অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యాధి

వ్యాధి

వ్యాధి అనేది ప్రతీ మనిషికీ సంబంధించిన సమస్య. వ్యాధి అనేది ఎవరికి, ఎప్పుడు సోకుతుందో ఎవరూ చెప్పలేరు. కేవలం ఒంట్లో బాగులేనట్టు అనిపించవచ్చు, జ్వరం రావచ్చు, లేదా ఒళ్ళంతా దద్దుర్లు పుట్టొచ్చు. వ్యాధి మృత్యువుకి కూడా కారణం కావచ్చు.

వ్యాధి అనేది ప్రతీ మనిషికీ సంబంధించిన సమస్య. వ్యాధి అనేది ఎవరికి, ఎప్పుడు సోకుతుందో ఎవరూ చెప్పలేరు. కేవలం ఒంట్లో బాగులేనట్టు అనిపించవచ్చు, జ్వరం రావచ్చు, లేదా ఒళ్ళంతా దద్దుర్లు పుట్టొచ్చు. వ్యాధి మృత్యువుకి కూడా కారణం కావచ్చు.

ఒకరికి వ్యాధి వస్తే అది ఇతరులకి కూడా వ్యాపించొచ్చు. ఆ వ్యాధి ఉన్నట్లుండి ఓ ఊరంతా, లేదా ఓ ప్రాంతమంతా వ్యాపించవచ్చు. కొన్ని వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి.

ఉదాహరణకి 1300ల్లో ఒకసారి కాల మృత్యువు (Black Death) అనే ఓ వ్యాధి యూరప్, ఆఫ్రికా, ఏషియా అంతా వ్యాపించి లక్షల కొద్దీ మనుషులని బలితీసుకుంది. మానవ చరిత్రలోనే అది అత్యంత ఘోరమైన ఉపద్రవం. యూరప్లో ఇంచుమించు మూడవవంతు మనుషులు సమసిపోయారు.

ఆ రోజుల్లో వ్యాధికి కారణమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. దయ్యం పట్టిందని, గాలి సోకిందని ఇలా ఏవో మూఢ నమ్మకాలు చలామణిలో ఉండేవి. లోకంలో పెరిగిన పాపభారానికి భగవంతుడిచ్చిన శిక్ష అనుకుని సరి పెట్టుకున్నారు కొందరు.

ఏదేమైనా వ్యాధిని అరికట్టవచ్చని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆ కాల మృత్యువు" మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో అని బిక్కుబిక్కుమంటూ బతికేవారు.

కొన్ని వ్యాధులలో ఒక విశేషం ఏమిటంటే ఒకసారి ఒక మనిషికి ఆ వ్యాధి సోకిందంటే అది ఆ మనిషికి మళ్లీ సోకదు. మసూచి గాని, అమ్మవారు" గాని ఒకసారి ఒక మనిషికి సోకి నయమైనట్లయితే, ఆ మనిషికి మళ్లీ ఆ వ్యాధి ఎప్పుడూ రాదు. ఆ మనిషికి "రోగనిరోధకతగా సంక్రమించింది అన్నమాట. ఆ మనిషి శరీరం ఆ రోగంతో పోరాడి ఆ రోగం నుండి ఒక విధమైన భద్రతాశక్తిని తనలో కల్పించుకుంటుంది. ఆ భద్రతాశక్తి కొన్నేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది.

అలాంటి రోగాల్లో ముఖ్యంగా బాగా ప్రమాదకరమైన రోగం మసూచి (small pox). అయితే చిక్కేమిటంటే ఈ రోగం ఒకసారి వస్తేనే ఆ మనిషి హరీ అనేవాడు. కాబట్టి ఇక భద్రతాశక్తి ఏర్పడినా లేకున్నా ఒక్కటే. కొంతమంది కోలుకున్నా ఆ రోగం వల్ల ఒళ్ళంతా ఏర్పడ్డ వికారమైన మచ్చలతో, బాధించే కురుపులతో జీవిత మంతా బాధపడాల్సి వచ్చేది. అయితే కొంతమందికి మాత్రం ఆ రోగం కొద్దిగానే సోకి ఎక్కువ దుష్ఫలితాలని విడిచిపెట్టకుండా తొలగిపోయేది. అలాంటి వ్యక్తికి మళ్ళీ ఆ వ్యాధి సోకకుండా భద్రతా శక్తి ఏర్పడేది.

కనుక మసూచి అసలు సోకకుండా ఉండేదాని కన్నా తక్కువ తీవ్రతతో సోకడమే నయం అన్నట్టు ఉండేది. తక్కువ తీవ్రతతో మసూచి సోకినట్టయితే ఇక జన్మలో రాదన్న ధీమా ఉండేది. అసలు సోకకుండా ఉన్నట్టయితే ఎప్పుడు దెబ్బ కొడుతుందోనన్న భయం నిరంతరం ఉండేది.

రోగగ్రస్తులకి దగ్గరగా ఉంటే రోగం సోకే ఆస్కారం ఎక్కువ అవుతుందని మనుషులకి తెలుసు. అలాంటప్పుడు తక్కువ తీవ్రతతో వ్యాధి సోకి నయం అయిపోయిన వారి దగ్గర ఉంటే మంచిదేమో? మనకీ అలా తక్కువ తీవ్రతతో వ్యాధి సోకి నయం అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడూ రాదు. ఉదాహరణకి మసూచి ఉన్నవారి శరీరం మీద ఉండే ఓ కురుపులోకి సూది గుచ్చి, కురుపులోని ద్రవం సూది మొనకి అంటుకున్నాక, ఆ గుచ్చిన సూది రోగం లేని వారి చర్మంమీద గుచ్చొచ్చు. దీనినే "ఇనోక్యులేషన్" (క్రిములని అంటించడం) అంటారు.

కాని ఇక్కడ చిక్కు ఏమిటంటే తక్కువ తీవ్రత వ్యాధి సోకిన వారి శారీరక ద్రవాల నుండి వ్యాధి లేని వారికి 'ఇనోక్యులేట్ చేస్తే, ఆ రెండవ వారికి కూడా తక్కువ తీవ్రతతో మాత్రమే వ్యాధి వస్తుందన్న నియమమేమీ లేదు. కనుక ఈ ఇనోక్యులేషన్ ప్రమాదంతో కూడిన పనిఆసుపత్రులలో అంతమంది ఎందుకు మరణిస్తున్నారో ఆలోచించసాగాడు సెమ్మెల్వేజ్, ఆసుపత్రులలో ఇతర రోగులకి చికిత్స చేసే డాక్టర్లే ఈ తల్లులకి కూడా చికిత్స చేస్తారు. ఇళ్ళలో గర్భిణీ స్త్రీలకి పురుడు పోసే మంత్రసానులు ఇతర రోగులకి చికిత్స చేయరు. అంటే ఆసుపత్రులలో డాక్టర్లు ఇతర రోగుల నుండి తల్లులకి రోగాన్ని చేరవేస్తున్నారా?

1770ల్లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే బ్రిటిష్ డాక్టరు కౌపాక్స్ అనే వ్యాధి మీదకి దృష్టి మరల్చాడు. అది ఆవులు, దున్నలు మొదలైన జంతువులకి వస్తుంది కనుక దాని పేరు వచ్చింది. ఇది తక్కువ తీవ్రత మసూచిని పోలిన ఓ వ్యాధి. అంటే ఓ ఆవు నుండి ఈ వ్యాధి సోకితే ఒకటి రెండు కురుపులు వచ్చి పోతాయంతే. అసలు రోగం వచ్చినట్టు కూడా ఎవరికీ తెలీదు.

జెన్నర్ నివసించే ప్రాంతాల్లోని పల్లెటూరి వాళ్ళలో ఈ కౌపాక్స్ వచ్చినవాడు అదృష్టవంతుడు అనే నమ్మకం ఒకటి వుండేది. ఎందుకంటే ఇది వస్తే ఇక మసూచి రాదు. 14మే, 1796లో అతడికి అప్పుడే కౌపాక్స్ వచ్చిన ఓ అమ్మాయి కనిపించింది. ఆమె చేతి మీద ఓ కురుపులోకి సూది గుచ్చి ఆ సూదితో ఎప్పుడూ కౌపాక్స్ గాని మసూచి గాని రాని ఓ కుర్రాడి చర్మం మీద గీశాడు. కుర్రవాడికి చర్మం మీద గీసిన చోట కురుపు తేలి మెల్లగా కౌపాక్స్ వచ్చింది.

కుర్రవాడికి పూర్తిగా నయం కావడానికి జెన్నర్ 2 నెలలు ఎదురుచూశాడు. అతడిలో కౌపాక్స్ నుండి రోగనిరోధకత ఏర్పడింది. కాని మసూచి నుండి కూడా అలాంటి నిరోధకత ఏర్పడిందా? ఇది తేల్చుకోవడానికి జెన్నర్ ఓ ప్రమాదకరమైన ప్రయోగం చేశాడు. మసూచి కురుపులో గుచ్చిన సూదిని ఈ సారి కుర్రవాడి చర్మం మీద గీశాడు. కుర్రవాడికి మసూచి రాలేదు.

ఇదే ప్రయోగం మరో రెండేళ్ల తరువాత కూడా కౌపాక్స్ సోకిన ఓ అమ్మాయి మీద చేశాడు. ఈసారి కూడా కౌపాక్స్ కురుపులో గుచ్చిన సూదితో మసూచి రాని మరో వ్యక్తికి మసూచి నుండి రోగనిరోధకత వచ్చేట్టు చేశాడు..

కౌపాక్స్ కి శాస్త్రీయ నామం "వాక్సీనియా" అంటే లాటిన్లో ఆవు అని అర్ధం. జెన్నెర్ రూపొందించిన ఈ పద్ధతికి, అంటే ముందుగా కౌపాక్స్ తెప్పించి ఆ విధంగా మసూదికి రోగనిరోధకత తెప్పించే పద్ధతికి వాక్సినేషన్ అని పేరు వచ్చింది. జెన్నర్ తన ఫలితాలని తెలియచేయగానే ఆనతి కాలంలోనే వాక్సినేషన్ పద్ధతి ప్రపంచ మంతటా అమలు అయ్యింది. వాక్సినేషన్ అమలైన ప్రాంతాల్లో మసూచి నిర్మూలించ బడింది.

అయితే ఇతర వ్యాధులని ఆ విధంగా నిర్మూలించడం సాధ్యం కాలేదు. ఇతర వ్యాధులకి తక్కువ తీవ్రత గల రూపాంతరాలు కనిపించలేదు.

ఏదేమైనా ఈ వాక్సినేషన్ పద్దతితో రోగం అనేది ఒక మనిషి నుండి మరో మనిషికి సంక్రమించగలదని తెలిసిపోయింది. ఈ తతంగం గురించి కొందరు ఇంకా లోతుగా ఆలోచించసాగారు. అంటే వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకకుండా ఆపితే వ్యాధి రాకుండా అరికట్టవచ్చు కదా?

ఇగ్నాస్ ఫిలిప్స్ సెమ్మెల్వేజ్ అనే హంగేరియన్ డాక్టర్ సరిగ్గా అలాగే ఆలోచించాడు. 1840ల్లో అతడు ఓ ప్రసూతి కేంద్రంలో పనిచేసేవాడు. అక్కడ ప్రసవించిన స్త్రీలలో చాలామంది పిల్లలు పుట్టగానే మరణించేవారు. ఇంట్లో ప్రసవించిన స్త్రీల విషయంలో సాధారణంగా అలా జరిగేది కాదు.

1847లో సెమ్మెలైజ్ ఓ ఆసుపత్రికి అధికారి అయ్యాడు. రోగి దగ్గరికి వాళ్ళ ముందు ఓ బలమైన రసాయనిక ద్రావకంలో డాక్టర్లు అందరూ తమ చేతుల్ని కడుక్కోవాలని నియమం పెట్టాడు. ఈ నియమం అమలులోకి రాగానే పరిస్థితులు చక్కబడ్డాయి. అప్పట్నుండి ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలు మరణించడం అరుదు అయ్యింది.

కాని ఈ వ్యవహారం డాక్టర్లకి నచ్చలేదు. మాటిమాటికీ చేతుల్ని ఘాటైన ద్రావకాలతో కడుక్కోవడం వాళ్లకి మంటగా వుంది. పైగా వాళ్ళే వ్యాధిని మోసుకెళ్లి మనుషుల్ని చంపుతున్నారు అన్న ఆలోచనని సహించలేకపోయారు. అసలు వాళ్ల చేతుల మీద ఏమీ లేనప్పుడు వ్యాధిని మోసుకుపోయేదేమిటి అని వాదించేవారు. అంతా కూడబలుక్కుని ఎలాగోలా సమ్మెల్వైని ఆసుపత్రి నుండి వెళ్ళగొట్టారు. చేతులు కడుక్కోవడం మానేశారు. మునుపటి దుర్గతి మళ్ళీ తల్లులకి తప్పలేదు.

ఇది నిజంగా ఓ సమస్యే. కంటికి కనిపించనిది వ్యాధిని ఎలా మోసుకు పోతుంది? ఈ విషయంలో ఎవరినైనా ఒప్పించేదెలా?

వాటంతట అవి పుట్టే సిద్ధాంతం మీద పనిచెయ్యక ముందు లూయీ పాశ్చర్ మరో ముఖ్యమైన సమస్య మీద పని చేసేవాడు.

ఆ రోజుల్లో ఫ్రాన్స్లో వైన్ పరిశ్రమ దురవస్థలో వుంది. ఎందుచేతనో వైన్ పులిసిపోతోంది. న్యాయంగా అయితే అలా పులియకూడదు. వైన్ వర్తకులకు మిలియన్ల ఫ్రాంకులు నష్టం వస్తోంది.

1856 లో పాశ్చర్ ని ఈ సమస్య మీద పని చెయ్యమని అడిగారు. అతడు చేసిన పనుల్లో ఒకటి వైన్ ని సూక్ష్మదర్శినిలో చూడడం. యీస్ట్ అనబడే సూక్ష్మక్రిములు వైన్లో కనిపించాయి. ఇందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అవే పళ్ళరసాలలో పెరిగి ఆ రసంలో ఉండే చక్కెరని ఆల్కహాలుగా మారుస్తాయి.

కాని పులిసిన వైన్ ని పరీక్షించినప్పుడు అందులో కొంచెం భిన్నమైన రూపాలు గల యీస్ట్ సూక్ష్మక్రిములు కనిపించాయి. అంటే రెండు రకాల యాస్ట్ కణాలు ఉన్నాయన్నమాట. ఒకటీ మంచిది, రెండవది చెడుది. మంచిది చక్కెరని ఆల్కహాలుగా మారుస్తుంది. చెడుది ఆల్కహాలుని ఒకవిధమైన ఆమ్లంగా (acid) మారుస్తోంది.

వైనాని కొద్దిగా వెచ్చ జేసి యిస్ట్ కణాలని సులభంగా చంపేయొచ్చు. పూర్తిగా తయారైన వైనాని కొద్దిగా వెచ్చజేయాలని సూచించాడు పాశ్చర్. దాస్ట్ కణాలు చచ్చిపోతాయి. మంచి జాతి యీస్ట్ కణాలు చేయాల్సిన పని అప్పటికే పూర్తయింది

"కనుక ఇక వాటితో పనిలేదు. చెడు జాతి యాస్ట్ కణాలు ఇక ఆల్కహాలని ఆమంగా మార్చేలోపు చచ్చిపోతాయి.

వైన్ ఉత్పత్తిదారులకు వైన్ ని వేడిచేసే ఆలోచన నచ్చలేదు. కాని ప్రయత్నించి చూశారు. పథకం పారింది. వైన్ పులియడం ఆగిపోయింది. వైన్ పరిశ్రమ కొత్త ఊపిరి పోసుకుంది. హానికరమైన సూక్ష్మక్రిములని చంపటం కోసం సున్నితంగా వేడిచేసే పద్ధతినే అప్పట్నుంచీ పాశ్చర్ పేరు మీద “పాశ్చరైజేషన్" అంటూ వచ్చారు. మనం కొనే పాలు కూడా సాధారణంగా పాశ్చరైజ్ చేయబడినవే.

వైన్ సమస్యమీద పాశ్చర్ చేసిన పరిశోధనల వల్లనే తమంతట తాము పుట్టే సిద్ధాంతం తప్పన్న బలమైన నమ్మకం ఏర్పడింది. అది నిజమే అయ్యుంటే యీస్ట్ కణాలని చంపితే సరిపోదు. రెండు రకాల యాస్ట్ కణాలు మళ్ళీ పుట్టుకొచ్చేవే. మళ్ళీ వైన్ పులిసిపోయేది..

ఆ ధీమాతోనే పాశ్చర్ తమంతట తాము పుట్టడం అసంభవం అని నిరూపించే తన ప్రఖ్యాత ప్రయోగం చేయడానికి పూనుకున్నాడు. జీవం లేని పదార్థాల లోంచి జీవకణాలు పుట్టవని అతనికిప్పుడు ఖచ్చితంగా తెలుసు.

వైన్ మీద స్వయంగా చేసిన పరిశోధనల ద్వారా పాశ్చర్ సూక్ష్మక్రిముల వ్యాప్తివల్ల వచ్చే సమస్యలని అర్ధం చేసుకున్నాడు. ఉదాహరణకి కాస్తంత పులిసిన వైన్స్ మంచి వైన్లో పోస్తే, మంచి వైన్ కూడా పులిసిపోతుంది. ఆల్కహాలుని ఆమ్లంగా మార్చే యీస్ట్ కణాలు మంచి వైన్లో పెరిగి దాన్ని కూడా పులియబెడతాయి.

ఉదాహరణకి వైన్ ని డబ్బాల్లోకి పోస్తున్న ఓ కార్మికుడి చేతులకి కాస్తంత వైన్ అంటింది అనుకుందాం. అలాంటి వైన్లో ఆల్కహాలు తయారు చేసే యీస్ట్ కాస్తంత ఉందనుకుందాం, కార్మికుడు ఇప్పుడు అదే చేతులని మంచి వైన్ లో ముంచితే ఆ చెడు యీస్ట్ కణాలు మంచి వైన్లోకి చేరతాయి. మంచి వైస్ పులిసిపోతుంది.

కొత్త వైన్ బ్యాచ్ మీద పనిచేసే ముందు కార్మికులు అందరూ తప్పనిసరిగా చేతులు కడుక్కుంటే ఇది జరక్కపోవచ్చు.

డాక్టర్లు తమ చేతులార వ్యాధిని మోసుకుపోతున్నారు అని సెమ్మెల్వేజ్ అన్నది అక్షరాలా నిజం. ఆ వ్యాధిని మోస్తున్నది సూక్ష్మక్రిములు కనుక అది కంటికి కనిపించలేదు.

అప్పటికే అలాంటి ఆలోచనలు పాశ్చర్ మనసులో మెదులుతున్నాయి. కాని వ్యాధిని మోసుకుపోయేది సూక్ష్మక్రిములే అని గట్టి సాక్ష్యాధారాలు లేకుండా చెయ్యగలిగింది ఏంలేదు.

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate