অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాగితాలతో రకరకాల ఆకారాలు

చిరిగిన కాగితం ముక్కతో చతురస్రం

అడ్డదిడ్డంగా చిరిగి వున్న ఓ కాగితం ముక్కతో ఒక చక్కటి చతురస్రాన్ని ఓ కాగితం ముక్కతో ఒక చక్కటి చతురస్రాన్ని చేసే పద్ధతి ఎలా వుంటుందో ఒకసారి గమనించడం.

kone1. ఇలాంటి చిత్తు కాగితంలో ఏదో ఒక వైపున కాగితాన్ని కొద్దిగా మడత పెట్టండి. (పటంలోని చుక్కలు గీతలను గమనించండి)

 

ktwo2. అలా మడతపెట్టాక మీ కాగితంలో సూటిగా వుండే ఒక అంచు ఏర్పడుతుంది. ఇప్పుడీ ఆకారంలో కొద్ది భాగాన్ని తిరిగి ఇంతకు ముందు మడతపెట్టిన బాగంపైకే మడత పెట్టండి. పటంలో నిలువుగా కన్పించే చుక్కల గీతలను గమనించండి.

 

kthree3. ఇప్పుడు మీ కాగితంలో మొదటి భుజానికి లంబంగా వుండే మరొక భుజం రూపొందింది. ఇప్పుడు రెండు అంచులూ (భుజాలూ) ఒకదాన్ని ఒకటి తాకేలా కాగితాన్ని మళ్ళీ మడవండి.

 

kfour4. అప్పడు మీకు ఈ రకమైన ఆకారం కన్పిస్తుంది. ఇప్పుడు కర్ణంగా వున్న అంచును (పటంలోని చుక్కల గీతల వెంబడి) వెనుక వైపుకి మడత పెట్టండి.

 

kfive5. అప్పుడు మీ కాగితంలో మొదటి భుజానికి లంబంగా వుండే మరొక భుజం రూపొందింది. ఇప్పుడు రెండు అంచులూ (భుజాలూ) ఒకదాన్ని ఒకటి తాకేలా కాగితాన్ని మళ్ళీ మడవండి.

 

ksix6. అప్పుడది ఈ విధంగా కన్పిస్తుంది. ఇప్పుడిక చుక్కల గీత వెంబడి దీనిని కత్తిరించండి. పటంలో నల్లగా కన్పిస్తున్న భాగాన్ని పూర్తిగా తొలగించండి.

 

kseven7. కత్తిరించడం పూర్తయ్యాక మిగిలిన భాగాన్ని తెరచి చూస్తే... ఇదిగో ఇలా మీకు కావలసిన చతురస్రం తయారై వుంటుంది. ఇందులో అన్ని భూజాలు సమానంగా వుంటాయి సుమా. ఒక వేళ అలా లేనట్లయితే మీరు ఎక్కడో ఏదో పొరపాటు చేసినట్లే లెక్క అలాంటిదేమైనా జరిగితే మళ్ళీ కొత్తగా మీ ప్రయత్నం మొదలు పెట్టింది. సరేనా.

దీర్ఘ చతురస్రం నుండి చతురస్రం

కాగితంతో పడవల్ని, ఇంకా అనేక ఆకారాలని తయారు చేసుకొనేందుకై మీరు ఎన్నోసార్లు దీర్ఘ చతురస్రాకారంలో వుండే కాగితాన్ని ఇలా చతురస్రంలోకి మార్చుకొని వుంటారు. అవునా అలా మార్చుకోవడంలో మీరు అనుసరించే పద్ధతి సరైనదో కాదో ఒకసారి సరిచూసుకోండి.

dcone1. దీర్ఘ చతురస్రంలో ఏదో ఒక వైపున వెడల్పుగా వుండే అంచు పొడవుగా వుండే అంచును తాకేలా మడవండి. అప్పుడు రెండో కొనన ఓ నిట్ట నిలువు దీర్ఘ చతురస్రాకారంలో కొంత భాగం మీకు కల్పిస్తుంది.

 

dctwo2. ఇలా మడతలకు వెలుపల అదనంగా వున్న కాగితపు భాగాన్ని (పటంలో నల్లగా కన్పిస్తోంది) కత్తిరించి వేయండి. లేదా ఆ మేరకు మడతపెట్టి ఆ ముక్కను చింపేయండి.

 

kseven3. ఇప్పుడు త్రికోణాకృతిలో మిగిలిన భాగాన్ని తెరిచి చూడండి. ఇంకే ముంది. మీక్కావలసిన చతురస్రం రెడీ.

సమబాహు త్రిభుజాన్ని తయారు చేయడం

ఒక చతురస్రాకారపు కాగితంలో సమబాహు త్రిభుజాన్ని ఈక్రింది పద్ధతిలో తయారు చేయవచ్చు.

stone1. చతురస్రాకారంలో పై అంచు, కింది అంచుని తాకేలా కాగితాన్ని మడత పెట్టండి. అప్పుడది తరువాతి చిత్రంలో చూపినట్లుగా ఒక దీర్ఘ చతురస్రంలా మారుతుంది.

 

sttwo2. ఈ ఆకృతిలో కుడివైపున కింది భాగంలో వున్న శీర్షం పై భాగంలోని భుజాన్ని తాకేలా కాగితాన్ని మళ్లీ మడతపెట్టండి. ఇలా చేయటంలో ఈ మడత అనేది ఎడమవైపున కింది భాగపు మూల నుంచి మొదలయ్యేలా చూసుకోండి.

 

stthree3. పటంలో కన్పించే చుక్కల గీత వెంబడి కాగితాన్ని కత్తిరించి, నల్లగా వున్న భాగాన్ని తొలగించండి.

 

stfour4. ఇప్పుడు మిగిలిన భాగాన్ని తెరిచినట్లయితే... మూడు భుజాలు, మూడు కోణాలూ సమానంగా వుండే ఒక సమబాహు త్రిభుజాకృతిలోని కాగితం మీ కళ్ళ ముందుంటుంది.

కాగితం గొలుసు

kagitamgolusuపొడవాటి దీర్ఘచతురస్రంలో వున్న కాగితాన్ని, తీసుకుని, దాని రెండు పొడవాటి అంచులూ కలుసుకునేలా ఆ కాగితాన్ని మధ్యలో మడతపెట్టండి. ఇలా ఏర్పడే ఆకారం కూడా వెడల్పు తక్కువగా వుండే మరో దీర్ఘచతురస్రంలాగానే వుంటుందని గమనించండి.

ఇప్పుడీ దీర్ఘచతురస్రంలో కాగితంలో కింది భాగాన, పై భాగాన, వరుసగా కత్తిరిస్తూ పోవాలి. కిందికొకసారి పైన ఒకసారి, మళ్ళీ కింద ఒకసారి పైన ఒకసారి ఇలా అన్నమాట. అయితే ఇలా కత్తిరించేటప్పుడు పూర్తిగా గాక, అంచునుంచి మొదలు పెట్టాక సగం కన్నా కొంచెం ఎక్కువ దూరం దాకా కత్తిరించి ఆపేయాలి. మొత్తం కత్తిరించండం అయ్యాక ఆకృతిని తెరిచిచూస్తే.. ఇదిగో ఇలా ఓ చక్కటి కాగితపు గొలుసు మీకు దర్శనమిస్తుంది.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate