অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సూర్యుడు - నక్షత్రాలు

332.jpgమన భూగోళమంతటికీ కొన్ని కోట్ల సంవత్సరాల నుండి వెలుతురునీ, వేడిమినీ అందుస్తున్న సూర్యుడి గురించి, అలాగే నక్షత్రాల గురించి చెప్పుకోవాలంటే చాలా సంగతులే వుంటాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అతి దగ్గరి నక్షత్రం

ఆకాశంలో మనకు కన్పించే అసంఖ్యాక నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకటి. సూర్యుడి కన్నా ఎన్నో రెట్లు పెద్దగా వుండే నక్షత్రాలు, చిన్నగా వుండే నక్షత్రాలు, అలాగే సూర్యుడి కన్నా ఎన్నో రెట్లు శక్తి వంతమైన నక్షత్రాలు కూడా ఈ విశ్వంలో కోట్ల కొలదీ వున్నాయి. అయితే ఆకాశంలోని మిగతా అన్ని నక్షత్రాల కన్నా సూర్యుడు చాలా పెద్దగానూ, ప్రకాశవంతంగానూ కన్పించడానికి కారణం మిగతా అన్నిటికన్నా అది మనకు చాలా దగ్గరగా వుండడమే సూర్యుడు మనకు సుమారు 14 కోట్ల కిలోమీటర్ల దూరంలో మాత్రమే వుంటే మిగతా నక్షత్రాలు అంతకన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ దూరంలో ఉన్నాయి. అందుకే అవి అంతచిన్నగా మనకు కన్పిస్తున్నాయి. భూమి కన్నా ఎంతో పెద్దది

భూమి కన్నా సూర్యుడు ఎంతో ఎంతో పెద్దది. అది ఎంత పెద్దదంటే మన భూమి లాంటి 12 లక్షలకు పైగా గ్రహాలు అందులో ఇమిడిపోగల్గుతాయి. అదేవిధంగా ద్రవ్యరాశి పరంగా చూసినా భూమికన్నా సూర్యుడి ద్రవ్యరాశి చాలా చాలా ఎక్కువ. అంతే దానర్థం సాపేక్షికంగా భూమికన్నా సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఎన్నెన్నో రెట్లు అధికం సరిగ్గా ఈ కారణంగానే సౌరమండలంలోని గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోక చుక్కలు వంటివన్నీ సూర్యుడి చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి,

వయసు కేవలం 460 కోట్ల సంవత్సరాలే

సూర్యుడు మండడం మొదలుపెట్టి ఇప్పటికీ సుమారు 460 కోట్ల సంవత్సరాలు మాత్రమే అయ్యింది. సాధారణంగా నక్షత్రాలు బతికే వయసుతో పోలిస్తే ఇది చాలా తక్కువ సమయమనే చెప్పాలి.

ఇలా పుట్టింది

333.jpgసూర్యుడు కూడా మిగతా అన్ని నక్షత్రాలలాగే ప్రాణం పోసుకుంది. సాధారణంగా నక్షత్రాలనేవి బ్రహ్మాండమైన వాయువుల, ఇంకా ధూళితో కూడిన మేఘాలతో మొదలవుతాయి. గురుత్వబలం ఈ వాయువులని ధూళిని తన వైపుకి లాగి అవి గోళాకారంలో ఇమిడేలా చేస్తుంది. అది క్రమేణా చాలా వేడెక్కుతుంది. నక్షత్రం తాలూకూ ఈ స్థితిని మనం ప్రొటో స్టార్ అని పిలుస్తాము, రానుకాను ఇవి ఎంత వేడిగా మారిపోతాయంటే, దాని ఫలితంగా ఉన్న పళంగా అవి హైడ్రోజన్ పరమాణువులను భారీ విడుదలై అవి వెలగడం మొదలుపెడతాయి. ఇలా జన్మించిన నక్షత్రాలు ఆకాశంలో అన్ని వైపులకూ విస్తరిస్తాయి. మన సూర్యుడు కూడా ఇలా పుట్టిన నక్షత్రమే.

ఇలా మరణిస్తుంది

334.jpgనక్షత్రాలకు, కూడా అంతిమ ఘడియలంటూ వుంటాయి. వాటివాటి పరిమాణాన్ని బట్టి, ద్రవ్యరాశిని బట్టి కోట్లాది సంవత్సరాలు, లేదా లక్షలాది సంవత్సరాలు నిర్విరామంగా వెలుగులు వెదజల్లిన నక్షత్రాలు తమలోని ఇంధనం తగ్గుముఖం పట్టగానే నక్షత్రాలు తమ అసలు పరిమాణం కన్నా సుమారు 100 రెట్లు పెద్దగా మారి, ఎర్రగా, కన్పించడం మొదలు పెడతాయి. కొంచెం దగ్గరి నుంచి చూడాలేగాని ఇవి అచ్చం ఎర్ర భూతాల్లాగే కన్పిస్తాయంటారు.

ఇలాంటి స్థితిలో మారిన నక్షత్రం తాలూకూ కాంతి, వేడి అంతకు ముందు కన్నా ఎన్నో రెట్లు తగ్గిపోతాయి. అయితే ఈ స్థితిలో కూడా నక్షత్రాలు కొన్ని లక్షల సంవత్సరాలో, ఇంకా అంతకన్నా ఎక్కువ కాలమో మనగల్గుతాయి. ఆ తరువాత పూర్తిగా తమ వెలుగుని కోల్పోతాయి. మన సూర్యుడికి కూడా ఈ పరిస్థితి తప్పదు.

ఎర్రతారగా మారేందుకు

సూర్యుడు ఎర్ర నక్షత్రంగా మారేందుకు ఇంకా 50 కోట్ల సంవత్సరాల సమయముందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అప్పటికి సూర్యుడి ఉపరితలంలోని వాయువులన్నీ అంతరించిపోయి కేవలం లోపలి భాగంలోని వాయువులు మాత్రమే ప్రకాశించడం కొనసాగిస్తాయి. సూర్యుడు ఎర్రతారగా మారే ప్రక్రియలో భాగంగా అపారమైన వేడిమి విడుదలవుతుంది. ఆ వేడికి సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధ, శుక్ర గ్రహాలతో పాటు మన భూమి కూడా ఆవిరైపోతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఏమైతేనేం సూర్యుడి లోపలి భాగంలోని ఇంధనం కూడా అయిపోయాక దాని కథ పూర్తిగా ముగిసిపోతుంది.

సూపర్ నోవా అంటే

ఏదైనా ఒక భారీ నక్షత్రం లోపలి భాగంలోని ఇంధనం అయిపోవడం మొదలు పెట్టినప్పుడు.... ఆ నక్షత్రం కడుపులోని పదార్థం, శక్తి క్రమక్రమంగా అంతరించిపోతూ వస్తాయి. అలాంటి స్థితిలో ఆ నక్షత్రం కొన్ని భౌతిక శక్తుల కారణంగా కాంతులు విరజిమ్ముతూ దడేలున పేలిపోతుంది. ఇలాంటి నక్షత్రాన్నే “సూపర్ నోవా” అని అంటారు. ఇలాంటి విస్ఫోటనం సంభవించినప్పుడు ఆ నక్షత్రం ముక్కలు ముక్కలై, ఆ ముక్కలు అన్ని దిక్కులకూ వ్యాపిస్తాయి.

మనుషులు చూసిన సూపర్ నోవా

ఇప్పుడు అంతరిక్షంలో ఏర్పాటు చేసే హబుల్ టెలిస్కోప్ లాంటి సాయంతో సుదూర విశ్వంలో జరిగిన నక్షత్ర విస్ఫోటనాల గురించి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాము. అయితే క్రీ.శ. 1054 లో ఈ భూమ్మీద మనుషులు నేరుగా ఒక నక్షత్ర విస్ఫోటనాన్ని చూడగలిగారు.

అప్పడెప్పుడో పేలిన తార

ఆనాడు మనుషులు చూసిన సూపర్ నోవా ఆ సంవత్సరంలో పేలింది. కాదు సుమా. అప్పటికి 6000 ఏళ్ళ కిందట పేలిన నక్షత్రాన్ని వాళ్ళు చూశారు. ఇదేం తమషా అంటారా. నిజానికి ఇందులో సైన్సేగానీ తమాషా గిమాషా ఏమీ లేదు. ఎలాగంటారా ?

ఒక నక్షత్రం నుంచి బయలుదేరిన కాంతి మన భూమిని చేరి, మన కళ్ళను తాకితేగాని మనం ఆ నక్షత్రాన్ని చూడలేము. అవునా ? అయితే నక్షత్రాలు దగ్గరాదాపులా ఏమీ లేవుగా ...అవి మనకు కొన్ని లక్షల కోట్ల మైళ్ళదూరంలో ఉన్నాయి. ఉన్నాయి.

కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు, అంత వేగంగా కాంతి ప్రయాణించినప్పటికీ సూర్యుడి నుంచి బయలుదేరిన ఓ కాంతి కిరణం మన భూమిని చేరేందుకు 8 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుడి కన్నా ఎన్నో లక్షల రెట్లు, కోట్ల రెట్లు దూరంలో ఉన్న నక్షత్రాల నుంచి కాంతి మనను చేరేందుకు సహంజగానే కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకే ఎన్నడో 6000 సంవత్సరాలు కిందట పేలిపోయిన ఓ నక్షత్రం తాలూకూ కాంతిని ఈ భూమ్మీద మనుషులు క్రీ.శ. 1054 లో గారి చూడలేకపోయారు. అలా పేలిపోయే నక్షత్రాల విషయంలోనే కాదు, ఈ రోజు మన కంటికి కన్పించే నక్షత్రాల విషయంలోనూ అలాగే జరుగుతుంది. ఈ రోజు మన కంటికి కన్పించే నక్షత్రాలలో నిజంగా ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో మనకు తెలియదు. ఎందుకంటే.... ఆయా నక్షత్రాలు ఉన్న దూరాన్ని బట్టి వీటి నుంచి బయలుదేరిన కాంతి మన భూమిని చేరేందుకు కొన్ని వందలు, వేలు, లక్షలు, లేదా కోట్ల సంవత్సరాలు పడుతుంది.

ఖగోళ పథార్థాలు మధ్య ఇంతలేసి దూరముంటుంది. కాబట్టే వాటి మధ్య దూరాన్ని కిలోమీటర్లలోనూ, మైళ్ళలోనూ గాక కాంతి సంవత్సరాలలో కొలిచే పద్ధతిని శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టారు. కాంతి ఒక ఏడాదిలో ఎంత దూరం ప్రయాణించగలదో, ఆ దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అని అంటారు. ఏదైనా ఒక నక్షత్రం ఓ 100 కాంతి సంవత్సరాల దూరంలో వుంది అంటే దానర్థం కాంతి వేగంతో మనం బయలుదేరినట్లయితే ఓ 100 సంవత్సరాలలో ఆ నక్షత్రాన్ని మనం చేరగలమని, అలాగే ఆ నక్షత్రం నుంచి బయలుదేరిన కాంతి ఒక 100 సంవత్సరాలకు మన భూమిని చేరుతుందని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

మెరిసే కారణం

అనేక ఇతర నక్షత్రాలలాగే సూర్యుడు కూడా తళతళా మెరిసే సంగతి మీకు తెలిసిందే అయితే ఈ మెరవడం లేక ప్రకాశించడం అనేది ఎలా సాధ్యమవుతుందో తెలుసా .... ఇతర నక్షత్రాలలాగే సూర్యుడు కూడా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో రూపొందింది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణాంగా ఆ వాయువులు దానినే అంటి హైడ్రోజన్ వాయువులు నిర్విరామంగా హీలియం పరమాణువులుగా మారిపోతుంటాయి. బృహత్తరమైన ఈ ప్రక్రియను నూక్లియర్ ఫ్యూజన్ ని అంటారు. ఈ ప్రక్రియ మూలంగా భారీ ఎత్తున శక్తి విడుదలవుతుంది. దాని కారణంగానే సూర్యుడు ప్రకాశించడం జరుగుతుంది.

335.jpgసూర్యుడిలో కన్పించే నల్లమచ్చలు లాంటివి కేవలం సూర్యుడిలోనే గాక దాదాపుగా అన్ని నక్షత్రాలలోనూ వుండే ప్రదేశంలోని వాయువులు సాపేక్షికంగా మిగతా భాగంలోని వాయువుల ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో వుంటాయి. అంటే సాపేక్షికంగా చల్లగా ఉంటాయన్నమాట. చల్లగా అంటే ఏ మంచుగడ్డలానో

అనుకునేరు. అలాంటిదేమీకాదు. ఈ నల్లమచ్చల ప్రాంతం కూడా భగభగలాడుతూనే వుంటుంది. కాకపోతే మరీ అంత తీవ్రంగా మండదు. అంతే తేడా. ఉదాహరణకు సూర్యుడి లోపలి భాగంలో సుమారు 17,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వుంటుంది. కాగా దాని వెలుపలి భాగంలో 5,500 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వుంటుంది. అయినా దీని గురించి మాట్లాడేటప్పుడు సూర్యుడి లోపలి భాగం కన్నా వెలుపలి భాగం చల్లగా ఉందంటారు.

అన్ని నక్షత్రాలూ గుండ్రంగానే వుంటాయి.

మనం బొమ్మల రూపంలో నక్షత్రాలను దించినప్పుడు లేదా ఇలా దించుతుంటాము. అవునా. అయితే వాస్తవానికి సృష్టిలో ఏ నక్షత్రం యొక్క ఆకారమూ ఇలా కోణీయంగా వుండదు. ఎందుకంటే గురుత్వశక్తి కారణంగా ప్రతి నక్షత్రమూ దోళాకారంలోనే వుంటుంది. మరి...

ఇవీ సూర్యుడికీ, నక్షత్రాలకీ సంబంధించిన కొన్ని విశేషాలు. వాటి గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా సంగతులే ఉన్నాయి, మరోసారేప్పుడన్నా ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. సరైనా...© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate