অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాగితంలో సీతాకోక చిలుక

కాగితంలో సీతాకోక చిలుక

1.చతురస్రాకారంలో వున్న ఒక కాగితాన్ని తీసుకోండి.one

 

 

2.దానిని సరిగ్గా మధ్యలో మడవండి.two

 

 

3. తిరిగి ఆ మడతను విప్పేయండి.three

 

 

4. ఇప్పుడు ఒక కొసను (శీర్షభాగం) మడతబెట్టి ఎదుట శీర్షానికి దగ్గరగా వుండే “x” అనే గుర్తు దాకా తీసుకొనిపొండి. (ఈ x అనే బిందువు ఎదుటి శీర్షానికి కాస్త దూరంలో వుంటే చాలు).four

 

 

5. శీర్షం నుండి కర్ణం మీదుగా సుమారు 2 సెంటీమీటర్ల దూరంలో “o” అనే బిందువు గుర్తుగా పెట్టుకోండి.five

 

 

6. ఇప్పుడు OA OB ల మీదుగా కాగితాన్ని మడవండి.six

 

 

7. ఇలా మడత పెట్టాక వీటిని తిరిగి విప్పేయండి. OX ప్రాతంలో రెండు చిన్న చిన్న త్రిభుజాల ముద్రలు కన్పిస్తాయి.seven

 

 

8. త్రిభుజాకారంలో వున్న ఈ రెండు బాగాలనూ బయటకు లాగి, పొడుచుకొచ్చిన ముక్కులాంటి ఒక భాగాన్ని రూపొందించండి.eight

 

 

9. ఇప్పుడు శీర్షం మీదుగా (చుక్కల గుర్తుల లైను) సాగే రేఖపై ఈ మొత్తం ఆకృతిని వెనుక వైపుకి మడవండి.nine

 

 

10. అప్పుడు మీకు ఇలాంటి ఆకారం కనిపిస్తుంది.ten

 

 

11. ఇప్పుడు వెడల్లుగా వున్న అంచులపై సీతాకోకచిలుక రెక్కల గుర్తులను, పెట్టుకొని, ఆ మేరకు కాగితాన్ని కత్తిరించండి. ఇక మూసి వున్న కొసను యాంటోన్నాల వంటి ఆకారాలకై గుర్తులను పెట్టుకొని ఆ భాగంలోని కాగితాన్ని తగిన విధంగా కత్తిరించండి. ఇంకేముంది. సీతాకోత చిలుక తయార్.twelve

 

 

12. ఇప్పుడు మీ ఎడమ చేతిలో ఈ కాగితం చిలుక క్రింది భాగాన్ని (పొడుచుకు వచ్చినట్లుండే భాగాన్ని) పట్టుకొని, కుడిచేత్తో బాణంలా కన్పించే భాగాన్ని పట్టుకొని ముందుకీ వెనక్కీ కదిపితే చాలు....twelve

మీ సీతాకోక చిలుక ఎంతో సంతోషంగా రెక్కలాడిస్తుంది.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate