অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సోపు కథ

సోపు కథ

soapసూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని కాపాడేది, మీ శరీర మురికిని తలగించి గజ్జి, తామర లాంటి చర్మవ్యాదులు రాకుండా రక్షించేది ఎవరో తెలుసా? హ.... హ.... నేనే సోప్ (సబ్బు) ని మరి. నేనేమిటో నా రూపు రేఖావిలాసమేమిటో వివరిస్తాను. ఆలకించండి. నిజానికి నేనెప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో నేను మరచాను. మీ చరిత్ర ప్రకారమైతే క్రీస్తు పూర్వ 600 సంవత్సరంలో (600 బి.సి) రోమన్లు (టాలో) నూనె కలప బూడిద మరియు ఆల్కలీ రసాయనాలతో నన్ను తయారు చేసేవారు. ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక 18వ శతాబ్దం వరకు ధనవంతులు మాత్రమే నన్ను వాడేవారు.

క్రి.శ 1790 సం.లో ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త నికోలస్ లేబ్లాంక్ సాధారణ ఉప్పు (సోడియం క్లోరైడ్, NaCl) నుండి కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్లోరైడ్, NaOH) ను తయారు చేసే విధానాన్ని కనుగొన్నాడు. క్రి.శ 1823 లో మైఖేల్ యూజీన్ చెరియాల్ అనే ఫ్రెంచి శాస్త్రవేత్త క్రొవ్వులు, నూనెల (Fats, Oils) స్వభావాన్ని తేటతెల్లం చేసాడు. తద్వారా క్రొవ్వులు, నూనెలను కాస్టిక్ సొడాతోకలిపి అతి తక్కువ ఖర్చుతో నన్ను తయారు చేసే పద్ధతి ప్రారంభం   అవసరమయ్యేది? భారతదేశంలో సీకాకాయ, కూకుడు కాయల పొడిని, సున్నిపిండిని, శెనగపిండిని శరీరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించేవారు.

రెండవ ప్రపంచయుద్ధం తరువాత నన్ను తయారుచేయడం సులభమయ్యంది. క్రొవ్వులు మరియు నూనెలను కాస్టిక్ సోడాతో నేరుగా కలిపి, ఈ మిశ్రమాన్ని 2480 F ఉష్ణోగ్రత (120° C) 2 రెట్లు వాతావరణం వద్ద వేడి చేసినప్పుడు వాటి మధ్య సెపానిఫి కేషన్ (sepanification) చర్య జరిగి సంయోగ పదార్థం యేర్పడుతుంది. దీని నుండి “గ్లిసరిన్” అదనపు పదార్థంగా (byproduct) వెలువడిన తరువాత చిలకడం (centrifugation) మరియు తటస్థీకరణ (nutralisation) చేయడం ద్వారా నేను (సోవ్) బయటపడేదాన్ని. ఈ పద్ధతిలో చాలా సులభంగా తక్కువకాలంలో నన్ను - తయారు చేస్తారు?

నేను ఎలా పనిచేస్తానో ఇప్పుడు మీకు చెబుతాను. నేను నీటితో కలిసినప్పుడు నీటి మొత్తాన్ని సమానంగా ఆక్రమించుకొంటాను. నాలోని హైడ్రోకార్బన్ ప్రోటీన్ యొక్క ఆయాన్లు ఇలా ఉంటాయి. పరస్పరం ఆకర్షింపబడి గుంపుగా చేరి గోళాకారంగా ఏర్పడతాయి. వీటిని మైసల్స్ (micelles) అంటారు. మైసల్స్ ఆయాన్ల తోకలు (lipophilic, నూనెను ఆకర్షించేవి) నీటితో కలవకుండా గోళం యొక్క లోపలివైపు ఉంటాయి. వాటి తలలు (hydrophilic నీటితో ఆకర్షింపబడేవి) వెలుపల వైపున ఉండే నీటితో కలిసి ఉంటాయి.

నీటితో తొలగని నూనె మరకలు నా దగ్గరకు వస్తే నా మైసల్స్ . నూనె బిందువులను వెంటనే లోనికి తీసుకుని దాని చుట్టూ గోళాకారంగా కప్పివేస్తాయి. నీరు పోసినట్లయితే ఈ మైసెల్స్ సులభంగా కొట్టుకుపోతాయి. ఈ విధంగా నేను మీ శరీరం పై ఉండే నూనె మరకలను, మురికినీ మైసెల్స్ ద్వారా తొలగిస్తానన్నమాట. అంటే సాధారణంగా నూనె మరియు నీరు కలవవు. నేను వాటితో కలిస్తే ఈ మైసెల్స్ ఏర్పడి నూనె బిందువులను లోనికి లాక్కుని సులభంగా నీటిలో కొట్టుకుపోయేలా చేస్తానన్నమాట.

నాలోని కొవ్వు పదార్థం (టోటల్ ఫాటీ మాటర్, Total fatty matter, TFM) కు మొత్తం పదార్థానికి గల నిష్పత్తిని బట్టి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వారు గ్రేడింగ్ చేసారు. 80% కంటే ఎక్కువ TFM ఉంటే గ్రేడ్ 1 సోపు అంటారు 65% నుండి 80% లోపల TFM ఉంటే గ్రేడ్ 2 సోపు అంటారు.

మార్కెట్ లోని వివిధ రకాల సోపులTFM లు ఈ విధంగా ఉన్నాయి. మైసూర్ సాండల్ - 80%, సింథాల్ (ఓల్డ్) - 79%, జాన్సన్స్ బేబీ సోప్ - 78%, సంతూర్ - 71%, డెట్టాల్-72%, మార్గో - 71%, లక్స్ -70%, రెక్సోనా-70%, హమామ్68%, లైఫ్ బాయ్ - 60%.

ఫాటీ ఆసిడ్స్, నూనెలు కాక నాలో ఇంకా ఈ క్రింది పదార్థాలు ఉన్నాయి.

  1. PEG-6 పాలీ ఇథలీస్ గైకాల్స్, మిధైల్ ఈధర్. ఇవి రంగులు మరియు సువాసనలు సమంగా నాలో కలపడానికి ఉపయోగపడతాయి.
  2. గ్లిసరిన్, సొర్బిటాల్- ఇవి నాలో సరైన రీతిలో అణువుల అమరికకు తోడ్పడతాయి.
  3. టైటానియం డై ఆక్సైడ్ - అపారదర్శకతకు,
  4. పెంటాసోడియం పెంటానేట్, EDIA- ఇవి నేను నీటిలో కరగడానికి ఉపయోగపడతాయి.
  5. ట్రైక్లోసాన్ - టైర్లో కార్బన్ - ఇవి నేని బాక్టీరియా నిర్మూలనకు (anti bacteria) ఉపయోగపడుతుంది.

హిందూస్థాన్ యుని లివర్ (HUL) అనే దేవ విదేశీ కంపెనీ చాలా రకాల సోపులను తయారుచేస్తోంది. స్వదేశీ కంపెనీలు కూడా కొన్ని రకాల సోపులను పేరు తయారుచేస్తున్నాయి. ప్రకటనలను చూసి నన్ను కొనకండి. నాలోని TPM ను చూసికొనండి. శుభ్రంగా రోజూన్ను ఉపయోగించి స్నానం చేయండి "ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి

ఉంటా మరి. సెలవా, టాటా

ఆధారం: యుగంధర్.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate