অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉష్ణము

ఉష్ణము

కృత్యము : చల్లదనం మరియు వేడి కావలసిన పరికరాలు : ప్రతి సమూహానికి 3 కప్పులు, సారాదీపం, మంచుగడ్డలు

jan015.jpgవిధానం : సాధారణ నీటితో రెండు కప్పులను నింపాలి. అందులో ఒక దానిలో మంచు ముక్కలు వేయాలి. సారాదీపంతో కొంత నీటిని వేడిచేసి మూడో కప్పులో పోయాలి. గ్రూపులోని ప్రతీ విద్యార్థిని పిలిచి వారి ఎడమచేతి వ్రేలిని మంచు కలిపిన నీటిలో, కుడి చేతి వ్రేలిని వేడినీటిలో ముంచి కొద్ది నిమిషాలు పరిశీలించమని తర్వాత ఆ రెండు వేళ్ళను సాధారణ నీరున్న కప్పులో పెట్టామనాలి. వారు గమనించిన విషయాన్ని నమోదు చేయమనండి.

విషయ అవగాహన : వేడి, చల్లదనము అనేది సాపేక్ష అంశాలు. వెచ్చదనానికి చల్లదనానికి నిర్ధారిత కొలత లేదు. ఉష్ణము వేరే వస్తువు నుంచి మన శరీరానికి చేరితే ఆ వస్తువు వెచ్చగా వేడిగా, మన శరీరం నుండి వస్తువుకు ఉష్ణం చేరితే ఆ వస్తువు చల్లగా అనిపిస్తుంది.

ప్రశ్నలు : సారాదీపపు జ్వాల చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుందా? మంచు ఎందుకని చల్లగా ఉంటుంది?

కృత్యము : ఉష్ణము వేడి వస్తువుల నుండి చల్లని వస్తువులకు ప్రసరిస్తుంది.

కావలసిన పరికరాలు : ప్రతీ/ఒక్కో సమూహానికి 3 కప్పులు, సారాదీపం, మంచుముక్కలు.

విధానం / పద్ధతి

- సాధారణ నీటితో కప్పును నింపి అందులో మంచుముక్కలు కలపాలి.

- సారాదీపంతో నీటిని వేడిచేసి ఆ నీటితో మరో కప్పును నింపాలి.

- ప్రత్రి విద్యార్థిని పిలిచి తమ చేతి వేళ్ల సహాయంతో ఏ కప్పులో నీరు వేడిగా/చల్లగా ఉందో చెప్పమనాలి.

- మొదటి కప్పులోని కొంత నీటిని 3వ కప్పులో తీసుకోవాలి.

- ఇప్పుడు 2వ కప్పులోని కొంత నీటిని 3వ కప్పులో పోయాలి.

- ప్రత్రి విద్యార్థిని పిలిచి 3వ కప్పులో చేతివ్రేళ్ళను ముంచి ఆ నీరు చల్లగా ఉందా? వెచ్చగా ఉందా? చెప్పి నమోదు చేయమనాలి.

- ఓ 20 నిమిషాలు, కప్పులలోని నీటిని అలా ఉంచి తిరిగి నీటిని పరిశీలించి, పరిశీలనలకు నమోదు చేయమనాలి.

గ్రహింపు

-మొదటి కప్పులోని చల్లని నీరు నెమ్మదిగా ఉష్ణాన్ని గ్రహించి సాధారణ నీరుగా మారుతుంది.

-రెండవ కప్పులోని వేడినీరు నెమ్మదిగా ఉష్ణాన్ని కోల్పోయి సాధారణ నీరుగా మారుతుంది.

-3వ కప్పులోని చల్లని నీరు వేడి నీటిని పోసినప్పుడు ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కి తిరిగి నెమ్మదిగా ఉష్ణాన్ని కోల్పోతూ సాధారణ నీరుగా మారుతుంది.

విషయ అవగాహన

ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. అది వేడి వస్తువును స్పృశించే విధంగా చల్లని వస్తువును ఉంచితే వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణం ప్రసారమౌతుంది. రెండు వస్తువులు ఒకేస్థాయి వేడికి లేదా చల్లదనానికి చేరినప్పుడు ఉష్ణప్రసారం జరుగదు. ఈ స్థితిని ఉష్ణసమతాస్థితి అంటారు.

అనుబంధ ప్రశ్నలు

-పరిసరాలలో ఉన్న గాలి నుంచి సాధారణ నీటిలోకి లేదా నీటి నుంచి గాలిలోకి ఉష్ణం ప్రసారం జరుగుతుందా? లేనట్టయితే ఎందుకు జరుగదు?

-ఎండాకాలం వేడిగా, చలికాలం చల్లగా ఎందుకుంటుంది?

-చలికాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులను ఎందుకు ధరిస్తాము?

మేజిషియన్ సుబ్బు కెమిస్ట్రీప్రయోగం

మెజీషియన్ సుబ్బు చేసే ప్రతి అంశం విద్యార్థుల్ని బాగా ఆకట్టుకుంటోంది. మరో మేకరి మెటీషియన్ సిద్దమౌతున్నాడు. ఒక ధర్మోకల్ బాక్స్ లోంచి ఒక మంచుగడ్డను బయటికి తీసి వేదిక మీద ఒక రాత్రి పలక మీద ఉంచాడు. మెజీషియన్ అందరికేసి చూస్తూ "మీలో ఎవరైనా ఈ మంచుగడ్డను మండించగలరా?” అన్నాడు. ఇదేమైనా కర్పూరమా అగ్గిపుల్లతో అంటిస్తే మండటానికి? మంచుగడ్డను ఆరుబయట ఉంచినా, కాస్త వేడితగిలినా కరిగి నీరవుతుంది. అంతేకాని మంచు మండటమేమిటి? అనుకున్నారంతా. “నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో, కానీ నేనీ మంచుగడ్డను మండిస్తా. కానీ, ఈ మంచుగడ్డను నా దగ్గరున్న మంత్రజలంతో అభిషేకిస్తా” అంటూనే తన దగ్గరున్న గాజు సీసాలోంచి రంగులేని ద్రవాన్ని కొద్దికొద్దిగా మంచుగడ్డ మీద పోశాడు. తర్వాత ఏదో ఉచ్ఛరిస్తున్నట్లుగా పెదాలు కదిపాడు. అగ్గిపుల్లను వెలిగించి మంచుగడ్డకు తగిలించాడు. అంతే, మంచుగడ్డ మీద మంటలు లేచాయి. మంచుగడ్డ మండుతోందనుకున్నారంతా చప్పట్లు మార్మోగాయి.

అదిసరే, అయినా మంచుగడ్డ మండటమేమిటి? ఇంతకీ మెజీషియన్ ఏం మాయచేశాడు? అతను ఉపయోగించిన ఆ మంత్రజలం ఏమిటి? అనుమానం తీర్చటం సైన్స్ టీచర్ లక్ష్మివంతయింది.

ఈ మేజిక్ మనమూ చెయ్యగలం. ఒక మంచుగడ్డను సంపాదించాలి. మన ఫ్రిడ్జిలో ఉండే ఐస్ క్యూబ్లు మరీ చిన్నవి. కాస్త పెద్ద సైజులో, ఘనాకృతిలో ఉండే మంచుగడ్డ అయితే మేజిక్ చూడ్డానికి బాగుంటుంది. ఐస్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకోవచ్చు. వేడిని తట్టుకునే ఏదైనా ఆధారం మీద ఐస్ గడ్డను ఉంచాలి. నావ రా లేదా లోహమువలకను ఉపయోగించుకోవచ్చు. మంచుగడ్డ మీద తేలిగ్గా మండే లక్షణం ఉన్న ఏదైనా ద్రవాన్ని పోసి అగ్గిపుల్లతో అంటిస్తే ఆ ద్రవం మండుతుంది. ఇథైల్ ఆల్కహాల్ (ఇథనోల్), లేదా 90% ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ (Rubbing Alcohol) లేదా మిథైల్ ఆల్కహాల్ (మిథ నోల్)ను ఉపయోగించవచ్చు.

ఇవి తేలిగ్గా మండడమే కాదు, మండేటప్పుడు పొగ కూడా రాదు. మంచుగడ్డ మండుతున్నట్లే అగుపిస్తుంది. మెజీషియన్ చేసింది ఇదే. మేజిక్ లో ఉపయోగించే ఆల్కహాల్ లో కొన్ని రసాయనాలను కలిపి రంగు మంటల్ని కూడా రప్పించవచ్చు. మిథనోల్ కు బోరిక్ ఆమ్లం కలిపితే ఆకుపచ్చని రంగు మంట వస్తుందని వివరంగా చెప్పింది సైన్స్ టీచర్.

ఈ మేజిక్ ను మరోలా కూడా చెయ్యవచ్చు. ఈ సారి ఒక 2 లీటర్ల బీకర్ ను తీసుకుని దాంట్లో ఒక చెంచా నిండా కాల్షియం కార్బైడ్ పలుకులను బీకర్ అడుగున ఉంచి బీకర్ ను ఐస్ ముక్కలతో నింపాలి. ఒక పొడవైన హాండిల్ ఉన్న లైటర్తో ఐస్ ముక్కల్ని అంటిస్తే అవి వండుతాం. మంచుముక్కలు మండుతున్నట్లే అగుపిస్తుంది. ఇందులో సైన్స్ రహస్యం మనం అర్థం చేసుకుందాం. మంచు కొద్దిగా కరిగినప్పుడు ఏర్పడే నీరు కాల్షియం కార్బైడ్తో చర్య జరిపినప్పుడు ఎసిటిలీన్ వాయువు ఏర్పడుతుంది. ఇది మండే వాయువు. లైటర్ తో అంటించినప్పుడు ఎసిటిలీన్ వాయువు మండుతుంది. మంచు మండుతున్నట్లే మనకు అగుపిస్తుంది. కాని ఈ మేజిక్ ను ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే చేయాలి. అంటించిన తర్వాత దూరంగా నిలబడాలి. వేడికి బీకర్ పగిలిపోవచ్చు. కంటికి గాగుల్స్ పెట్టుకుంటే మంచిది.

ఆధారం: 7వ తరగతి 5వ పాట్యంశం ఉష్ణోగ్రత మరియు దానిని కొలుచుట.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate