অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రజ్ఞులు – ప్రజలు

శాస్త్రజ్ఞులు – ప్రజలు

scientistsశాస్త్రమంటే అదేదో కొరుకుడు పడని బ్రహ్మపదార్ధమని భావిస్తారు సామాన్య ప్రజలు. కాని శాస్త్రం పురోగతి ప్రజల పురోగతికి బాట వేసిందని శాస్త్రం మానవ జీవిత గమనాన్ని ఎంతగానో ప్రభావం చేస్తోందని వారీకి తెలియదు. శాస్త్రజ్ఞాలు – సామాన్య ప్రజల మధ్య , సమాచార మార్పిడిలో ఇంతటి అంతరం ఎందుకు? ప్రజలు చెల్లించే పున్నల నుండే జీతాలు పొందుతున్న పరిశోధకులు ప్రయోగశాల నాలుగు గోడల మధ్య ఏం చేస్తుంటారు? వారి పరిశోధనలు జన సామాన్య జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి ? వారి పరిశోదనలు నిధులు ఎలా సమకురుతున్నాయి? పరిశోధనలు ఫలితాల మంచి చెడులేమిటి? ఇత్యాది విషయాలు ప్రజలకు స్పష్టంగా తేలియాల్సిఉంది. శాస్త్రజ్ఞాలే స్వయంగా తమ పరిశోధనల సంగతులు సామన్యులకు తెలియజేయాలి. ఈ నెపధ్యంలోనిదె ఈ సంభాషణ.....

పాత్రలు

శాస్త్రజ్ఞాలు: డా. జ్యోతి, డా. వికాస్

మ్యవసాయ అధికారి: శ్రిరావు

ఆదర్శరైతులు : ఆడ మ్, అక్తర్, అమల

రైతు దినోత్సవం సందర్భంగా ఆడమ్ , అక్తర్ , అమల ఆదర్శ రైతులుగా ఎంపికై గౌరవింపబడతారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి వారికి వ్యవసాయ పరిశోధనల పట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రం తీసుకువెడతాడు. అక్కడ.......

రావు: వ్యాన్ పరిశోధనాకేంద్రం చేరింది... ఇక ... దిగండి. ప్రయోగశాల వెళ్ళాక నిశ్శబ్దంగా ఉండాలి. అక్కడ ఉండే పరికరాలను ముట్టుకోవద్దు. అంతగా తెలుసుకోవాలనుంటే .... అక్కడ ఉండే శాస్త్రవేత్తను అడిగి చూడాలి.

ఆడమ్, అక్తర్, అమల: సరేసార్ .... మిరింతగా చెప్పాలా ఏంటి ? లాబ్ లో జాగ్రత్తగా మెలుగుతాం......

రావు: సంతోషం రండి ఇక లాబ్ లోకి వెళ్దాం......

డా.వికాస్: నమస్తే.... నమస్తే.... ఆ... చెప్పండి ... ఈసారి పంటలు ఎలా ఉన్నాయి?

అక్తర్: పంటలకేంది సార్..  బ్రహ్మండంగా పండాయి. అందంతా మీరిచ్చిన సంకర విత్తనాలు, సూచనలు, సలహాలు వల్లే కదా.....

డా. జ్యోతి: ఆ.....అది సరే... ఇంతకూ ముగ్గురు ఆదర్శరైతులు ఏం చేస్తారు? అది మాకేలా ఉపయోగపడుతుంది? .... తదితర విషయాలు తెలుసుకోవాలని వచ్చాం....

డా. వికాస్: అబ్బో .... చాలా పెద్ద ఆలోచనలే ఉన్నాయి మీ బుర్రలో ... సరే మీరు ఎం తెలుసుకొవాలనుకుంటున్నారో అడగండి.

ఆడమ్: సర్..... ఈ పరిశోధనా కేంద్రంలో ఏయే విషయాల పై పరిశోధనలు చేస్తారు?

డా.వికాస్: అదే నయ్యా మిరిందాకా అన్నారే... సంకర విత్తనాలని అవి ఇక్కడ తయారు చేస్తాం... అలాగే నేల పరిక్ష చేసి.... ఎ పోషకాహారలోపం ఉంది? ఏ ఎరువు వాడాలి? పంటలను ఎలాంటి చిడపిడలు ఆశిస్తాయి? వాటినెలా తొలగించాలి? ఆధునిక యాజమాన్య పద్ధతులతో పాటు పంటలకు సంబంధించిన మరెన్నో అంశాల పై పరిశోదిస్తాం.

అక్తర్: సర్.... ఇంకా ఎం చేస్తారు?

డా. జ్యోతి: పంటలకు సంబంధించిన అన్ని అంశాల పై ఇక్కడ పరిశోధన జరుగుతుంది. ముఖ్యంగా అధిక దిగుబడి సాధనకు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందజేస్తాం.

అక్తర్: ఈ పరిశోదనా ఫలితాలను ఇంకా ఏం చేస్తారు ?

డా. జ్యోతి: పరిశోధనా ఫలితాలను దేశ విదేశీ పరిశోధనా పత్రికలలో ప్రచురిస్తాం.

అమల: అయితే... మేడం... మారి ఈ పరిశోధనలు చేయడానికి డబ్బేవారిస్తారు?

డా.జ్యోతి: మీరే.... అదే ... ప్రజలు చెల్లించే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. దాంట్లో౦చే ఒక్కో పద్దుకు కొంత కేటాయిస్తుంది. ప్రభుత్వం.

అమల : అంటే ... మా  సంపాదనలో ఇంట్లో ఒక్కో ఖర్చుకు కొంత తిసినట్లుగానా?

డా. జ్యోతి : అవును.... భలే .... బాగా చెప్పావమ్మా.....

ఆడమ్: సార్.... మరైతే మీరు చేస్తున్న పరిశోధనలు గూర్చి మీరే ప్రజలకు తెలియజెప్పవచ్చుకధా?

డా. వికాస్: మంచి ప్రశ్నే... కానీ ... మాకు అంత తీరిక ఎక్కడిది? పరిశోధనలు , ప్రచురణల, సభలు, సమావేశాల్లో పాల్గొనడానికి సమయం చాలడం లేదు.

అలాగే ఈ విషయాలను సామాన్యుడికి తెల్యజేప్పడం అయితే సరైన పదాలే దొరకవు.

అక్తర్: మీరే అలా అంటే ఎలా సార్? అది మీ బాద్యత కాదా? డా. జయంతి నార్లికర్. డా. ఎం.ఎస్.స్వామినాధన్ వంటి శాస్త్రజ్ఞాలు తమ పరిశోధన విషయాలను సరళమైన భాషలో, వారి మాతృభాషలో సామాన్యులకు చేరవేస్తూన్నారు కదా?

డా. వికాస్: అవుననుకో....నువ్వుచెప్పేది నిజమే... కానీ....

అక్తర్: సర్....కానీ.... అవునూ అంటారేంటి సార్... మీరు చేసే పరిశోదన గూర్చి మీకే బాగా తెలుసు కాబట్టి ఆ విషయాలను మీరైతేనే ఖచ్చితంగా చెప్పగలరు. ఏ పత్రికా విలేఖరో లేదా మరో సైన్స్ రచయితో మీరు చెప్పి విషయాలను అంట ఖచ్చితంగా ప్రజలకు చేరవేయలేరుకదా?

డా. వికాస్: అవును.... నువ్వున్నది నిజమే... జన్యుమార్పిడి పంటల గూర్చి ఈ మధ్య ఒక ఇంటర్వ్య్హు ఇచ్చాను. నెను చెప్పిందోకటే... అతను రాసింది మరొకటి.....

అమల: అందుకే కదా సార్.... తమ పరిశోధనల గూర్చి సామాన్య ప్రజలకు శాస్త్రజ్ఞాలే తెలియజేస్తే బాగుంటుంది. శ్రమ అనుకోకుండా మీరే ఈ పని చేయండి. ఇందుకు కొంత సమయం కేటాయిస్తేనే కదా మీ పరిశోధనలు ఫలించినట్లు, అందుకు చేసిన వ్యయం సద్వినియగమైనట్లు....

డా. జ్యోతి: అమ్మో.. మీతో మాట్లాడటం అంట ఈజీ కాదు... మీరు ఎంతో తెలివైన వాళ్ళు.

అమల: అదేం. లేదు మేడం... మికన్నానా? మీరు పెద్దపెద్ద చదువులు చదివి శాస్త్రవేత్తలయ్యారు. జన్యుమార్పిడి పంటలన్నారు. వాటి గూర్చి ... చెప్పారు....

డా. జ్యోతి: జన్యు మార్పిడి పంటలు... సరికొత్త వ్యవసాయ పంటలు.... శాస్త్రవేత్తల కృషి ఫలితంగా... ఈవంటలు అందుబాటులోకి వచ్చాయి.

ఆడమ్: అదేదో జన్యుమార్పిడి వంకాయ అంటున్నారు. ఇంతకు ముందు బి.టి పత్తి గూర్చి చాలా విన్నాం. టమాట, బంగాళదుంప, వరి .... మరి అనేక జన్యుమార్పిడి పంటలు వచ్చాయి కదా....

డా. వికాస్ : అవును... నువ్వు చెప్పినట్టె వచ్చాయి.

అక్తర్: ఇవి తింటే ఆరోగ్యానికి హాని అంటున్నారు... ఈ విషయం గూర్చి చెప్పరూ......

డా.వికాస్: తప్పకుండా... ఇప్పుడు రకరకాల జన్యుమార్పిడి పంటలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటి వినియోగం వల్ల కలిగే లాభనష్టాల గూర్చి తెలిసుకుందాం మొదట లాభాల గూర్చి చెబుతా...

అమల: జన్యుమార్పిడి పంటల వల్ల లాభాలున్నాయా?

డా.జ్యోతి : ఉన్నాయి జన్యుమారిపిడి పంటలలో వైరస్ , కిటక గుల్మనాశక నిరోధక లక్షనాలున్నాయి. అలాగే బాక్టీరియా మరియు శిలింద్ర వ్యాధులను తట్టుకొనే గుణాలూ ఉన్నాయి.

ఆడమ్ : ఇంతేనంటారా?

డా. జ్యోతి : ఇంతే కాదు మరికొన్ని లాభాలు ఉన్నాయి. జన్యు పరివర్తిక టొమాటోలు నిలవ రవాణాకు అనుకూలం కోసిన తరువాత ఆలస్యంగా పండబారటం వల్ల అమ్మకానికి పెట్టినా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే జన్యు పరివర్తత సంకరవిత్తణాలు తయారీలో ఉపయోగిస్తారు. అలాగే జన్యు పరివర్తిత సంకరవిత్తనాలు తయారీలో ఉపయోగిస్తారు. జన్యు పరివర్తిత బసుమతి వరి రకం చలి కరువు క్షార వేడి మొదలుగు ప్రతికూల పరిస్ధితులను బాగా తట్టుకోంది.

అక్తర్ : జన్యుమార్పిడి పంటలు మేలైన పంట ఉప్తత్తుల నివ్వడమే  కాకుండా మరే విధంగానైనా ఉపయోగపడుతాయా?

డా.జ్యోతి : మంచి ప్రశ్న అడిగారు.. ఎందుకులేవు. మనకవసరమైన మేలురకం ఇన్సులిన్, ఇంటర్ ఫెరాన్ పెరుగుదల హోర్మోన్లు, సుక్ష్మజివనాశకాలు ప్రతి రక్షకాలు తదితర జీవరసాయనాలను అందిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే మొక్కలను జీవ కర్మాగారాలు గా వాడుకొంటూ మనకు అవసరమై ఔషధాలు రసాయనాలు తదితరాలను పెద్దయేత్తున ఉత్పత్తి చేయవచ్చు.

అమల: మరి ఆ పంటల గూర్చి నెలకొన్న భయాల మాటేమిటి?

డా. వికాస్ : ముఖ్యమైన ప్రశ్న అడిగావ్ ప్రపంచ వ్యాప్తంగా జన్యుమార్పిడి పంటల సేద్యం పెరుగుతున్న ఈ నేపధ్యంలో ఈ పంటల వినియోగానికి సంబంధించి ప్రజల్లో అనేక భయాలు, అనుమానాలు నెలకొని ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచ ప్రజలందరికి ఆహార భద్రత చేకురాలంటే జన్యుమార్పిడి పంటలు సేద్యం తప్పదు మరి.

వికాస్: అలాగే కొన్ని ముఖ్యమైన భయాందోలనలను ప్రస్తావిస్తా.

-      జన్యుమార్పిడి ఆహారం నుండి అలేర్జి కారకాలు మానవులు, పశువుల్లోకి చేరచ్చు

-      అను సేద్యం వల్ల కూరగాయల ప్రాధమిక లక్షణాలే మారిపోమించవచ్చని.

-      ఇది కృత్రిమంగా ఏర్పడినందున జివవైవిద్యానిక తద్వారా పర్యావరణ ప్రమాదకారిగా పరినమించవచ్చిని

-      జన్యు కాలుష్యానికి అవకాశం ఉన్నందున మహకలుపుమొక్కలు (సూపర్ విడ్స్ అభివృద్ధి చెందవచ్చిని)

-      జన్యు పరివర్తిక మొక్కలు సహజజివ పరిణామక్రమంలో మార్పు తేవచ్చని భయపడుతున్నారు.

అక్తర్ : మేడం మరైతే జన్యు పరివర్తిత మొక్కల వల్ల కలిగే అవాంచనియ పరిణామాలను నివారించే రక్షణలు లేవా.

డా. జ్యోతి : భారత వ్యవసాయ రంగంలో జన్యుమార్పిడి పంటల పై నెలకొన్న అందోళనలను తొలిగించడానికి భారత ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు చట్టాలు ఏర్పరిచంది. ప్రమాదక్ర సూక్ష్మ జీవులు, జన్యు ఇంజనీరింగ్ చేయాలి. జీవుల కణాల తయారీ వినియోగం దిగుమతి నిల్వల పై పూనా సంమోజన జన్యుపదార్ధం భద్రటకు సంభంధించి మార్గదర్శకాలు చట్టపరమైన చర్యలు ఇలా వున్నాయి.

-      ప్రయోగ సంస్ధల్లో పరిశోధనల తీరును ప్రిశిలించడానికి సంస్దాగత బయో సేఫ్టీ కమిటి (IBCS) నెలకొల్ప బడ్డాయి.

-      ప్రయోగశాలల్లో జన్యుమార్పిడి పరిశోధనల సమీక్ష కమిటి (RCGM) ఏర్పాటు చేసింది.

-      కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అధ్వర్యంలో జన్యు ఇంజనీరింగ్ అమోడి కమిటి (GEAC) నెలకొల్పింది.

అమల: మేడం... మరైతే... జన్యుమార్పిడి పంటలను వాడటానికి భయపడాల్సిన పనిలేదంటారు.

డా.జ్యోతి : ప్రభుత్వ నియమనిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేట్లు చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వేతర సంస్ధలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండి, ప్రజలను చైతన్య పరచాలి, జన విజ్ఞాన వేదిక వంటి సంస్ధలు ఈ విషయంలో వంటి సంస్ధలు ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాలును గట్టిగా వ్యతిరేకించాయి.

ఆడమ్, అక్తర్, అమల: సర్... మేడం... చాలా చాలా ధ్యాంక్స్ జన్యుమార్పిడి పంటల గూర్చి అనేక విషయాలు చెప్పారు.

డా. వికాస్: సంతోషం ... మీరు తెలుసు కున్న విషయాలు ఇతరులకూ చెప్పండి... ఆ ... మీరు చెప్పినట్లు ఇక ప్రచార సాధనాలకు శాస్త్ర విషయాల గూర్చి నేనే రాస్తా... సరేనా....

ఆడమ్: సరే... సరే... మామాట మన్నించి నందుకు ... నమస్తే... సార్.... వేల్లోస్తాం...

డా. వికాస్: సరే... అలాగే....

ఆధారం: సమ్మెట గోవర్ధన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate