অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రీయ దృష్టి

శాస్త్రీయ దృష్టి

అప్పుడే క్లాసు ముగించుకుని ఒక మాష్టరు వెళ్లిపోయాడు. మరో క్లాసు మొదలయ్యేలోగా పిల్లలంతా వాళ్లకు తోచిన విధంగా ఆటల్లో, ముచ్చట్లలో మునిగిపోయారు. ఇంతలో వివేక్ తన ముందు బెంచీలో కూర్చున్న తన మిత్రుడు విశాల్ ను పిలిచి, నేనొకటి రాస్తాను. గుర్తుపడతావా? అని అడిగాడు. విశాల్ అందుకు ఓ దానికేముంది! రాసుకో చెబుతానని తన బెంచీ నుండీ వెనుకు తిరిగి కూర్చున్నాడు.

వివేక్ ఒక అంకెవేశాడు తన నోటు పుస్తకంపై. మరుక్షణమే విశాల్ ఇదా! నువ్వు రాసింది. “ఆరు'' అన్నాడు. అందుకు వివేక్ నవ్వేసి కాదు. నేను రాసింది. తొమ్మిది అన్నాడు. ఇద్దరూ వారివారి వాదనలను పట్టువిడవకుండా ఒకింత మొండిగానే వాదించుకుంటున్నారు. ఈలోగా క్లాసులోకి వచ్చిన మాష్టారిని కూడా వారు గమనించలేదు. క్లాసంతా నిశ్శబ్దం. కేవలం వారి మాటలే వినపడుతున్నాయి. ప్రక్కనున్న వారి స్నేహితులు సార్ వచ్చిన సంగతిని సైగ చేస్తున్నారు. మాష్టారు వారిని వారించి, ఆయనే ఇద్దరి దగ్గరకూ వెళ్లారు. వారిద్దరూ తప్పు చేసిన వాళ్లలా లేచి నిలుచున్నారు. మాష్టారు నవ్వి “ఏమిటి. మీ సమస్య?” అంటూ భుజం మీద చేయివేసి అడిగారు. మిత్రులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కానీ మాట్లాడలేదు. మళ్ళీ మాష్టారే పర్వాలేదు, చెప్పండి అంటూ ప్రోత్సహించారు. వివేక్ తను రాసిన ‘తొమ్మిది'ని విశాల్ 'ఆరు' అంటున్నాడన్న విషయం చెప్పాడు. మాష్టారు “చాలా మంచి సందేహం”. సరే ఇద్దర్నీ కూర్చోబెట్టి మొత్తం విద్యార్థుల్ని ఈ విషయం పై చర్చింపచేశారు. నేను వ్రాసిందే కరెక్టంటాడు వివేక్, నేను కూడ కరక్టే కదా సార్ అంటారు విశాల్. ఇద్దరూ కరక్ట్ అన్నాడు మాష్టారు. క్లాను క్లాసంతా ఇద్దరూ కరెక్టేలాసార్ అని గొంతుకలిపారు. ఎవరి దృష్టిలో వారు కరక్టేనన్నారు మాష్టారు. కానీ అక్కడ రాసింది '9' అయినా కావాలి లేకుంటే '6' అయినా కావాలి కదా!?

అవునా! అది చూసే వాళ్ళ దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళవాళ్ళ దృష్టిలో ఇద్దరూ కరెక్టే. వివేక్ రాసిన దాన్ని ఒక వైపు నుంచి చూస్తున్నాడు. అదే అంకెను విశాల్ పూర్తి వ్యతిరేక దిశ నుండి చూస్తున్నాడు. అందుకే ఈ తేడా వచ్చింది.

“మరి అసలు వాస్తవం తేలేదెట్లా సార్' విద్యార్థులు ప్రశ్న.

“అందుకు మనం శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఆలోచన చేయాలి. మనం నిత్య జీవితంలో చాలా విషయాలను హేతుబద్ధంగా ఆలోచించక ఈ రోజు వివేక్, విశాల్ ల కొచ్చిన సందిగ్ధంలోనే పడతాం! మన జీవితంలో శాస్త్రీయ దృష్టి సహేతుకంగా ఆలోచించడం అవసరం అని చెప్పడానికే ఈ రోజు వీళ్ళ నంశయాన్ని మీ అందరితో చర్చిస్తున్నా. ఉదాహరణ కి వివేక్ రాసిన '9' అంకె ముందు '8' రాస్తే అప్పుడు అది ఇరువురికీ ఒకే లాగ కనిపిస్తుంది కదా! అప్పుడు వివాదమే రాదు ఇంకొంచెం ముందుకు వెళ్ళి 7 అంకెను రాయండి. ఇప్పుడు చెప్పండి ఇదేలా కనిపిస్తుంది. విశాల్?” నాకది ఒక అంకే కాదు సార్. అది ఇంగ్లీషు ఎల్ అన్నాడు విశాల్.

అవును వేవేక్ దీన్ని ఏడు అంటే విశాల్ అది ఒక అంకె కాదంటున్నాడు. ఇలా మనం రకరకాల దృష్టికోణాలతో అలోచించినప్పుడు మనకవి వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ అక్కడ ఆ అక్షరం రాయటం వస్తవరం కదా ! సరైన అవగాహనకు ఎలావస్తాం ! సక్రమంగా అలోచించినప్పుడు. సక్రమంగా అంటే ఏమిటి మాస్టారూ ? మళ్ళి కాస్లంతా ఒకే హేతుబద్ధమైన ఆలోచనలతో .... అదెలా అని గదా మీ సందేహం.

మనం మళ్ళి 9 అంకేనే ఉదాహరణగా తీసుకుందాం. కేవలం ఈ ఒక్క అంకెనే విడదీసి చూస్తే సరైన అవగాహనకు రాలేం. తొమ్మిదికి ముందు, వెనుక ఎటువంటి అంకెలున్నాయో పరిశీలించాలి. అప్పుడు మనం చూస్తున్నది ఆరా, తొమ్మిదా అనేది సృష్టమవుతుంది. విశాల్ తల్లకిందులుగా చూడటం వలన తొమ్మిది ఆరులా కాన్పి౦చింది. వివేక్ ను  తాను రాసిన అంకెకు ముందు అంకెను తర్వాతి అంకెను వ్రాయమని అడగాలి. అప్పుడు వివేక్ వ్రాసిన అంకెను తేలిగ్గా చెప్పవచ్చు. నిత్యజీవితంలో కూడ దేన్నీ విడదీసి చూడలేం. సమయం, సందర్భాన్ని బట్టి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతీది సమగ్ర దృష్టితో చూడాలి. అప్పుడే అసలు నిజం బయట పడుతుంది".

“మీరు మొన్న చెప్పిన 'ఏనుగు, ఏడుగురు గుడ్డి వాళ్ళ ఉదాహరణలాగా సార్!” “అవును. ఆ కథలో ఒక ఏనుగును ఏడుగురు గుడ్డి వాళ్లు వరిశీలించి, ఒకరు స్తంభంలా ఉందనీ, మరొకరు చేటలా ఉందనీ రకరకాలుగా చెబుతారు గదా!”. “అవును సార్. వాళ్లు చూడలేరు కదా!” పిల్లల సమాధానం.

“అయినా వారి పరిశీలనలో వాస్తవాలు ఉన్నాయి. వారు గమనించినవి వాస్తవాలే కదా! కాళ్ళు స్తంభంలా ఉంటే, చెవులు చేటల్లా ఉంటాయి కదా! అవి సత్యమే. కానీ అవి పాక్షిక సత్యాలు మాత్రమే. పూర్తి నిజం కావాలంటే మనకు చూస్తు న్నదావట్ల ఒక నమగ్ర అవగాహన కావాలి. మనకు ఆ అవగాహన లోపిస్తే మనకూ దృష్టిలేని వారికి మధ్య వ్యత్యాసం ఉండదు. అందుకే మన పరిశీలనలో అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. భిన్న కోణాల నుంచి ఆలోచించి, హేతుబద్ధంగా బేరీజు వేసుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఇటువంటి ఆలోచనను మనం అభివృద్ధి చేసుకుంటే తప్పులు చేసే అవకాశాలు ఉండవు. శాస్త్రీయ దృష్టి అంటే అన్ని కోణాల నుండి పరిశీలించడం, నిజానిజాలను బేరీజు వేసుకొని నిర్ణయానికి రావటమన్నమాట".

*****

decs3ఒక రోజు రాత్రి జనవిజ్ఞాన వేదిక వాళ్ళు మా స్కూల్లో, స్కైషో ఏర్పాటు చేశారు. ఆకాశంలో ఎన్నడూ గమనించని నక్షత్ర సమూహాలను, మనం రోజూ చూస్తున్నా అవేమిటో తెలియని వింతను 'టెలిస్కోప్'లో చూపించారు. ఇంత మంచి ప్రదర్శనకు తప్పక వస్తానన్న నా మిత్రుడు మాత్రం రాలేదు. ఎందుకు రాలేదని మర్నాడు అడిగాను. అడగడం కాదు తిట్టాను. కారణం చెప్పమని అంటే నేనొక్కణ్ణి చీకట్లో వచ్చేందుకు భయం వేసి రాలేకపోయానని చెప్పాడు. రోజూ

రోజు మనం వచ్చే దారే కదా, భయం దేనికి? అలా అనుకుంటే నేనే నీ దగ్గరకొచ్చి కలిసి వచ్చేవాళ్ళం కదా అన్నాను. అసలు విషయం చెబితే నవ్వుతాననీ చెప్పలేదట. ఏమిటా అసలు విషయం? అదే భయం. ఆ భయం ఎందువలన? దారిలో ఉన్న మర్రిచెట్టుపై దయ్యాలుంటాయని వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడో చెప్పిందట.  దయ్యాలుంటాయని నమ్ముతున్నావా? వాటిని ఎప్పుడైనా చూశావా? అంటూ ప్రశ్నలతో నిలదీసినంత పని చేశాను.

నా మిత్రుడు దయ్యాలను చూశానని, అవి ఉన్నాయని , నమ్ముతానని చెప్పాడు. నాకు ఆశ్చర్యం  వేసింది. ఎక్కడ చూశావని అడిగాను. కలలో చూశానన్నాడు. ఈసారి మాత్రం  నిజంగానే నవ్వేశాను. కలలో వచ్చిందానికి నిజమని నమ్మేన్ భయపడుతున్నావా? ఇలా అయితే మనం చదువుకుని ఏమి ప్రయోజనం, దేన్నైనా నమ్మేముందు శాస్త్రీయంగా  ఆలోచించాలని మన సైన్సు మాష్టారు చెప్పింది మర్చిపోయావా? నీకు కన్పించింది దయ్యాలే అని ఎలా నిర్ధారించుకుంటావు? తను మూర్ఖంగా నమ్మటం లేదనీ, చూసింది దయ్యాలేనని, వాటి పాదాలు వెనకకు తిరిగి ఉన్నాయనీ చెప్పాడు. చూశానని, అవి ఉన్నాయని చెప్పాడు.

అప్పుడే క్లాసులోని వచ్చిన సైన్సు మాష్టారు మా చర్చను ఆసక్తితో గమనించడాన్ని వేమిద్దరమ గుర్తించనేలేదు. మా క్లాస్ మేట్స్ సైగ చేయటంతో మేమిద్దరం గప్ చుప్ అయిపోయాం కాని మాష్టారు మాత్రం ఆ విషయాన్ని వదిలి పెట్టకుండా మా మధ్య చర్చకు పెట్టి విశ్లేషించారు. మనం పగలు తిరిగిన పంటచేలు వంటి వివిధ ప్రదేశాలకు రాత్రి వేళ వెళ్లడానికి జంకుతామెందుకు? పగలు ఉన్న వస్తువులు, చెట్లు, రాత్రి కూడా అక్కడే వుంటాయి. మేం రోజూ చూసే మర్రి చెట్టు దగ్గరకు రాత్రి వెళ్లేందుకు భయం ఎందుకు? దీన్ని విశ్లేషించి మరీ చెప్పారు మాస్టార్. చిన్నతనంలో

మనం విన్న విషయాలు మనసుల్లో బాగా నాటుకుంటాయి, నీ మిత్రుడి విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళ అమ్మమ్మ మర్రిచెట్బ మీద దయ్యాలుంటాయన్న మాటతో గుండెల్లో భయం గూడుకట్టుకుంది. అందువలననే రాత్రి కలలో కూడా తనకు దయ్యాలు కనిపించాయి. కనిపించాయి అంటే ఎక్కడో ఒకచోట ఉన్నాయనే కదా మాష్టారూ అన్నాం మేమంతా, మాష్టారు నవ్వారు. అవి ఎలా కనిపించాయి? నీవు అనుకున్నట్లే కనిపించాయి. నీవు వాటి కాళ్ళు, పాదాలు వెనకు తిరిగి ఉంటాయని విని ఉన్నావు. ఆ ప్రకారమే నీకు కనిపించాయి. పాదాలు నెత్తిమీద కనిపించాయా - కనిపించలేదు కదా! కలలు కూడా మన పూహలకు లోబడే వస్తాయి. దయ్యాలు వికృతంగా ఉంటాయని మన వూహం వల్లనే అది వికృతంగా కన్పిస్తాయి. నిజంగా అటువంటి జీవులు ఉన్నాయి అని నిర్ధారించుకోవాలి కదా!

మనం ఎప్పుడైనా, ఎక్కడైనా పాదాలు వెనకుతిరిగిన జంతువుల్ని చూశామా? అవి నిజంగా ఉంటే ఒక్క నీ మిత్రుడికే కాకుండా మన అందరికీ ఎందుకు కనిపించవు? కనిపించితేనీ మిత్రుడికైనా కలలోనే ఎందుకు కనిపించాలి? వాస్తవంలో ఎందుకు కనిపించలేదు? ఇటువంటి  హేతుబద్ధమైన ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. అప్పుంటే దేన్నైనా నమ్మటమో, మానటమో చేయాలి. అంతేకాని ఏవో కట్టుకథల్ని విని సమ్మేసి భయపడకూదదు. రోజు పగలు చూసే వస్తువులు, జంతువులు, చెట్లే రాత్రిళ్లూ వుంటాయి. కానీ చీకటిలో వేరే ఏవో ఆకారాలుగా ఊహించుకుని భయపడుతూ ఉంటారు. “రజ్జుసర్ప భ్రాంతి” గురించి విన్నారా ఎప్పుడైనా? తాడును పాముగా భ్రమపడటం అన్నమాట. చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాం. పగలైతే అలా అనుకునే ఆస్కారం లేదు. రాత్రిళ్లో కనపడదు కాబట్టి భయపడతాం. తేడా ఒక్కటే "వెలుతురు" లేక పోవటం. ఎల్లవేళలా హేతుబదమైన ఆలోచన, శాస్త్రీయ దృష్టి వుంటే అది మనకు “వెలుతురు"లా ఉపయోగపడి నిజాన్ని నిగ్కతేలుస్తుంది. ఆ వెలుతురే జ్ఞానం.

ఆధారం: డా. కట్టా సత్యప్రసాద్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate