వేసవిలోనూ చల్లదనాన్ని, స్వచ్చమైన గాలలిని ఇచ్చే పచ్చని చెట్టు, ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణంలో కొంచెం అమాయకత్వం, కొంచెం అధునికత కలగలిసిన విద్యార్దుల మధ్య పని చేయడం ఒక సంతృప్తికర అనుభూతి! మా పాటశాలలోని ప్రగతి సైన్సు క్లబ్ తరపున చేసిన ప్రయోగాల్లో పదవ తరగతి విద్యార్దుల శాఖీయోత్పత్తి ఒకటి. మొక్కయోక్క శాఖీయ భాగాలైన పత్రము, కాండము, వేర్ల ద్వారా మొక్కల ప్రత్యుత్పత్తి విధానాన్ని “శాఖీయ వ్యాప్తి” అంటారని విద్యార్ధులకు తరగతిలోనే పరిచయం కావడం వల్ల, మా పాటశాల తోటలో క్రోటన్ మొక్కలు నాటిన విధానం తెలిసి ఉన్నందువల్ల మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి విద్యార్ధులు ఆసక్తిని కనబరిచారు. ముందు రోజు ఒక్కో విద్యార్ధి ఒక్కో పేరు చెప్పేలా ప్రొత్సాహించి ఇంటి పరిసరాలలో, పొలాలలో వారు చూసిన మొక్కలన్నింటి జాబితా తయారు చేశారు.
రెండవరోజు సైన్స్ లాబ్ లోకి అధిక సంఖ్యలో మొక్కలు, దుంపలు వచ్చి చేరాయి. వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తికి సంబంధించిన కరివేపాకు చిలగడదుంపలు, కర్రపెండలం వంటి మొక్కలు అకులద్వారా ప్రత్యుత్పత్తికి రణపాల సేకరించి కాండము ద్వారా ప్రత్యుత్పుత్తికి చాలా మొక్కలు దుంపలు తెచ్చారు. పాటశాలకు ఒక వైపు చెరకుతోట, రెండు వైపు ఉల్లి, బంగాళాదుంప, చేమ, క్యారెట్ దుంపలు, రకరకాల క్రోటన్ మొక్కల కొమ్మలు, మనీప్లాంట్ మొదలగు నాచుగులబి మొక్కలు, చేమంతి, గులాబి, మల్లె... ఇలా ఎన్నో మొక్కలతో సైన్స్ లాబ్ టేబుల్ నిండిపోయింది.
తాము రొజూ చూసే మొక్కలు, దుంపలనే ఈ రోజు క్రొత్తగా శాస్త్రీయ దృక్పధంతో చూడడం మొదలెట్టారన్నమాట. విద్యార్ధులు ఎక్కువమంది వ్యవసాయదారుల కుటుంబం నుండి వచ్చినందును చేరకుగడను కణుపులకు ఇరువైపులా నరికి భూమిలో నాటడం, పసుపుకొమ్మలు, అరటి పిలకలు వంటి వాటి గురించి ఎక్కువగా వివరంచాల్సిన పని తప్పింది. కాని బంగళాదుంపలోని కళ్ళు అల్లం చేమదుంప పంటి వాటి కణుపుల వద్ద కోసి నాటడం మనీప్లాంట్ మొక్క ప్రతి కణుపు వద్ద ఆకు రావడం వారికి ఆసక్తి కలిగించాయి. ఉల్లి, బంగాళాదుంపలను భూమిలో నాటి, వాటినుండి పిల్లదుంపలు రావడం స్వయంగా చేసి చూసి విద్యార్ధులు చూసారు. పాటశాలలో క్రోటన్ మొక్కలోతో లైనింగ్ వేసేము. వాటిని కత్తిరించి తడిగా ఉన్నచోట వాటిని నాటి నారు పెంచి వాటి వేర్లను పరిశీలించారు.
తాము నిత్యం సాధారణ దృష్టితో చూసే మొక్కల పెరుగుదలలో వెనుక ఉన్న సైన్సు ను తెలుసుకున్నామనే తృప్తి విద్యార్ధుల్లో స్పష్టంగా కనిపించింది.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020