పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సగ్గు బియ్యం – కర్ర పెండలం

కస్సావా చెట్లనుండి వచ్చేవే కర్రపెండలం దుంపలు.

1కీర్తనకు జ్వరం వచ్చింది.

“కాస్త తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పెట్టండి.” అన్నాడు డాక్టర్.

”సగ్గుబియ్యం జావ ఇస్తే మంచిది.” అని కూడా చెప్పాడు.

హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత - ”సగ్గు బియ్యమా? ఓఖ్... నేను తినను. ” అన్నది కీర్తన.

కీర్తన ఎనిమిదేళ్ళ అమ్మాయి.

”అదేమిట్రా – నువ్వు మొన్న కేరళ వెళ్ళినప్పుడు టాపియోకా చిప్స్ బాగానే తిన్నావుగా.” అన్నాడు నాన్న.

”టాపియోకా ఉడికించి ఇస్తే నారాయణ్ కుట్టి ఇంట్లో తింటూ మరీ మరీ ఆ దుంపలను తిన్నావు.” అన్నది అమ్మ.

ఠటాపియోకా, సగ్గుబియ్యం ఒక్కటేనేంటి?” అంది ఉక్రోషంగా కీర్తన.

”టపియోకానే మనం తెలుగులో ‘కర్రపెండలం‘ అంటాం. కర్ర పెండలం నుండి ముత్యాల్లాగా తయారైన గింజలే సగ్గుబియ్యం. హిందీలో కర్రపెండలాన్ని ’సిమ్లా ఆలు’ అని పిలుస్తారు. ’మరగెనుసు’ అని కన్నడంలో, మళయాలంలో ‘కప్పా’ అని కూడా పిలుస్తారు. ” అని చెప్పింది అమ్మ.

”మరి అరపంలో? ” చిలిపిగా అడిగింది కీర్తన.

ఠమఱవెళ్ళి కిఱగ్ను, అని కుచ్చికుఱగ్ను, అని అంటారు” అన్నాడు నాన్న.

”టాపియోకా తింటాను కాని సగ్గుబియ్యం జావ మాత్రం తాగను.” అన్నది కీర్తన మెండిగ.

”అమ్మ చాలా రుచిగా జావ చేస్తుంది నాన్నా – రుచి చూసింతర్వాత చెప్దువుగాని.” అన్నాడు నాన్న.

ఒప్పుకుంటున్నట్లే మొహం పెట్టింది కీర్తన.

కస్సావా చెట్లనుండి వచ్చేవే కర్రపెండలం దుంపలు. దీని శాస్త్రీయ నామం మేనిహాట్ ఎన్మ్యులేంటా. ఈ దుంపల్నే టాపియోకా అని పిలుస్తున్నాం.

పోర్చుగీసు వారు ఇండియాకు వచ్చినప్పుడు ఈ కర్రపెండలం దుంపలను భారతదేశానికి పరిటయం చేశారు. నిజానికి ఇది బ్రెజిల్ దేశంలో విరివిగా పండుతుంది. పోర్చుగీసు వారు మన దేశానికి కర్రపెండలంతో పాటు ఆలుగడ్డలను, విరపకాయలను, మొక్కజొన్ననీ తీసుకుని వచ్చి మనకు అలవాటు చేశారు. అంతకు ముందు మనం కారం తినాలంటే మిరియాల మీదనే ఆధారపడేవాళ్లం. పోర్చగీసు వాళ్లే ఈ కర్ర పెండలం దుంపలను ఆఫ్రికా ఖండానికి, ఆసియా ఖండానికి తీసుకువచ్చారు.

ఈనాడు ఆఫ్రికాలో వారి సంప్రదాయ పంటలు పోయి వాటి స్థానంలో కర్రపెండలాన్నే విరివిగా పండించడమే కాకుండా వారికి అదే ముఖ్యమైన ఆహారంగా మారింది. దీన్ని ”ఉష్మమండలం రొట్టె”  గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు.

అయితే కస్సావా దుంపల్లో సైయెనోజిన్స్ అనే విషపదార్థం ఈ సైయెనోజిన్స్ నుండే వస్తుంది. అయితే వీటిని తినేటప్పుడు కొన్ని రోజులు నీళ్ళల్లో నానబెట్టి వాటి తోలు వలిచేసి ఎండబెడతారు. తర్వాత దాన్ని ఉడకబెడతారు. ఈ విధంగా ఈ దుంపలో వుండే సైయెనోజిన్స్ తొలిగిపోతాయి. అప్పుడు దీన్ని టాపియోకా అని పిలుస్తారు. (ఒకప్పుడు మన మార్కెట్లో వుడే ఎర్రని కేసరిపప్పు తినడం వలన పక్షవాతం వస్తుందని గుర్తించారు. కేసరిపప్పు యొక్క శాస్త్రీయ నామం లాధిరస్ సటైనస్. అయితే భారత్ వ్యవసాయ పరిశోధనా సంస్థా (IARI) కేసరిపప్పులోని విషాన్ని తొలిగించి కొత్తవంగడాలను అభివృద్ధి చేసింది.)

ఆఫ్రికా ఖండంలో ఈ కర్రపెండలం దుంపలు సుమారు 500 మిలియన్ల ఆఫ్రికన్లకు ముఖ్యమైన ఆహారం. నైజీరియా దేశం ఈ దుంపలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో రెండు తెగుళ్ళు ఈ పంటను నాశనం చేస్తున్నాయి. ఒకటి కస్సావా మచ్చల తెగులు (cassava mosaic disease) ఇది కస్సావా చెట్ల ఆకుల్ని తినేస్తుంది. పెండవది గోధుమ రంగు రేఖల తెగులు (Brown streak disease) ఇది దుంపలను నాశనం చేస్తుంది.

”భారతీయ ఆహార పదార్థాల్లో పోషక విలువలు – సంతృప్తికరమైన ఆహార ప్రణాళిక” అనే పుస్కం కర్రపెండలంలో 60 శాతం నీరు ఉందని తెలుపుతున్నది. ఒక్క గుక్కలో తినే దుంపలో 157 కెలారీల శక్తి వుంది. ఇందులో 389 గ్రా. పిండిపదార్థం వుంది. 1.2 గ్రా. లవణాలు, 0.6 గ్రా. పీచుపదార్థం, 0.7 గ్రా. మాంసకృతులు, 0.2 గ్రా. క్రొవ్వు ఉంది. కాల్షియం లవణం అధికంగా వుంది. కాని మాంసకృత్తులు ఎక్కువగా లేకపోవడం వలన ఎక్కువ ఫోషకవిలువలు లేవు.

ఈ కర్రపెండలం దుంపలను సంపూర్ణ ఫోషక విలువలు కలిగిన ఆహారంగా తయారు చేయడానికి బయోకస్సావా  ప్లస్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ ఒక అంతర్జాతీయ సహకార సంస్థ. ఈ సంస్థలో జాతీయ దుంప పంటల సంస్థ – నైజీరియా, కెన్యా వ్యవసాయ సంస్థ – కెన్యా, సేయింట్ లుయీస్ లోని డాస్ఫోర్త్ మొక్కల విజ్ఞాన శాస్త్ర కేంద్రం – అమెరికా మొదలైన సంస్థలు సభ్యులు. ఈ సంస్థ పెట్టుకున్న లక్ష్యాలేమిటంటే –

  1. ఈ దుంపల్లో జింక్, ఐరన్ లవణాల ఆరింతల అభివృద్ధి.
  2. నాలుగింతలుగా మాంసకృతుల అభివృద్ధి.
  3. పదింతలుగా విటమిన్లు ఎ, ఇలా అభివృద్ది.
  4. వైరస్ తెగులు అంటని వంగడాల అభివృద్ది.
  5. పంట చేతికి వచ్చినంక దుంప తొందరగా పాడైపోకుండా చూడటం.
  6. పదింతలుగా సైయోనోజిన్స్ తగ్గుదల.

వీటన్నింటిలో కూడా బయోకస్సా ప్లస్ సంస్థ ప్రగతి సాదించింది. ఇప్పుడు వీళ్ళు పివణి వీధిలోకి తెస్తున్న కస్సావా వంగడాల్లో సైయోనోజిన్స్ తగ్గిపోవడమే కాకుండా మాంసకృత్తులు, అమినో ఆమ్లలు పెరిగిపోతాయి. ఎంజైములు గణనీయంగా పెరిగాయి. మాలిక్యులార్ బయాలజీ సాధించిన విజయం ఇది.

గేట్స్ ఫౌండేషన్ (మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్ గేట్స్ స్థాపించిన సంస్థ) కూడా బయోకస్సావా ప్లస్ గ్రూపుకి ఆర్థికంగా సాయపడుతున్నది.

”అంతా టాపియోకా గురించే చెప్పావు. మరి నేను తినాల్సిన సగ్గుబియ్యం గురించి మాత్రం చెప్పనేలేదు. ” అని గొఱిగింది కీర్తన.

నవ్వుతూ కూర్తన తలమీద ఒక మొట్టికాయ వేసింది అమ్మ.

టాపియాకా దుంపల్ని బాగా నీళ్ళల్లో నానబెట్టి తోలువలచి మిషన్లలో దంచడం వల్ల పాలు వస్తాయి. ఈ పాలను 8, 9 గంటల పాటు నిలుపజేస్తారు. అప్పుడు ఇందులోని మలినాలన్నీ పైకి తేలి తొట్టు కడతాయి. ఈ తొట్టుని తొలగించి యంత్రాల ద్వారా ఈ పాలను గుండ్రని ముత్యాలను వేయించి సగ్గుబియ్యం చేస్తారు. కొన్ని సార్లు ఈ గుండ్రని ముత్యాలను వేయించకుండా ఉడికించి ఆరబెడతారు. వీటిని నైలాన్ సగ్గుబియ్యం అంటారు. సగ్గుబియ్యం చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం.

సగ్గుబియ్యం కావాలంటే ముందుగా కర్రపెండలం తోటలు వేయాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కర్రపెండలము తోటలున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 70,000 ఎకరాల్లో ఈ పంటసాగు చేస్తారు.

కాని గత సంవత్సరం 2011 లో వర్షపాతం తక్కువగా నమోదు కావటం వలన పంట సరిగ్గా చేతికిరాలేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు. రైతు ఒక్కొక్క ఎకరాకు 15,000 రూపాయలు వెచ్చిస్తే పంట అమ్ముకుంటే కేవలం 9,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయని రైతులంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లాల్లో కర్రపెండలం సాగు రైతు సంగం వుంది. కర్రపెండలాంనికి ప్రభుత్వం కనీసమద్ధతు ధర ప్రకటించాలని రైతులు కోరుకుంటున్నారు. కర్రపెండలం నుండి సగ్గుబియ్యం తయారుచేసే రైతులు ఇక్కడ ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. అదే ఆంధ్ర సాగో అసోసియేషన్. ఈ ప్రాంతంలో 32 సగ్గుబియ్యం ఫ్యాక్టరీలు ఉత్పత్తిని నిలిపివోశాయి.

బయట మార్కెట్లో ధరలు తారాజువ్వల్లా ఆకాశంలోకి పయనిస్తున్నా రైతు దగ్గరకు వచ్చేసరికి అమ్ముకుందామంటే ధరలు తగ్గుతున్నాయి. ‘అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి’ అన్న చందంగా వుంది. రైతు పరిస్థితి. గలకాలంలో 90 కిలోగ్రాముల బస్తాను 3,000 రూపాయలకు అమ్మిన రైతు నేడు కేవలం 2,000 రూపాయలకే అమ్ముకుంటున్న పరిస్తితి ఎదురవుతుంది.

కర్రపెండలం కులు ఏరిపట్టుపురుగుల పెంపకానికి పనికి వస్తాయి. దాంతో పట్టుదారం తయారవుతుంది. ఈ దిశగా రైతులు ఆలోచించాలి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వం ఆదుకోవాలి. అప్పుడే ఈ దేశంలో రైతులు బతికి బట్టకడతారు.

”రైతుల్ని బతికించే ప్రభుత్వం ఎప్పుడొస్తుంది? ” అడిగింది కీర్తన.

”అది ప్రజల చేతుల్లో అంటే ఓటుల్లో వుంది. ” అని చెప్పాడు నాన్న.

రచన; పైడిముక్కల ఆనంద్ కుమార్

3.0
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు