హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / సైన్స్ పదనిసలు / హరిత రసాయన శాస్త్రం – హరిత పర్యావరణం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

హరిత రసాయన శాస్త్రం – హరిత పర్యావరణం

నేడు మానవుడు ఎదుర్కొంటున్న అతి భయంకరమైన సమస్యల్లో పర్యావరణం కాలుష్యం మొదటి స్ధానంలో ఉంది.

plasticనేడు మానవుడు ఎదుర్కొంటున్న అతి భయంకరమైన సమస్యల్లో పర్యావరణం కాలుష్యం మొదటి స్ధానంలో ఉంది. రసాయనాలు విచ్చలవిడి వినియోగం ముఖ్య కాలుష్య కారకాల్లో ఉంది. రసాయనాలను విచక్షణ వినియోగిస్తే ప్రయోజనాలున్నట్లు, వికచక్షణారహిత వినియోగం ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. రసాయన శాస్త్రజ్ఞాలు ఇప్పుడు పర్యావరణ స్నేహశాల రసాయనాల పై దృష్టి సారించారు. గ్రీన్ కేమిస్టిరగా పిలువబడే ఈ సరికొత్త రసాయన శాస్త్ర శాఖకు ఎంతో ఉజ్వల భావిష్యత్తు ఉంది. ఇది క్లిన్ కెమిస్ట్రిగా అభివృద్ధి చెందే దిశలో పురోగమిస్తోంది. రసాయన శాస్త్రజ్ఞాలు ఈ సరికొత్త వనరుల సంరక్షణ , కొనసాగే అభివృద్ధి తో పాటు మానవాళ పై దుష్రభావం కలిగించనిరీతిలో వనరుల వినియోగం జరగాలన్నదే మన ఆశయం కావాలి.

సైన్స్ మాస్టారు విరామం తరువాత తరగతిలో కి ప్రవేశిస్తు... అందరూ వచినట్లేనా... ఇంకా ఎవరైనా రావాలా? అని అడిగారు!

విద్యార్ధులు: లేదు సార్... అందరం బయటికెల్లోచ్చాం.. ఇక వచ్చేవాళ్లేవరూ లేరు.

సైన్స్ మాస్టారు: అలాగయితే సరే...... ఇక పాటం మొదలెడదాం ..... నిన్నటి రోజు.. మీరు కాలుష్యం గూర్చి తెలుసుక్కున్నారు కదా..

జిజ్ఞాన : అవును సార్ .... పర్యావరనంలోకి వ్యర్ధ పదార్ధాలు ఇబ్బడి ముబ్బడిగా చేరడమే కాలుష్యం కదా....

సైన్స్ మాస్టర్: భేష్ అమ్మాయి .... కాలుష్యాన్ని చాలా చక్కగా సంక్షిప్తంగా వివరించావ్ ... మరైతే ఈ రోజు కాలుష్యకారకాల్లో, రసాయనాల గూర్చి తెలుసుకుందాం.....

అన్వేష్: సరే.... సరే..... కాలుష్య కారకాల్లో రసాయనాలు ముఖ్యమైనవంటారు.

సైన్స్ మాస్టర్: అవున్త్రా .... ఈరోజు మానవుడు పందుల వేల రకాల రసాయనాలను వినియోగిస్తున్నాడు. అయితే వీటి విచ్చక్షణ రహిత వినియోగం వల్లే కాలుష్యం పెరుగుతుందో. రసాయనాల నద్వినియోగం వర్యావరణాన్ని ఎలా పదిలంగా ఉంచగలదో చూద్దాం.

అమీర్: అరే.... చిత్రంగా ఉందే...... రసాయనాలు కాలుష్య కారకాల్లో ముఖ్యమైనవి అనుకోన్నా..... వాటి సద్వినియోగం, పర్యావరణాన్ని ఎలా పదిలంగా ఉంచగలదో చూద్దాం.

అమీర్ : అరే..... చిత్రంగా ఉందే రసాయనాలు కాలుష్య కారకాల్లో ముఖ్యమైనవి అనుకొన్నా వాటి సద్వినియోగం పర్యావరణాన్ని కాపాడుతుందా?

సైన్స్ మాస్టర్: అవున్రా ..... అందులో ఎలాంటి సందేహంలేదు. కేవలం రాసాయనాలేంటి. ఎన్నో ఉదాహరణలు చూడవచ్చు. వైద్యం, వ్యవసాయం, ఆహార పదారాల పరికరణ, విధ్యత్

రంగాల్లో అణుశక్తి ఉపయోగపడుతుంది. అలాగే అణుబాంబులు తయారిలోనూ..... కత్తిలో కూరగాయలు తరగవచ్చు. మెడనూ కోయవచ్చు. ఇలా ఎన్నో ఉదాహరణ చెప్పవచ్చు. వస్తువు వినియోగంలోనే ఉంది సత్వలితం లేదా దుష్చలితం రావడం.

అన్వేష్: సర్...... మరి అలాంటి రసాయనం ఒకదాని గూర్చి చెప్పరూ......

సైన్స్ మాస్టర్: ఇదిగో  ఇప్పడు నే చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వినండి..... రసాయనాలు పర్యావరణ పరిరక్షణలో ఎలా తోడ్పడుతాయో స్పష్టంగా అర్ధమవుతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2) ఎంతో బలమైన రసాయనం. పరిశ్రమల్లో ఎంతగానో ఉపయోగించే ఈ రసాయనం. పరిశ్రమల్లో ఎంతగానో ఉపయోగించే ఈ రసాయనం వల్ల కాలుష్యం పేరుగుతుందనుకుంటాం. కానీ నిజానికి ఈ రసాయనం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేయడంలో కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తుంది.

అమీర్: మాస్టారూ... అదెలాగో వివరించురూ.....

జిజ్ఞాస: అవునా.... మాస్టారూ .... ఆ విషయం మరింతగా వివరించరూ......

సైన్స్ మాస్టార్: H2O2 లో ఆక్సిజన్ ఒక క్రియాశీల భాగం. దీనిలోని ఆక్సిజన్ ను సహజ విఘటంనం ద్వారా పొందవచ్చు. ఈ చర్యలో కేవలం నీరు ఉప ఉత్పన్నం . ఇలా ఈ రసాయన చర్య కాలుష్యాన్ని కలిగించదు.

అన్వేష్: సార్..... H2O2 వినియోగం పెరగాల్సి ఉందంటారా? అందువల్ల ఎలాంటి నష్టం లేదంటారా?

సైన్స్ మాస్టర్: అవును.... నే చెప్పేవిషయం అదే కదా.... ఈ రాసాయనాన్ని రెండవ ప్రపంచయుద్ధ సమయం దాకా బాగా ఉపయోగించే వారు. అయితే ఆ తరువాత దీనికి ప్రత్యామ్నాయయంగా సరికొత్త సాంకేతికాలు అందుబాటులోకి రావడంతో H2O2 ప్రాముఖ్యత మరుగున పడిపోయింది . వినియోగం బాగా తగ్గిపోయింది. కాలుష్యం పెరగడంతో, మానవుడిలో పర్యావరణ పరిరక్షణ ఆకాంక్ష పెరిగింది. ఈ రసాయనం ప్రాముఖ్యత తిరిగి వెలుగులోకి వచ్చింది. అంటే మరుగున వడిన ప్రాముఖ్యత తిరిగి కనుక్కోబడింది.

అమీర్: సర్...... H2O2 రసాయనం పర్యావరణ స్నేహశీలత కలిగి ఉందంతున్నారు...... ఆ లక్షణాలేమిటో చెప్పరూ?

సైన్స్ మాస్టర్ : సరే.... అలాగే.... అందరికి అందుబాటులో ఉంది... పైగా ఆక్సిజన్ తో నిండి ఉంది. ఈ కారణంగా అది పర్యావరణ స్నేహశీలమైనా ఇప్పుడు దిన్ని పారిశ్రామిక పర్ద జలాలను శుభ్రపరచడానికి , ఆక్వా కల్చర్ కుంటల్లో కరిగి ఉండే ఆక్సిజన్ శాతా న్ని పెంచడానికి, మొక్కలను హరిత ఎరువుగాను, డిక్లోరినేషన్, డిసిన్ ఫెక్షన్, స్తేరిలైజేషన్ మరియు శుభ్రపరచడానికి ఉపయోగిస్తున్నారు.

జిజ్ఞాస: సరే.... అదేదో గ్రీన్ కేమిస్త్రి క్లిన్ కెమిస్ట్రీ అంటున్నారు కదా ......వాటి గూర్చి మరింతగా చెప్పారూ.

సైన్స్ మాస్టర్: పర్యావరణ ఆరోగ్యం మరింతగా దిగజారకుండా ఉండటానికి ఇప్పుడు పారిశ్రామిక విధానాలన్ని పర్యావరణ స్నేహశీలమైనవిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తి విధానాలు చవకైనవి, లాభాదాయకమైనవి. పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలకు తగినట్టుగా ఉంటాయి. ఇక గ్రీన్ కెమిస్ట్రీ విధానం వస్తూ ఉత్పత్తిలో వనరులు, శక్తిని తక్కువగా వినియోగించడం , ఉత్పత్తి వ్యయం తగ్గించేది విష ద్రావణాలన తక్కువగా వాడేది తద్వారా సివరేజ్ సిస్టం పై భారం తగ్గించేదిగా ఉంటుంది. ఈ విధానం మానవ ఆరోగ్య రక్షణ పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

అన్వేష్ : సార్....  గ్రీన్ కెమిస్ట్రీ అంటే  ఏమిటో తెలిసింది. మారి క్లిన్ కెమిస్ట్రీ సంగతి ఏమిటి? ఈ విధానంలో నానో మేతిరియల్స్ ఉపయోగిస్తారా?

సైన్స్ మాస్టర్: మంచి ప్రశ్న అడిగావ్ రా...  నేను ఈ విషయం చేబుతామనుకుంటూనే మరిచిపోయో..... తక్కువ పరిణామం, ఎక్కువ ఉపరితలం కిలిగిఉండటం వల నానోమేటియల్స్ బాగా ఉపయోగిస్తున్నారు. పర్యావరణ స్నేహశీలా ఉత్పత్తి విధానాలూ, నానో మేటిరియల్స్ కైపొఇ వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఒక అద్భుత ఆయుధం లభించినట్లయింది. సేంద్రియ కాలుష్యకాల విఘటనం శిలింధ్రనాశక , ఉత్ప్రేరక చర్యల్లో సౌలభ్యంగా ఉంటాయి.

అమీర్: సర్.... క్లిన్ కెమిస్ట్రీ వల్ల సిద్ధించగల మరిన్ని ప్రయోజనాల గూర్చి వివరించరూ?

సైన్స్ మాస్టర్: తప్పకుండా నాన్ బయోడి గ్రెడబుల్ ప్లాస్టిక్స్ స్ధానంలో బయోడి గ్రేడబుల్   ప్లాస్టిక్స్ వినియోగించడానికి సరికొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక వాహన కాలుష్యాలను తొలగించడంలో నానోగోల్డ్ బాగా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్స్ మరింత సుక్ష్మికరించడం వల్ల ప్లాస్టిక్ మరియు టాక్సిక్ వ్యర్ధాలు తగ్గించబడుతున్నాయి. అలాగే నానో మేటిరియల్స్ ఆహారం పై బాక్టీరియా దాడిన అరికడతాయి. అలాగే ఆహారంలో ఉంచబడిన నానో సెన్సార్లు ఆహారం తాజాగా ఉన్నది లేదా చెడిపోయినది తెలియజేస్తాయి.చెప్పాలంటే మరెన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

జిజ్ఞాన: సర్..... ఈ అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం (2011) లో గ్రీన్ కెమిస్ట్రీ గూర్చి తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.

సైన్స్ మాస్టర్: అదే కదమ్మా.... ఉన్నత చదువులంటే కేవలం ఇంజనిరంగ్ మేడిసనే కాదు. సైన్స్ లోను మంచి భావిష్యత్తు ఉంది. అందుకే మీరంతా రసాయన శాస్త్రం పట్ల మక్కువ పెంచుకోవాలి. రసాయనశాస్త్రం లో పై చదువులు చదవాలి.

ఆధారం: డా. సమ్మెట గోవర్ధన్

3.01728395062
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు