অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కదిలే కాగితపు చేప

కదిలే కాగితపు చేప

“మచిలీ జల్ కీ రాణిపై... జీవన్ వుస్ కా పై...

హాత్ లగావో థర్ జాయీగీ.. బాహార్ నిఖిలో మర్ జియీగ్....”

చేప నీళ్ళల్లో వుండే రాణి. నీరే దానికి జీవం. నీళ్ళలో చేయి పెడితే భయపడుతుంది. నీళ్ళ బయటకు తీస్తే చనిపోతుంది. హిందీలో పై పాటను మీరు చిన్నప్పుడు స్కూల్ లో పాడే వుంటారు. చేపలు జలచరాలు, పశువులు భూచరాలు. తాబేళ్ళు ఉభయ చరాలు (amphibians). చేపలు నీటిలో ఈదుతూ అప్పుడప్పుడు నీటి పైకి వచ్చి వెళుతుంటాయి కదా. అలా కాకుండా నీటిపైనే ఈదులాడే చేపను చూసారా? క్రీ.శ. 1800లో సైన్సు పుస్తకాలలో పిల్లలను అలరించిన అద్భుత సైన్సు ప్రక్రియ పేపరు చేప. నీటి ఉపరితలంపై మోటారు బోటులాగ కదులుతూ ఈదే పేపరు చేపను ఎప్పుడైన చూసారా? చూడడం ఏమిటి? మనమే తయారు చేస్తేపోలా? ఎలాగంటారా? రండి చేసి చూద్దాం.

కావలసిన పరికరాలు: కాగితపు ముక్క కత్తెర, వంట నూనె లేక లిక్విడ్ డిటర్జెంట్ (పాత్రలు కడిగే లిక్విడ్ తీసుకోవచ్చు), పెద్ద వెడల్పాటి పాత్ర, నీరు.

విధానం: కాగితాన్ని తీసుకొని దానిపై పటంలో చూపిన చేపబొమ్మను ట్రేస్ చేసుకోండి. కత్తెరతో చేప బొమ్మను కాగితం పై కత్తిరించండి. చేప మధ్యలో 'a' వద్ద గుండ్రంగా రంధ్రం కత్తిరించి, 'a' నుండి 'b' వరకు పేపరు పీలికను కత్తిరించి తీసివేయాలి. ఈ పేపరు చేపను పాత్రలోని నీటి ఉపరితలంపై సమాంతరంగా, జాగ్రత్తగా అమర్చండి.

ఇప్పుడు చేప కేంద్రం '0' వద్ద గల రంధ్రంలో ఓ చుక్క నూనెను లేక లిక్విడ్ డిటర్జెంట్ ను జాగ్రత్తగా జారవిడచండి. అంతే కొన్ని క్షణాల్లో చేప నీటిపై ముందుకు కదుతులూ ఈదుతూ పోతుంది. మోటారు బోటు లాగ నీటిపై తిరుగుతూ వుంటుంది. పాత్ర ఎంత పెద్దదైతే అంత బాగా చేప తిరుగుతుంది.

dec022.jpgఇది ఎలా సాధ్యం, అసలు ఏమి జరిగింది. దీనికి కారణం 'తలతన్యత (surface tension) తలతన్యత అంటే ఏమిటో ఇదివరకే తెలుసుకున్నాం. ప్రతి ద్రవం యొక్క ఉపరితలం ఓ పెద్ద సాగదీసిన రబ్బరు పొరలాగా పనిచేస్తుంది. అదే తలతన్యత కదా. నీటికి కూడా తలతన్యత వుంది. మన కాగితపు చేప నీటిపై తేలుతూ వుంది కదా. చేప మధ్యలో జారవిడిచిన వెజిటబుల్ నూనె (లేక పాత్రలు కడిగే ద్రవం) తక్కువ తలతన్యత కలవి. ఈ తక్కువ తలతన్యత గల ద్రవం చేప రంధ్రం నుండి చీలిక ద్వారా ఎక్కువ తలతన్యత గల నీటిని చేరినప్పుడు నీరు దీనిపై ఒత్తిడి చూపుతుంది. అప్పుడు చేపముందుకు కదులుతుంది. అలా కదులుతూ వున్నప్పుడు మెల్లగా నూనె ద్రవం నీటిలో కలవడం మొదలవుతుంది. ద్రవం పూర్తిగా నీటి ఉపరితలాన్ని ఆక్రమించుకునేంత వరకు చేప కదులుతూనే వుంటుంది. అదన్నమాట అసలు విషయం తెలిసిందా?



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate