజయవంతమైందని అలనాటి ప్రధాని ఇందిరాగాంధీకి రాజరామన్న అలా సంకేతప్రాయంగా తెలియజేశారంటారు.

హేలీ : సార్, దాని తర్వాతే కదా, విదేశాలు ఆంక్షలు విధించడం, మనవాళ్లు పరం, అనుపం అమేయా వంటి సూపర్ కంప్యూటర్ లను రూపొందించడం జరిగింది.

ఉమా : గుడ్... ఆ తర్వాత 1998 మే నెల 11న రెండోసారీ పోఖ్రాన్ లో అణు పరీక్షలు జరిపినప్పుడు దానికి శక్తి అని పేరు పెట్టారు. అమెరికా గుఢాచారి ఉపగ్రహాలకు సైతం ఈ పరీక్షల సంగతి తెలియకపోవడం అందరికీ ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.

సతీష్ : అయితే మళ్లీ ఆంక్షలు పెట్టాయా సార్.

రమా : (నవ్వుతూ) ఆంక్షలు పెడితే ఏమౌతుందో ఒకసారి తెలిసిందిగా. అందుకే ఎలాంటి ఆంక్షలు పెట్టలేకపోయారు. మనం అగ్ని, త్రిశూల్ వంటి మిసైల్స్ న్నెన్నింటినో తయారుచేశాం. ఈ అణు పరీక్షలతో మన రక్షనకై అణ్వాయుద్ధాలను తయారుచేసే స్థాయికి ఎదిగాం.

జాన్ : సార్, పొగుడుతున్నానని కాదు కానీ, భరత్ దేనిలో తక్కువండీ. నానో టెక్నాలజీ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించారు. అటు డి.ఆర్.డి.ఓ, డి.ఆర్.డి వంటి ఎన్నో సంస్థల పరిశోధనలు చక్కని ఫలితాలనందిస్తున్నాయి. నానో పార్టికల్స్ రంగంలో ఢిల్లీ యూనివర్సిటీ దాదాపు 11 పేటెంట్లు సాధించుకొంది.

ఉమా : ప్రపంచంలోనే అతి పెద్ద శాస్త్రీయ, సాంకేతిక మానవ వనరులున్న దేశాల్లో మనదేశం మూడోది. 162కు పైగా విశ్వివిద్యాలయాలు, 40కి పైగా పరిశోధనా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రపంచ ఐటి రంగానికి సరికొత్త చిరునామా భారత్.

హేలీ : సర్ (బాధగా) మనుకోకపోతే, ఒక్క విషయం, మనవాళ్లు స్వతంత్రంగా ఎన్ని ఆవిష్కారాలు చేశారు, ఎన్ని నోబుల్ బహుమతులు సంపాదించారు?

ఉమా : నీ బాధ నాకర్తం అంయిందయ్యా. అదంతా గత చరిత్ర కాబోతుంది. ఇప్పుడు మన దేశంలో కొత్తగా ఎన్నో పరిశోధన అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. జన్యు లోపాలు గుర్తించి సరిచేసే స్థాయిలో ఉన్నాం. ఐతే మూల భౌతిక, రసాయన శాస్త్రాల్లో పరిశోధనలు ఎన్నో జరగాలి. జరుగుతున్నాయి కూడా.

రమా : అవునండీ. ఆ నమ్మకం నాకుంది. వచ్చే 10 ఏళ్లలో వైద్య, సాంకేతిక రంగాలే కాదు పలురంగాల్లో పరిశోధనలు ఇక్కడే జరగబోతున్నాయి.

ఉమా : అది చాలా కీలకం కూడా. ఎందుకంటే రాబోయేది విజ్ఞాన ఆధారిత ఉత్పత్తి వ్యవస్త. మనందరమూ అందుకోసం శ్రద్ధగా కృషి చేయాలి.

సతీష్ : తప్పకుండానండీ. మేమిద్దరం, ఇండియాలోనే పరిశోధనలు చేస్తాం. మీ పేరు నిలబెడతాం.

ఉమా : ఆల్ ది బెస్ట్. ప్రపంచంలోనే గొప్ప విజ్ఞాన శక్తిగా అవతరిస్తాం. సందేహం లేదు.

ముగ్గురూ : ధాంక్యూ సార్.

(సమాప్తం)

ఆధారం: వి.వి. వెంకటరమణ

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate