অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాంతి వద్యుదయస్కాంత తరంగాలు

కాంతి వద్యుదయస్కాంత తరంగాలు

electromag.jpgచెకుముకి నేస్తాలూ! యాంత్రిక తరంగాలు, శబ్దతరంగాల గురించి క్రితం నెల పత్రికలలో చదివారు కదా! ఈ నెల కాంతి తరంగాల గూర్చి నేర్చుకొందాం. కాంతి తరంగాలుగా ప్రయాణించే ఒక శక్తి. శబ్ద తరంగాలు ప్రయాణించటానికి పదార్థం కావాలని నేర్చుకొన్నారు కదా! అయితే కాంతి తరంగాల ప్రయాణానికి పదార్థం అవసరం లేదు. అవి అంతరిక్షం ద్వారా ప్రయాణిస్తాయి. అందువల్లే సూర్యుని నుండి కాంతి మన భూమిని చేరగలుగుతోంది.

కాంతి తరంగాలు విద్యుత్, అయస్కాంత క్షేత్రాల కంపనాలతో శక్తిని మోసుకుపోతాయి. ఈ తాము ప్రయోగించే దిశకు లంబంగా అయస్కాంత, విద్యుక్షేత్రాలను ఏర్పరుసూ పోతాయి. ఈ క్షేత్రాలు డోలన వ్యవస్ధ (harmonic system) లాగా ఏర్పడతాయి. ఒకే విధమైన తరంగస్ధాయి (phase) ఉన్న ప్రక్కప్రక్కబిందువుల మధ్య దూరాన్ని తరంగదైర్యం (wave length) అంటాము. ఒక సెకను కాలంలో ఒక నిర్దిస్ట బింధువు నుంచి ఎన్ని తరంగాలు వెళ్ళాయన్న సంఖ్యను ఆ తరంగ పౌనఃపుణ్యం (frequency) అంటారు. తరంగాల తరంగదైర్ఘ్యం, లేదా పౌనఃపున్యాల ఆధారంగా కాంతితరంగాలను జోన్లుగా వర్గీకరించారు. ఈ మొత్తం జోన్లను కలిపి విద్యుదయాస్కాంత వర్ణపటం (electro magnetic spectrum) అంటాము. ఈ వర్ణపటంలో మన కంటికి కనబడే బాగాన్ని దృగ్గోచరకాంతి (visible light) అంటారు.

దృగోచర కాంతి తరంగాల కంటె పొడవైన తరంగదైర్ఘ్యం లేక తక్కువ పౌనఃపున్యం గల మిగతా కాంతి తరంగాలు ఉంటాయి. దృగ్గోచర కాంతి కంటే ఈ తరంగాలకు తక్కువశక్తి ఉంటుంది. పరారుణ (Infrared), మైక్రో, రేడియో తరంగాలు ఈ కోవకు చెందినవి.

పరారుణ తరంగాలు ఉష్ణతరంగాలు. అధిక వేడిగా ఉన్న వసువులు ఎక్కువ పరారుణ తరంగాలను యిస్తాయి. కొన్ని కెమెరాలు పరారుణ కాంతి కిరణాలను నమోదు చేస్తాయి. ఆ కెమెరాలు అత్యధిక వేడి వున్న ప్రదేశాలను తెల్లగాను అత్యధిక చల్లగా ఉన్న ప్రదేశాలను నల్లగాను నమోదు చేస్తాయి.

వెుక్కజొన్న పేలాలను, పాప్ కార్న్లను మైక్రోతరంగాల ఓవన్లో తయారుచేసుకొంటే, మైక్రోతరంగాల శక్తి ఆ పనిని చేయటాన్ని మీరు గమనిస్తారు. మైక్రో తరంగాలు మొక్కజొన్నగింజలోపల ఉన్న తడిని వేడి చేయటం వలన, నీరు ఆవిరి అయి అధిక పీడనం వల్ల గింజ పేలి తెరుచుకొంటుంది.

నేస్తాలూ, అదోభాగమైతే, X-కిరణాలు, అతినీల లోహిత కాంతి (Ultraviolet) కిరణాలకు దృగోచర కాంతి కంటే తక్కువ తరంగదైర్ఘ్యం, ఎక్కువ పౌనఃపున్యం ఉంటాయి. ఈ కిరణాలు కంటికి కనబడవు. కాని కొన్ని కెమెరాలు వాటిని నమోదు చేస్తాయి. మానవ శరీరంలోని పలుభాగాల ప్రతిబింబాలను నమోదు చేయటానికి X-కిరణాలను వాడతారు.

నేస్తాలూ! ఎవరికైన యాక్సిడెంట్ వల్ల చెయ్యో కాలో విరిగిందంటే, ఎక్స్-కిరణాల ప్రతిబింబాల ద్వారా, ఎక్కడ, ఏ విధంగా ఎముక విరిగినది డాక్టరు ఖచ్చితంగా తెలుసుకొని, ఎముకను సరిచేసి చికిత్స చేయడానికి సహాయపడుతుంది.

అతినీలలోహిత (UV) కిరణాలు చర్మానికి, కండ్లకు హాని చేస్తాయి. ఈ ప్రమాదాన్ని సన్బర్న్ అంటారు. సన్స్క్రీన్ ద్వారా చర్మాన్ని కండ్లకు అద్దాలతో అతినీలలోహిత కిరణాలను పూర్తిగా అడ్డుకోవచ్చు.

వాతావరణంలో ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను భూమి మీదకు రాకుండా అడ్డుకుంటుంది. కాని విచాలవిడిగా ఫ్రీజ్ లు, ఎయిర్ కండిషనర్ లలో ఉపయోగించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (CFC) వాతావరణంలోకి విడుదలై ఓజోన్ పొరదెబ్బతింటుంది. కావున CFC బదులు వేరే సాంకేతిక పరికరాలు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

EMspectrum.jpgసూర్యుడి నుంచి వచ్చే శక్తిపై మనమెంత ఆధారపడ్డామో మీరెప్పడైనా ఆలోచించారా నేస్తాలూ! తినే తిండి, త్రాగేనీరు, వాడే బొగ్గు, పెట్రోలు, గ్యాసు మరెన్నో ముఖ్యమైన ప్రక్రియలు, సంఘటనలకు నిరంతర శక్తి స్థావరం ప్రత్యక్షంగానయినా.

ఎండలో నిల్చున్నట్లయితే వెచ్చదనాన్ని మీరు అనుభవిస్తారు. సూర్యుని నుంచి వచ్చిన శక్తి మీకు ఏ విధంగానైతే వెచ్చదనాన్నికలుగజేసిందో, అదే విధంగా భూమి మీద వున్న గాలి, మట్టి, నీరు కూడా వేడెక్కుతాయి. భూమి మీద వేరు వేరు ప్రదేశాలలో సూర్యశక్తి శోషించుకొనే (absorb) పరిమాణం వేరుగా ఉంటుంది. దీనివల్ల కొన్ని ప్రదేశాలు వేడిగా, కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. ఈ తేడాల వల్ల గాలి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వీస్తుంది. ఆ విధంగా పవనాల కదలికతో వాతావరణ మార్పులు ఏర్పడతాయి.

భూమి ఉపరితలంలో నీరు సూర్యశక్తితో ఆవిరి అవుతాయి. అవే మేఘాల రూపంలో వరాన్నియిస్తాయి. నీటి చక్రంలో యిది చాల ముఖ్యమైన అంచు.

సూర్యశక్తితో భూమిపై అన్ని ఆహార పదార్గాలు తయారవుతాయి. మొక్కలు, సూర్యరశ్మిని శోషించుకొని, కార్బన్ డై ఆక్సైడ్, క్లోరోఫిల్ సహాయంతో ఆహారాన్ని తయారుచేసుకొంటాయి. జంతువులకు శక్తి మొక్కల ద్వారా లభిస్తుంది. ప్రజలు మొక్కల ద్వారా, జంతువుల ద్వారా ఆహారం పొందుతాయి. బిర్యాని ద్వారా, పాయసం ద్వారా, బర్గర్ ద్వారా వచ్చే శక్తి అంతటికి మూలం సూర్యుడు కదా! నేస్తాలూ! అలా లభించే శక్తి మనమంతా సమంగా పంచుకోవాలి కదూ! -

రచయిత: ప్రొ. యం. అదినారాయణ, సెల్: 9849781144

చివరిసారిగా మార్పు చేయబడిన : 9/8/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate