অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సైన్సుకూ చరిత్ర ఉంది

సైన్సుకూ చరిత్ర ఉంది

sc1“పిల్లలూ, మిమ్మల్ని ఇప్పుడు సైన్సుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేస్తాను. సమాధానాలు చెప్తారా?“ అడిగాడు సైన్సు మాస్టారు శ్రీనివాస్.

“చెప్తాం మాస్టారు.“ అరిచారు పిల్లలు.

“భూమి చుట్టుకొలత ఎంత? తెలిసిన వాళ్ళు చెయెత్తండి.“

కిరణ్ చెయెత్తాడు.

“చెప్పు.“ అన్నాడు మాస్టారు.

“40,074 కిలోమీటర్లు మాస్టారు.“ సమాధానం చెప్పాడు కిరణ్.

“వెరిగుడ్, ఇప్పుడు ఇంకో ప్రశ్న. భూకంపాలను కొలిచే సాధనం ఏమిటి?“

చాలా మంది చేతులెత్తారు.

“సాయిలక్ష్మీ, నీవు చెప్పు.“ అడిగాడు మాస్టారు.

“సెస్మోగ్రాఫ్ మాస్టారు.“ అంది సాయిలక్ష్మీ.

“ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు వేస్తాను. భూమి చుట్టు కొలతను పరికరాలతో కొలిచి, చాలా కొద్ది తేడాతో, మొదటిసారిగా చెప్పిన శాస్త్రజ్ఞుడెవరు?“

క్లాసంతా మౌనం.

“ఏ సంవత్సరంలో ఆ శాస్త్రజ్ఞుడు భూమి చుట్టు కొలతను కొలిచి చెప్పాడు?“

మరల మౌనం.

“సెస్మోగ్రాఫ్ తో ప్రపంచంలో మెట్టమెదట ఏ శాస్త్రజ్ఞుడు 600 కి.మీ. దూరాన వచ్చిన భూకంపాన్ని ఏ సంవత్సరంలో చెప్పాడు?“

మరలా క్లాసంతా మౌనం.

“ఇలాంటివన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?“

“ఉంది మాస్టారు. “ అన్నారు పిల్లలందరూ.

“ఇవన్నీ సైన్సుకు సంబంధించిన విషయాలు. ఇలాంటి విషయాలన్నీ వేల సంవత్సరాలుగా లక్షలాది మంది శాస్త్రవేత్తల నిరంతర కృషి  కారణంగా కనుగొనబడ్డాయి. ఆ సైన్సు ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. సైన్సు కూడా ఓ చరిత్ర ఉంది. అనాది నుండి మానవుడు ప్రకృతిని గూర్చి తెలుసుకోవడానికీ, ప్రకృతిని జయించడానికి తీవ్రమైన కృషిసల్పాడు. ఆ కృషికి, విజయాలకు సంబంధించిన వివరాలను, అంటే సైన్సు చరిత్రను మనమందరం తెలుసుకోవాలి. ఆ చరిత్రను మనమందరం తెలుసుకోవాలి. ఆ చరిత్రను మీకు వివరిస్తాను. కొన్ని లక్షల ఏళ్ల క్రితం... “ అని మాస్టారు ఏదో చెప్పబోయేలోగా, సిద్దూ లేచి “భూమి చుట్టుకొలత మాస్టారు.“ అన్నాడు మెల్లగా.

సూర్య లేచి “భూకంపం మాస్టారు.“ అన్నాడు చిన్నగా.

“ఓ.కె., ఓ.కె. ఆ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంది కదా?“ అని చెప్పి, తర్వాతే సైన్సు చరిత్రలోకి వెళ్తాను. గ్రీకు శాస్త్రవేత్త ఎరటోస్తనీస్ క్రీ.పూ.240 లో భూమి చుట్టుకొలతను కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడంటే, ఆ సంవత్సరం వేసవి కాలంలో జూన్ 21వ తేదీన సియెన్ అనే ప్రదేశంలోనూ, దానికి 800 కి.మీ. దూరంలో ఉన్న అలెగ్జాండ్రియా పట్టణంలోనూ రెండు స్తంభాలు పాతించి, మధ్యాహ్నం 12 గంటల వేళ సియెన్ పట్టణంలో స్థంభం నీడ పడని సమయంలో అలెగ్జాండ్రియాలో స్థంభం నీడ 7.2o గా ఉండటాన్ని కొలిచాడు. ఆ దూరము, నీడ కోణాన్ని బట్టి, లెక్కించి భూమి చుట్టుకొలత 40,555 కి.మీ. అని చెప్పాడు. ఇది ఆధునిక భూగోళ శాస్త్రజ్ఞుల లెక్కల కంటే 500 కి.మీ. మాత్రమే తేడా. భూమి చుట్టు కొలత దాదాపు ఖచ్చితంగా క్రీ.పూ. 240 సంవత్సరాల నాడే చెప్పిన ఎరటోస్తనీస్ గొప్ప శాస్త్రవేత్త గదా? అలాగే చాంగ్ హెంగ్ అనే చైనా శాస్త్రవేత్త  క్రీ.శ. 2వ శతాబ్దంలోనే భూకంప తీవ్రతను లెక్కించే సీస్మోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్నాడు. దాని సాయంతో క్రీ.శ. 132 లో చైనా రాజధాని నగరానికి 600 కి.మీ. దూరంలో ఉన్న ఫట్టణంలో చాలా తీవ్రత గల భూకంపం వచ్చిందని, ఆ పట్టణానికి పెద్ద ఎత్తున ఆస్తునష్టం, ప్రాణనష్టం కలిగిందనీ రాజుగారికి చెప్పాడు. అదే విషయాన్ని గుర్రాలపై ప్రయాణించిన దూతలు, కొన్ని రోజుల తర్వాత వచ్చి, రాజుగారికి చెప్పారు. ఇలా దాదాపు 1900 ఏళ్ళ క్రితం సీస్మోగ్రాఫ్ ను కనుగొన్న శాస్త్రజ్ఞుడు ఎంతో ప్రతిభావంతుడు గదా?“ అన్నాడు మాస్టారు.

“మాస్టారు, ఒక చిన్న సందేహం.“ అన్నాడు జహంగీర్.

“అడుగు.“ అన్నాడు మాస్టారు నవ్వుతూ.

“ఇందాక మీరు లక్షలాది మంది శాస్త్రవేత్తల నిరంతర కృషి కారణంగా సైన్సు అభివృద్ధి అయిందన్నారు. అన్ని లక్షల మంది శాస్త్రవేత్తలున్నారా?“ అడిగాడు జహంగీర్.

“ఉన్నారు జహంగీర్, ప్రాచీనకాలంలో కనుగొనబడ్డ నిప్పు తయారీ, చక్రం, బాణం ఇలాంటి నూతన ఆవిష్కరణలు ఆనాడు నివసించిన వందలాది మంది మానవుల సమిష్టి కృషి ఫలితమే. వారందరూ శాస్త్రవేత్తలే. ఇలా వేలాది సంవత్సరాల కాలంలో కృషి చేసిన వారందరి శ్రమ ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న సైన్స్ విజయాలు. అవి తెలుసుకోబోయే ముందు సైన్సు అంటే ఏమిటో నిర్వచించుకుందాం. సైన్సు ను ఎవరైనా నిర్వచించగలరా?“ అడిగాడు మాస్టారు.

“శాస్త్రవేత్తల ప్రయోగాల ఫలితమే సైన్సు. “ సమాధానమిచ్చాడు రాజశేఖర్.

“రుజువు చేయబడిన విషయాలే సైన్,.“ సిద్దూ సమాధానం.

sc2మాస్టారు నవ్వుతూ “ఇద్దరి నిర్వచనాలు కరెక్టే. శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి ఒక అంశాన్ని రుజువు చేస్తారు. ఆ అంశం ఎవరు, ఎక్కుడ, ఏ కాలంలో ప్రయోగానికి గురి చేసినా అదే ఫలితం వస్తుంది. ఉదాహరణకు ప్రాచీనకాలపు మానవులు “నిప్పులో వేలుపెడితే కాలుతుంది.“ అని తెలుసుకున్నారు. అది సైన్సు. ఆ సైన్సు అంశాన్ని ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ప్రయోగం చేసినా అదే ఫలితం వస్తుంది గదా? ఆ సైన్సు చరిత్రనే మనం తెలుసుకుందాం. వచ్చే క్లాసులో.“ అని ముగించారు సైన్సు మాస్టారు.

మొరటు రాళ్ల నుండి మట్టి కుండల దాకా...

పిల్లలూ, సైన్సు చరిత్రలో ఒక గొప్ప విశేషం ఉంది. సైన్సు పురోగతికి, మానవ జాతి ప్రగతికీ విడదీయరాని సంబంధం ఉంది. ఏ మేరకు మానవజాతి ప్రగతి సాధించింది. మానవులకు మరింత సౌకర్యవంతమైన జీవితం లభించింది. ఉదాహరణకు మానవుడు నిప్పు యొక్క ఉపయోగం తెలుసుకున్న తరువాత అతని జీవితం ఎంతో సుఖవంతమవుతుంది. గుహలలో రాత్రిళ్లు వేసుకున్న నెగళ్ల మంటల వలన ఆనాటి మానవుడు క్రూర మృగాల గుహల దరిదాపులకు రాకుండా చేసుకొని, నిశ్చితంగా  నిద్ర పోగలిగాడు. మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకుని  మరింత చుచి కరమైన ఆహారం తినగల్గాడు. అలా సైన్సు పురోగతి సాధించేకొద్దీ మానవుడు మరింత సుఖపడ్డాడు, ఇప్పుడు సైన్సు చరిత్రను తెలుసుకుందాం. సైంటిస్టులు వానర దశ నుండి మానవుడు పరిమాణం చెందాడని నిరూపించారని మీకు తెలుసుగదా. అలా నాలుగు కాళ్లపై తిరిగే కోతి దశ నుంచి రెండు కాళ్ళపై నడిచే మానవుడుగా ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం పరిమాణం చెందాడు? సౌజన్య... నువ్వు చెప్పమ్మా.“ అడిగాడు మాస్టారు.

“ఇప్పటికి సుమారు 44 లక్షల సంవత్సరాల క్రితం మాస్టారు.“ అంది సౌజన్య.

“అవునమ్మ, శాస్త్రజ్ఞులు ప్రకటించిన ఆ పరిశోధనా ఫలితాన్ని సైన్సు అనే ప్రముఖ మాస పత్రిక 2009 వ సంవత్సరాపు మేటి డిస్కవరీగా ప్రకటించింది. అప్పటివరకు ముందు కాళ్ళుగా పనిచేస్తున్న అవయవాలు అప్పటి నుంచి చేతులుగా ఉపయోగపడసాగాయి. వాటితో రాళ్లనో, కర్రలనో, ఎముకలనో పట్టుకొని జంతువులను చంపడం, వాటిని తినడం మానవుడు చేయసాగాడు. జంతువులకు, మానవులకు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే పరికరాలను గాని, ఆయుధాలను గాని ఉపయోగించడం కోతుల వంటి జంతువులకూ తెలుసు. కాని మానవుని ప్రత్యేకత ఏమిటంటే పరికరాలను, ఆయుధాలను తయారు చేయడం నేర్చుకున్నాడు. ఉదాహరణకు మానవుడు క్రమక్రమంగా రాతిని మరింత పదునుగా చేయడం నేర్చుకున్నాడు. అనేక పరకరాలను తయారు చేశాడు. ప్రపంచంలోని అనేక గుహల వద్ద దొరికిన రాతి పరికరాలను రేడియో కార్బన్ పద్ధితిలో పరిశోధిస్తే కొన్ని లక్షల సంవత్సరాలనాటి రాతి పరికరాల కంటే, 1, 2 లక్షల ఏళ్ల నాటి పరికరాలు మరింత పదును తేలి ఉండటం, కొన్ని వేల ఏళ్ల నాటి పరికరాలు ఇంకా మొనతేలి ఉండడం శాస్త్రజ్ఞులు గమనించారు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను. మొదట్లో మానవుడు ఎక్కడ నివసించేవారు? నీవు చెప్పు మనోహర్.“ అని అడిగాడు మాస్టారు.

“కౌండ గుహల్లో మాస్టారు.“ మనోహర్ చెప్పాడు. అవును. అతి ప్రాచీన కాలంలో మానవులు కొండ గుహల్లో నివసించేవారు. ఆ కాలాన్ని పాత రాతి యుగం అని శాస్త్రజ్ఞులు పిలిచారు. వారు హెచ్చులూడి కొనతేలిన రాళ్లనే ఆయుధాలుగా చేసుకొని జంతువులను వేటాడి ఆ పచ్చి మాంసాన్నే తినేవారు. మొదట్లో వారికి నిప్పును తయారుచేసుకోవడమే కాదు, నిప్పును ఉపయోగించడం కూడా తెలియదు. అగ్ని పర్వతాలు పేలడం వలన అడువులలో దావానలం పుట్టినప్పుడూ చెలరేగిన నిప్పును చూసి మొదట్లో భయపడేవారు. కాని ఆ నిప్పును చూసి, భయపడి, క్రూర జంతువులు పారిపోవడం గమనించారు. ఆ మంటల్లో కలిన జంతువుల మాంసం రుచిగా ఉండటం కూడా చెలుసుకున్నారు. అలా నిప్పు ఉపయోగాలను అర్థం చేసుకున్నారు. ఆనాటి మానవుడు కాలుతున్న చెట్టు కొమ్మను తన గుహ వద్దకు లాగుకొని వచ్చి, దానికి మరికొన్ని కొమ్మలను, ఎండుటాకులను, చేర్చి  ఆ నిప్పు ఆరకుండా చూసుకున్నాడు. ఇందాక చెప్పినట్లు ఆ నిప్పు వలన క్రూర మృగాలు దగ్గరకు రాకుండాను, మరింత రుచికరమైన మాంసాన్ని తినగలిగేటట్లు చేసుకుని తన జీవితాన్ని  మరింత సుఖరకరం చేసుకున్నాడు. ప్రపంచంలో కొన్ని గుహల వద్ద పేరుకున్న బూడిద గుట్లను పరిశోధించగా, మానవుడు దాదాపు పది లక్షల ఏళ్ల నాటికి ఆ రకంగా నిప్పును ఉపయోగించుకునే వాడని అర్థమవుతోంది. ఆ తర్వాత చాలా కాలానికి నిప్పును తయారు చేయడం నేర్చుకున్నాడు. అడవులలో, ఎండకాలంలో గాలికి రాసుకుంటున్న రెండు ఎండు కొమ్మల నుండి నిప్పు రవ్వలు రాలడం, అవి కిందనున్న ఎండుటాకులపై పడి మంట పుట్టడం చూసిగాని, రాతి పరికరాలను మరింత పదును పెట్టేటప్పుడు నిప్పు రవ్వలు పుట్టి అవి కింద ఎండుటాకుల మీద పడి మంటమండటం చూసిగాని, నిప్పును తయారు చేయడం నేర్చుకున్నాడు.

ఇది చెకుముకి రాళ్ల ద్వారా నిప్పును తయారు చేసే విదానం. ఇది సైన్సు చరిత్రలో అతి ముఖ్యమైన విషయం. నిప్పు వలన ఆదిమానవుడు రాత్రులలో చలిగాలుల నుంచి తననుతాను కాపాడుకోగలిగాడు. ఇది నిప్పు వలన మరో ఉపయోగం. మానవుడి సఖమయ జీవితానికి మరో మెట్టు. పాత రాతి యుగంగా పిలవబడే ఆ కాలంలో మానవుడు అనేక సైన్సు ఫలితాలు సాధించాడు. వాటిని ఆ తరువాత క్లాసులో వివరిస్తాను.“ అని తెలిపాడు మాస్టారు.

sc3“పిల్లలూ! ఆదిమానవులు రాళ్ళను, ఎముకలను మరింత కొనతేలేటట్లు పదును పెట్టడం ద్వారా పనిముట్లను, ఆయుధాలను మెరుగుపరుచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. సమాధానం తెలిసిన వారు చేయెత్తండి. ఆదిమ మానవులు చర్మంతో బట్టలు, చెప్పులు, బూటు కుట్టుకున్నారు. అది ఎలా సాధ్యమయిందో ఆ పరిణామాన్ని ఊహించి చెప్పండి.” అడిగాడు శ్రీనివాస్ మాస్టారు.

నలుగురు పిల్లలు చేయెత్తారు. “సిద్దూ! నువ్వు చెప్పు” అన్నారు మాస్టారు.

“మొదట్లో మాంసం తినగా మిగిలిన చర్మాన్ని చుట్టుకుంటే వెచ్చగా, హాయిగా ఉండటాన్ని వాళ్ళు గమనించి, చర్మాన్ని కప్పుకోసాగారు. వాటిని ఎప్పుడూ పట్టుకొని ఉంటే వేటాడటానికి ఇబ్బందిగా ఉండేది. అందువలన సన్నని, కొనదేలిన ఎముకముక్కతో రెండు చివరలూ బొక్కలు చేసి జంతువుల నరాలతో కుట్టుకుని తిరిగేవారు. తర్వాత చర్మాన్ని ముక్కలు చేసి తలకు, ఒంటికి, చేతులకు విడివిడిగా చర్మాలతో తయారుచేసిన బట్టలను ధరించేవారు. అలాగే కాళ్ళకు కూడ చర్మపు పాదరక్షలను తయారు చేసుకొని వాడటం నేర్చుకున్నారు. క్రమంగా కుట్టే పరికరాన్ని, అది ఎముక ముక్కగానీ, చెక్క ముక్కగానీ మరింత  పయోగకరంగా ఉండేటట్లు వాటికి కన్నాలు పొడిచి, నరాలను ఎక్కించి కుట్టడం వరకు నేర్చుకున్నారు. ఇదీ మాస్టారూ! చర్మపు బట్టల, పాదరక్షల తయారీకి సంబంధించిన పరిణామం” అన్నాడు సిద్దూ.

“బాగుంది సిద్దూ! బాగానే ఊహించావు. ఇలా బట్టలూ, పాదరక్షలూ తయారు చేసుకొని ధరించడం మొదలయ్యాక ఆదిమ మానవులకు అడవులలో విశాల ప్రాంతాలలో తిరిగే సామర్ధ్యం పెరిగిందని ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు జె.డి. బెర్నాల్ తాను వ్రాసిన చరిత్రలో సైన్స్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఆ తరువాత వారు ఆహారం, నీరు నిల్వ చేసి తీసుకువెళ్ళడానికి అవసరమైన సంచుల వంటివాటిని తోలుతో తయారు చేశారు. ఆ సంచీలు తయారైన తర్వాత మానవులు సాధించిన గొప్ప సైన్సు విజయం నీటిని వేడి చేయడం. అది ఎలా చేసేవారంటే, రాళ్ళను కాల్చి, ఆ వేడిరాళ్ళను తోలుసంచిలోని నీళ్ళలో పడవేసేవారు. అలా రాళ్ళను కాల్చి నీటిలో వేయడం వలన పగిలిన రాళ్ళు, ఆదిమానవులు నివసించిన నివాసాల వద్ద లభించాయి. తర్వాతి సైన్సు ఆవిష్కరణ వెదురుతో బుట్టలు అల్లడం. తర్వాత కొంతకాలానికి మరోగాప్ప ఆవిష్కరణ జరిగింది. అదేమిటంటే వెదురుబట్టలకు మట్టిపూసి వాటిని కాల్చడం, అలా కాల్చిన బుట్టల్లో నీరు నిలువ ఉండేది. ఆ బట్టల్లో నీరును వేడిచేయడం చేసేవారు. ఒక ఇబ్బంది ఏమిటంటే ఆ బుట్టలకు ఎక్కువ మట్టిని పూయడం వలన అవి చాల బరువుగా ఉండేవి. మోసుకుపోవడానికి వీలయ్యేది కాదు. ఈ బట్టలు మరో గొప్ప ఆవిష్కరణకు దారితీస్తాయి. అదేమిటంటే, పాతరాతి యుగపు మానవులు ఆ బుట్టలలో పోసిన ద్రవపదార్ధాలు నిల్వ ఉంచితే అవి పులియడం, కొన్ని మార్పులకు గురికావడం గమనించారు. ఈ పరిశీలన పదార్థాలను పులియ బెట్టడం అనే గొప్ప ఆవిష్కరణకు దారితీసింది. దీని తర్వాత వారు తోళ్ళను నానబెట్టి శుభ్రం చేయడం, రంగుల తయారీ వంటి విజయాలు సాధించారు. ఆ కాలంలోనే వారు కొన్ని ఔషదాలు కూడ తయారు చేయగలిగారని చరిత్రకారులు అర్ధం చేసుకున్నారు" అన్నారు మాస్టారు.

“మాస్టారూ! పాతరాతి యుగంలోనే వారు రంగుల తయారీ చేసేవారు అనే దానికి రుజువులేమయినా ఉన్నాయా?” అడిగాడు సూర్యాంశ్.

“మంచి ప్రశ్న. పాతరాతి యుగపు మానవులు నివశించిన గుహలలో, వారు వేసిన చిత్రాలు యీనాటికీ ఉన్నాయి. వాటికి వాడిన రంగులే మనకు ఆధారం" బదులిచ్చాడు మాస్టారు.

“ఆ కాలపు మానవులు జంతువులను వేటాడటమేనా? వాటిని మచ్చిక చేసుకున్నారా మాస్టారూ?" అడిగింది స్వాతి.

“పాతిరాతియుగంలోనే మానవులు కుక్కను మచ్చిక చేసుకున్నారమ్మా. దీనికి సంబంధించిన రుజువుల ఆనాటి మానవులు నివసించిన గుహల వద్ద దొరికాయి. ఇప్పుడు మరో ప్రశ్నవేస్తాను. చక్రం మానవుడు సాధించిన సైన్సు విజయాలలో ఒకటి. దీనిని పాతరాతి కాలంలోని మానవుడు ఎలా కనుగాని ఉంటాడు? సిరీ! నీవు ఊహించి చెప్పగలవా?” అడిగాడు మాస్టారు.

“చెబుతాను మాస్టారూ! గాలివానకు విరిగిన చెట్టుకొమ్మల్లో ఒకదాని మీద ఒకటి క్రాస్ గా పడిపోయి ఉంటాయి. పైనున్న కొమ్మను పిల్లలు కూడ జరపగలగటం గమనించి ఉంటారు. కాబట్టి గుండ్రని వస్తువుపై బరువైన వస్తువును తేలికగా జరపగలమని ఆనాటి మానవులు అర్థం చేసుకునానరు. ఆ అంశాన్ని గూర్చి అనేక ప్రయోగాలు చేసి, ఈనాటి చక్రాన్ని రూపొందించి ఉంటారు మాస్టారూ!" అంది సిరి.

“అవునమ్మా! అలాగే జరిగి ఉంటుంది. సైన్సు ఆవిష్కరణలలో చాలా భాగం ఇలా రూపొందించబడ్డవే. ఆ ఆ కాలంలోని మరో గొప్ప ఆవిష్కరణ విల్లు. వెదురుబద్దను వంచినపుడు శక్తిపోగవుతుందనీ, దానిని వదలినపుడు ఆ శక్తి విడుదల అవుతుందని మానవుడు గమనించాడు. దాని అభివృద్ధియే విల్లును కనుగొనటం. పాతరాతి యుగపు చివరి రోజుల్లో మానవుడు యీ విజయాన్ని సాధించాడు. అయితే శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం వెదురుబుట్టలకు మట్టిపూసిన కుండలు కాకుండా మట్టితో కుండలను తయారు చేయడంతో పాతరాతి యుగం అంతమయింది. కాకపోతే యీ కుండలు చాల బరువుగా ఉండేవి.

కొత్తరాతి యుగం

sc4పిల్లలూ! ఇవీ పాతరాతి యుగం నాటి సైన్సు విజయాలు. అంటే దాదాపు ఇప్పటికి 12,000 సంవత్సరాల నాటి సైన్సు విజయాలు. అప్పటి నుండి సైన్సు, మానవజాతి అభివృద్ధి, రెండూ వేగంగా, జమిలిగా కొనసాగాయి. వాటిని గూర్చి వచ్చే క్లాసులో ముచ్చటించుకుందాం' అంటూ ముగించారు.” సైన్సు మాస్టారు.

“పిల్లలూ! ఇప్పటికీ దాదాపు 12,000 సంవత్సరాల క్రిందట పాతరాతి యుగం అంతమై, కొత్తరాతియుగం ప్రారంభమయింది. ఈ కాలాన్ని కొత్తరాతియుగం అని ఎందుకు అన్నారంటే... ఈ కాలంలో రాళ్ళను పదును పెట్టడం కాకుండా రాళ్ళతో అనేక పనిముట్లు, ఆయుధాలు తయారు చేయబడ్డాయి. రాతి కొడవళ్ళు, రాతి గదలు, వాటిలో కూడా ఎముక పిడి కల్గినవి. రాతి కొడవళ్ళు అత్యంత పదునైనవి తయారు చేయబడ్డాయి. కొత్తరాతి యుగం దాదాపు క్రీ.పూ. 3000 వరకు, అంటే ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటి వరకు కొనసాగింది. ఈ కాలంలో మానవులు సాధించిన గొప్ప గొప్ప సైన్సు విజయాలలో.... పశువుల మచ్చిక, వ్యవసాయం చాలా ముఖ్యమైనవి. మానవుడు పశువులను ఎలా మచ్చిక చేసుకున్నాడో ఎవరైనా ఊహించి చెప్పగలరా?” అడిగారు సైన్సు మాస్టారు శ్రీనివాస్.

సాయిలక్ష్మి చేయెత్తింది.

“చెప్పు.“ అన్నారు చిరునవ్వుతో మాస్టారు.

“పూర్వకాలంలో మన పూర్వీకులు జంతువుల వేట కోసం గుంపులుగా వెళ్ళేవారు. అప్పుడు వాటి గుంపును మూడు వైపుల నుండి తరిమేశారు. అవి పారిపోతూ ఉండగా వెనుకవైపు నుండి రాతి గదలతో కొట్టిన దెబ్బలకు ఒక్కసారిగా నాలుగైదు జంతువులు కాళ్ళు, నడుములు విరిగి, క్రిందపడిపోయి ఉంటాయి. వాటినన్నింటిని ఒక్క రోజులో తినలేరు కదా? అందుకని ఒకదానిని చంపి తిని మిగిలిన వాటిని తర్వాత తిందామనుకుని వాటిని అడవి తీగలతోనూ, గడ్డితాళ్ళతోను కట్టివేసి ఉంటారు. అవి చస్తే తమకు పనికిరావు కదా. కాబట్టి, అవి బ్రతికి ఉండటం కోసం అవి తినగలిగే మాంసమో, గింజలో, గడ్డినో ఆహారంగా పెడుతూ ఉండి ఉంటారు. ఒక్కోసారి ఎక్కువ జంతువులు గాయపడితే నాలుగైదు వారాల వరకు కూడా వాటికి ఆహారం పెట్టవలసి వచ్చేది. అప్పుడవి మనుషులు కనిపిస్తే బుసకొట్టడం మాని మోరపైకెత్తి మనుషుల చేతిలో ఉన్న ఆహారం వైపు చూసి ఉంటాయి. అపుడు ఆ ఆహారాన్ని గనక వేస్తే తమకు మచ్చిక అవుతాయని మానవులు గ్రహించి ఉంటారు. మచ్చిక అయిన జంతువుల తమకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆహారంగా ఉపయోగపడతాయని గ్రహించి జంతువులను పెద్ద సంఖ్యలో రకరకాల పద్ధతుల ద్వారా పట్టుకొని, కట్టిపడేసి, వాటికి ఆహారం అందించి మానవులు మచ్చిక చేసుకున్నారు. ఇదీ పశువులు మచ్చిక అయిన పద్ధతి.“ ముగించింది సాయిలక్ష్మి,

“మాస్టారూ! సాయిలక్ష్మి చూసినట్టే చెప్పిందండీ. “ అంది నవ్య. క్లాసంతా నవ్వారు.

“మరి మాస్టారు ఊహించమన్నారుగా. నాకు చేతనయినట్లు ఊహించాను.“ అంది సాయిలక్ష్మి,

“కరెక్ట్ గానే ఊహించావమ్మా.“ అన్నారు మెచ్చుకోలుగా మాస్టారు.

“మాస్టారూ! అన్ని జంతువులలోకి మొదటగా మచ్చిక అయిన జంతువు ఏది?“ అడిగాడు జహంగీర్.

sc5“పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మానవునికి మొట్టమొదటగా మచ్చిక అయిన జంతువు కుక్క. అది మచ్చిక అయిన తర్వాత మానవునికి వేటలో సహాయ పడటమే కాకుండా, మానవుడు తినగా మిగిలిన మాంసంతోనే సంతృప్తిపడేది. ఆనాటి నుండి ఈనాటి వరకు మానవునికి ఎంతో విశ్వాస పాత్రంగా సేవ చేస్తున్నది. కుక్క తరువాతనే మానవులు గేదెలు ఆవులు, దున్నలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నారు. సైన్సులో ఈ విజయం మానవుల జీవితాలను మరింత సుఖవంతం చేసింది. ఇప్పుడు మరో ప్రశ్న వేస్తాను. మానవులు వ్యవసాయం చేయడాన్ని ఎలా కనుగొన్నారు? దానికి దారి తీసిన భౌతిక పరిస్థితులు ఏమిటి? దీన్ని కూడా ఊహించి చెప్పండి.“ అని ప్రశ్నించారు మాస్టారు. దీనికి సంబంధించిన క్లూ ఒకటి సాయిలక్ష్మి చెప్పింది.

ఆ మాటతో పదిమంది చేతులెత్తారు.

“రాజశేఖర్. నీవు చెప్పు“ అన్నారు మాస్టారు.

“మచ్చిక చేయబడ్డ పశువుల కోసం తమ చుట్టుపక్కల పిచ్చిగా పెరుగుతున్న గడ్డిమొక్కలను కోసి గింజలతో సహా పశువులకు మానవులు వేసేవారు. తరువాత క్రమంగా పశువుల కోసం ఆ గడ్డి గింజల పెరుగుదలను అధ్యయనం చేశారు. వాటిని పెంచసాగారు. అలా పశువుల మేత కోసం మొదలైన గడ్డిగింజల పెంపకం బాగా విస్తరించింది. ఆ గింజలు పశువులేకాదు, తామైనా ఎందుకు తినగూడదని ఆలోచించి, అనేక ప్రయత్నాల తర్వాత ఆ గింజలను - రాతిపై నూరి, పొట్టు మరిన్ని వివరాల కోసం ప్రతి సంవత్సరం అనేక విషయాలు గమనించడం మొదలెట్టారు. ఆ గింజలు ఏ నేలల్లో మొక్కలై పెరుగుతాయి? వాటికి ఎంతనీరు కావాలి? ఏ వాతావరణంలో బాగా పెరుగుతాయి? మొదలైనవన్నీ గమనించి ఆ గింజల పెంపకాన్ని అభివృద్ధి చేశారు. అదే వ్యవసాయం అనే నూతన సైన్సు విజయంగా మారింది.“ అన్నాడు రాజశేఖర్.

“గుడ్. రాజశేఖర్. బాగా ఊహించావు. వ్యవసాయానికి సంబంధించిన మరికొన్ని విషయాలు చెబుతాను. కొత్తరాతి యుగపు మానవులు మొదటగా వ్యవసాయం ద్వారా సాగు చేసిన గింజలు గోధుమ, బార్లీలు అని పరిశోధకులు కనుగొన్నారు. ఉదాహరణకు నైలు నదికి పడమర దిక్కున ఉన్న ఫయూమ్ సరస్సు ఒడ్డున క్రీ.పూ. 4300 అంటే ఇప్పటికీ 6300 సంవత్సరాల ప్రాంతంలో లభించిన వస్తువుల్ని పరిశీలిస్తే, ఆ ప్రాంతంలో ఆనాడు మానవులు నివసించారనీ, వారు గోధుమ, బార్లీ పంటలను పండించారనీ తెలుస్తోంది. అంతేకాదు అక్కడ ధాన్యాన్ని నిలువ చేయడానికి అంచుల్లో గడ్డి పెట్టిన గరిశెల శిథిలాలు కనిపించాయి. అలాగే మధ్య ఐరోపాలో జరిగిన అనేక తవ్వకాల్లో గోధుమ, బార్లీ ధాన్యాల అవశేషాలు, రకరకాలైన వ్యవసాయ పనిముట్లు, పశువులు, పందులు, గొర్రెలు ఎముకలు లభించాయి. ఈ నాగరికతను డాన్యూబ్ నదీ నాగరికత అని చరిత్రకారులు పిలిచారు. డాన్యూబియన్లు వ్యవసాయాన్ని ఎంతగా అధ్యయనం చేశారంటే, నిస్సారమైన పొలాల్లో కలుపు మొక్కల్ని పెరగనిచ్చి, తరువాత వాటిని ఆ పొలంలోనే కాల్చేస్తే, ఆ బూడిద పొలాన్ని మళ్ళీ సారవంతం చేస్తుందని వారు కనుగొన్నారు. ఇవీ కొత్తరాతి యుగానికి చెందిన రెండు ముఖ్య విశేషాలు. ఈ కాలానికి చెందిన మరికొన్ని సైన్సు విజయాలను వచ్చే క్లాసులో ముచ్చటించుకుందాం.“ అంటూ ఆ రోజు క్లాసు ముగించారు సైన్సు మాస్టారు.

june9“పిల్లలూ! కొత్తరాతి యుగంలో మానవులు సాధించిన మరికొన్ని సైన్సు విజయాలు వివరిస్తాను. వారు రాట్నాన్ని తయారుచేశారు. దానితో మొదట గొర్రెల ఉన్నితో దారం తీయడం నేర్చుకున్నారు. మగ్గాల్లాంటి యంత్రాల్ని తయారుచేసి, వాటితో బట్టల్ని నేయడం నేర్చుకున్నారు. తరువాత క్రమంగా గోగునార, జనపనార వంటి నారలతో, ఆ తర్వాత పత్తితో, పట్టుతో దారం తీయడం నేర్చుకొని, బట్టల్ని నేశారు. అలాగే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు పాలను ఇస్తాయనీ, అవి విలువైన ఆహారమనీ కనుగొని, వాటిని త్రాగడం మొదలెట్టారు.” అంటూ ఆ రోజు క్లాసు మొదలెట్టారు శ్రీనివాస్ మాస్టారు.

“వారు ఇళ్ళు ఎలా కట్టుకున్నారు మాస్టారూ?” అడిగాడు తేజ.

“ఇళ్ళగోడలను వారు మట్టి, రాయి, కర్ర, మట్టిపూసిన పేము బెత్తపు తడికలతో కట్టుకునేవారు. పైన గడ్డి కప్పేవారు. అంటే వారి ఇళ్ళు దాదాపుగా యీనాటి గుడిసెలను పోలి ఉండేవి. ఇలాంటి గుడిసెలు కూలిపోతే వాటి శిథిలాల మీదే కొత్త ఇళ్ళు కట్టుకున్నారు. ఇలాంటి శిథిలాలు చిన్నదిబ్బలుగా రూపొందాయి. ఇలాంటి దిబ్బలు వేలసంఖ్యలో గ్రీస్ లో, నదితీరాల్లో టర్కీ పీఠ భూమిలో, సిరియా గడ్డి బీళ్ళలో కనిపించాయి. వీటిలో మనకు కనిపించే పొరల్ని ఆధారం చేసుకొని, ఆ ప్రాంతంలోని ప్రాచీనమైన పల్లె ఎప్పటిదో శాస్త్రజ్ఞులు నిర్ణయిస్తారు. june10పురావస్తు శాస్త్రవేత్తలు ఇలాంటి పరిశోధనల ప్రకారం, పాలస్తీనాలో, జెరూసలేం దగ్గరగా ఉన్న ఒక ఒయాసిస్ ప్రక్కన నిర్మింపబడిన 'జెరికో' అనే గ్రామం ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన గ్రామంగా నిర్ణయించబడింది. కొందరు శాస్త్రజ్ఞులు 'జెరికో'ను ప్రపంచంలోని మొదటి పట్టణంగా వర్ణించారు. ఇంతకీ యీ గ్రామ లేక పట్టణ వైశాల్యం దాదాపు 10 ఎకరాలు మాత్రమే. దీనిని 7000 బి.సి.లో అంటే ఇప్పటికి 9000 సంవత్సరాల క్రితం నిర్మించారని ఆ పట్టణ శిథిలాలపై జరిపిన పరీక్షలు రుజువులు చేస్తున్నాయి. ఆ పట్టణ వివరాలు చెబుతాను వినండి. జనాభా 2000, 3000 మధ్యలో, పట్టణం చుట్టూ రాతిని చెక్కి 27 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు ఉన్న అగడ్డను తవ్వారు. అక్కడి ప్రజలు ఆహారాన్ని సేకరించుకోవడమే కాకుండా, ఆహారాన్ని పండించుకుంటూ, గొర్రెలను పెంచుకుంటూ జీవించారు. విశేషమేమంటే వారు చనిపోయిన వారిని తమ ఇళ్ళలోనే భూమిలో పాతి పెట్టేవారు. ‘అమ్మ దేవత’ బొమ్మలు ఆ పట్టణంలో చాలా కనిపించాయి. అంటే వారు 'అమ్మ దేవత'ను పూజించే వారన్నమాట. ఇవీ కొత్తరాతి యుగపు పట్టణ విశేషాలు. ఆ కాలం నాటి మతాచారాలకు సంబంధించిన మరికొన్ని విశేషాల్ని వివరిస్తాను. అదేమిటంటే ప్రకృతిలోని సృజనశక్తికి పురుష చిహ్నంగా రాతితో చేసిన లింగాలు అనటాలియా (ఇరాక్ కు ఉత్తర ప్రాంతం), ఇంగ్లాండ్, బాల్కన్ (అనటోలియాకు వాయువ్య ప్రాంతం)లో కనిపించాయి. అంటే కొత్తరాతి యుగం నాటికే యూరప్ లోని అనేక ప్రాంతాల్లో లింగాకారానికి పూజలు జరిగేవన్నమాట. అంతేకాదు. ఆ కాలం నుండే ప్రజలకు మంత్రతంత్రాలకు సంబంధించిన మూఢనమ్మకాలు ఉండేవి. మధ్యధరా సముద్ర ప్రాంతంలో లభించిన ఆ కాలం నాటి తాయెత్తులే ఇందుకు సాక్ష్యం.” అన్నారు మాస్టారు.

june11“మాస్టారూ! ఈ రోజుల్లో లాగ ఆ రోజుల్లో కూడ వీళ్ళు యీ పని మాత్రమే చేయాలి, అనే పని విభజన ఉండేదా?” అడిగాడు సుందర్.

“సుందర్! ఒకే తెగలోని ప్రజల్లో అవకాశాన్ని బట్టి స్త్రీ పురుషుల మధ్య పని విభజన తప్ప వేరే రకంగా పని విభజన లేదు. ఉదాహరణకు ఆ కాలంలో పొలాన్ని దున్నడం, ధాన్యాన్ని దంచడం, వంట చేయడం, బట్టల్ని నేయడం, కుండల్ని చేయడం ఆడవాళ్ళు చేసేవారనీ పొలాన్ని చదునుచెయ్యడం, గుడిసెల్ని కట్టడం, పశువుల్ని మేపడం, వేటాడటం పురుషులు చేసేవారనీ ‘చరిత్రలో ఏం జరిగింది?' అనే గ్రంథ రచయిత గార్డెన్ చైల్డ్ పేర్కొన్నారు. అయితే వేరే వేరే తెగలు వేరే వేరే పనులు చేసేవనీ, ఆ తెగల మధ్య వస్తుమార్పిడీ ఉండేదనీ రుజువులు దొరికాయి. ఉదాహరణకు వేల్స్ ప్రాంతంలో మాత్రమే దొరికే రాతితో తయారుచేసిన గొడ్డళ్ళు ఇంగ్లాండ్ ప్రాంతంలో విరివిగా దొరికాయి. అంటే వేల్స్ ప్రాంతంలోని ప్రజలు రాతిగొడ్డళ్ళు తయారుచేసి ఇంగ్లాండ్ లోని ధాన్యంతోనో, వేటాడిన జంతువులతోనో మార్పిడి చేసుకునే వారన్నమాట.” అన్నారు మాస్టారు.

‘మాస్టారూ! సైన్సు వలన మానవజీవితం మరింత, మరింత సుఖవంతమైంది. కాని సైన్సును కొందరు స్వార్ధపరులు దుర్వినియోగం చేసి మానవ వినాశనానికి తోడ్పడ్డారు. అలాంటి దుర్వినియోగానికి - బీజాలు ఏవైనా ఆనాడే పడ్డాయా?" అడిగాడు కిరణ్.

“కిరణ్. చాలా బాధాకరమైనా చెప్పక తప్పదు. పాత రాతియుగం కాలంలోనే మానవులు కనుగొన్న అంశం కొన్ని పదార్థాలను నిల్వ ఉంచితే, అవి పులిసి, వాటిలో 'ఈస్ట్' అనే రసాయనిక ద్రవ్యం తయారౌతుందని. ఆ అంశాన్ని మరింతగా పరిశోధించి కొత్తరాతి యుగం మానవులు కల్లునూ, ఒకరకమైన బీరునూ తయారు చేయడం నేర్చుకున్నారు. దీనికి రుజువు ఏమిటంటే ఆధునిక కాలంలో కూడ దట్టమైన అడవుల్లో నివశిస్తున్న అనాగరిక జాతుల వారు ఏదో రకమైన మద్యాన్ని తయారు చేసుకొని తాగుతున్నారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు కదా? ఐనా వారు మద్యం ఎలా తయారు చేయగలుగుతున్నారు? అంటే అది వారికి వారసత్వంగా వచ్చిన సైన్సు విషయం అన్నమాట. మనకు లభించిన పురాతన వస్తువుల ఆధారంగా కొత్తరాతి యుగం వాళ్ళు తాగుడుకు అవసరమైన పానపాత్రలు, వడియగట్టే సాధనాలు, తాగుడు గొట్టాలు కలిగి ఉండేవారని తెలుస్తాయి. ఆ ప్రకారంగా సైన్సును దుర్వినియోగం చేయడం కూడ ఆనాడే మొదలైందనీ, తాగుడు మహమ్మారి ఆనాడే ప్రజలను పిప్పి చేయడం మొదలెట్టిందనీ రుజువవుతోంది.

పిల్లలూ! ఇవీ కొత్తరాతి యుగం నాటి సైన్సు విజయాలూ, విశేషాలూ. వచ్చే క్లాసులో లోహయుగం నాటి సైన్సు విజయాలు తెలుసుకుందాం.” అంటూ ముగించారు మాస్టారు.

కంచుయుగంలో సైన్స్ పురోగతి

aug12”పిల్లలూ! కొత్తరాతి యుగం దాదాపు క్రీ.పూ. 3000 వరకు కొనసాగిందనీ, ఆ తర్వాత లోహయుగం మొదలయిందని చెప్పానుగదా? ఆ యుగంలో క్రీ.పూ. 3000 నుండి క్రీ.పూ. 1200 వరకు గల కాలాన్ని కంచుయుగం గాను, క్రీ.పూ. 1200 నుండి క్రీ.పూ. 330 వరకు గల కాలాన్ని ఇనుపయుగం గానూ పురాతత్వ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు నిర్ణయించారు. క్రీ.పూ. 1200 వరకు కంచుయుగం అన్నారంటే, ఆ కాలంలో ఇనుము ఉపయోగంలో లేదని అనుకోకండి. కాకపోతే పనిముట్లు, ఆయుధాల తయారీలో కంచు లేక రాగి ప్రధానపాత్ర వహించాయి. అందువల్ల ఆ కాలాన్ని కంచు లేక రాగియుగం అన్నారు. ఇప్పుడు యీ కంచుయుగంలో జరిగిన ఆవిష్కరణలు, వాటి వలన జరిగిన మానవజాతి పురోగతిని గూర్చి చెబుతాను.” అంటూ మాస్టారు ఆ రోజు క్లాసు మొదలు పెట్టారు.

”కంచు యుగం యొక్క ప్రధాన ఆవిష్కరణ ఆ యుగం పేరే సూచించినట్లు కంచు, రాగి వస్తువుల తయారీ. రాగిలోహం ఉపయోగాన్ని మానవుడు ఎలా కనుగొన్నాడో ఎవరైనా ఊహించగలరా? ” అని అడిగాడు శ్రీనివాస్ మాస్టారు.

సిద్దూ చేయెత్తాడు. మాస్టారు నవ్వుతూ ”సరే చెప్పు. ” అన్నారు.

”రాగి యొక్క ఖనిజం ఎక్కడైనా భూమి పైపొరల్లో ఉండి, అక్కడ కార్చిచ్చు కారణంగా అడవి మండుతున్నప్పుడు, ఆ అధిక వేడికి అప్పటిదాకా రాయి, మట్టిలాగా ఉన్న ఆ ఖనిజం కరిగి పారడం మొదలై ఉంటుంది. కార్చిచ్చు ఆగిపోయిన తర్వాత కరిగి, పారిన ఆ కొత్తరకం రాతిమీద రాతిగదతో గట్టిగా కొడితే అది పగలకపోగా సాగి ఉంటుంది. తాము రోజూ వాడే రాతి ఆయుధం కంటే గట్టిదీ, త్వరగా పగలనిదీ, సాగేగుణం కలదీ అయిన ఆ కొత్త పదార్థాన్ని ముక్కలు చేసి, సాగగొట్టి, ఆనాటి మానవుడు ఆయుధంగా తయారు చేసుకొని ఉంటాడు. ఆ తర్వాత ఆ పదార్థం ఎలాంటి నేలల్లో దొరుకుతుందీ, దాన్ని వినియోగం లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది అనేక వందల సంవత్సరాల పరిశీలన, పరిశోధనల్లో నేర్చుకుని ఉంటాడు.” అన్నాడు సిద్దూ.

”గుడ్ సిద్దూ! బాగా చెప్పావు. మానవుడు ఖనిజాలన్నిటిని వినియోగంలోకి ఇలాగే తెచ్చుకొని ఉంటాడు. ముఖ్యమైన విషయమేమంటే, మానవుడు రాగితో తయారుచేసింది. మొదటగా ఆయుధాలే. పరికరాలు కాదు. దీనికి ఋజువేమిటంటే ఆ కాలంనాటి సమాధుల్లో మొదటగా కనిపించిన లోహ వస్తువుల ఆయుధాలే. పనిముట్లు కాదు. తర్వాత క్రమంగా రాగికి తగరాన్ని కలిపి కంచును తయారు చేయడం మానవుడు నేర్చుకున్నాడు, అలా రాగి, కంచు వస్తువుల తయారీ ఆ యుగంలో జరిగింది.

ఇక కంచుయుగంలో జరిగిన రెండవ ప్రధానమైన సైన్సు విజయం చక్రాలబళ్ళ తయారీ, మానవుడు అప్పటికే చక్రాన్ని కనుగొన్నాడు. జంతువులను మచ్చిక చేయగలిగాడు. కంచుయుగంలో ఈ రెండింటిని సమన్వయపరిచి రెండు లేక నాలుగు చక్రాల బండిని మానవుడు తయారుచేయగలిగాడు. దీనివలన మానవుల ప్రయాణాలు, వస్తువుల రవాణా మరింత సులభతరం అయింది.

aug13ఈ యుగంలోని మరో గొప్ప ఆవిష్కరణ పడవల తయారీ. దీనివలన నదులలో, సముద్రాలలో ప్రయాణాలు, రవాణా సులభమయ్యాయి. పడవలు ఈ కాలంలో మొట్ట మొదటిసారిగా మానవులు తయారుచేశారని చెప్పడానికి ఆధారం ఏమిటంటే,ఆ కాలం నాటి ఈజిప్టులోని సమాధిలోని పడవ నమూనా. విశేషం ఏమిటంటే, తెడ్లతో నడిపై పడవలనే కాకుండా, తెరచాప పడవలను కూడా ఈ కాలంలోనే తయారుచేశారనేందుకు ఆధారాలు దొరికాయి.

ఈ కాలంలోని మరో ముఖ్య ఆవిష్కరణ కుమ్మరిసారెపై కుండల తయారీ. దీనివలన అందమైన కుండలు వేగంగా తయారయ్యాయి. అలాగే యీ

యుగంలో కాల్చిన ఇటుకలను తయారుజేయడం మరో గొప్ప ఆవిష్కరణ. దీనివలన తమ ఇళ్ళను మరింత సౌకర్యవంతం చేసుకోగలిగారు. ” అన్నారు మాస్టారు.

”ఆ కాలంలో వ్యవసాయం ఏమన్నా అభివృద్ధి అయిందా మాస్తారూ? ” అడిగాడు సుఖదేవ్.

”బాగా అభివృద్ది అయింది సుఖదేవ్. ఆ కాలంలో ఎద్దలతో దున్నే కొయ్యనాగలిని  కనుగొన్నారు. దానివలన అంతకుముందు చిన్నచిన్న కమతాలకు మాత్రమే పరిమితమైన వ్యవసాయం పెద్ద పెద్ద భూభాగాలకు విస్తరించిండి. దానివలన మానవజాతిలో మిగులు సంపద అనేది పెరిగి, దానిని శ్రమజీవుల నుంచి మోసంతో స్వాధీనం చేసుకునే మతాధికార వర్గం బయలుదేరింది. వీరు సాగులోకొచ్చిన భూమి అంతా దేవుళ్ళదనీ తాము దేవుళ్ళమనీ, తాము దేవుళ్ళ పూజారులమనీ ప్రకటించుకొని, పండిన పంటలో ఎక్కువ భాగాన్ని పొందటం మొదలయింది. ఉదాహరణకు మెసపొటేమియాలోని లాగోష్ పట్టణంలో లభించిన ఒక శాసనం ప్రకారం, ఆ పట్టణం వద్ద ఉన్న పొలాలు 20 మంది దేవుళ్ళకు పంచబడ్డాయి. వారందరిపై అధికారం గల్గిన ఒక దేవుడు ఉన్నాడు. అతని భార్య బౌ 17 చదరపు మైళ్ళ ప్రాంతానికి యజమానురాలని ఆ శాసనం చెబుతోంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్తరాతి యుగంలోనే దేవుళ్ళకు దేవాలయాలు, దేవాలయ భూములూ ఉండేవి. ఆ కాలంలో ఆ భూములను, వాటిమీద ఆధారపడ్డ ప్రజలకు సమానంగా పంచేవారు. కాని రాగియుగంలో ఆ సమానత్వం మాయమయింది. దేవుళ్ళ భూములను ప్రజలకు పంచడంలో తీవ్రమయిన అసమానతలు చోటుచేసుకున్నాయి. భూములలో ఎక్కువ భాగం పూజారివర్గం స్వాధీనం చేసేసుకుంది. అంతేకాదు. ఇంతకు ముందు ఉదహరించిన శాననం ప్రకారం మతాధికారులు పేదలను దోపిడీ చేసేవారు. వారు పేదల తోటల్లో కొచ్చి తమకు కావాల్సినంత కలపను పట్టుకొని పోయేవారు. ఇక రాజుల విషయానికి వస్తే వారు తమకు అధికారం దేవుడు ఇచ్చిందని చెప్పుకున్నారని సుమేరియన్ శాసనాలు చెబుతున్నాయి. ఆ కాలంలో యుద్ధాలు, సంధులు దేవతల పేరుతోనే జరిగేవి. ఒక ఆసక్తికరమైన అంశమేమంటే యుద్ధాలు, విప్లవాలు జరిగినప్పుడు రాజులు మారిపోయేవారు. కాని దేవాలయాలు, వాటి పూజారులు మాత్రం మారిపోయేవారు కాదు. గెలిచిన రాజులు పాత దేవాలయాలను పోషించేవారు. అవసరమైన చోట్ల వాటిని పునరుద్ధరించే వారు. పూజారుల్ని కొనసాగించేవారు. ఉదాహరణకు సీరియూ సముద్రతీరంలోని హాలష్ అన్నచోట ప్రజలు పరస్పర సహకారంతో గుళ్ళు కట్టుకున్నారు. తరువాతి కాలంలో 'ఆల్ ఉబైద్' జాతివారు హాలఫ్ ను ఆక్రమించుకున్నారు. వారు హాలఫియన్ల గుళ్ళను పెద్ద ఎత్తున పునర్నిర్మించి, పూజారులను కొనసాగించారు.”  అన్నారు మాస్టారు.

”ఈ కాలంలో ఖగోళ శాస్త్ర విజయాలేమైనా ఉన్నాయా? మాస్టారూ?” అడిగాడు రఘు.

”అంతకు ముందు నుండి కొనసాగిన ఖగోళశాస్త్ర పరిశోధనలను ఆ కాలం వారు కొనసాగించి ఒక గొప్ప శాస్త్ర విజ్ఞాన విషయాన్ని వారు మనకు అందించారు. రఘూ! అదే సూర్యపంచాంగం! క్రీ. పూ. 2700 నాడే ఈజిపులో పూజారులు కాలండర్ ను తయారుచేశారు. కొద్దిపాటి మార్పులతో అదే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇదే ఆనాటి ఖగోళశాస్త్ర ఘనవిజయం.” అన్నారు మాస్టారు.

”మాస్టారూ! ఆనాటి శాసనాలు అని చెప్తున్నారు. 'అంటే ఆ కాలంలో లిపి కనుగొనబడిందా? ”  అడిగింది విప్లవ,

“మంచి ప్రశ్నవేశావమ్మా! ఆ కాలంలోనే లిపి కనుగొనబడింది. భారతదేశంలోని సింధు ప్రాంతంలోనూ, సుమేరియాలోనూ విడివిడిగా లిపిని కనుగొన్నారు. భారతదేశీయుల లిపి ఇంతవరకు ఎవరూ చదవలేకపోయినారు గానీ, సుమేరియన్ లిపిని శాస్త్రజ్ఞులు చదవగల్గినారు.” అన్నారు మాస్టారు.

”మాస్టారూ! మానవుల మధ్య శ్రమ విభజన అనేది ఆనాడు కూడా ఉండేదా? ” అడిగాడు డేనియల్.

aug14“అసలు శ్రమ విభజన మొదలైంది ఆ కాలంలోనే డేనియల్! మానవులు మతాధికారులుగా, రాజులుగా, లేఖకులుగా, వృత్తి విద్యలలో నిపుణులుగా, కూలీలుగా అనేక వర్గాలుగా విభజించబడింది. ఆ కాలంలోనే. చాలా ఆసక్తికరమైన అంశమేమిటంటే ఆనాడు తండ్రులు తమ బిడ్డలు శారీరక శ్రమచేసేవారుగా ఉండాలని కోరుకోలేదు. శారీరక శ్రమ ఏమాత్రంలేని లేఖకులుగా ఉండాలని కోరుకున్నారు. ఈజిప్ట్ పాపిరస్ లో దొరికిన ఒక లేఖ దీనికి రుజువు. ఆ లేఖలో ఒక తండ్రి తన కొడుకుకు చెప్పినదాని సారాంశాన్ని వినండి..

‘శారీరక శ్రమ క్రూరమైనదని నేను అనుకొంటున్నాను. చదువుపై నీ మనస్సు లగ్నం చేయి. నేను మండుతున్న కొలిమి వద్ద చెమట కారుతోన్న లోహకారుడిని చూశాను. అతని వేళ్ళు మొసలి తోళ్ళలా ఉంటాయి. అతని చర్మం చేపగుడ్ల చెడువాసన కొడుతుంది. నేతగాడు ఇరుకుగోతిలో కూర్చుంటాడు. అతనిది ఆడదానికంటే నికృష్టమైన జీవితం, తొడలను, రొమ్ముదాకా లాక్కుంటాడు. శ్వాస తీయలేడు. చేపలు పట్టే వాడి జీవితం మరీ నీచం. అందుకే అన్నింటికంటే నుఖమైన వని లేఖకుడిది. చదవగలవాడు, రాయగలవాడు అందరికంటే అధికుడు.’

ఆ విధంగా లేఖలు రాసేవాళ్ళు, పూజారులు, రాజులు భౌతిక శ్రమకు దూరమయ్యారు. భారతదేశంలో వేదాలు రచించే రోజుల్లో అందరూ వేదాలు రచించారు. కాని వాటిని తర్వాతి తరాలకు అందించే సమయం వచ్చేసరికి వేదపండితులు వర్ణవిభజన చేసి, శారీరకశ్రమ చేసే వర్గాల వారు వేదాలు పఠించకూడదని శాసించి, మానసిక శ్రమకూ, శారీరక శ్రమకూ విభజన రేఖ గీశారు.” అన్నారు మాస్టారు.

”ఆ రోజుల్లో మత విషయాలు ఎలా ఉండేవి మాస్టారూ?” అడిగాడు జహంగీర్.

”ఆ కాలంలో భారతదేశంలో సింధూ ప్రాంతంలో విగ్రహారాధన ఉండేది. మట్టితో చేసిన చిన్న స్త్రీ విగ్రహాలు, పూజా వస్తువుల మీద, సీళ్ళ మీద చిత్రించిన బొమ్మలు, ముఖ్యంగా లింగం, స్త్రీ అవయవం ఆకారం కల్గిన పెద్దరాతి బొమ్మలు అనేకం ఈ శిథిలాల్లో లభించాయి. అంతేకాదు ఆ తర్వాత ఆర్యులు రచించిన వేదాల్లో ప్రకృతిదేవతల ఆరాధన ఉంది. ఈజిప్టులో, ఆత్మలున్నాయనీ, వాటికి చిట్టచివరి తీర్పు ఉందనే విశ్వాసం ప్రజలలో ఉండేది, అంతేకాదు. ఆ కాలంలో సిసిలీ, సిరియా, స్పెయిన్ మొదలైన దేశాలలో మతాధిపతులచే మత్తుపదార్థాలకు బదులుగా పరలోకాన్ని చేరే మార్గంగా, కార్మికులకు 'ముక్తి' అనే మార్గం ఎరగా చూపబడిందని 'చరిత్రలో ఏం జరిగింది?' అనే గ్రంథంలో గారన్ ఛైల్డ్ పేర్కొన్నారు. అంటే ఆ కాలంలో మతాధిపతులు పరలోకం ఒకటి ఉందనీ, ఈ జన్మలో తాము చెప్పిన పనులు చేస్తే, జీవుల ఆత్మలు సుఖపడతాయనీ చెప్పేవారు. అక్కడ బాధలన్నిటికీ ముక్తి లభిస్తుందని చెప్పి కష్టాలు పడుతున్న ప్రజలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్నారు. ఆ కాలంలోని మరో విశేషం ఏమిటంటే యుద్ధాలలో ఓడిన జాతుల వారి దేవుళ్ళను, కంచు యుగం నాగరికత యొక్క అత్యున్నత దశలో, గెలిచిన దేవుళ్ళు ఆక్రమించుకున్నారు. సుమేరియన్లు సృష్టించిన 'ఎన్లిల్' అనే దేవుడి స్థానాన్ని బాబిలోనియా దేవుడైన 'మార్దుక్' ఆక్రమించాడు. ఈజిపులో సూర్యదేవుడైన 'రా' స్థానాన్ని 'ధీబ్స్' నగరదేవుడైన ‘ఆమెన్’ ఆక్రమించాడు. ఆమెన్ కొడుకుగా ‘ఫెరో’ రాజు తనను తాను ప్రకటించుకున్నాడు. ఫెరో ఏ దేశాన్ని ఆక్రమిస్తే, ఆ దేశంలో 'ఆమెన్' భగవంతుడుగా చలామణి అయ్యాడు. అంటే గెలిచిన రాజుల దేవుడు ఓడిన రాజుల దేవుళ్ళ స్థానాన్ని ఆక్రమించుకోవడం ఆనాటి నుండి ఉందన్నమాట. ఇదీ ఆనాటి మతం పరిస్థితి.” అన్నాడు మాస్టారు.

”ఈనాడు ప్రభుత్వోద్యోగులలో అవినీతి చాల ఎక్కువగా ఉన్నది కదా? ఆనాడు కూడ వారిలో అవినీతి ఉండేదా మాస్టారూ?" అడిగాడు రాజశేఖర్.

”ఆనాడు కూడ అవినీతి ఉండేది రాజశేఖర!” బాధగా అన్నాడు మాస్టారు. ”ఆనాటి రాజులు వ్రాసిన ఉత్తరాలు, వేసిన శాసనాలు ఆ కాలం నాటి అవినీతిని తెలియజేస్తున్నాయి. క్రీ.పూ. 1800లో బాబిలోనియా రాజు హమ్మురాబీ న్యాయాధిపతులు, ఉద్యోగులు డబ్బున్న కక్షిదారుల నుండి లంచం తీసుకునే దురాచారాన్ని ఎలా రూపుమాపాలో, తను రాసిన ఉత్తరాలలో ఆదేశించాడు. ఆ కాలానికి చెందిన ఒక లేఖ లంచాలు ఇవ్వలేని బీదవాడు న్యాయాన్ని పొందలేకపోవడాన్ని దీనంగా వర్ణిస్తుంది. క్రీ.పూ. 14వ శతాబ్దపు ఫెరో చక్రవర్తి బలవంతంగా లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులకు ముక్కును తెగగోయడం, దేశబహిష్కరణలు లాంటివి శిక్షలుగా విధించాలని శాసించాడు. ఇవన్నీ ఆనాటి ఉద్యోగుల అవినీతిని సూచిస్తున్నాయి.

పిల్లలూ! ఆ కాలం నాటి మరికొన్ని సైన్సు విజయాలు వివరించి ఈ కాలం వివరాలు ముగిస్తాను. ఈ కాలంలోనే గాజును తయారు చేయడం ఈజిప్టులో కనిపెట్టబడింది. అంతేకాదు ఈ విజ్ఞానంతో వారు నకిలీ వజ్రాలను చేయడం కూడా ప్రారంభించారు. ఇవీ కంచుయుగం నాటి విశేషాలు. వచ్చే క్లాసులో ఇనుపయుగంలో సైన్సు విజయాలను గూర్చి వివరిస్తాను.” అంటూ క్లాసును ముగించారు సైన్స్ మాస్టారు శ్రీనివాస్ గారు.

ఇనుపయుగంలోని విశేషాలు

sep5“ఏల్లలూ! క్రీ. పూ. 1200 ప్రాంతంలో కంచుయుగం అంతమై, ఇనుపయుగం వచ్చింది. ఈ యుగం దాదాపు క్రీ. పూ. 330లో వరకు సాగింది. ఈ కాలాన్ని ఇనుపయుగం అని సైన్సు చరిత్రకారులు అన్నారంటే, దానికి కారణం ఈ కాలంలో ఇనుము పెద్ద ఎత్తున వినియోగంలోకి రావడమే. యుద్ధాలలో ఇనుప ఆయుధాల వినియోగం బాగా పెరిగింది. ఇనుమొన గల్గిన నాగళ్ళు వ్యవసాయాన్ని బాగా విస్తృతపరచాయి. పెద్ద పెద్ద ఓడల నిర్మాణ సామర్థ్యం పెరిగింది. సైన్సురంగంలోని ఈ పురోగతి యొక్క ఫలితాలేమిటో తెలుసా? హిటైట్లు, పర్షియన్లు, ఆర్యులు మొదలైన ఆటవికులు సాయుధులై, నూతన ప్రాంతాలను ఆక్రమణ చేశారు. వ్యవసాయ భూములు బాగా విస్తరించాయి. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగాయి. దానివలన ఆహార వినియోగమూ మరియూ విశ్రాంతి కాలమూ బాగా పెరిగింది. దానితో యీ విశ్వం ఉనికీ, దుఃఖాలు లేని జీవితం ఎలా సాధించాలి? లాంటి తాత్విక చింతనలు ఒక వంకా, శ్రామికుల శ్రమ శక్తిని మరింత మోసపూరితంగా ఎలా అనుభవించాలి? అనే స్వార్ధ చింతనలు మరో వంకా పెరిగాయి. అంతేకాదు ఓడల నిర్మాణం వలన సముద్రాల మీద ప్రయాణాలు పెరిగి ఒకరి సంస్కృతి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందింది. వీటిని ఒక్కొక్క దాన్నీ వివరిస్తాను.“ అంటూ ఆ రోజు క్లాసు మొదలు పెట్టారు సైన్సు మాస్టారు శ్రీనివాస్,

“వ్యవసాయ భూములు బాగా విస్తరించాయన్నారు. మాస్టారూ! వ్యవసాయం చేయడానికి దండయాత్రీకులైన హిట్టైట్లు, ఆర్యుల వంటి వారికి వ్యవసాయ కార్మికులు ఎలా దొరికారు?“ అడిగాడు సిద్దూ,

“ముఖ్యమైన విషయమేమిటంటే, వారు జయించిన ప్రాంతాలలో ప్రజలకు వ్యవసాయం చేయడంవచ్చు. దురాక్రమణ చేసిన మొదట్లో స్థానికులను చంపడం లేదా ఇంటి సేవలకు వినియోగించడం చేసినా, తర్వాతి కాలంలో తమ బానిసలను ఆక్రమణదారులు వ్యవసాయం వంటి ఉత్పత్తి కార్యక్రమాలకు వాడారు. అందువలన వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగాయి.“ అన్నారు మాస్టారు.

“వ్యవసాయ ఉత్పత్తుల మారకం ఎలా జరిగేది మాస్టారూ?" అడిగింది సాయిజ్యోతి.

sep6మొదట్లో బార్టరు పద్ధతిలోనే జరిగేదమ్మా అంటే వస్తువుకు మరో వస్తువుతో మార్పిడి అన్నమాట. కాని  తర్వాత లోహపు నాణాలతో మార్పిడి పద్ధతి ప్రవేశపెట్టబడింది. తక్కువ విలువ గల్గిన రాగినాణాల ముద్రణతో వ్యాపార సమస్యలు అనేకం పరిష్కారం అయినాయి. అందువలననే ఈ చిల్లర నాణేల ముద్రణను ఒక విప్లవాత్మకమైన పరిణామం అని ప్రముఖ చారిత్రక పరిశోధకులు గార్టెన్ చైల్డ్ పేర్కొన్నారు.“ అన్నారు మాస్టారు.

“ఓడల నిర్మాణ సామర్థ్యం పెరిగినందువలన ఎలాంటి పరిణామాలు వచ్చాయి మాస్టారూ?“ అడిగింది విప్లవ.

“సముద్ర తీరప్రాంతాలు, సముద్రాల ద్వారా వ్యాపారం చేసి బాగా లాభపడ్డాయి. తీరం వెంబడి నగరాలు బాగా అభివృద్ధి చెందాయి. విచిత్రమేమంటే సముద్రాలలో తిరిగే రవాణా ఓడల దొంగలు అంటే సముద్రపు దొంగలు, తర్వాత కాలంలో యీ నగరాలలో వ్యాపారాలుచేస్తూ పారిశ్రామిక వేత్తలుగా స్థిరపడ్డారు. ఈ అంశంలోని విశేషం ఏమిటంటే, 14, 15 శతాబ్దాలలో ఇతర దేశాలలో వలసలు స్థాపించిన యూరోపియన్ వర్తక సమూహాలు మొదట సముద్రపు దొంగలే.“ అని మాస్టారు చెప్పగానే పిల్లలంతా ఫక్కున నవ్వారు.

“ఈ కాలంలోని ఖగోళశాస్త్ర పరిశోధనలూ, వాటి ఫలితాలు ఏమిటి మాస్టారూ?“ జహంగీర్ అడిగాడు.

“కంచుయుగం నాటి నుండి ఖగోళ శాస్త్ర పరిశోధనలు తీవ్రంగా చేసిందీ, సమాచారాన్ని గ్రంథాలలో నిక్షిప్తం చేసింది చైనీయులే జహంగీర్! ఈ కాలంలో ఈజిప్షియన్లు సౌరపంచాంగం తయారు చేయగల్గినా, చైనీయులు మరెన్నో ముఖ్యాంశాలు రికార్డు చేశారు. చైనీయులు క్రీ.పూ. 1600 నుండి వచ్చిన తోకచుక్కల వివరాలు గ్రంధస్తం చేశారు. వారు క్రీ.పూ. 1361లో వచ్చిన గ్రహణాన్ని రికార్డు చేశారు. ఇక ఇనుపయుగంలో, క్రీ.పూ. 467లో వచ్చిన తోకచుక్కను వారు తమ రికారుల్లో పొందుపరిచారు. విశేషమేమిటంటే, ఇటీవల హాలీ అనే శాస్త్రవేత్త కనుగొన్న హాలీ తోకచుక్క అదే! వారి తర్వాత ఖగోళ పరిజ్ఞానం భారతీయులదే! క్రీ.పూ. 900లోనే లగధుడనే భారతీయ శాస్త్రవేత్త 'జ్యోతిష్య వేదాంగం' అనే ఖగోళశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన మొట్టమొదటి సమగ్ర సమాచార గ్రంథం అదే! ఇది గ్రీకుల విషయానికి వస్తే, థేల్స్ అనే శాస్త్రవేత్త క్రీ.పూ. 585లో వచ్చిన సూర్యగ్రహణాన్ని, ముందుగానే గణించి చెప్పాడు. ఆసక్తికరమైన అంశమేమంటే, తర్వాతి కాలపు ఖగోళ శాస్త్రవేత్తలు అనేక దేశాలలో నక్షత్రాలు, గ్రహాలకు దైవత్వాన్ని ఆపాదించి, వాటి చలనం భూమి మీద ఉన్న వారిపై ప్రభావాన్ని కల్గిస్తుందంటూ ఊహించి చెప్పే జ్యోతిష్యాన్ని అభివృద్ధి చేశారు. కాని చైనీయులు మాత్రం ఆ వాదాన్ని తిరస్కరించారు. జ్యోతిష్యాన్ని అసలు పట్టించుకోలేదు. గ్రహాలకు దేవతా సంబంధమైన ప్రత్యేకశక్తి ఉంటుందనే భావననూ, అవి భూమి మీద ఉన్నవారిపై ప్రభావం కల్గిస్తాయనే వాదననూ వాళ్ళు అంగీకరించలేదు.“

“ఆ కాలంలో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందా మాస్టారూ?“ అడిగింది శాంతి.

“బాగా అభివృద్ధి చెందిందమ్మా, భారతదేశంలో క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే 'ఆయుర్వేదం' అనే వైద్యప్రక్రియను ఆత్రేయుడు, ధన్వంతరి అనే ఇద్దరు ప్రఖ్యాత వైద్యులు కనుగొన్నారు. ఆత్రేయుని శిష్యుడైన అగ్నివేశుడనే వైద్యుడు 'అగ్నివేశ తంత్ర' అనే గ్రంథాన్ని రచించాడు. గ్రీసు దేశంలో హిప్పోక్రేట్స్ అనే ప్రఖ్యాతవైద్యుడు క్రీ.పూ. 5వ శతాబ్దం చివరలో ఉండేవాడు. ఆయనను 'గ్రీకు వైద్యపిత' అని వైద్యలోకం పిలుస్తోంది. ఈయన తన శిష్యులకు వైద్యమంటే అన్ని వృత్తులలో ఒకటిగా చూడవద్దనీ, అది ప్రత్యేకమైన, పవిత్రమైన వృత్తి అనీ, వైద్యుడు రోగులను ప్రేమతో, ఆదరంగా చూడాలనీ చెప్పాడు. వైద్యవృత్తిలో చేరబోయేముందు తన శిష్యులచేత ఒక ప్రమాణం చేయించేవాడు. ఆ ప్రమాణాన్నే రోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల చేత గురువులు చేయిస్తున్నారు. అలాగే చైనాలో 'ఆక్యుపంచర్' వైద్యం యీ కాలంలోనే ప్రారంభమయింది.“ అన్నారు మాస్టారు.

“ఈ కాలంలో తాత్విక చింతనలు ప్రారంభమయ్యాయన్నారు. వాటి విశేషాలు చెప్పరా మాస్టారూ?“అడిగాడు అభినంద్.

sep7“ఈ కాలంలో అనేక దేశాలలో వ్యవసాయం బాగా అభివృద్ధి అయినందువలన, ఆహార ఉత్పత్తి బాగా పెరిగి, కొందరికి అదనపు ఆహారం దొరికింది. అందువలన వారికి విశ్రాంతి కాలం పెరిగింది. ఈ కాలాన్ని వారు తాత్విక చింతనకు కేటాయించారు. వారిలో గ్రీకు దేశానికి చెందిన డెమోక్రటీస్, ఎంపిడోక్లెస్, ఎనక్సిమాండర్, ఎపిక్యూరస్, ప్లేటో చైనాకు చెందిన కన్ఫ్యూజియస్, లావోసు, భారతదేశంలో యాజ్ఞవల్క్యుడు వంటి ఋషులు, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, చార్వాకులు, కణాదుడు, ఇరాస్లో జొరాస్టర్ మొదలైన వారు ఉన్నారు. ఈ తాత్విక చింతనలు రెండు ధోరణులలో సాగాయి. మొదటి ధోరణికి చెందిన వారిలో ఎంపెడోక్లెస్, ఎనక్సిమాండర్, డెమొక్రటిస్, ఎపిక్యూరస్, బుద్భడు, వర్ధమాన మహావీరుడు, కణాదుడు, చార్వాకులు ఉన్నారు. వీరంతా యీ విశ్వసృష్టి భగవంతుని వలన జరగలేదనీ, పదార్ధమంతా కొన్ని అణువుల చేతనో, నిప్పు, నీరు, గాలి, భూమిల సంయోగవియోగాల చేతనో జరిగిందనీ, పై స్థాయి జంతువులు క్రింది స్థాయి జంతువుల నుండి అభివృద్ధి అయినాయనీ తెల్పారు. ఉదాహరణకు అనక్సిమాండర్ జీవులు నీటి నుండి వచ్చాయనీ, మనిషి కూడ చేపవంటి మరో జంతువేననీ, తడిజీపులు సూర్యరశ్మికి ఎండిపోతే, మనిషి వంటి పొడిజీవులు అభివృద్ధి అయినాయని సిద్ధాంతీకరించాడు. ఇది డార్విన్ నిరూపించిన పరిణామ సిద్ధాంతానికి చాల దగ్గరగా ఉంది.“ అన్నారు మాస్టారు.

“మరి, రెండో ధోరణి సిద్ధాంతం ఏమని చెబుతోంది మాస్టారూ?“ అడిగాడు శ్రీను.

“రెండో ధోరణి తాత్వికులు భగవంతుని ఉనికిని అంగీకరించారు. వీరిలో కన్ ఫ్యూజియస్, జొరాస్టర్ యాజ్ఞవల్యుడు, ప్లేటో మొదలైనవారన్నారు. వీరిలో ప్లేటో మరో ముందడుగు వేసి, దేవుడు, తరువాత జన్మ మొదలైనవి మూఢనమ్మకాలు అని అంగీకరిస్తూనే, అమలులో ఉన్న ధనిక, బీద అనే తేడాలున్న సామాజిక వ్యవస్థను నిలబెట్టడానికి యీ మూఢనమ్మకాలు అవసరమంటాడు. 'రోమన్ల గొప్పతనానికి పునాది మూఢవిశ్వాసం' అని బహిరంగంగా ఉద్ఘాటిస్తాడు.

పిల్లలూ! ఇవీ ఇనపయుగం సైన్సు పురోగతీ, తద్వారా వచ్చిన మానవజాతి పురోగతి, మోసగాళ్ళద్వారా కల్గిన సామాజిక అంతరాలకు సంబంధించిన విశేషాలు. వచ్చే క్లాసులో క్రీ.పూ. 330 తర్వాత కాలంలోని ప్రాచీన నాగరికతను గూర్చి, దానికి మూలమైన సైన్సు పురోగతిని గూర్చి వివరిస్తాను. సరేనా?“ అంటూ ఆ రోజు క్లాసు ముగించారు సైన్సు మాస్టారు శ్రీనివాస్,

ప్రాచీన కాలపు సైన్స్ విజయాలు

పిల్లలూ,

oct7“క్రీ.పూ. 330 వరకూ ఉన్న కాలాన్ని ఇనుప యుగంగా చరిత్రకారులు గుర్తించారని చెప్పాను గదా. క్రీ.పూ. 330 నుంచి దాదాపుగా ఒక వేయి సంవత్సరాల కాలాన్ని ప్రాచీన యుగంగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆ యుగం విశేషాలు చెబుతాను వినండి.“ అంటూ సైన్స్ మాస్టారు శ్రీనివాస్ ఆ రోజు సైన్స్ పాఠాన్ని మొదలుపెట్టాడు.

“ఆ యుగంలో సముద్ర ప్రయాణాలు, సముద్రం మీద యుద్దాలు, వాటి కోసం పెద్ద పెద్ద ఓడల నిర్మాణాలు బాగా పెరిగాయి. సిరాక్యుస్ అనే గ్రీకు నగరంలో 4200 టన్నుల బరువు లాగగల ఓడ నిర్మించబడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ కాలంలోనే 480 అడుగుల ఎత్తున లైట్ హౌస్ కూడ నిర్మించబడినట్లు చరిత్రకారులు తెలియజేస్తున్నాము. ఋతుపవనాలు అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా ప్రయాణిస్తే, సముద్ర ప్రయాణ కాలం చాలా తగ్గుతుందని గ్రహించి సముద్ర ప్రయాణాలను మరింత త్వరితం చేశారు. ఈ కాలంలోనే చైనా వారిచే నావికా దిక్సూచి కనుగొనబడింది. ప్రాచీనకాలం నాటి మహాద్భుత కట్టడాలలో ఒకటీ, భూమి మీద మానవుడు నిర్మించిన అత్యంత పెద్ద నిర్మాణము ఈ కాలంలో చైనా వారిచే నిర్మించబడింది. అది ఏమిటో ఎవరైనా చెప్పగలరా? తెలిసిన వాళ్ళు చేయెత్తండి.“ అన్నాడు మాస్టారు.

చాలా మంది పిల్లలు చేయెత్తారు.

“చందూ, నీవు చెప్పు.“ అన్నారు మాస్టారు.

“చైనా గోడ మాస్టారు.“ అన్నాడు చందూ.

“కరెక్ట్. దాని పొడవు, ఎత్తు అది ఎప్పుడు నిర్మించబడిందీ, ఎవరైన చెప్పగలరా?” అడిగాడు మాస్టారు.

క్లాసంతా మౌనం.

oct8మాస్టారే చెప్పసాగారు. “చైనా గోడ పొడవు 2400 కి.మీ. ఎత్తు చాలా చోట్ల 27 అడుగులు. అంతకు ముందు చిన్న చిన్న రక్షణ గోడలుగా ఉన్న వాటిని, క్రీ.పూ. 221 ప్రాంతంలో ఆనాటి చైనా చక్రవర్తి చిన్ షి హువాన్ డి, పొడిడించి, ఈ బ్రహ్మాండమైన గోడను నిర్మించాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. భూమి చుట్టుకొలతను, దాదాపు ఆధునికుల కొలతకు దాదాపు సమానంగా, ఒక శాస్త్రవేత్త, ఈ కాలంలోనే కనుగొన్నాడని ఇంతకు ముందే మీకు చెప్పాను కదా. ఆయన పేరేమిటి? సిద్దూ నీవు చెప్పు.“ అడిగాడు మాస్టారు.

“ఆయన పేరు ఎరటోస్తనీస్ మాస్టారు.“ అన్నాడు సిద్దూ.

“కరెక్ట్, ఇప్పుడు మరో ముఖ్యమైన సైన్సు పరిశోధనను మీకు వివరిస్తాను. గ్రీకు శాస్త్రవేత్త అరిస్టార్కన్, అప్పటి వరకు దేవుళ్ళుగా భావించబడుతున్న సూర్యచంద్రుల సైజులు, భూమి నుండి దూరాలు కొలవడానికి ప్రయత్నించాడు. ఆయన తన వద్దనున్న పరికరాల సహాయంతో భూమికి, చంద్రునికీ మధ్య ఉన్న దూరం కంటే, భూమికీ, సూర్యునికి మధ్యనున్న దూరం 19 రేట్లు ఎక్కువ అన లెక్కగట్టాడు. ఇది వాస్తవంగా ఉన్న దూరమైన 20 రేట్లకు దాదాపు సమానం. అరిస్టార్కస్ కాలానికి ఒక శతాబ్దం వాడైన హిప్పార్కస్ చంద్రుని వ్యాసార్థం భూమి న్యాసార్థంలో మూడవవంతు మాత్రమే ఉంటుందని లెక్కించాడు. ఈ లెక్కలు పూర్తి వాస్తవాలు కాకపోయినా, ఇవి మతనాయకుల ప్రచారమైన భూమి జగత్తుకు కేంద్రమనే వాదనను అరిస్టార్కస్ ఖండించి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. బాధాకరమైన విషయమేమిటంటే, హిప్పార్కస్ ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించి భూమి కేంద్రమన్న సిద్ధాంతాన్నే ప్రకటించాడు. మతనాయకులు, తమ, మత సిద్ధాంతాలకు అనుకూలమైన హిప్పార్కస్ సిద్ధాంతాన్నే సరియైన సిద్ధాంతంగా ప్రకటించి ప్రచారం చేయసాగారు.

హిప్పార్కస్ సాధించిన మరో గొప్ప సైన్సు విజయం ఏమిటంటే భూమి, ఒక పడిపోతున్న బొంగరం లాగా, కొంచెం ఏటవాలుగా, తన అక్షంపై తరుగుతున్నదని కనుగొన్నాడు.

ఈ కాలంలోని సైన్సు సాధించిన విజయాలలో కొన్నిటికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీకు చెబుతాను అదేమిటంటే ప్రొ. బురీ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు. దాని పేరు ‘ది ఐడియా ఆఫ్ ప్రొగ్రెస్’ ఆ పుస్తకంలో ప్రాచీన కలంవారా? పునరుద్దరణ కలంవారా? క్రీ.శ. 1450-1550 (మధ్యకాలం) ఎవరు గొప్పవారు? అనే చర్చ జరిగిందట. పునరుర్థరణ కాలం గొప్పదనేవారు, ఆ కాలమే గొప్పదన్నారు. ఎందుకని? ఆ కాలంలో ముద్రణాయంత్రం, తుపాకి మందు, అయస్కాంత దిక్సూచి కనుగొనబడ్డాయని వారి వాదన. కాని ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే ఆ మూడు ప్రాచీనకాలంలో చైనీయులదే కనుగొనబడ్డాయి. ఆ వాస్తవాన్ని గూర్చి బురీ తన గ్రంథంలో ఒక్క వాక్యమైనా రాయలేదు. ఈ విషయం పాశ్చత్యులు అన్నీ తామే కనుగొన్నామనే అహంకార ప్రచారానికి అద్దం పడుతోంది.

ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. సమాధానం చెప్పండి, రసాయనిక ఎరువులు రాకముందు, ప్రధానంగా ఎరువుగా చేలల్లో దేనిని వాడేవారు?“ అని అడిగారు మాస్టారు.

“ఆవు, బర్రె, ఎద్దు, దున్నపోతుల పేడ.“ తేజ సమాధానం చెప్పాడు.

“మేకలు, గొర్రెలు, మానవులు విసర్జించేది.“ వెంకట్రావు అన్నాడు.

oct9“అవును. ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన ఎరువులే. ఇవన్నీ ఎరువులనే విషయం ఎవరు కనుగొన్నారో తెలుసా? ప్రాచీన యుగం నాటి మనుషులే. మీకు మరో ఆసక్తికరమైన ఆవిష్కరణను గూర్చి వివరిస్తాను. చైనా చరిత్రలో ప్రాచీనకాలం నాటి విషయాలన్నీ వ్రాయబడి ఉండటమనే మంచి జరిగింది. వ్రాతపూర్వకమైన ఆ రికార్డులలో ఏముందంటే క్రీ.శ. 105 లో చైనాలోని ఒక చేతి వృత్తిదారుడు చక్రవర్తి వద్దకు వచ్చి ‘మహరాజ, వ్రాతకోసం ప్రస్తుతంవెదురు బొంగులు చాలా బరువు. లేఖలు వ్రాస్తే పట్టు వస్త్రాలు చాలా ఖరీదు. అందువల్ల వ్రాయడం కోసం చెట్ల బెరడు, వెదురులను బాగా కలిపి, నేను పల్చని పదార్థాన్ని తయారుజేశాను. అది వ్రాతపనికి చాలా అనుకూలంగా ఉంటుంది.’ అన్నాడు. దాని పేరే కాగితం. కాబట్టి... ఇప్పుడు చెప్పండి. కాగితం ఎప్పుడు తయారయింది?“

“క్రీ.శ. 105 లో.“ అభినంద్ అన్నాడు.

“ఏ దేశంలో?”

“చైనాలో.“ అన్నాడు జహంగీర్.

“వెరిగుడ్ పిల్లలు. ప్రాచీన యుగంలో అనేక మంది మహాశాస్త్రవేత్తలు భారతదేశంలోనూ, ఇతర దేశాలలోను... జన్మించి గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలు చేశారు. మరెన్నో గొప్ప సిద్ధాంతాలను రూపొందించారు. వారి పేర్లు నేనిప్పుడు చెబుతాను.  మీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని గూర్చి మీ పెద్దల ద్వారా తెలుసుకొని వచ్చే క్లాసులో వివరించాలి. మీరు సిద్ధమేనా?“ అడిగారు మాస్టారు.

“సిద్ధమే.“ ఉత్సాహంగా అరిచారు పిల్లలందరూ.

“ఒకే. భారతీయ శాస్త్రజ్ఞులు ఆర్యబట్ట, వరహమిహిర, బ్రహ్మగుప్త, గ్రీకు శాస్త్రజ్ఞులు ఆర్కమెడిస్, టోలమీ, గాలెన్, భారతీయ వైద్యులు చరక, శుశ్రుత, భారతీయ వృక్షశాస్తజ్ఞుడు పరాశర. భారతీయ లోహశాస్త్రజ్ఞులు వీరందరి పేర్లు మీలో కొందరికిస్తాను. మీలో ఉత్సాహవంతులు ముందుకు రండి.“ అన్నారు మాస్టారు.

కొందరు పిల్లలు వచ్చి, తలా ఒక శాస్త్రజ్ఞుడి పేరు తీసుకొని వెళ్ళారు. ఆ రోజుకి క్లాసును మాస్టారు ముగించారు.

ప్రాచీనకాలపు గ్రీకు, రోమన్ శాస్త్రవేత్తలు

nov3“పిల్లలూ, మీరు చెప్పవలసిన శాస్త్రవేత్తలను గూర్చి తయారై వచ్చారు గదా?” అడిగాడు సైన్స్ మాస్టారు శ్రీనివాస్.

“ఓ...” అన్నారు పిల్లలు.

“ముందుగా గ్రీకు, రోమన్ శాస్త్రవేత్తలను గూర్చి, వారి పరిశోధనా విజయాలు, సమాజంపై వాటి ప్రభావాన్ని గూర్చి తెలుసుకుందాం. సిద్దూ, నీవు ముందు గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ గూర్చి చెప్పు.”

“గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడీస్ క్రీ.పూ. 287 లో జన్మించి, క్రీ.పూ. 212 లో మరణించాడు మాస్టారు. ప్రాచీనకాలపు గ్రీకు శాస్త్రవేత్తలలో ఈయనను చాలా గొప్పవాడిగా సైన్సు చరిత్రకారులు భావిస్తారు. ఎందుకంటే ఈయన అనేక గప్ప సైన్సు పరికరాలు కనుగొన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈయన విశిష్ట గురుత్వ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఈయన ఆశయం ఏమిటంటే, విజ్ఞానం. విజ్ఞానం కొరకే గాని మనుష్యుల స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగపడకూడదని. కాని బాధాకరమైన విషయం ఏమిటంటే ఈయన కనుగొన్న సైన్సు సూత్రాలు అనేక యుద్ధపరికరాలు తయారుజేయడానికి ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు భూతద్దం ద్వారా సూర్యరశ్మిని కేంద్రీకరించి, అవతలి వైపు దూది, గుడ్డ లాంటి వస్తువులను కాల్చవచ్చునని ఈయన కనుగొన్నాడు. ఈ సూత్రాన్ని ఉపయోగించి, యుద్దాలలో, గ్రీకు సైనికులు శత్రుపడవల తెరచాపలు కాల్చి వారిని చికాకు చేసేవారు. అలాగే ఆర్కిమెడీస్ కనుగొన్న ఉండోలుబద్ద పరికరానికి సంబంధించిన సూత్రాన్ని ఉపయోగించి, గ్రీకు వీరులు, దూరంగా ఉన్న శతృసైనికుల మీదికి పెద్దపెద్ద రాళ్ళు విసిరేవారు.

nov4ఆర్కిమెడీస్ కనుగొన్న సూత్రాలు ప్రజా ఉపయోగానికి కూడా వినియోగించబడ్డాయి. ఈయన మరమేకులోని రేఖాగణిత సూత్రాన్ని కనుగొని, దాని సహాయంతో దాదాపు 12 అడుగుల లోతు నుంచి నీరు తయారుచేశాడు. ఇలాంటి యంత్రాల చిత్రాలు క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందిన ఈజిప్షియన్ పాపైరస్ రేకులు మీద చిత్రించబడి, ఆర్కిమెడిస్ ప్రతిభను నిరూపిస్తున్నాయి.” అన్నాడు సిద్దూ.

“ఆర్కిమెడీస్ కనుగొన్న విశిష్ట గురుత్వ సిద్ధాంతం గూర్చి చెప్పగలావా?”

“చెప్పగలను మాస్టారు. ఈ సిద్ధాంతాన్ని ఆర్కిమెడీస్ కనుగొనడానికి సంబంధించిన ఒక కథ ఉంది. అది కూడా చెబుతాను.”

ఆర్కిమెడీస్ ఒక రాజు గారి ఆస్థానంలో ఉండేవాడు. ఒకసారి రాజుగారు తనకు కిరీతం తయారుచేయమని ఒక లోహకారుడికి కొంత బంగారం ఇచ్చాడు. లోహకారుడు కిరీటం తయారుచేసుకొని వచ్చాడు. కాని రాజు గారికి ఒక అనుమానం వచ్చింది. ఏమని? లోహకారుడు కిరీటంలో బంగారానికి కొంత రాగిని కల్తీ కలిపాడేమోనని. కిరీటం చెడగొట్టకుండా, తన అనుమానాన్ని నిష్పత్తి జేయమని రాజుగారు ఆర్కిమెడిస్ ను అడిగాడు. ఆర్కిమెడిస్ ‘కిరీటం చెడగొట్టకుండా, బంగారంలో కల్తీని కనుగొనడమెలా?’ అని ఆలోచించసాగాడు. ఎప్పుడూ అదే ఆలోచనతోనే గడపసాగాడు. ఒక రోజున, ఆ విషయమే ఆలోచిస్తూ, స్నానాల తొట్టిలోకి దిగి, స్నానం చేయసాగాడు. స్నానాల తొట్టిలోని తాను తేలిపోయి, బరువు తగ్గినట్లుగా అనిపించింది. దానిని గూర్చి ఇంకా లోతుగా ఆలోచించసాగాడు. అకస్మాత్తుగా ఆయనకొక విషయం మనసుకు తట్టింది. అదేమిటంటే ఒక ద్రావకంలో ఒక వస్తువును ముంచినప్పుడు దాని బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఆ తగ్గిన బరువు, తొలిగించబడిన ద్రావకం బరువుతో సమానం. అదే విశిష్ఠ గురుత్వ సిద్ధాంతం.

nov5ఈ సూత్రాన్ని కనుగొన్నానన్న ఆనందంలో, తాను ఎట్లా ఉన్నాడో అనే సంగతి మరిచిపోయి, నగ్నంగానే వీధిలోకి వచ్చి ‘యురేకా! యురేకా!’ అని అరుస్తూ పరిగెత్తసాగాడు. యురేకా అంటే  ‘కనుగొన్నాను.’ అని అర్థం.“ అని సిద్ధూ చెబుతుండగానే పిల్లలందరూ నవ్వసాగారు.

మాస్టారు “సైలెన్స్.” అని వారందరిని వారించి, “ఆ శాస్త్రజ్ఞుడి పరధ్యానపు పనిని విని నవ్వడం కాదు. శాస్త్రవిజ్ఞాన పరిశోధనలో ఆయన ఎలా నిమగ్నమైనాడో, ఎంతటి ఏకాగ్రత చూపాడో ఆ గుణాన్ని మనమందరం అలవర్చుకోవాలి. అప్పుడే గొప్ప కార్యాలు సాధించగలం.” అన్నారు.

“ఆర్కిమెడీస్ గణితశాస్త్రంలో కూడ చాలా పరిశోధనలు చేశాడు మాస్టారూ!” సిద్దూ కొనసాగించాడు. “ఆయన లెక్కలలో తరచుగా ఉపయోగించే '𝞹' విలువను 3.1408 మరియు 3.1429ల మధ్యన ఉంటుందని ప్రకటించాడు. గోళాకార వస్తువు యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుగొన్నాడు. అయితే, ఆయన గ్రీకు, రోమన్ల యుద్ధాలలో అకారణంగా బలి అయిపోయాడు. రోమన్లు సైరాకస్ పట్టణాన్ని ఆక్రమించినప్పుడు, ఆయన విలువను గుర్తించిన రోమన్ పాలకులు, ఆయనను వధించవద్దని సైనికులకు ఆదేశాలు జారీచేశారు. కాని కావాలనో, పొరబాటుగానో ఆయనను సైనికులు చంపివేశారు. అయినప్పటికీ, ఆయనకు గౌరవసూచకంగా, రోమనులు ఒక గొప్ప సమాధిని నిర్మించారు. దానిపై ఆయనకిష్టమైన ‘గోళంపై ఒక వర్తులాకార గొట్టం చుట్టినట్లు ఉండే బొమ్మ'ను చిత్రించారు. ఇదీ మాస్టారూ! ఆర్కిమెడిస్ జీవితం, పరిశోధనా విశేషాలు!” అని ముగించాడు సిద్దూ,

nov6“గుడ్! సిద్దూ! బాగా చెప్పావు. ఈ సందర్భంగా మరొక్క విషయాన్ని నేను ఈ అంశానికి జోడిస్తాను. ఇందాక సిద్దూ గ్రీకు, రోమన్ల యుద్ధోన్మాదాన్ని గూర్చి ప్రస్తావించాడు. ఆ కాలంలో గ్రీసుదేశం అనేక ముక్కలై, ఎన్నో నగర రాజ్యాలుగా విడిపోయింది. అవిగాక గ్రీకేతర రాజ్యాలైన పార్టియా, ఆర్మేనియా, అరేబియా, రోమ్, కార్తీజ్ రాజ్యాలు ఉండేవి. ఇవన్నీ నిరంతరం పరస్పర మారణకాండ లోకి అత్యుత్సాహంగా దూకాయి. అంతర్యుద్ధాలో మునిగి తేలాయి. సామాజికంగా అశాంతి పెరిగింది. అభివృద్ధిని గురించి పట్టించుకొనే వారే లేరు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ హింసాకాండ దేశభక్తిగా చలామణీ అయింది.

శాంతికాముకులను దేశద్రోహులుగా హింసావాదులు నిందించసాగారు. ఇదీ ఆనాటి సామాజిక పరిస్థితి.

పిల్లలూ! వచ్చే క్లాసులో మరికొందరు గ్రీకు, రోమన్ శాస్త్రవేత్తల పరిశోధనా విజయాలు తెలుసుకుందాం.” అంటూ ఆరోజు క్లాసులు ముగించారు మాస్టారు.

“పిల్లలూ! ప్రాచీన గ్రీకు, రోమన్ శాస్త్రవేత్తలు మరికొందరిని గూర్చి తెలుసుకుందాం.

సూర్యాంశ్! ప్రాచీన గ్రీకు ఖగోళ శాస్త్రజ్ఞుడు టాలమీని గూర్చి చెప్పు.” అన్నారు మాస్టారు.

dec7”టాలమీ క్రీ.శ. 85 - 165 మధ్య జీవించాడు. మాస్టారూ! ఈయన గొప్ప ఖగోళ, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఈయన 'ఆల్మాజెస్ట్' అనే గ్రంథాన్ని రచించాడు. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, టాలెమీ, భూమిని గ్రహకూటమికి కేంద్రంగా ఊహించాడు. చంద్రుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, అంగారకుడు, గురుడు, శని, నక్షత్రాలు, ఇదే క్రమంలో భూమి చుట్టూ తిరుగుతున్నాయని ప్రకటించాడు. ముఖ్యమైన విషయమేమంటే టాలమీ భూమి కదలకుండా నిశ్చలంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. ఆనాటి మతనాయకులు భూమి విశ్వానికి కేంద్రమనీ, గ్రహాలూ, నక్షత్రాలూ అన్ని మానవులు నివాసముండే భూమి అంటే గౌరవసూచకంగా దాని చుట్టూ వర్తులాకారంలో తిరుగుతున్నాయని ప్రచారం చేసేవారు. టాలమీ సిద్దాంతం దానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని వెంటనే ఆమోదించి ప్రచారం చేయడం మొదలెట్టారు. దానివలన ఎంత ప్రమాదం జరిగిందంటే, వాస్తవ సిద్ధాంతమైన సూర్యుడు సౌరకుటుంబానికి కేంద్రమనే విషయం కోపర్నికస్ గణితశాస్త్రబద్దంగా నిరూపించేదాకా మరుగున పడిపోయింది!” అన్నాడు సూర్యాంశ్.

”టాలమీని గూర్చి ఇంకా ఏమైనా చెప్పగలవా?” అడిగాడు మాస్టారు.

”టాలమీ భూగోళశాస్త్రంలో కూడా ఎన్నో పరిశోధనలు చేసి, అక్షాంశాలు, రేఖాంశాలు కలిగిన భూగోళ పటాన్ని తయారుచేశాడు మాస్టారూ! గణితశాస్త్రంలో బాగా పరిశోధన చేసి ట్రిగొనామెట్రీ అనే గణిత విభాగానికి సంబంధించిన 'నాచురల్ సైన్స్'ల పట్టికనొకదాన్ని తయారుచేశాడు. టాలమీకి సంబంధించి నాకు తెలిసిన విశేషాలు ఇవే మాస్టారూ!” అన్నాడు సూర్యాంశ్,

”గుడ్! అన్ని ముఖ్య విషయాలు చెప్పావు. శ్రీనూ! నువ్వు గాలన్ అనే శాస్త్రవేత్తను గూర్చి చెప్పు.”  అన్నారు మాస్టారు.

dec8”గాలెన్ అనే శాస్త్రవేత్త క్రీ.శ. 129లో పుట్టి 199లో మరణించాడు మాస్టారూ! ఈయన జీవశాస్త్రంలోనూ, వైద్యశాస్త్రంలోనూ చాలా పరిశోధనలు చేశాడు. రోం చక్రవర్తి మార్కస్ ఆరిలియస్! ఆస్థాన వైద్యుడుగా ఉండేవాడు. ఆ రోజుల్లో మానవుల శరీరాలను, వారు చనిపోయిన తర్వాత ఐనాగాని, కోయకూడదనే నిషేదం ఉండేది. అందువలన గాలన్ బ్రతికున్న, చనిపోయిన జంతువుల శరీరాలను కోసి, వాటిని పరీక్ష చేశాడు. కొన్ని వైద్య శాస్త్ర విషయాలు ప్రకటించాడు. అవేమిటంటే జంతువుల, మానవుల శరీరాలలో ధమనులు, సిరలు ఉంటాయి. వాటిద్వారా శరీరంలో రక్తప్రసరణ జరుగుతుంది. ఉచ్వాస నిశ్వాసాల ద్వారా, అంటే గాలిపీల్చడం వదలటం ద్వారా రక్తం శుభ్రపడుతుంది. ఇవీ గాలన్ కనుగొన్న కొన్ని ముఖ్య విషయాలు. అయితే రక్తంలో వచ్చేపోయే ఆత్మలు ఉంటాయనీ, రక్తంలో వేడిని పుట్టించేది గుండె అనీ, ఊపిరితిత్తులు రక్తాన్ని చల్లబరచే విసనకర్రలు అనీ కొన్ని అశాస్త్రీయమైన ఊహలు కూడ గాలన్ చేశాడు. అంతేకాదు, భారతీయులు 'ప్రాణం' అని పిలిచేదాన్ని గ్రీకులు 'న్యూమా' అని పిలుస్తారు. అది గాలి ద్వారా తయారవుతుందనీ, అదే శక్తికి మూలమనే ఊహను కూడా చేశాడు.” అన్నాడు శ్రీను.

”ఆ ఊహ శాస్త్రీయమా? అశాస్త్రీయమా?” అడిగాడు మాస్టారు.

”తెలియదు మాస్టారూ!" అన్నాడు శ్రీను.

”ఆ ఊహ అశాస్త్రీయమే. ఎందుకంటే, ఇప్పటివరకు జీవశాస్త్రజ్ఞులు గానీ, వైద్యశాస్త్రజ్ఞులు గానీ 'న్యూమా' లేక 'ప్రాణం' అనేది ఉంటుందని నిరూపించలేదు. ఈ విషయంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే. గాలెన్ భావాలు ఇంకా కొంతమందిని ప్రభావితం చేస్తున్నాయి. అందువలననే గాలన్ గ్రంథాలు 1952లో ఇంగ్లీషులో ప్రచురించబడ్డాయి.” అన్నారు మాస్టారు.

ఒక నిముషం నిశ్శబ్దం. మాస్టారు చందూ వైపు చూశారు.

”మాస్టారూ! నేను మరికొందరు గ్రీకు శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలు చెబుతాను. ” అన్నాడు చందూ.

”చెప్పు.” అన్నారు మాస్టారు చిరునవ్వుతో.

dec9”క్లాడియస్ ఒక వైద్యశాస్త్రవేత్త. ఈయన క్రీ.పూ. 100 ప్రాంతాల్లో జీవించాడు. ఈయన ఫాంటస్ రాజుకు వైద్యుడు. ఈయన పరిశోధనల్లో విశేషం ఏమిటంటే, తాను ఔషదాలకు ఉపయోగించే మూలికల బొమ్మల్ని చిత్రించేవాడు. దానివలన వైద్య శాస్త్రమూ, వృక్షశాస్త్రమూ అభివృద్ధి చెందాయి. ఈయనకంటే ముందే క్రీ.పూ. 300 ప్రాంతం వారైన హీరో ఫైలస్, ఇరాసిటోసస్ అనే శాస్త్రవేత్తలు వైద్యశాస్త్రాన్నీ, శరీరశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. వీరిద్దరూ శవాలను కోసి, పరిశీలించి, శరీరశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను కనిపెట్టారు. హీరో ఫైలస్ నాడీమండలాన్ని అధ్యయనం చేసి, నాడీ కొట్టుకోవడాన్ని రోగ నిర్ధానానికి ఉపయోగించాడు, జ్ఞానేంద్రియాలు, చలనాలు కలిగించే నరాల మధ్య తేడాను వివరించాడు. ఇరాసిటోసస్ మరో అడుగు ముందుకు వేసి మెదడులోని కంపనాల ప్రాముఖ్యతను వివరించాడు. ఇవీ మాస్టారూ! మరికొందరు గ్రీకు శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలు.” అన్నాడు చందూ,

”గుడ్! జహంగీర్! ఆకాలంలో గ్రీకు, రోమన్ ఇంజనీర్ల శాస్త్ర, సాంకేతిక రంగ విజయాలు నీవు చెప్పు.” అన్నారు మాస్టారు.

”చెబుతాను మాస్టారూ!” మొదలెట్టాడు జహంగీర్. ”ప్రాచీనకాలంలో గ్రీకు ఇంజనీర్లు గొప్ప ప్రతిభతో అనేక సాంకేతిక రంగ విజయాలు సాధించారు. ముఖ్యంగా నగరాలకు నీటి సరఫరా విషయంలో ఎంతో ప్రగతి సాధించారు. వారు భూమిని సర్వే చేయడంలో, భూమట్టపు కొలతలు తీయడంలో ఎంతో గొప్ప విజ్ఞానాన్ని సాధించారు. ఆ విజ్ఞానంతో వారు నగరాలకు నీటి సరఫరా చేయగలిగారు. వారు తయారుచేసిన పరికరాలతో ఒక కొండలో 500 మీటర్ల పొడవైన సొరంగాన్ని రెండు వైపుల నుంచీ త్రవ్వగలిగారు. అలాగే రోమన్ ఇంజనీర్లు కూడా అదే విజ్ఞానాన్ని సాధించారు. వారు రోమ్ నగరానికి 9 కాలువల ద్వారా రోజుకు 17 కోట్ల 50 లక్షల లీటర్ల మంచినీటిని సరఫరా చేసేవారని ‘హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే గ్రంథంలో ఆర్.వి.జి. మీనన్ వివరించారు, ఆ నీరు త్రాగటానికీ, స్నానాల గదులకు, ఫౌంటెన్లకూ వాడేవారు. నగరం బయట వ్యవసాయానికి కూడ ఆ నీరు వాడేవారు.  క్రీ.పూ. 312లో కట్టిన ఒక ఆనకట్ట నుంచి 10 మైళ్ళ దూరానికి (అంటే 16 కిలోమీటర్ల దూరానికి) నీళ్ళు సొరంగాల గుండా, భూగర్భంలోని కాలువల గుండా తీసుకుపోబడ్డాయని ప్రసిద్ధ చరిత్రకారుడు గార్డెన్ ఛైల్డ్ తెలియజేశారు.” అని ముగించాడు జహంగీర్..

“వెరీగుడ్! వచ్చే క్లాసులో శాస్త్ర సాంకేతిక విజయాల ప్రభావాలు సమాజంపై ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.” అని ఆ రోజు క్లాసు ముగించారు సైన్సు మాస్టారు.

మధ్య యుగాలలో సైన్సు పురోగతి

jan5“పిల్లలూ! మధ్యయుగాలలోని అరబ్బీ శాస్త్రవేత్తలు, వారు కనుగొన్న నూతన విషయాలూ, నూతన సిద్ధాంతాలను గూర్చి మీరు తలా ఒక అంశాన్ని గూర్చి చెప్పడానికి తయారై వచ్చారుగదా?” అడిగారు సైన్సు మాస్టారు శ్రీనివాస్.  “ఓ!” అన్నారు పిల్లలు.

"అయితే నేనిప్పుడు ఒక్కొక్కరి పేరూ పిలుస్తాను. మీకిచ్చిన అంశం పేరు చెప్పి, క్లుప్తంగా ఆ అంశాన్ని గురించి మాట్లాడండి. మొదటగా సాయిలక్ష్మీ! నీవు మాట్లాడమ్మా!" అన్నారు మాస్టారు.

"నాకిచ్చిన అంశం ఆల్ ఆల్ ఖ్వరిజ్మీ, ఉమర్ ఖయ్యాం అనే శాస్త్రవేత్తల గురించి మాస్టారూ! అల్ ఖ్వరిజ్మీ క్రి.శ. 825 ప్రాంతంలో జీవించాడు. ఈయన గొప్ప గణిత శాస్త్రవేత్త. నాల్గవ ఖలీఫా ఆల్-మెమన్ గ్రంథాలయానికి అధిపతిగా ఉండేవారు. ఈయన గణితశాస్త్రంపై తన పరిశోధనల సారాంశాన్ని ‘హిసాబ్ ఆల్-జీబ్రవ ఆల్ ముఖాబిల్లా' అనే గ్రంధంగా రచించాడు. ఇది గణిత శాస్త్రంలోని ఒక నూతన విభాగం. ఈ పుస్తకం పేరులోని ఆల్-జిబ్రవ నుండే ఆ విభాగనికి ఆల్ జీబ్రా అనే పేరు వచ్చింది. ఆల్-జిబ్ర అంటే పునరుద్ధరణ, ఆల్జీబ్రాలో ఒక సమీకరణానికి రెండు వైపులా ఏదో ఒక సంఖ్యలను కూడికగాని, తీసివేతగాని చేసి ఆ సమీకరణంలోని తెలియని విలువను కనుగొనడం జరుగుతుంది. సైన్సులోని అనేక విభాగాల పేరు లాటిన్ నుండి తీసుకొని శాస్త్రవేత్తలు కొనసాగించారు. కాని ఆల్జీబ్రా అనే విభాగం మాత్రమే దాని అరబ్బీ పదం కొనసాగింపుగా తీసుకున్నారు. ఈయన తరువాత చాలా కాలానికి ఉమర్ ఖయ్యాం అనే గణిత శాస్త్రజ్ఞుడు ఆల్జీబ్రాను మరింత అభివృద్ధి చేసి వర్గ సమీకరణాలే కాక ఘన సమీకరణాల సమస్యలను పరిష్కరించాడు." అని చెప్పింది సాయిలక్ష్మి

"12 వ శతాబ్దంలో ఉమర్ ఖయ్యాం అనే ప్రఖ్యాత కవి ఉండేవాడు గదా?” అడిగాడు రాజశేఖర్. సాయిలక్ష్మి నవ్వుతూ “ఆ ఉమర్ ఖయ్యామే ఈ ఉమర్ ఖయ్యాం. ఆయన గొప్ప కవేకాదు. గణిత శాస్త్రవేత్త కూడా” అంది.

పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు చరిచారు. తర్వాత మాస్టారు జాన్ వైపు చూశారు. జాన్ లేచి “నాకిచ్చిన అంశం అల్-బత్తాని అనే శాస్త్రవేత్తను గూర్చి మాస్టారూ! ఈయన క్రీ.శ 858 - 929 మధ్య జీవించాడు. ఖలీఫా ఆల్-మమున్ స్థాపించిన ఖగోళ వేధశాలలో పనిచేశాడు. తన పరిశోధనల ద్వారా విషవత్తుల కాలాన్ని టోలమీ చెప్పిన దానికంటే మరింత కరెక్టుగా చెప్పగలిగాడు." అని చెప్తుండగా వెంకట్రావు లేచి "విషవత్తులు అంటే ఏమిటి?" అని అడిగాడు.

"విషవత్తులు అంటే పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులు. సంవత్సరంలో అవి రెండు రోజులుంటాయి. అవి మార్చి 21, సెప్టెంబరు 23. ఆల్-బత్తాని కనుగొన్న మరో గొప్ప విషయమేమంటే, భూమి యొక్క కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంటుందని. ఇవీ అల్-బత్తానికి సంబంధించి నాకు తెలిసిన వివరాలు మాస్టారూ!” అని చెప్పి కూర్చున్నాడు జాన్. "గుడ్, తర్వాత సిద్దూ! నువు చెప్పు." అన్నాడు మాస్టారు.

సిద్దూ లేచి "నేను అరబ్బీల రసాలు విజ్ఞానాన్ని గూర్చి చెబుతాను మాస్టారూ! అరబ్బుల కంటే ముందున్న గ్రీకు పండితులు ప్రయోగం ప్రయోగాలు శారీర శ్రమతో కూడినవి కాబట్టి వాటిని చేయడానికి ఇష్టపడలేదు. అందువలన రసాయన ప్రయోగాల అవకాశం అరబ్బులకు చిక్కింది. ఈ రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు, లోహ విజయ శాస్త్రాలపై కృషి చేశారు. అప్పటికే చైనా, భారత దేశాలలో రసాయన శాస్త్రం ఉచ్ఛదశలో ఉంది. అరబ్బులు విజ్ఞానాన్ని కూడా వాడుకున్నారు. అరబ్బి రసాయన శాస్త్ర పీతగా జబర్ ఇబిన్ హయ్యన్ ను చరిత్ర కారులు పేర్కొంటున్నారు.

jan7రసాయన శాస్త్ర అభివృద్ధికి బట్టి అనే పరికరం ముఖ్యమైనది. అప్పటికే అందుబాటులో ఉన్న బట్టీని, అరబ్బులు అత్తరులు భారీస్థాయిలో డిస్టిల్ చేయడానికి పనికొచ్చే విధంగా అభివృద్ధి చేశారు. అందువలన సుగంధ రసాయన శాస్త్రం అభివృద్ధి అయింది. సారాను ఖురాను నిషేధించింది. అందువలన అరబ్బులు ద్రాక్షసారా, ఆల్కహాల్ల తయారీ జోలికిపోలేదు. అయితే ఈ పనిని ఆ తర్వాత యూరప్ దేశాల క్రైస్తవులు చేపట్టారు.

అరబ్బులు అనేక కొత్త కొత్త రసాయన పదార్థాలు కనుగొన్నారు. వారు ఆర్సెనిక్, ఆంటిమొనీ, ఖనిజ ఆమ్లాలు, సాల్ట్ పెటర్ (సోడియం నైట్రేట్), సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రికామ్లము, ఆక్వారీజియాలను కొత్తగా తయారు చేశారు. వారు సోడా, పటిక, ఐరన్ సల్ఫేట్లను పెద్ద ఎత్తున తయారు చేసి ఎగుమతి చేసేవారు. వీటిని అన్ని దేశాలలో జౌళిపరిశ్రమల్లో ఉపయోగించేవారు. ఇవీ అరబ్బుల రసాయన శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన విశేషాలు మాస్టారూ!” అన్నాడు సిద్దూ.

మాస్టారు సూర్యాంశ్ వైపుచూచి చిరునవ్వు నవ్వాడు. సూర్యాంశ్ లేచి “నేను అరబ్బీ గణితంపై వైద్యశాస్త్రంపై భారతీయ శాస్త్రాల ప్రభావాన్ని గూర్చి చెబుతాను మాస్టారూ! క్రీ. శ 773 లో అబ్బాసిద్ లో రెండవ ఖలీఫా ఆల్-మన్సూర్ కు భారతీయ గణిత శాస్త్ర వండితుడు ‘మంకా’ ఒక బహుమతిగా వంపబడ్డాడు. ఆయన ద్వారా భారతీయ గణిత శాస్త్ర సిద్ధాంతాలూ, బ్రహ్మగుప్తుని రచనలూ, భారతీయ దశాంశ వద్ధతీ, కొత్తగా కనుగొనబడిన సున్నా, స్థాన విలువల పద్ధతీ అన్నీ అరబ్బులకు చేరాయి. వీటితో బాటు చరకుడూ, శుశ్రుతుల వైద్యశాస్త్ర గ్రంధాలు అరబ్బులకు చేరి, అవి అరబ్బీ భాషలోకి అనువదించబడినాయి. అలా అరబ్బుల విజ్ఞానాన్ని భారతీయ శాస్త్రాలు అభివృద్ధి చేశాయి. భారతీయుల గణితశాస్త్ర విజ్ఞానాన్ని భౌతిక శాస్త్ర, ఖగోశాస్త్ర సమస్యలను పరిష్కరించడంలో అరబ్బులు బాగా ఉపయోగించుకున్నారు.” అని చెప్పికూర్చున్నాడు.

మాస్టారు శైలజ వైపు చూసి నవ్వుతూ “ఊ! చెప్పు” అన్నాడు. శైలజ లేచి “నేను అరబ్బులలో ప్రఖ్యాత వైద్యుడు, మహా పండితుడు అవిసెన్నాను గూర్చి చెబుతాను మాస్లారూ! ఈయన క్రీ.శ 980, క్రీ.శ 1037 ల మధ్య జీవించాడు. చాలా మేధావిగా గుర్తింపుపొందిన ఈయన, 10 ఏళ్ళ వయస్సులోనే ఖురాను మొత్తాన్నీ చూడకుండా వల్లించేవాడు. 18 ఏళ్ళు వచ్చేటప్పటికే ప్రఖ్యాత వైద్యుడుగా పేరు తెచ్చుకొని రాజాస్థానంలో ప్రాపకం సంపాదించాడు. 31 ఏళ్ళ వచ్చేటప్పటికి గ్రీకు, భారతీయ, చైనా దేశపు వైద్యశాస్త్రాలను మధించి, 20 సంపుటాల 'వైద్యవి సర్వస్వాన్ని’ రచించాడు. ఆయన రచనలలో మరో ప్రముఖ గ్రంధం ‘కానన్ ఆఫ్ మెడిసిన్' అని పాశ్చాత్యులు పిలిచే వైద్యశాస్త్ర గ్రంధం. ఇది మధ్య యుగాలలో తూర్పు దేశాలలోనూ, తర్వాత 17వ శతాబ్దం వరకూ యూరోపులోనూ వైద్యవిద్యార్థులకు పాఠ్యగ్రంధంగా చెలామణి అయ్యింది.” అని చెప్పింది.

"సిరీ! నువ్విప్పుడు." అన్నారు మాస్టారు.

“నేను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇబిన్ యూనస్ ను గూర్చి చెబుతాను మాస్టారూ! యూనస్ దాదాపు క్రీ.శ. 1000 ప్రాంతంలో జీవించాడు. ఖలీఫా ఆల్-హకీమ్ కైరోలో నెలకొల్పిన ఖగోళ వేధశాలలో పరిశోధనలు చేశాడు. అరబ్బీ ఖగోళ శాస్త్రజ్ఞులలో ఈయన అందరి కంటే గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు. సూర్య, చంద్రగ్రహణాలను గూర్చి ప్రత్యేక పరిశోధనలు చేశాడు. అంతకు ముందు 200 సంవత్సరాల నుండి తయారు చేయబడిన వివరాలు సేకరించి ఖగోళ శాస్త్ర పట్టికలు తయారు చేసి వాటికి తమ ఖలీఫా గౌరవార్థం హకీమైట్ ఖగోళ పట్టికలు అని పేరు పెట్టాడు.” అని చెప్పింది సిరి.

“గుడ్! పిల్లలూ ఈ రోజుకు క్లాసుముగిద్దాం. వచ్చే క్లాసులో మరికొన్ని విశేషాలు ముచ్చటించుకుందాం.” అంటూ లేచారు మాస్టారు. పిల్లలు మాస్టారిని అనుసరించారు.

feb14“పిల్లలు! మధ్యయుగాలలో సైన్సు అరబ్బు దేశాలలో అనువాదాల ద్వారాగానీ, పరిశోధనల ద్వారా గానీ పురోగమించిందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అభినంద్ నువ్వు ఏం చెబుతావు?” అడిగాడు మాస్టారు.

“నేను అల్-హేధమ్ అనే నేత్ర శాస్త్రవేత్తను గూర్చి చెబుతాను మాస్టారు. ఈయన క్రీ.శ. 1030 ప్రాంతాల్లో జీవించాడు. కాంతి రేఖలకు సంబంధించి యూక్లిడ్, టాలెమీల సిద్ధాంతాన్ని ఈయన తిరస్కరించాడు. వాళ్ళు కాంతి రేఖలను వస్తువుల మీదికి కళ్ళు ప్రసరిస్తాయనీ. అప్పుడు ఆ వస్తువులు కనిపిస్తాయని ప్రతిపాదించాడు. అల్-హేథమ్ కాలం వరకూ ప్రజలు ఆ సిద్దాంతం తప్పనీ, వస్తూవులపై నుండి మాత్రమే కాంతి రేఖలు మొదలై కంటిపై పడతాయని, అప్పుడు వస్తువులు కంటికి కనిపిస్తాయనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతేకాదు. తన ప్రయోగాల ద్వారా కంటిలో కటకం ఉంటుందనీ, కంటికి కటకాలు బిగిస్తే అక్షరాలు పెద్దవిగా కనబడతాయనీ నిరూపించాడు. తర్వాతి కాలంలో ఇదే సిద్ధాంతాన్ని ఉపయోగించి టెలిస్కోపులు, మైక్రోస్కోపులూ, కెమేరాలు తయారు చేయబడ్డాయి.” అని వివరించాడు అభినంద్.

“మంచిది. ఇప్పుడు మధ్య యుగాలలోని ఇద్దరు క్రైస్తవ శాస్త్రజ్ఞులను గూర్చి తెలుసుకుందాం. వారిద్దరూ రాబర్ట్ గ్రాసెట్టి, రోగర్ బాకన్. వారిని గూర్చి విప్లవా, నువ్వు చెప్పమ్మా.” అడిగాడు మాస్టారు

"అలాగే మాస్టారూ! వారిద్దరూ గురుశిష్యులు. రాబర్ట్ గ్రాసెట్టి క్రీ.శ 1168, 1253 ల మధ్య జీవించాడు. ఈయన కాంతిని గూర్చి అధ్యయనం చేశాడు. కటకంలో కాంతి యొక్క వక్రీభవనానికి సంబంధించిన ప్రయోగాలు చేశాడు. కానీ కాంతిని ఇతను 'దివ్యజ్యోతి' గా భావించాడు. మత పరమైన విషయాలు సత్యమని సమర్ధించడమే సైన్సు యొక్క ముఖ్యమైన పని అన్నాడు. రోగర్భాకన్ గ్రాసెట్టి శిష్యుడు. క్రీ.శ 1214, 1294 ల మధ్య బాకన్ జీవించాడు. ప్రధాన పరిశోధనలు నేత్ర వైద్యం, కటకాల మీద చేశాడు. కాని ఈయన పరిశోధనలు పోపుగారి కోపానికి కారణమయింది. అందువలన దాదాపు పది సంవత్సరాలపాటు ఏదీ రాయకుండా ఉండిపోవలసి వచ్చింది. ఈ లోగా ఈయన చొరవతో బాకన్ వ్రాసిన ‘ఓపస్ మేజేస్' అనే పేరుగల విజ్ఞాన సంగ్రహం వెలువడింది. కానీ 1268 లో క్లెమెంటు IV చినిపోయాడు. దానితో బాకస్ కష్టాలు రెట్టింపయ్యాయి. 1278 లో ఆయనను విచారించి. న పరిశోధనలు క్రైస్తవ సంప్రదాయ భావాలకు సదంగా ఉన్నాయని నిర్ధారించి, బాకన్ను గృహ నిర్భంధానికి గురిచేశారు. విచిత్రమైన యమేమిటంటే బాకన్ కూడ తన గురువు గ్రాసెటి వలెనే క్రైస్తవం చెప్పినది సత్యమని రుజువు చేయడమే సైన్సు కర్తవ్యం అన్నాడు. అయినా అతడు చర్చి పెద్దల ఆగ్రహానికి గురికావడానికి కారణం ప్రతి ఒక్క అంశాన్నీ ప్రయోగాల ద్వారా రుజువు చేసుకున్న తర్వాతనే అంగీకరించమని కోరడమే. బాకన్ యొక్క గొప్పతనం ఏమిటంటే. 13 వ శతాబ్దంలోనే ఆయన మోటారు కార్లు, ఓడలు, విమానాలు నిర్మించడాన్ని గూర్చిన ఊహలు చేశాడు. తుపాకీ మందు, భూతద్దాల వినియోగాన్ని గూర్చి తన రచనలలో చర్చించాడు. అన్నిటినీ మించి టోలమీ ఊహించిన గ్రహాల స్థానాలు తప్పయి ఉండ వచ్చునన్నాడు గాని ఏ విషయాన్నీ శాస్త్రీయంగా రుజువు చేయలేక పోయాడు. మొత్తం మీద భవిష్యత్తులో కనుగొన్న అనేక అంశాలను బాకన్ ముందుగానే ఊహించాడు. అదీ బాకన్ ప్రతిభ.” అంటూ ముగించింది. విప్లవ.

feb15మాస్టారు మధుకర్ వైపు చూచి చిరునవ్వు నవ్వారు. మధుకర్ లేచి “నేను అన్-నఫిజ్ అనే శాస్త్రవేత్తను గురించి చెబుతాను మాస్టారూ! ప్రాచీన కాలం నాటి ప్రఖ్యాత వైద్యుడు గాలెన్ రక్త ప్రసరణను గూర్చి చెప్పిన సిద్దాంతాన్ని అన్-నఫిల్ తిరస్కరించాడు. గాలెన్ ఏం చెప్పాడుంటే రక్తం గుండెలోని కుడివైపు గదుల నుండి మధ్యలోని రంధ్రాల ధ్వారా ఎడమవైపు గదులలోకి ప్రసరిస్తుందని చెప్పాడు. అన్-నఫిజ్ ఏం నిరూపించాడంటే గుండెలోని కుడి, ఎడమ కవాటాల మధ్య ఎలాంటి త్రోవాలేదు. ఆ కవాటాల మధ్యనున్నగోడ మిగిలిన భాగాల మధ్యనున్న అవయవాలకంటే మరింత మందమైనది అని. ఇలా నఫిజ్ వైద్యశాస్త్రాన్ని ఒక ముఖ్యమైన మలుపుతిప్పాడు.” అని చెప్పి కూర్చున్నాడు.

మాస్టారు “రాంబాబూ! నీవు చెప్పు! అన్నాడు. రాంబాబు “మాస్టారు! నేను అర్జాచల్ అనే ఖగోళ శాస్త్రవేత్తను గూర్చి చెబుతాను. ఈయన క్రీ.శ. 1080 ప్రాంతంలో జీవించాడు. ఈయన సిద్ధాంతీకరించిన విషయం ఏమిటంటే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరుగుతున్నాయని. అయితే ఆ విషయాన్ని లెక్కల ద్వారా నిరూపించలేక పోయాడు. ఎందుకంటే, అప్పటికి గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్ర అంశాలను నిరూపించే స్థాయికి ఎదగకపోవ చే దువలన ఎవ్వరూ ఆయన తార్కిక సిద్ధాంతాన్ని ఆమోదించలేదు. అప్పటికి కొన్ని వందల ఏళ్ళుగా ప్రజలు నమ్ముతున్న టోలమీ, అరిస్టాటిల్ల సిద్దాంతమైన 'అన్ని గ్రహాలు భూమి చుట్టూనే తిరుగుతున్నాయి' అనే విషయాన్నే అంగీకరించారు గాని అర్జాఛల్ సిద్ధాంతాన్ని ఎవరూ అంగీకరించలేదు.” అని చెప్పి కూర్చున్నాడు.

feb16“పిల్లలూ! సైన్సు చరిత్రలో ఇస్లాం శాస్త్రజ్ఞుల పాత్రను గూర్చి మీరు తెలుసుకున్నారుగదా? వారు రెండు కర్తవ్యాలు నిర్వహించారు. ఒకటి ప్రాచీన కాలంనాటి సైన్సును కాపాడి, సైన్సు గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించి, వాటిని యూరోపు దేశాలకు అందించారు. ఇస్లామిక్ సామ్రాజ్యం తూర్పున ఇండియా, చైనాల వరకూ, పశ్చిమాన యూరప్ వరకూ విస్తరించి ఉండటం కారణంగాను, ఇండియా నుండి స్పెయిన్ వరకూ వారి వ్యాపార సంబంధాలు ఉండటం మూలంగానూ, అప్పటికే అభివృద్ధి చెందిన తూర్పుదేశాలలోని సైన్సు మరియు సాంకేతికతలను, పునర్వికాసానికి సిద్ధంగా ఉన్న పశ్చిమ దేశాలకు అందించారు. ఇది వారు నిర్వహించిన రెండవ కర్తవ్యం. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే. 11 వ శతాబ్ది నుండి ఇస్లామిక్ సామ్రాజ్యం పతనమవుతూ వచ్చింది. అదే సమయంలో మత ఛాందస వాదులదిపై చేయి అయి, వారు సైన్సు అనుమానపు కోణంలో చూచిన కారణంగా, సైన్సు ప్రయోగాలు అణచివేయబడి సైన్సు ప్రగతి ఆదేశాలలో ఆగిపోయింది. అయితే పశ్చిమ దేశాలలో, క్రమంగా సైన్సు పునర్వికాసం చెందడం సంతోషకరమైన విషయం. ఇప్పుడు పునర్వికాస కాలానికి ముందునాటి శతాబ్దాలలో యూరోపు దేశాలలోని సైన్సు ప్రగతిని తెలుసుకుందాం. మీరు తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం మధ్యయుగాలలోని యూరోపియన్ సైన్సు, సాంకేతికతలలో ఎక్కువ భాగం చైనా ఇండియాల నుంచి యూరప్ దేశాలకు చేరినవే, ఉదాహరణకు కొందరు యూరోపియన్ శాస్త్రవేత్తలను గూర్చి చెబుతాను. బాత్ అనే ఇంగ్లీషు పండితుడు అరబ్బీ సైన్సును గూర్చి సంగ్రహంగా 'నాచురల్ క్వశ్చన్స్' అనే పేర వ్రాశాడు. ఈయనే ఆల్-ఖ్వారిజ్మీ వ్రాసిన ఆల్జీబ్రాను లాటిన్ భాషలోకి అనువాదం చేసి, దానిలో భారతీయ అంకెలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈయన క్రీ.శ 1150 ప్రాంతాల్లో జీవించాడు. ఆ తర్వాత క్రీ.శ 1200 ప్రాంతాల్లో జీవించిన ఇటాలియన్ గణితశాస్త్రవేత్త, తాను వ్రాసిన 'లిబర్ అబకి' అనే పుస్తకంలో రోమన్ సంఖ్యామానం కంటే భారతీయ సంఖ్యామానం ఎంతో ఉన్నతమైనదని వివరించాడు. వీరి కృషి కారణంగా, 13వ శతాబ్ది అంతానికి పాశ్చాత్యదేశాలలో భారతీయ సంఖ్యామానం బాగా చలామణీలోకి వచ్చింది. కాకపోతే యూరప్లో ఆ సంఖ్యామానం అరబిక్ సంఖ్యామానంగానే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మధ్యయుగాలలోని సాంకేతికతలూ, వాటి మూలాలూ తెలుసుకుందాం. గీతా! నువ్వు చెబుతావా?” అని అడిగాడు మాస్టారు.

"చెబుతాను మాస్టారూ! సాంకేతికతలలో ఎక్కువ భాగం అరబ్బుదేశాలకు చైనా నుండి వచ్చాయి. ఉదాహరణకు పేపర్ తయారీ పరిశ్రమ క్రీ.శ. 105 లో చైనాలో మొదలయ్యింది. అది సమర్ఖండకు క్రీ.శ. 761 లోనూ. స్పెయిన్ కు క్రీ.శ. 1100 లోనూ వచ్చింది. అలా చైనా నుండి అరబ్బు దేశాలకూ, అక్కడి నుండి మూరపకూ ఆ పరిశ్రమ వ్యాపించింది. అలాగే తుపాకీ మందును యుద్ధాలలో ఉపయోగించడం కూడా చైనా నుండి మంగోలుల ద్వారా యూరప్ కు విస్తరించింది. ముద్రణా యంత్రం చైనాలో క్రీ.శ 700 లో వచ్చింది. మొదట్లో పేకముక్కలను ముద్రించేవారు. ఆ సాంకేతికత మంగోలుల దండయాత్రల తర్వాతనే యూరప్ చేరింది. అలాగే గుర్రం యొక్క జీను, దిక్సూచి, చుక్కాని చైనా నుండే ఇస్లాం సామ్రాజ్యం గుండా యూరప్ చేరాయి. మరికొన్ని పరికరాలు గ్రీకు, రోమన్ల నుండి అరబ్బుల ద్వారా యూరప్ చేరాయి. అవి నీటి మిల్లులు, నీటి గడియారాలు.” అని చెప్పింది గీత.

"ఈ కాలంలో భారతదేశం యొక్క పాత్ర ఏమీ లేదా? మాస్టారూ!” అడిగాడు రాజశేఖర్. “బాధాకరమైన విషయమేమంటే మధ్య యుగాల సైన్సు సాంకేతికల ప్రగతిలో భారతదేశం యొక్క పాత్ర ఏమీ లేదు. దానికి కారణాలను ప్రముఖ సైన్సు చరిత్ర కారులు ఆర్.జి.వి.మీనన్ 'హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలా వివరించారు. సమాజం ఆ కాలంలో సృజనాత్మకతను ఆహ్వానించ లేనంతగా కుదించుకుపోయింది. అంతర్ముఖామయింది. ఆత్మహత్యా సదృశంగా సంప్రదాయపు సంకెళ్ళు తగిలించుకొంది. అలాకుంచించుకుపోయిన సమాజంలో సైన్సు ప్రగతి పూర్తిగా ఆగిపోయింది పిల్లలూ! విజేతలు విజయాలు సాధించడానికి గల కారణాలూ, ఎదుగుబోదుగులు లేని సమాజాలలోని లోపాలూ అన్నీ తెలుసుకుంటేనే మనం భవిష్యత్తులో విజయాలు సాధించగలం. అవి అన్నీ తెలుసుకోండి. వచ్చే క్లాసులో పునర్వికాస కాలంలో సైన్సు ప్రగతిని గూర్చి తెలుసుకుందాం.” అంటూ మాస్టారులేచారు. పిల్లలు మాస్టారిని అనుసరించారు.

పునర్వికాస కాలం

mar12

“పిల్లలూ! మధ్యయుగాలలో సైన్సు పురోగతినీ, దాని వలన మానవ జాతికి కలిగిన ప్రయోజనాల ఉంచీ తెలుసుకున్నాం. సైన్సు పురోగతిలోని ఒక పన విషయం ఏమిటంటే, ఒక ప్రాంతంలో న ఆలోచనలు స్తంభించిపోతే మరొక ప్రాంతంలో మొగ్గతొడిగాయి. ప్రాచీన కాలంలో భారతదేశం, చైనాలు శాస్త్రీయ ఆలోచనలలోనూ, నూతన ఆవిష్కరణలలోను ముందున్నాయి. కానీ మధ్య యుగాలలోకి వచ్చేసరికి చైనా, ఇండియాలలో శాస్త్రీయ ఆలోచనా పరంపర స్తంభించిపోయింది. కానీ అదే కాలంలో అరబ్బు దేశాలలో శాస్త్రీయ ఆలోచనా ప్రవాహం ఇంకిపోయి, ఆ ఆలోచనలు యూరపు దేశాలలో పునర్వికాసం జరిగి, పునరుద్ధరించబడ్డాయి. అందువలన 15 వ శతాబ్దం మధ్య భాగం నుండి రెండున్నర శతాబ్దాల కాలాన్ని పునర్వికాస మరియు పునరుద్ధరణ కాలాలుగా సైన్సు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆ కాలాలలోని సైన్సు ప్రగతిని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం.” అన్నారు మాస్టారు.

“పునర్వికాస కాలం అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు మాస్టారూ?” అడిగాడు మధుకర్.

mar13“పునర్వికాన కాలానికి ఒక తేదీని నిర్ణయించవలసి వస్తే, క్రీ.శ. 1452 లో పునర్వికాస కాలం ఆరంభమయినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే యూరోపు దేశాల్లో జరిగిన సైన్సు పునర్వికాసానికి ఆ ఒడైన లియొనార్డో డావిన్సీ 1452 లో జన్మించాడు. అలాగే ప్రాచీన కాలపు ఖగోళశాస్త్ర అశాస్త్రీయ భావాలను తొలగించిన మహాశాస్త్రవేత్త కోపర్నికస్ మరణించిన సంవత్సరమైన 1543 ను పునర్వికాస కాలపు చివరి సంవత్సరంగా సైన్సు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాబట్టి డావిన్సీ, కోపర్నికస్లు పునర్వికాస కాలపు ప్రముఖ శాస్త్రజ్ఞులుగా సైన్సు చరిత్రలో నిలిచారు. సైన్సు వికాసానికి వారిద్దరి కృషీ ఆ కాలం నాటి ఇతర శాస్త్రజ్ఞుల కృషీ, ఫలితాలూ, ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

లియోనార్డో డావిన్సీ ఒక గొప్ప ఇంజనీరు, శాస్త్రజ్ఞుడు అంతేకాదు. ఆయన మరొక రంగంలో కూడా గొప్పవాడు. అది ఏ రంగంలోనో ఎవరైనా చెప్పగలరా? “ అడిగాడు మాస్టారు. జాన్ లేచి నిలబడ్డాడు. మాస్టారు చిరునవ్వుతో “చెప్పు” అన్నారు.

“ఆయన చిత్రకళారంగంలో గొప్ప ప్రతిభాశాలి మాస్టారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మోనాలిసా చిత్రాన్ని గీసింది. ఆయనే.” అన్నాడు జాన్

“గుడ్, కరెక్టుగా చెప్పావు. డావిన్సీ గొప్పతనం ఏమిటంటే ఒక శాస్త్రీయ ఫలితాన్ని సాధించాలంటే ప్రయోగాల ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పాడు. అని వరకు శాస్త్రజ్ఞులు గణిత సిద్ధాంతాల ద్వారా వచ్చిన సమాధానాలను అంగీకరించి, అదే శాస్త్రీయం ఫలితమనేవారు. ప్రయోగాలకు అగ్రస్థానమిచ్చి, డావిని సైన్సు రంగాన్ని ఒక గొప్ప మలుపు తిప్పాడు.” అన్నారు మాస్టారు.

"ఆయన చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాలూ చెప్పండి మాస్టారూ!” అడిగింది లలిత.

mar14“డావిన్సీ ప్రతిపాదించిన అనేక సిద్ధాంతాలు తర్వాతి కాలంలో ప్రయోగాల ద్వారా ఋజువైనాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆయన జీవించిన కాలంలో ప్రయోగపరికరాలను, తానే తయారు చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అప్పటికి స్థితిశాస్త్రం, గతిశాస్త్రాలు తగినంతగా అభివృద్ధి కాలేదు. యంత్రాలు కదిలించడానికి అవసరమైన ఆవిరి యంత్రం ఇంకా కనుగొనబడలేదు. అయినా వివిధ వైజ్ఞానిక రంగాలలో డావిన్సీ యెుక్క ఊహలు కరెక్టేనని తర్వాతి శాస్త్రీయ, పరిశోధనలు నిరూపించాయి. వాటిని ఒక్కొక్కటీ వివరిస్తాను.

జీవశాస్త్ర రంగంలో శరీరంలో జరిగే రక్తప్రసరణ మార్గాన్ని డావిన్సీ ముందుగానే ఊహించాడు. ఖగోళశాస్త్ర రంగంలో, ఆయన ఇతర గ్రహాల లాగే భూమి కూడా ఒక గ్రహమనీ, గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయనీ భావించాడు. ఆ తరువాత కోపర్నికన్ దీనిని నిరూపించాడు. యాంత్రిక శాస్త్రంలో, గెలీలియో నూరేళ్ళ తర్వాత నిరూపించిన అంశాలను డావిన్సీ ఊహించి చెప్పాడు. అదేమిటంటే ‘ప్రతి పదార్థానికీ, తాను ప్రయాణిస్తున్న దిశలో కొంత భారం ఉంటుంది’ అనీ, ‘పై నుండి క్రిందికి పడుతున్న ఏ వస్తువుకైనా, అది క్రిందికి పడేకొలదీ వేగాన్ని పెంచుకుంటుంది’ అనీ. అంతేకాదు, ఈ విశ్వమంతా కొన్ని యాంత్రిక సూత్రాల ఆధారంగానే నడుస్తున్నదనే న్యూటన్ నిరూపణను ఈయన ముందుగానే సూచించాడు. కాంతికి సంబంధించి, హూజెన్స్ తరువాత కాలంలో నిరూపించిన ‘కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది’ అనే విషయాన్ని ముందుగానే ఊహించిన మహాశాస్త్రవేత్త డావిన్సీ. అంతేకాదు, చంద్రుని ఉపరితలం చీకటిగా ఉంటుందనీ, సూర్యుని కాంతి భూమి మీదపడి, అది ప్రతిఫలించి, చంద్రుని మీద పడినంతమేర, ఆ భాగం ప్రకాశిస్తుందనీ, అదే చంద్రకాంతి అనే భావించిన మొట్టమొదటి పాశ్చాత్య శాస్త్రవేత్త డావిన్సీ. అందకరమైన విషయం ఏమిటంటే, క్రీ.శ. 6 వ శతాబ్దం మొదట్లోనే ఈ విషయాన్ని ప్రఖ్యాత భారతీయ గోళ, గణిత శాస్త్రవేత్త ఆర్యభట వివరించారు.

ఇక భౌతికశాస్త్ర రంగంలో డావిన్సీ ఈ క్రింది విషయాన్ని గమనించాడు. “ఎక్కడ అగ్ని మండుతున్నా, దాని చుట్టూ వాయు ప్రవాహం బయలుదేరుతుంది. ఈ వాయువు ప్రవాహవే మంటను నిలిపి ఉంచుతుంది.” ఈ వాయు ప్రవాహమే 'ఆక్సిజన్' అని 300 ఏళ్ళ తర్వాత 1777 లో లెవోయిజర్ అనే శాస్త్రవేత్త వివరించాడు.

వైద్యశాస్త్ర రంగంలో, డావిన్సీ, శరీర భాగాలకు సంబంధించిన 750 చిత్రాలు గీసి, ప్రపంచంలోని శారీరక శాస్త్రజ్ఞులలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

mar15అంతేకాదు, డావిన్సీ ఒక్క యంత్రాన్ని కూడా తయారు చేయకపోయినా, అసంఖ్యాకంగా యంత్రాలను ఊహించి, వాటి బొమ్మలను గీశాడు. వాటిలో పిండి మిల్లులు, కదులతూ కాలువలు , తవ్వేయంత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని మించిన మరొక గొప్ప ఊహను డావిన్సీ చేశాడు. దాని పేరును ఆయన తన నోటు బుక్కులో ఎత్తు నుంచి భూమికి దిగే సాధనము" అని వ్రాశాడు. అదే నేటి మన 'పారాషూట్' ఆధునిక కాలంలో దానిని నిర్మించిన కొన్ని వందల సంవత్సరాల క్రితమే దానిని ఊహించి, ఊహా చిత్రాన్ని గీసిన ప్రతిభాశాలి లియోనార్డో డావిన్సీ ఆయన హెలికాప్టరూ, తుపాకీల సమూనాలు కూడా గీశాడు. అందువలననే ప్రతి విజ్ఞానశాఖ వారు డావిన్సీ తమ వాడంటారు. భౌతికశాస్త్రజులు ఆయన భౌతిక శాస్త్రజ్ఞుడంటారు. ఖగోళ శాస్త్రజ్ఞులు ఖగోళశాస్త్రవేత్త అంటారు. వైద్యులు ఆయనను గొప్ప వైద్యశాస్త్ర పరిశోధనాశాలి అంటారు. శరీర శాస్త్రజ్ఞులు ఆయనను తమవాడని గౌరవిస్తారు. ఇంజనీర్లు తమ తోటి యంత్రనిర్మాత అంటారు. చిత్రకారులాయనను మహాచిత్ర కారుడంటారు. ఇంతటి మహా ప్రతిభాశాలి తన 67వ ఏట 1519లో మరణించాడు.”

“ఆయన ఏదేశం వాడు మాస్టారూ?" అడిగాడు అభినంద్

“ఇటలీ దేశంవాడు అభినంద్." అన్నాడు మాస్టారు.

క్లాసంతా కొంతసేపు మౌనం. తర్వాత మాస్తారే చెప్పడం మొదలెట్టారు.

“పిల్లలూ! ఇంత క్రితం లాగే ఇప్పుడు కూడ మీకు తలా ఒక శాస్త్రవేత్త పేరును లేదా ఒక అంశాన్నీ ఇస్తాను. మీరందరూ ఆ అంశాన్ని గూర్చి బాగా చదివివచ్చే క్లాసులో ఆ విషయాన్ని మిత్రులకు వివరించండి.” అంటూ తలా ఒక అంశాన్ని ఇచ్చారు. పిల్లలు వాటిని తీసుకున్నారు.

"వచ్చే క్లాసులో కలుసుకుందాం." అంటూ మాస్టారు క్లాసు బైటికి నడిచారు. పిల్లలు మాస్టారిని అనుసరించారు.

పునర్వికాస కాలం నాటి శాస్త్రజ్ఞులు – సైన్సు ప్రగతి

apr7“పిల్లలూ! పునర్వికాస కాలం నాటి శాస్త్రజ్ఞులను గూర్చీ, ఆనాటి సైన్సు ప్రగతిని గూర్చీ మీరు ఒక్కొక్కరూ ఒక్కో అంశాన్ని చెప్పాలన్నాను. మీరు చెప్పడానికి సిద్దపడి వచ్చారు గదా?” అన్నారు సైన్సు మాస్టారు. “ఓ!” అన్నారు పిల్లలు.

“వెరీగుడ్! సిరీ! జాన్ గుటెన్ బర్గ్ ను గూర్చీ, ఆయన తయారు చేసిన అచ్చు యంత్రాన్ని గూర్చీ, ఆ కాలంలో అభివృద్ధి అయిన ముద్రణా సామగ్రిని గూర్చీ వివరించు.” అన్నాడు మాస్టారు.

“జాన్ గుటెన్బర్గ్ జర్మన్ దేశీయుడు మాస్టారూ! ఈయన 1898 లో జన్మించి 1465 లో మరణించాడు. ఈయన ముద్రణాయంత్రాన్ని కనుగొనడమే కాక, అవసరాన్ని బట్టిమార్చగల అచ్చు అక్షరాల ముద్రలను కనుగొన్నాడు. ఆ కాలంలోనే సన్నని కాగితాన్నీ, ముద్రణకు కావలసిన నూనె ఆధారిత ఇంకును కనుగొనడం జరిగింది. వాటినుపయోగించి 1453 లో గుటెన్ బర్గ్ 41 లైన్లు వచ్చే కాగితంపై, మొదటి గ్రంధంగా, బైబిలను ముద్రించాడు. అప్పటి నుండి అనేక గ్రంధాలు, వేగంగా ముద్రించాడు. అప్పటి నుండి అనేక గ్రంధాలు, వేగంగా ముద్రించబడి యూరప్ ముఖచిత్రాన్నే మార్చివేశాయి మాస్టారూ!” అని చెప్పి కూర్చుంది సిరి.

“బాగా చెప్పావు సీరి.” అని మాస్టారు సూర్యాంశ్ వైపు చూశాడు.

“నేను ఆల్ బ్రెక్ట్ డ్యూరర్ ను గూర్చి చెబుతాను మాస్టారూ! ఈయన జర్మనీ దేశస్థుడు. 1471 లో జన్మించి 1528 లో మరణించాడు. ఆధునిక కాలంలో నగర నిర్మాణానికి సంబంధించి ప్లానులను మొదటగా రూపొందించిన ఇంజనీరు ఈయనే. ఈయన ప్లానులో సాంఘిక సౌకర్యాలూ, నగర రక్షణ విధానాలూ రెండూ చక్కగా రూపొందించబడ్డాయి. కర్మాగారాలు నగరానికి దక్షిణం చివరలో ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకుంటే యూరోపులో దక్షిణంవైపు వీచే గాలులే ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి కర్మాగారాల నుంచి వచ్చే విషగాలులు నగరం వైపు కాకుండా నగరం ఆవలికి వీచేట్టుగా వాటిని డ్యూరర్ అలా ప్లాను చేశాడు. రాగిపని చేసే వారూ కర్మాగారాలకు దగ్గరలో నివసించేట్లుగా ఆహారం అమ్మే వీధికి దగ్గరగా ఉండేట్లుగానూ, టౌన్ హాల్ సామాజిక కేంద్రం, అంగళ్ళూ నగరం మధ్యలోనూ ఏర్పాటు చేశాడు. ఇలా ఆధునిక నగర నిర్మాణ కర్తగా డ్యూరర్ కీర్తి గడించాడు మాస్టారూ!” అని వివరించాడు సూర్యాం. “గుడ్! సూర్యా! బాగా చెప్పావు. కాకపోతే ప్రపంచ చరిత్రలను క్షుణ్ణంగా చదివిన వారికి ఎవరికైనా, నగర నిర్మాణ పద్ధతులు ప్రాచీన కాలంనాటి భారతీయులకు హరప్పా, మొహంజోదారోల నిర్మాణకాలం నాటికే తెలుసని అర్థమవుతుంది. ఇప్పుడు పునర్వికాస కాలంలో వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో, ఆ వివరాలు తెలుసుకుందాం. సిద్దూ! నీవు చెప్పు.” అడిగాడు మాస్టారు.

apr8“అలాగే మాస్టారూ! శరీరంలో రక్త ప్రసరణను గూర్చిన విజ్ఞానం ఈ కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. ప్రాచీన కాలం నాటి వైద్యశాస్త్రవేత్త గాలెన్ చెప్పిన సిద్ధాంతాన్నే శాస్త్రవేత్తలు 1543 వరకూ ఎన అంగీకరించేవారు. గాలెన్ ఏం - చెప్పాడంటే, రక్తం గుండెలోని కుడి భాగం నుండి ఎడమ భాగానికి వాటి మధ్యనున్న సెప్టమ్ అనే గోడ ద్వారా ప్రవహిస్తుందని చెప్పాడు. కాని 1543 లో వెసాలియస్ అనే శాస్త్రవేత్త దానిని ఖండించాడు. వెసాలియస్ ఆనాటి నెదర్లాండ్స్ దేశంలో 1514 లో పుట్టాడు. ఈయన ఏమని సిద్ధాంతీకరించాడంటే, గుండె మధ్యభాగంలో ఉండే గోడ చాలా మందంగా ఉంటుందనీ, అందువలన దానిలో నుండి రక్తం ప్రవహిండం అసాధ్యమనీ అన్నాడు. కానీ వెసాలియస్ రక్తప్రసరణ గుండె ద్వారా ఎలా జరుగుతుందో చెప్పలేక పోయాడు, ఈయన 1564 లో మరణించాడు. ఈయన బ్రతికి ఉండగానే మైకేల్ సెర్వెటస్ అనే స్పెయిన్ శాస్త్రవేత్త ఆ వివరాన్ని చెప్పాడు. సెర్వెటస్ 1511 లో పుట్టాడు. ఈయన శాస్త్రవేత్తే కాదు. మత సంస్కర్త కూడా. ఈయన ఏం చెప్పాడంటే ‘రక్తం గుండెలోని కుడి భాగం నుండి ముందుగా ఊపిరితిత్తులలోనికి వెళుతుంది. అక్కడ ప్రాణ శక్తిని పెంచే గాలి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అక్కడి నుండి గుండెలోని ఎడమ భాగానికి చేరుతుంది’ అని సిద్ధాంతీకరించాడు. సెర్వెటస్ మత సంస్కర్త కూడా అని చెప్పాను గదా? క్రిస్టియన్ మతంలో కాథలిక్కులూ, ప్రొటె స్టెంట్ లూ ఇద్దరూ త్రిమూర్తి వాదాన్ని అంగీకరిస్తారు. కానీ సెర్వెటస్ దానిని అంగీకరించలేదు. అందువలన కాల్విన్ అనే మత నాయకుడు ఈయనను నాస్తికుడుగా ముద్రవేసి, సజీవదహనం చేయమని తీర్పుచెప్పాడు. అందువలన 1553 అక్టోబర్ లో చితి పేర్చి సెర్వెటస్ ను సజీవ దహనం చేశారు. ఆ విధంగా మరో శాస్త్రవేత్త మతనాయకుల చేతిలో బలియైపోయాడు.” అని చెప్పి కూర్చున్నాడు సిద్దూ.

“గుడ్! బాగా చెప్పావు సిద్దూ. ఇప్పుడు శైలజా మొట్టమొదటి రసాయన శాస్త్రవేత్తగా పేరుగాంచిన పార్సెల్ససను గూర్చి చెప్పమ్మా." అడిగాడు మాస్టారు.

“అలాగే మాస్టారూ! పార్సెల్సస్ స్విట్జర్లాండు దేశం వాడు. ఈయన 1493-1541 మధ్య జీవించాడు. అసలు ఈయన పేరు చాలా పెద్దది. ‘అరూలియస్ ఫిలిప్పస్ ధియోఫ్రస్టస్ బంబాస్ట్ వాన్ హెూ హెన్ హీమ్’ అనేది ఈయన అసలు పేరు. కానీ ఈయన తన పేరును ‘పార్సెల్సస్’ గా మార్చుకొన్నాడు. పార్సెల్సస్ చాల అహంభావి. గర్వపోతు, ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ఎంత గర్వపోతు అంటే ప్రాచీన చరిత్ర వైద్యవిజ్ఞానానికి పునాదులు వేసిన ప్రాచీన వైద్యశాస్త్రజ్ఞులు గాలెన్, అవిసెన్నాలను గూర్చి చులకనజేసి మాట్లాడేవాడు. తన 33 వ ఏట ఇద్యశాస్త్ర ప్రొఫెసర్గా భాసిల్లో నియమింపబడగానే. ఈయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గాలెన్, అవిసెన్నాల గ్రంధాలను బహిరంగంగా తగల బెట్టాడు. అయినా పార్సెల్సస్, తాను సాధించిన నూతన రసాయన మందుల ఆవిష్కరణల కారణంగా ఆధునిక కాల రసాయన శాస్త్రపు ఆద్యుడుగా గుర్తింపు పొందాడు.

apr9ఈయన పరిశోధనలలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రసాయనాలు వ్యాధుల నిర్మూలనలో ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, దానికోసం ఆయన తన పేషెంట్లకు, వాళ్ళకు తెలియకుండా, అనేక వ్యాధులకు కొత్త కొత్త రసాయన పదార్థాలిచ్చి, వారి వ్యాధులపై అవి ఎలా పని చేస్తాయో పరీక్షించేవాడు. వాటిలో కొన్ని విషరసాయనాలు కూడా ఉండేవి. వాటి ప్రభావం వలన కొందరు రోగులు చనిపోయేవారు. పార్సెల్సన్ రోగుల మీద ఈ విధంగా వివిధ రసాయనాలను ప్రయోగిస్తున్నాడని తెలిసి, ఆయనను యూనివర్సిటీ యాజమాన్యం పదవి నుండి తొలగించింది. కానీ ఈ లోగా పార్సిల్సస్ అనేక కొత్త రసాయన పదార్థాలనూ, వివిధ వ్యాధులపై వాటి ప్రభావాన్నీ తెలుసుకోగల్లాడు, ఆ విధంగా ఆయన ఆధునిక రసాయన శాస్త్ర ఆద్యుడుగా పేరు తెచ్చుకున్నాడు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వైద్యరంగాన్ని ఒక మలుపు తిప్పిన ఈధర్ అనే రసాయనాన్ని ఈయన కనుగొన్నాడు. దానిని కొజ కొరత ప్రయోగించాడు. అది పీల్చినకోళ్ళు ఎక్కువ సేపు నిద్రపోతున్నాయనీ, తర్వాత ఏ మాత్రం ఇబ్బంది లేకుండా లేస్తున్నాయనీ గమనించాడు. అయితే ఈ రసాయనాన్ని తన పేషెంట్లపై ప్రయోగించి, పరీక్షించేలోగా ఆయన బాసిల్ నుండి బహిష్కరించబడటంతో ఆ ప్రయోగం చేసే అవకాశం తర్వాతి వైద్యులకు దక్కింది.

పదార్థ విజ్ఞాన శాస్త్రానికి పార్సెల్సస్ ఒక నూతన సిద్ధాంతాన్ని అందించాడు. అప్పటి వరకు, ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఎం పెడోక్లన్ ప్రవచించిన 'నాలుగు మౌలిక పదార్థాల సిద్ధాంతమే’ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలూ ఆమోదించారు. దాని ప్రకారం పదార్ధం నాలుగు మూలకాల సంయోగమే. ఆ నాలుగూ భూమి, గాలి, నిప్పు మరియు నీరు. పార్సెల్సస్ సిద్ధాంతం ప్రకారం అన్ని రసాయనిక పదార్థాలూ మూడు మూల స్థితుల సంయోగం మాత్రమే. అవి ఏమిటంటే, మొదటిది గంధకం. ఇది కాలే గుణం కలది. రెండవది పాదరసం. ఇది పారే గుణం కలది. మూడవది ఉప్పు. ఇది స్థిరత్వము కలది. ఈ మూడు స్థితుల సంయోగమే పదార్థం. ఇలా పదార్థ విజ్ఞాన శాస్త్రంలో మూడు మూల స్థితుల సంయోగ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు పార్సెల్సన్. ఆధునిక రసాయన శాస్త్ర మూల పురుషుడూ, మూడు మూల స్థితుల సిద్ధాంతకర్తి అయిన పార్సెల్సస్ జీవిత విశేషాలు ఇవే మాస్టారూ.” అని చెప్పి కూర్చుంది శైలజ.

“బాగా చెప్పావమ్మా శైలజా. పిల్లలూ, వచ్చే క్లాసులో పునర్వికాస కాలంనాటి సైన్సు ప్రగతిని గూర్చిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం." అంటూ లేచారు. మాస్తారు. పిల్లలు మాస్టారిని అనుసరించారు.

may3“పిల్లలూ! పునర్వికాస కాలంనాటి మరికొందరు శాస్త్రజ్ఞులను గూర్చీ, ఆ కాలంనాటి సైన్స్ ప్రగతిని గూర్చీ మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వంశీ! టార్టాగ్లియాను గూర్చి చెప్పు” అడిగాడు సైన్సు మాస్టారు.

“టార్టాగ్జియా అసలు పేరు నికోలో ఫోంటానా మాస్టారూ! ఈయన గొప్ప గణితశాస్త్రజ్ఞుడు, ఇటలీ దేశస్థుడు. క్రీ.శ 1506-59 మధ్య జీవించాడు. ఈయన 20, 22 ఏళ్ళ వయస్సులో ఉండగా ఫ్రెంచి సైనికులు, . ఫోంటానా నివసించే బ్రెస్సియా మీద దాడి చేశారు. ఆ దాడిలో ఒక ఫ్రెంచి సైనికుడు ఆయన దవడలు, అంగిలి పై బలంగా కొట్టాడు. దానిలో ఫోంటానా అంగిలికి శాశ్వతంగా దెబ్బతగిలి నత్తివచ్చింది. అందువలన ప్రజలు ఆయనను టార్జాగ్జియా (నత్తివాడు) అని పిలిచేవారు. నత్తివాడే అయినా, తన కాలంనాటి ఉత్తమ గణిత శాస్త్రజ్ఞుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కొన్ని గణితశాస్త్ర విశేషాలు చెబుతాను, ఒక వడిశెలను 45 డిగ్రీల కోణంలో విసిరితే, అది మిగిలిన అన్ని కోణాలలో విసిరిన దాని కంటే ఎక్కువ దూరం వెళుతుందని ఆయన లెక్కల ద్వారా నిరూపించాడు. అలాగే (1+a)b యొక్క విలువ తెలిస్తే (1+a)b+1 యొక్క విలువ తెలుసుకోవచ్చునని నిరూపించి, తద్వారా ద్విపద సిద్ధాంతానికి బాటలు వేశాడు.

1530 లో టార్టాగ్లియా, ఘన సమీకరణానికి పరిష్కారాన్ని కనుగొనగలనని ప్రకటించాడు. ఆంటోనియోడెల్ ఫియోర్ అనే వ్యక్తి ఆ విషయంపై టార్టాగ్లియాను సవాలు చేశాడు. ఆ సవాలును స్వీకరించి టార్టాగ్లియా, అన్ని ఘన సమీకరణాలనూ పరిష్కరించే సామాన్య సూత్రాన్ని కనుగొన్నాడు. టార్టాగ్లియా ప్రతిభను కార్డన్ అనే ఆయన విన్నాడు. కార్డన్ వైద్యశాస్త్రంలో ప్రొఫెసర్ కానీ ఆయనకు గణితంలో మంచి ఆసక్తి ఉంది.

అందువలన ఆయన టార్టాగ్లియా వద్దకు వచ్చి ఘన సమీకరణాలను పరిష్కరించే సూత్రాన్ని తనకు నేర్పమన్నాడు. టార్టాగ్లియా ఆ సూత్రాన్ని కార్డన్ ఇతరులెవరికి వెల్లడిచేయ కూడదనే షరతు పెట్టాడు. ఆ షరతకు ఒప్పుకుంటూ కార్డన్ ప్రమాణం చేశాడు. టార్టాగ్లియా ఆ సూత్రాన్ని కార్డన్ కు వివరించాడు. కానీ 15 ఏళ్ళ తర్వాత, కార్డన్ తను చేసిన ప్రమాణాన్ని గాలికి వదలివేసి, బీజగణితం మీద తాను వ్రాసిన గ్రంథంలో ఘన సమీకరణాల పరిష్కార సూత్రాన్ని వివరించి, ఆ సూత్రం తనదిగా ప్రకటించుకున్నాడు. ఆ విషయం టార్టాగ్లియాకు తెలిసి గొడవ చేశాడు. కార్డన్ ఆయనకు సమాధానమిస్తూ టార్జాగ్జియా తనకు గణిత సమస్యలను. ఇచ్చాడే కానీ, వాటిని పరిష్కరించే పద్దతిని ఇవ్వలేదని బొంకాడు, టార్జాగ్జియా దానిపై బహిరంగ చర్చకు రమ్మని కార్డన్ ను కోరాడు, కార్డన్ దానికంగీకరించాడు కానీ అనుకున్న టైముకు చర్చకు రాకుండా తప్పించుకున్నాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే. ఈనాటికీ ఆ గణిత సూత్రం ‘కార్డన్ సూత్రం' అనే పేరుతోనే చెలామణీ అవుతోంది. ఇదీ మాస్టారూ! గణితశాస్త్రవేత్త టార్టాగ్లియా జీవితమూ, పరిశోధనలూ, పరిష్కారాల విశేషాలు" అని చెప్పి కూర్చున్నాడు వంశీ.

"బాగా చెప్పావు వంశీ!” అంటూ మాస్టారు ఉదయ్వైపు చూసి చిరునవ్వునవ్వారు.

may4ఉదయ్ లేచి “నేను పునర్వికాస కాలంనాటి సామూహిక ఉత్పత్తి పద్దతులు వివరిస్తాను మాస్టారూ! ఈ కాలం వాడైన బ్రింగిక్కి యో 'పైరో టెక్నియా' అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. దానిలో సారాం మొదలగువాటిని పెద్ద ఎత్తున కాచే విధానాన్నీ, తుపాకీ మందు తయారీని, లోహశాస్రాన్నీ, అచ్చుముద్రల తయారీని వివరించాడు. ఆనాడు లోహ వస్తువుల తయారీ ఎంత పెద్ద ఎత్తున జరిగేదనే విషయాన్ని బ్రింగిక్కియో తన గ్రంథంలో వివరించాడు. మిలాన్ పట్టణంలో ఉన్న ఒకే ఒక్క ఫౌండ్రీ, ఇటలీ మొత్తానికి కావలసిన ఇత్తడి గుర్రపు బండి కొక్కేలనూ, కప్పులనూ, బెల్లు కొక్కేలనూ, గొలుసులనూ, గంటలనూ, కుట్టుపనివారి వేళ్ళ రింగులనూ తయారు చేయగలిగేదిట. ఇంకా విశేషం ఏమిటంటే, ఈ వస్తువులన్నిటికీ అవసరమైన అచ్చులు ఒకేగదిలో తయారయ్యేవి. దానిలో పోత పనిలో నిపుణులైన 8 మంది, మరికొంతమంది కార్మికుల సహకారంతో కేవలం పోతఅచ్చులు మాత్రమే తయారు చేస్తుండేవారు. ఆ రకంగా అప్పటికే పెద్దఎత్తున వస్తువుల తయారీలో పని విభజన, పనిలో నిపుణత ప్రవేశించింది. దానివలన తయారీ ఖర్చు తగ్గింది. వస్తువుల నాణ్యత పెరిగింది.

ఇటలీలోని మరో నగరరాజ్యం వెనిస్లోని పనివారు పెద్ద ఎత్తున ఓడలనూ, యుద్ద సామగ్రిని, ఫిరంగులనూ తయారు చేసేవారు. మిలాన్లో అచ అత్యంత నిపుణతతో, తక్కువ ఖర్చుతో తయారు చేయడమే వారి ప్రత్యేకత. ఇలా పారిశ్రామిక విప్లవ ఫలితమైన సామూహిక వస్తు తయారీకి బీజాలు ఆనాడే పడ్డాయి మాస్టారూ.” అని కూర్చున్నాడు ఉదయ్.

“మంచిది ఉదయ్!” అని మాస్టారు మేఘన వైపు తిరిగి “అమ్మా మేఘనా! ఆ కాలంనాటి లోహ పరిశోధనా పద్ధతులు, ప్రగతిని గూర్చి చెప్పమ్మా.” అన్నారు.

“అలాగే మాస్టారూ! పునర్వికాస కాలంలో ముడిఖనిజం నుండి వెండినీ, రాగినీ విడదీసే ఆధునిక పద్దతి కనుగొనబడింది. ఈ పద్దతిలో రాగి, సీసంల మధ్య లోహదశ నుండి ద్రవస్థితిలోకి కరిగే ఉష్ణోగ్రతల తేడాలు ఆధారంగా వాటిని వేరుచేయడం జరిగింది. అలాగే వెండి, సీసంల మధ్య ఉండే రసాయనిక సాన్నిహిత్యం ద్వారా వాటిని వేరుజేసే ప్రక్రియ కనుగొనబడింది. ఈ ప్రక్రియలనుపయోగించి యూరప్ లోని అనేక దేశాలు వెండి, రాగి గనుల త్రవ్వకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి. వాటిలో జర్మనీ ముందుంది. 15 వ శతాబ్ది చివరలో ఘగ్గర్ అనే ధనికుడు, గనుల ఇంజనీర్ ధర్టో సహకారంతో గనుల తవ్వకం, లోహాల్ని కరిగించే ప్రక్రియద్వారా శుద్దలోహాలు తయారు జేయడం, మిల్లుల స్థాపన చేశాడు. 1495 నాటికి వారి కంపెనీ లోహపరిశ్రమలో యూరప్ మార్కెట్ ను ఆక్రమించింది. ఇవీ ఆ కాలంనాటి లోహపరి విశేషాలు మాస్టారూ!” అన్నది మేఘన.

“గుడ్ మేఘనా. బాగా చెప్పావు. సాత్విక్, ఆ కాలం నాటి సివిల్ ఇంజనీరింగ్ నిపుణతను గూర్చి చెప్పు.” అడిగాడు మాస్టారు.

“ఆ కాలంలో సివిల్ ఇంజనీర్ల నిపుణత బాగా పెరిగింది మాస్టారూ. అప్పటి సివిల్ ఇంజనీర్లలో ఇటలీలోని రోలా చాలా గొప్పవాడు. ఈయన ప్రపంచంలో మొదటిసారిగా దాదాపు 20 కిలోమీటర్ల పొడవుగల కాలువను, లాకుల ద్వారా నీటిని క్రిందకు పంపే ఏర్పాట్లతో నిర్మించాడు. దాని వలన మిలాన్ పట్టణం యొక్క వ్యాపారం బాగా అభివృద్ధిచెంది, ఈ పట్టణ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయింది. విశేషం ఏమిటంటే మిలాన్ నగరపు ఈశాన్య భాగంలోని కాలువపై గల శాన్ మార్కో లాకుకు రూపకల్పన చేసింది ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఇంజనీరు, చిత్రకారుడు అయిన లియోనార్డో డావిన్సీ. ఆ లాకు 20 వ శతాబ్దం వరకు నిలిచే ఉంది. ఇవీ ఆనాటి సివిల్ ఇంజనీరింగ్ విశేషాలు మాస్టారూ.” అని చెప్పి కూర్చున్నాడు సాత్విక్,

“గుడ్ స్వాతిక్. స్వాతీ, నువ్వు ఆ కాలంనాటి ప్రఖ్యాతి ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికసను గూర్చిచెప్పు.” అడిగాడు మాస్టారు.

“అలాగే మాస్టారూ! కోపర్నికస్ క్రీ.శ. 1473 లో జన్మించాడు. గణిత, ఖగోళ, వైద్యశాస్త్రాల్లోను, వేదాంతం అంటే మత విషయాల్లోను పట్టభద్రుడయ్యాడు. ఈయన పోలెండ్ దేశంవాడు. తన 22 వ ఏట చర్చిలో జీవితాంతపు మతాధికారిగా ఈయనకు ఉద్యోగం లభించింది. చర్చిలో ప్రార్ధనలు చేసేవాడు. బైబిల్లోని విషయాలపై ఉపన్యాసాలు చెప్పేవాడు. బైబిల్లో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పబడింది. కానీ ఖగోళ గణితశాస్త్రాలలో పట్టభద్రుడైన కోపర్నికసకు దీనిపై తీవ్రమైన అనుమానాలుండేవి. దానితో తన విజ్ఞానానికి పదును పెట్టాడు. గణితాన్ని, ఖగోళ శాస్త్రాన్ని మధించాడు. చివరకు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనేకన్నా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని భావిస్తే, రేయింబవళ్ళకు, రుతువులకూ కారణాలు సులభంగా అర్థమవుతాయని లెక్కలతో సహా నిరూపించాడు. తన పరిశోధనా సారాన్ని 1514లో ఒక వ్యాసంలో వివరించాడు. అప్పటి వరకూ అందరూ నమ్ముతున్న భూకేంద్రక సిద్ధాంతం తప్పన్నాడు. అయితే, ఆ రచనను ముద్రించి, ప్రచారం చేసుకోవడానికి అప్పటి మత నాయకులు అంగీకరించలేదు. ప్రచురిస్తే శిక్షిస్తామన్నారు. అయినా తన భావాలను రహస్యంగా 'ఫస్ట్ అకౌంట్' పేరుతో ముద్రించాడు. మతనాయకులు దీనిని వెలుగుచూడనీయలేదు. ఆయన 1543 లో మరణించాడు. ఆయన రచన 'ఫస్ట్ ఎకౌంట్' కాపీలలో ఒక దాన్ని ఆయన శవంపై మిత్రులు ఉంచగలిగారు. శవంతోపాటు ఆ కాపీ కూడా దహనమైంది. కానీ, ఆ చితి వెలుగులో ఆయన భావాలు జగతులో వ్యాప్తిచెందాయి." అని చెప్పి కూర్చుంది స్వాతి.

“మంచిది. స్వాతీ! బాగా చెప్పావు. పిల్లలూ, కోపర్నికస్ మరణంతో పునర్వికాస కాలం ముగిసింది. ఈ కాలంలో యూరప్లో సైన్సు బాగా అభివృద్ధి చెందింది. పాత భావాలు కొన్ని సవాలు చేయబడ్డాయి. ఆధునిక కాలానికి పునాదులు వేయబడ్డాయి. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాము. వచ్చే క్లాసులో మత యుద్దాలు కాలం నాటి విశేషాలు, సైన్స్ ప్రగతిని గూర్చి తెలుసుకుందాం. మీ కందరికీ తలా ఒక అంశం ఇస్తాను. చెప్పడానికి తయారై రండి.” అని చెప్పి పిల్లలకు తలా ఒక అంశం మాస్టారు ఇచ్చారు. మాస్టారూ, పిల్లలూ మెల్లగా బైటికి కదిలారు.

మత యుద్ధాల కాలం

jun12“పిల్లలూ! క్రిందటి క్లాసులో పునర్వికాస కాలం నాటి సైన్స్ ప్రగతి, శాస్త్రజ్ఞుల పరిశోధనలూ, వాటి ఫలితాలు ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మత యుద్ధాల కాలంనాటి శాస్త్రజ్ఞులు, వారి పరిశోధనలు, వాటి వలన కలిగిన సైన్సు ప్రగతి వీటన్నిటిని గూర్చి తెలుసుకుందాం. అవన్నీ చెప్పడానికి మీరు తయారై వచ్చారు గదా?” అడిగారు సైన్సు మాస్టారు శ్రీనివాస్.

“ఓ!" అన్నారు కొంతమంది పిల్లలు.

“గుడ్! మొదలు పెడదాం. జాన్! నువ్వు చెప్పు. శాస్త్రజ్ఞులు ఏ కాలాన్ని మతయుద్ధాల కాలం అని పిలిచారు? ఎందుకు అలా పిలిచారు?”

"క్రీ. శ 1550 - 1650 ల మధ్య కాలాన్ని మత యుద్ధాల కాలం అని పిలిచారు. ఎందుకుంటే నూతన శాస్త్ర పరిశోధనలతో బాటు, యీ కాలంలో ఫ్రాన్సులోనూ, జర్మనీలోనూ, లోకంట్రన్ గా పిలవబడే మరికొన్ని దేశాల లోనూ మతయుద్దాలు జరిగాయి మాస్టారూ!” అని చెప్పాడు జాన్.

"గుడ్! ఈ కాలంలో అనేక మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జీవించారు. వారిలో బ్రూనో అనే ఖగోళ శాస్త్రవేత్త మత నాయకుల ఆగ్రహానికిగురై, వారిచే సజీవ దహనం చేయబడ్డాడు. గెలీలియో గృహ నిర్బంధానికి గురైనాడు. ఇలాంటి వారి బలిదానాలు, త్యాగాల కారణంగానే సైన్సు పురోగమంచి మానవజాతి ముందుకుసాగింది. ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం. ముందుగా విజ్ఞానశాస్త్ర పరిధిని పెంచి అమరుడైన బ్రూనోను గూర్చి తెలసుకుందాం. శ్రీనూ, నువ్వు చెప్పు.” అడిగాడు మాస్టారు.

"బ్రూనో పూర్తి పేరు గియార్డినో బ్రూనో మాస్టారూ. ఈయన 1548 లో ఇటలీ దేశంలో జన్మించాడు. చిన్నతనంలోనే చర్చికి సంబంధించిన మోనాస్టరీలో విద్యాభ్యాసానికై చేర్చబడ్డాడు. ఆనాటికి కోపర్నికస్ వ్రాసిన ‘ఫస్ట్ ఎకౌంట్’ అనే గ్రంథం నిషేధించబడి ఉంది. అయినా బ్రూనో రహస్యంగా ఆ పుస్తకాన్ని చదివాడు. అది చదివాక, మతాధిపతులు చెప్పే ‘భూకేంద్రకం సిద్దాంతం’ ఎంతటి అశాస్త్రీయమైనదో, అజ్ఞాన పూరితమైనదో ఆయన గ్రహించాడు. తాను తెలుసుకున్న నూతన విషయాన్ని అంటే ‘సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని’ సహాధ్యాయులకు వివరింపసాగాడు. విషయం మోనాస్టరీ అధికారులకు తెలిసింది. బైబిల్ లో చెప్పబడిన దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నందుకు అతనికి కఠినదండన విధించాలని వారు నిర్ణయించారు. విషయం తెలిసి బ్రూనో మెనాస్టరీ నుండి పారిపోయడం, మతాధికారులు వెంటబడ్డారు. చివరకు దేశం విడిచి పారిపోయాడు.

అయినా మతాధికారుల ఆగ్రహం తగ్గలేదు. వారు బ్రూనో వెంటబడ్డారు. ఆయన 16 ఏళ్ళపాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, హీమియా మొదలైన అనేక దేశాలకు పారిపోయి నివసించసాగాడు. చివరకు మాతృదేశమైన ఇటలీకి రహస్యంగా తిరిగివచ్చాడు. ఈలోగా ఆయన కోపర్నికస్ సిద్ధాంతంలోని లోపాన్ని సరిచేయడమే కాక, దాన్ని మరింత అభివృద్ధి చేశాడు. ఈ అనంత విశ్వంలో మన సూర్యుడు, దాని చుట్టూ పరిభ్రమించే మన భూమిలాంటి గ్రహాలు ఉన్నాయని గణితశాస్త్ర వివరాల ద్వారా నిరూపించడమే కాక, ఇంకా అనేక సూర్యులున్నారనీ, వారి చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయనీ, నిరూపించాడు. అంటే విశ్వంలో అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నాయనీ, అవి ఒక్కొక్కటీ ఒక్కొక్క సూర్యబింబం లాంటిదనీ, ప్రతిదాని చుట్టూ కొన్ని గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయనీ తెలిపాడు. అద్భుతమైన వక్పృత్వంతో తన సిద్ధాంతాన్ని దేశదేశాల్లో ప్రచారం చేశాడు. ప్రతిదేశంలోనూ, మతాధికారులచే బహిష్కరించబడి మరో దేశానికి చేరుకొనే వాడు. చివరకు స్వదేశానికి చేరాడు.

బ్రూనో ఇటలీ చేరుకున్న తర్వాత కొందరు ద్రోహుల దుర్మార్గం కారణంగా మతాధికారులకు పట్టుబడ్డాడు. వారు ఆయనను విచారించి, మతగ్రంధాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకూ, తప్పును ఒప్పుకొని క్షమాపణ అడగనందుకూ శిక్షగా మరణదండన విధించారు. అదీ సజీవ దహనం ద్వారా బ్రూనో మరణదండన క్రీ.శ 1600 సంవత్సరం, ఫిబ్రవరి 17 న అమలు జరుపబడింది. రోమ్ నగరం నడిబొడ్డున, ఒక పెద్ద చితి ఏర్పాటు చేయబడింది, మతాధిపతి ఆదేశాల మేరకు బ్రూనోను ఇనప సంకెళ్ళతో బంధించి, పెడరెక్కలు విరిచికట్టి, తమ విశ్వాసాలను వ్యతిరేకించిన ఏ వ్యక్తికైనా ఈ రకమైన శిక్ష తప్పదని చాటింపు వేస్తూ, రోమ్ లో వీధుల గుండా ఊరేగిస్తూ చితి ప్రదేశం దగ్గరకు తీసుకువచ్చారు. ఊరేగింపు సమయంలో బ్రూనో తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెబుతాడేమోనని భయపడి, ఆయన నాలుకను ఇనుపతీగతో చుట్టి, నోటికి అడ్డంగా గుడ్డను కట్టారు. ఊరేగింపు ముందుకు సాగుతున్న సమయంలో, బ్రూనోను చూసి జనం కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. ఆయనను చితి వద్దకు తీసుకువచ్చి, నిలువెత్తు స్తంభానికి ఆయనను కట్టివేసి నోటికి కట్టిన గుడ్డను, నాలుకకు చుట్టిన ఇనుప తీగను తీసివేసి, మతాధిపతులు తప్పును ఒప్పుకోవడానికి ఆఖరి అవకాశం బ్రూనోకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన “నా మరణశిక్ష నాకన్నా మిమ్ములను ఎక్కువ యాతన పెడుతుంది. నేను పలికేది సత్యం. నా సిద్ధాంతం ఖచ్చితమైనది.” అని ఎలుగెత్తి చాటాడు. అంతే! బ్రూనో సజీవ దహనమయ్యాడు. భౌతికంగా కాలి బూడిదయ్యాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సత్యాన్వేషణాపరుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే రోమ్ లో ఆయనకు మరణ శిక్ష అమలు జరిగిన చోట నిర్మించిన స్మారక చిహ్నంపై “ఈయన ప్రజలందరి కోసం, ఆలోచనా స్వేచ్ఛ కోసం ఎలుగెత్తి నినదించాడు. దాని కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు." అని వ్రాయబడింది. ఇవీ మాస్టారూ! ఖగోళశాస్త్ర విజ్ఞాన ప్రగతి కోసం తన ప్రాణాలను బలిపెట్టిన బ్రూనో జీవిత విశేషాలు." అని చెప్పికూర్చున్నాడు శ్రీను.

“గుడ్! శ్రీనూ! సత్య నిరూపణలో అమరుడైన శాస్త్రవేత్త బ్రూనోను గూర్చి చక్కగా వివరించావు. పిల్లలూ! ఆ కాలం నాటి మరికొందరు శాస్త్రవేత్తలను గూర్చిన విశేషాలు వచ్చే క్లాసులో తెలుసుకుందాం.” అంటూ లేచారు మాస్టారు. పిల్లలు మాస్టారిని అనుసరించారు.

ప్రాచీనకాలంలో భారతీయ శాస్త్రజ్ఞాలు

“పిల్లలూ! ప్రాచీన కాలంలో గ్రీసు, రోమ్ దేశాల్లోనే కాదు భారతదేశంలోనూ మహా శాస్త్రవేత్తలుండేవారు. వారిని గూర్చి, వారి ప్రతిభా విశేషాల్ని గూర్చి, భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడం యంలో వారి పాత్ర గురించి మనమందరం తప్పక తేసుకోవాలి. మొదటగా గణిత, ఖగోళ శాస్త్రాల్లో గొప్ప శాస్త్రజుడైన ‘ఆర్యభట్టను’ గూర్చి తెలుసుకుందాం. సాయిజ్యోతీ! ఆర్యభట్టను గూర్చి నీవు చెప్పమ్మా!” అన్నాడు సైన్సు మాస్టారు శ్రీనివాస్.

"అలాగే మాస్టారూ!” అంటూ మొదలు పెట్టింది సాయిజ్యోతి. "ప్రాచీనకాలపు ఖగోళ శాస్త్రవేత్తలలో అత్యంత గొప్పవాడుగా ఆధునిక శాస్త్రవేత్తలచే ఆర్యభట్ట కీర్తించబడుతున్నాడు. ఈయన క్రీ.శ. 5వ శతాబ్దంలో కూసుమపురంలో అంటే నేటి పాట్నాలో జీవించాడు. ఈయన 'ఆర్యభట్టీయం' అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఆర్యభట్ట భూమికి సంబంధించిన ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రకటించాడు. అదేమిటంటే, ‘భూమి ఒక గోళాకారంలో ఉన్నది. అది దాని స్వంత అక్షం పై బొంగరం లాగా తిరుగుతున్నది’ అని. అంతేకాదు, గ్రహణాలకు సంబంధించి, సూర్యచంద్రులను రాహువు మింగితే సూర్య, చంద్రగ్రహణాలు వస్తాయనే మతాచార్యుల వాదనల్ని ఖండించి, గ్రహణాలు సూర్యచంద్ర భూములు ఒకే రేఖ పైకి వచ్చినప్పుడు సూర్యకాంతికి చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణమని, సూర్యకాంతి చంద్రుని మీద పడకుండా భూమి అడ్డం వస్తే చంద్రగ్రహణమనీ శాస్త్రీయ వివరణ ఇచ్చాడు. అంతేకాదు చంద్రుడెప్పుడూ కరీ గ్రహమనీ, సూర్యకాంతి చంద్రునిపై పడ్డప్పుడే చంద్రుడు ప్రకాశిస్తాడని కూడా చెప్పాడు. మరో ముఖ్య విషయమేమంటే ఈయన పరిచక్ర సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. దీన్నే ఇంగ్లీషులో ‘థియరీ ఆఫ్ ఎపీసైకిల్స్’ అని కూడా అంటారు. దీని ద్వారా గ్రహాల చలనాన్ని వివరించాడు. ఇన్ని విషయాలను 1600 ఏళ్ళ క్రిందటనే చెప్పడమే ఆర్యభట్ట గొప్పతనం మాస్టారూ.”

“ఆర్యభట్ట ఇతర పరిశోధనలను గూర్చి ఏమైనా చెప్పగలవా? అమ్మా!” అన్నాడు మాస్టారు.

"గణితంలో ఐక్తంలో ఆయన అనేక సమస్యలు వరిష్కరించాడు మాస్టారూ! p(పై) విలువను 3.1416గా కనుగొని, దాని ద్వారా వృత్త వైశాల్యానికి నంబంధించిన గణిత సూత్రాన్ని కనుగొన్నాడు. స్వేర్రూట్లు, క్యూబ్ రూట్లను కనుగొనే సూత్రాన్ని కనుగొన్నాడు. ట్రిగొనామెట్రీ సూత్రాలయిన సైన్, కొసైన్లను నిర్వచించి, వాటి ద్వారా త్రికోణ సమస్యలను పరిష్కరించాడు.” అన్నది సాయిజ్యోతి.

“సాయిజ్యోతి! బాగా చెప్పావమ్మా! ఆర్యభట్టకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని చెబుతాను. అదేమిటంటే ఆయన మహోన్నత గ్రంథం ‘ఆర్యభట్టీయం’ 1847 వరకూ, అంటే దాదాపు 1300 సంవత్సరాల పాటు, అసలు శాస్త్రవేత్తలకెవరికీ దొరకలేదు. ఆయనను సమర్థిస్తూ లేక విమర్శిస్తూ, రాసిన గ్రంథాల నుండి మాత్రమే ఆయన నిరూపించిన విషయాలు ప్రజలకు తెలిశాయి. పురాణ గ్రంథాలకు నకళ్ళు తీసి అనువాదాలు చేసి, వాటిని కాపాడుకున్న మన పండితుల శాస్త్రీయ విషయాలంటే ఎంత నిర్లక్ష్యం చేసే వారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.” అని ఒక నిట్టూర్పు విడిచి “తర్వాత మనం మరో ప్రముఖ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త వరావమిహిరుడిని గూర్చి తెలుసుకుందాం. అభినంద్! నీవు చెప్పు.” అన్నారు మాస్టారు.

“వరాహ మిహిరుడు 6వ శతాబ్దం వాడు మస్టారూ! ఈయనను ఖగోళ శాస్త్రజ్ఞులూ, చరిత్రకారులూ ‘ఖగోళ శాస్త్ర విజ్ఞాన సర్వస్వం'గా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఈయన ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులైన పైతామహ, వశిష్ఠ, పౌవిస, రోమక, సూర్యులు రచించిన సిద్ధాంత గ్రంథాలన్నింటి సారాన్నీ మధించి ‘పంచ సిద్ధాంతిక’ అనే పెద్ద గ్రంథాన్ని రచించాడు. విశేషమేమంటే పైన పేర్కొన్న పంచసిద్ధాంతాలలో పైతామహ, వశిష్ట సిద్దాంతాలు ఖగోళ శాస్త్ర సత్యాలకు చాలా దూరంగా ఉన్నాయని వరాహమిహిరుడే పేర్కొన్నాడు.

భూమి స్వరూపాన్ని గూర్చి వరాహమిహిరుడు వివరిస్తూ, “అన్ని అంశాలూ భూమి గోళాకారంగా ఉన్నదని నిరూపిస్తున్నాయి. పర్వతాలు, నదులు, చెట్లు, మనుష్యులు, అన్ని వస్తువులు భూమికి పైనా కింద అన్ని వైపులావున్నాయి. కాని, అందరూ ఎవరికి వారు నేను భూమిపైన ఉన్నాను. మిగిలిన వారు వేరే వైపు ఉన్నారు.” అనుకుంటారు. వాస్తవం ఏమిటంటే భూమి అందరినీ ఆకర్షిస్తున్నది అని తెల్పాడు.

ముఖ్యమైన విషయం ఏమిటం భూమి చలనానికి సంబంధించి వరాహమిహిరుడు, ఆర్యబట్టతో విభేదించాడు. ఆయన భూమి ఈ విశ్వానికి కేంద్రంలో ఉన్నదని, దానికి చలనం లేదని అన్నాడు. దీనికి కారణ మతమౌఢ్యం కాదు. ఆయనకున్న లౌకికజ్ఞానం మాత్రమే. భూమి తన చుట్టూ తాను తిరగటం వాస్తవమే. పడమర వైపుగా బయలుదేరిన పక్షి తన గూటికి తాను ఎన్నటికీ చేరుకోలేదు అని ఆయన వ్రాశాడు.” అలా ముగించాడు అభినంద్.

“వరాహమిహిరుడిని గూర్చి ఇంకేమైనా తెలుసా?” అడిగాడు మాస్టారు.

అభినంద్ మౌనం వహించాడు.

“నేను చెబుతాను.” మాస్టారు చెప్పడం మొదలెట్టాడు.

“ఈయన ఖగోళశాస్త్రంలోని గ్రహాల చలనా గణించి, వాటి ద్వారా మానవుల జాతకలను ‘జ్యోతిష్యము' అనే అంశాన్ని వివరిస్తూ ‘బృహత్ జాత్’ అనే జ్యోతిష గ్రంథాన్ని వివరించాడు. దీనిలోని విశేషాలేమిటంటే, భూమికి చలనం లేదనే అంశం మొదటిది. భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, అంగాకారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనే గ్రహాలే తిరుగున్నాయని పేర్కొన్నాడు. ఆయన గ్రంధంలో రాహు, కేతువుల ప్రస్తావనే లేదు. ఇలా చలనమున్న భూమిని చలనం లేనిది  భూమి చుట్టూ చంద్రుడు తప్ప సూర్యుడు గానీ ఇంద్రుడు, వంటి గ్రహాలు గానీ తిరగకపోయినా తీరుగుతున్నట్లు ప్రకటించిన బృహత్ జాత్ శాస్త్రీయమా? అశాస్త్రీయమా?” మరల అడిగారు మాస్టారు.

“అశాస్త్రీయ గ్రంథమే!” అన్నారు పిల్లలందరూ.

“వరాహమిహిరుడు భూమి చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నాయంటాడు. నేటి జ్యోతిష పండితులు తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నాయంటారు. వీటిలో సూర్యుడు ఒక గ్రహమే కాదు, అది ఒక నక్షత్రం. ఇలా పరస్పర విరుద్ద విషయాలు, అజ్ఞానంతో కూడిన విషయాలూ కలిగిన అంశం శాస్త్రమా?”

"శాస్త్రం కానే కాదు” అన్నారు పిల్లలందరూ.

“మంచిది. అనేక ఖగోళ శాస్త్ర గ్రంథాలను మధించి, ఒక బృహత్ గ్రంథాన్ని రాసిన వరాహమిహిరుడిని ప్రాచీన కాలపు మహా శాస్త్రవేత్తలలో ఒకడైన ఖగోళ శాస్త్రవేత్తగా అంగీకరిద్దాం. ఆయన వ్రాసిన అశాస్త్రీయ విషయాలను తిరస్కరిద్దాం. ఏమంటారు?” అడిగారు మాస్టారు.

“అలాగే మాస్టారూ.” అన్నారు గట్టిగా పిల్లలందరూ.

“మంచిది. తర్వాతి క్లాసులో మరో భారతీయ ప్రముఖ ఖగోళ, గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడిని గూర్చి తెలుసుకుందాం'' అంటూ లేచారు మాస్టారు.

పిల్లలు ఆయనను అనుసరించారు.

గ్రీసు, రోముల్లో సామాజిక పరిస్ధితులు

“పిల్లలూ! ఈ రోజు ప్రాచీన కాలంలో జరిగిన శాస్త్ర విజ్ఞాన విజయాలు గ్రీను, రోమ్ సమాజాలపై ఎలాంటి ప్రభావాలు కలిగించాయో తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయ అభివృద్ధి ప్రభావం, రైతులను మోసం చేయడం, దాని వలన వ్యవసాయం పతనం జరిగిన విధానాన్ని తెలుసుకుందాం. సంహితా! నువ్వు చెప్పు.” అన్నారు మాస్టారు.

“అలాగే మాస్టారూ!” సంహిత చెప్పడం మొదలెట్టింది. “మెరుగైన వ్యవసాయ విధానాలు అవలంబించడం కారణంగా వ్యవసాయం అభివృద్ధి అయింది. కాని అందులో ఎక్కువ భాగం రాజుల బొక్కసాలకు, అవినీతి పరులైన ప్రభుత్వోద్యోగుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రభుత్వోద్యోగుల్లో లంచగొండితనం ఎంత దారుణంగా వ్యాపించిందో ఆనాటి పత్రాలు తెలియజేస్తున్నాయి. సామాన్య ప్రజలకు ఏం మిగిలాయంటే అధిక పన్నులు, జవులు, చెరసాలలు, చట్టాన్నుంచి తప్పించుకోవడానికి ప్రజలు పారిపోయేవారు. క్రీ.పూ. 196 లో చెక్కబడిన రోసెటా శిలాఫలకం ఈ పరిస్థితిని, దానిని చక్కదిద్దడానికి తీసుకోబడిన చర్యలను వివరిస్తుంది.” అంది సంహిత.

“తమ సమస్యల పరిష్కారానికి ఆనాటి రైతుల ఒక ఆయుధం కనిపెట్టారు. ఆ ఆయుధం ఏమిటి? చెప్పగలవా?” అడిగారు మాస్టారు.

“ఆ ఆయుధం పేరు సమ్మె మాస్టారూ! రైతుల తమ పనిని వదిలి పెట్టి, మూకుమ్మడిగా ఒక దేవాలయంలోకి వెళ్ళిపోయి, దారుణమైన తమ  సమస్యలు పరిష్కారమయ్యేవరకు బయటకు వచ్చేవార కాదు. అంటే సమ్మె చేసి తమ సమస్యలు పరిష్కరించుకు వారన్నమాట. అయితే ఆనాటి రాజులు, రైతులకు సమే చేసే హక్కు లేకుండా కౌలు పత్రాలు రాసేట్లుగా చట్టాలు రూపొందించారు. రాజులకు, రాచరికానికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించబడ్డాయి.” అని చెప్పింది సంహిత.

“అలాంటి విధానాల ఫలితాలేమిటి?” అడిగారు మాస్టారు.

“ఆ విధానాల కారణంగా కౌలు రైతులు కూలీలు గ్రామాలలో వ్యవసాయాన్ని వదిలి పారిపోయారు. ఇందువలన వ్యవసాయం చేసేవారు తగినంత మంది గ్రామాలలో దొరకని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం క్షీణించింది, ఆనకట్టలు, కాలువలు శిథిలం అయ్యాయి. పల్లెల సగటు జనాభా 140 నుంచి 40 కి తగ్గిపోయినట్లు ఆనాటిపత్రాలలో ఆధారాలు దొరికాయి.” అన్నది సంహిత.

“చరిత్రలోని ఈ అంశం చెప్పే గుణపాఠం ప ఏమిటో తెలుసా? ప్రభుత్వాలు, ధనికులకు మాత్రమే అనుకూలించే చట్టాలు చేస్తే, సామాన్య ప్రజలలో చెలరేగే అసంతృప్తి ఏ రూపం తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలంమౌతుంది.” అన్నారు మాస్టారు.

మరల వాణి మాస్టారే కొనసాగించారు. “నైలునదీ ముఖద్వారంలో ఏ స్థాపించబడిన అలెగ్జాండ్రియా నగరం కొన్ని శతాబ్దాల పాటు విజ్ఞానకేంద్రంగా విలసిల్లింది. జాన్! దాని వివరాలన్నీ నీవు చెప్పు.” అన్నారు.

“అలెగ్జాండరు బ్రతికుండగానే ప్రపంచ అత్యు సామ్రాజ్యానికి రాజధానిగా ఉండే ఒక నగరాన్ని ఓ నిర్మించాలని కలలుగన్నాడు మాస్టారూ? అది నైలునదీ ముఖద్వారంలో ఉండాలని దాని స్థలాన్ని కూడ వా నిర్ణయించాడు. అంతేకాదు, ఆ నగరం పేరు, తన పేరు ముక మీద 'అలెగ్జాండ్రియా' అని ఉండాలని కూడ నిర్ణయం చేశాడు. కాని క్రీ.పూ. 323 లో అలెగ్జాండరు ఆ చనిపోయాడు. ఆయన తదనంతరం ఆయన ఈజిప్టు భాగానికి వారసుడైన టోలమీ, అలెగ్జాండ్రియాను నిర్మించాడు. దానిలో విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తి కోసం, ప్రస్తుత కాలపు విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. టోలమీ క్రీ.పూ. 238 లో చనిపోయాడు. ఆయన తర్వాత 2వ టాలమీ అధికారానికి వచ్చాడు. తన పూర్వీకుల కలలను సాకారం చేయడానికి అతడు అలెగ్జాండ్రియాలో బ్రహ్మాండమైన లైబ్రరీని నెలకొల్పాడు. దానిని స్థాపించిన మొదటి 40 సంవత్సరాలలోనే 4 లక్షల వ్రాతప్రతులను సేకరించి ఉంచాడు. అందువలన చరిత్ర కారులు ఆ గ్రంథాలయాన్ని ప్రాచీనకాలపు ఏడు వింతలలో ఒకటిగా పేర్కొన్నారు. అది విజ్ఞాన శాస్త్రాలకు 2 వ టాలమీ చేసిన అపూర్వమైన సేవ, కాని ఆ లైబ్రరీ క్రీ.శ. 390 లో ఆర్బిబిషప్ ధియోఫిలస్ పాక్షికంగా నాశనం చేశాడు.”

“క్రైస్తవ మతానికి చెందిన ఆర్బిబిషప్ విజ్ఞాన శాస్త్ర భాండాగారాన్ని నాశనం చేయించాడా? కారణమేమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు రాజశేఖర్.

“అవును క్రైస్తవ ఆర్బిబిషప్పే దానిని చాలా వరకు నాశనం చేయించాడు. దానికి కారణాన్ని 'హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే గ్రంథంలో ఆర్.వి.జి. మీనన్.” చక్కగా వివరించాడు.

“క్రైస్తవ మతం ఆనాడు జీవితానికి ఒక కొత్త అర్థాన్ని సూచించింది. వారి భవిష్యత్తు స్వర్గంలో ఉంది. ఇహలోక జీవితం, భవిష్యత్తులో ఎప్పుడో రాబోయే జీవితానికి ఒక సన్నాహక ప్రయత్నం లాంటిది. ఇలాంటి గ్రంధాలెన్నో ఆ గ్రంధాలయంలో అశాస్త్రీయతను నింపుకొని ఉండేవి. ఇలా వారు విజ్ఞానశాస్త్రాన్ని, శాస్త్రజ్ఞులను ద్వేషిస్తున్న కారణంగా వారి నాయకుడు ఆర్బిబిషప్ ధియోఫిలస్ అలెగ్జాండ్రియాలోని లైబ్రరీని పాక్షికంగా నాశనం చేయించాడు. ఆ లైబ్రరీకి సంపూర్ణ వినాశనం క్రీ.శ. 642 లో ఖలీఫా ఒమర్ నాయకత్వంలో జరిగింది. ఆ సంవత్సరంలో మహ్మదీయులు అలెగ్జాండ్రియాను జయించారు. లైబ్రరీని ధ్వంసం చేయడానికి కారణాన్ని తెల్పుతూ ఒమర్ ఈ గ్రంథాలు దేవుని పుస్తకం అయిన ఖురాన్ లో ఉన్న విషయాలనే తెల్పితే, ఇంక ఖురాన్ కన్న వేరే గ్రంథాలెందుకు? అవి అనవసరం, వాటిని తగలేయండి. ఆ పుస్తకాలలో ఖురాన్ కు విరుద్ధమైన అంశాలంటే, అవి హానికరం. అందువలన వాటిని నాశనం చేయాల్సిందే అన్నాడు. అలా విజ్ఞాన శాస్త్ర వ్యతిరేకుల చేతుల్లో ప్రాచీన కాలపు ఏడు వింతల్లో ఒకటి సర్వనాశనమైపోయింది.” అని ముగించాడు జాన్.

“వెరీగుడ్! ఆనాడు మతోన్మాదులు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తగలబెట్టడమే కాదు, శాస్త్రవేత్తలను తీవ్రంగా హింసించి చంపివేశారు. అలాంటి వారిలో హైపేషియా ఒకరు. సిరీ! హైపేషియాను గూర్చి నీవు చెప్పు.” అన్నారు మాస్టారు.

"హైపేషియా క్రీ.శ. 360 ప్రాంతంలో పుట్టింది మాస్టారూ! ఆమె సాహిత్యంలోనూ, సైన్సులోనూ గొప్ప విజ్ఞానవంతురాలు. ఆమె హుందాతనానికీ, పవిత్రతకూ అందరూ ముగ్గులయి ఆమెను గౌరవించేవారు. ఆమె తండ్రి పేరు ధియాన్. ఏథెన్స్ లో విద్యాభ్యాసం అయిన తర్వాత ఆమె అలెగ్జాండ్రియాలో నియోప్లేటోనిక్ స్కూఎలల్ ఆచార్యపదవిని అధిష్టించి విద్యార్థులకు తత్వశాస్త్రం ఖగోళ శాస్త్రాలను బోధిస్తుండేది. అయితే ఆమె విజ్ఞానానికి అసూయపడిన కొందరు కైస్తవ మతోన్మాదులు ఆమెపై కక్ష గట్టి, ఆమెను బలవంతంగా వీధులలో లాగుకొని వెళ్ళి, బట్టలను చించివేసే పెంకుముక్కలతో చర్మాన్ని గిరి, కండలను కోసి చంపివేశారు. ఈ దారుణమారణకాండ క్రీ.శ 415 జరిగింది.” అంటూ ముగించింది సిరి.

"బాగా చెప్పావమ్మా. ఇవీ ప్రాచీనకాలంలోని గ్రీకు, రోమన్ శాస్త్రవేత్తల జీవిత విశేషాలూ, పరిశోధనా ఫలితాలూ, ఆనాటి సామాజిక పరిస్థితులు వచ్చే క్లాసులో భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభావిశేషాల తెలుసుకుందాం.” అంటూ ఆ రోజు క్లాసును ముగించా సైన్సు మాస్టారు శ్రీనివాస్.

ఆధారం: కె.ఎల్. కాంతారావు



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate