অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్ర ప్రస్ధానంలో

శాస్త్ర ప్రస్ధానంలో

2014వ సం. చివరకు వచ్చాం. ఈ సం. కూడా సైన్సులో గొప్ప పరిశోధనలు జరిగాయి. మానవాళి మేలు చేసేవి కొన్నయితే విశ్వాంతరాళాల లోతుల్ని కల్గినేవి మరికొన్ని. మనిషిని అనారోగ్యం పాలు చేసే ఎన్నో వ్యాధులకు కారణాలను తెల్సుకున్నవి ఇంకొన్ని శక్తివంతంగా నీలికాంతిని వెదజల్లే డయోడ్ల రహస్యాలను ఛేదించి LED లైట్లను అందించి శక్తిని పొదుపుచేసే మార్గం చూపిన జపాన్ శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ సం. నోబెల్ బహుమతిని ఇచ్చారు. సూక్ష్మదర్శిని ద్వారా నానోస్థాయి వస్తువులను చూడగలిగే ఆవిష్కరణకు రసాయనశాస్త్ర నోబెల్ పురస్కారం దక్కింది. ఇంతేగాక ఈ ఏడాది మరెన్నో కీలక పరిశోధనలు వెలువడ్డాయి.

సాధారణ కణంలో వలె పలు రసాయన చర్యలు నెరపే కృత్రిమ ప్లాస్టిక్ కణాన్ని రసాయన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రక్తంలో ప్రమాదకరంగా తయారవుతున్న (మోటాస్టాసిస్ అవుతున్న క్యాన్సర్ కణాలను నాశనం చేసే కొత్త పద్ధతిని కనిపెట్టారు. అంతేకాదు కనుచూపు కోల్పోతున్న ఆరుగురు రోగులకు సరికొత్త ‘జీన్ ధేరపీ' (Gene Therapy) ప్రక్రియ ద్వారా చూపును ఇచ్చిన గొప్ప పరిశోధన కూడా ఈ సం. జనవరిలోనే జరిగింది. జపాన్ పరిశోధకులు వయస్సు వచ్చిన ఎలుక కణాలను ఆమ్లంలో ముంచటం ద్వారా సులువుగా మూలకణాలను (Stem cells) అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ ముందు ముందు వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది కాగలదు. మూలకణాల ద్వారా చేసే చికిత్సలో ఈ పద్ధతి పటిష్టంగా పనిచేయటమే కాదు వేగవంతంగా, చౌకగా కూడా అందుబాటులోకి రాగలదు. సరైన సిగ్నల్స్ ను పంపి, నియంత్రించి పిండస్థ మూలకణాల నుండి చేపపిండాన్ని అభివృద్ధి చేయటం, గొప్ప ఆవిష్కరణ. ఈ కణాల నుండి పూర్తి అవయవాలను పెంచేందుకు వీలవుతుంది. ఇది మూలకణాల పరిశోధనల్లో గొప్ప ముందడుగు.

రెండు వేల రెట్లు పెద్దగా చూపే అర్థరూపాయి (50సెంట్లు), కాగితం మైక్రోస్కోపును స్టాన్ఫర్ట్ బయో ఇంజనీర్లు ఈ సం. మార్చినెలలో ఆవిష్కరించారు. మైక్రోస్కోప్ ఏమిటి? అదీ కాగితంతోనా? ఆశ్చర్యపోతున్నారా? అవును. కాగితంతోనే మనం చూసే వస్తువును ప్రయోగశాలల్లో వాడే మామూలు మైక్రోస్కోప్ ఎక్కువలో ఎక్కువ వెయ్యిరెట్లు మాత్రమే పెంచి చూపగలదు. దీనితో అందుకు రెట్టింపు సైజులో చూడవచ్చు. ఈస్ట్ కణాల్లో ఉండే క్రోమోజోమును మొట్టమొదటిసారిగా కృత్రిమంగా సృష్టించి పనిచేయించిన పరిశోధన కూడా ఈ ఏడాదే జరిగింది.

మానవ శరీరంలోకి వైద్యం కోసం రకరకాల ఇంప్లాంట్స్ (కవాటాలు మొ.)ను వైద్యులు ప్రవేశపెడతారు. ఇందుకు చాలా అవస్థలు పడవలసి వస్తుంది. కానీ వీటిని తేలికగా ప్రవేశపెట్టేందుకు ఒక బాటరీని పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే అది శరీరం లోపలికి వెళ్లినాక దానంతటదే కరిగిపోతుంది. అంటే జీవులే కరిగించి వేయగల బాటరీ ఇది.

క్షీరదాల (పాలిచ్చే జంతువులు) ప్రత్యుత్పత్తిలో కీలకమైన సంయుక్త బీజమేర్పడే దశ ఫలదీకరణకు అవసరమైన ప్రోటీన్ ను ఏప్రియల్ నెలలో కనొన్నారు. ఈ ప్రోటీన్ ను జునో (Juno)గా పేర్కొనట్లు ప్రఖ్యాత సైన్సు పరిశోధనా పత్రిక 'నేచర్ (Nature) వెల్లడించింది.

పిల్లలు పుడుతూనే పెరుగుదల సక్రమంగా లేక తెలివిలేక బుద్ధిమాంద్యంతో ప్రత్యేక సీడ్రోమ్ లుగా పడతారు. దీనికి ఆటిసమ్ కారణం. ఆటిసం (Autism)కు కారణమైన జన్యు ఉత్పరివర్తనాన్ని (Genetic Mutation) ఈ సం. జూలైలో కర్గోన్నారు. మనం రోజూ తాగే కాఫీ, దాన్నిచ్చే కాఫీ మొక్క పూర్తి జన్యు రూపాన్ని (Genome) వెల్లడించారు. దీనిలో 25 వేల జన్యువులను గుర్తించారు. వెయ్యి స్వతంత్ర ఇంజన్లు ఉండి తనంత తానే నిర్వహించుకోగలిగిన రోబోను హార్వర్డ్ విశ్వవిద్యాలయం వాళ్లు ప్రదర్శించారు. దీని పేరు రోబో స్వార్మ్ (Robo Swarm)

బ్రిటిష్ సైన్స్ ఫెస్టివల్లో స్వయంగా డిష్ వాషర్ (Dishwasher- పాత్రలు కడిగే మిషన్)ను లోడ్ చేయగలిగిన రోబోను చూపించారు. ఈ సం. చివరకు ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యధికంగా రోబోలున్న దేశం చైనా.

ఇవన్నీ ఒక ఎత్తైతే మనదేశం మార్స్ (కృజగ్రహం) మీదికి ఉపగ్రహాన్ని పంపించిన “మంగళయాన్' విజయవంతం కావటం భారతదేశపు సైన్సు ఈ సం. సాధించిన ఘన విజయంగా పేర్కొనవచ్చు. ఇది సెప్టెంబర్ 24న జరిగింది.

యాంటి బయాటిక్స్ వాడకుండానే సూక్ష్మజీవుల్ని వాటి ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టవచ్చు. ఇది నానో రేణువుల (Nanoparticle) ఇంజనీరింగ్ ద్వారా సుసాధ్యం చేశారు శాస్త్రవేత్తలు. లిపిడ్ లనే క్రొవ్వు పదార్థాల నుండి తయారు చేసిన నానోరేణువులు బాక్టీరియాల వలన వచ్చే ఇన్ ఫెక్షన్స్ ను నయం చేశాయి.

2014వ సం. మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. NASA ప్రకారం ఈ సం. జూన్ నెల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఉష్ణోగ్రతలను రికార్డు చేయడం మొదలుపెట్టిన 1880 నుండి చూస్తే ఈ సం. వేడి చాలా ఎక్కువట!© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate