অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అట్టముక్కలతో జంతువుల నమూనాలు

అట్టముక్కలతో జంతువుల నమూనాలు

కావలసినవి:

మందమైన అట్టలు, బ్లేడు, కత్తెర, స్కెచ్ పెన్స్, వాటర్ కలర్స్, పెన్సిల్, దారం.

ఇలా చేద్దాం:

మందమైన లేత రంగు అట్టముక్కలను సేకరించాలి. వాటిపై పెన్సిల్ తో మనకు కావలసిననంత సైజులో బొమ్మలు గీయాలి. నీటిలో జీవించే చేప, నీటిలోను భూమిపైన నివసించే కప్ప, గాలిలో ఎగరగలిగే పక్షి ఎడారిలో సులభంగా మసలగలిగే ఒంటె ఇలా వివిధ భిన్న పరిసరాలకు అనుగుణంగా జీవనంసాగించే జంతువులు ఈ ఫోటోలో ఉన్నాయి. ఇలా మనకు ఇష్టంగా ఉండే వివిధ జంతువులను గీసి వాటి అంచులు వెంబడి నెమ్మదిగా బ్లేడుతో కత్తిరించాలి. ఇలా అన్నీ రెడీ అయిన తరువాత వాటికి అంచులు, కళ్ళు, శరీరంపై చుక్కలు ఇలా వివిధ భాగాలను స్కెచ్ పెన్ తో తుది మెరుగులు దిద్దాలి. ఇలా ఒకే బొమ్మకు రెండువైపులా ఒకేలాగా వాటర్ కలర్స్ తో తయారుచేస్తే ఇంకా బాగుంటుంది. బాగా ఆరిన తరువాత వీటికి పై భాగాన మధ్యలో గట్టి దారం కట్టి వ్రేలాడదీయాలి. ఇప్పుడు ఇవి ఏ వైపుకు తిరిగినా ఒకేలాగా కనబడుతూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. వీటినిపాలితిన్ కవర్ లో భద్రపరిస్తే పదికాలాలపాటు ఉపయోగించుకోవచ్చు.

నిర్వహణ : టి. శాంతాభాస్కర్, చిత్తూరు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/27/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate