పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సీసాలో గుడ్డు

గాలి వత్తిడి ఎంత బలంగా వుంటుందో చూద్దాం.

మీ స్నేహితులు ముందు గాలి వత్తిడి ఎంత బలంగా వుంటుందో తెలియజేయాలనుకుంటున్నారా?

అయితే దీనికి ఒక సులభమైన పధ్ధతి వుంది. చేసి చుడండి.

eggబాగా ఉడకబెట్టిన గుడ్డును, శుభ్రపరచిన పాలసిసాను తీసుకోండి. గుడ్డు పై పెంకును ఒలిచి సీసామూతి పై గుడ్డును వుంచండి. గుడ్డుపై పెంకును ఒలిచి సీసామూతి పై గుడ్డును వుంచండి. గుడ్డును సిసాలోకి నెట్టమని మీ మిత్రులను అడగండి. మొదట్లో అది చాలా సులభంగా అని వాళ్ళు అనుకుంటారు. కాని ఎన్ని సార్లు ప్రయత్నించినా అలా చెయ్యలేరు. సీసాలోని గాలి బయటకు రాలేదు. కనుక గుడ్డు లోపలికి పోలేదు.

సీసాలోని గాలి ఒత్తిడి గుడ్డును లోనికి పోనివ్వడు. అప్పుడు మీరు ఆ పని ఎలా చెయ్యగలరో వాళ్ళకు చూపండి. ఒక అగ్గిపుల్లను గిసి సీసాలో పడవేసి దాని మూతి పై గుడ్డును ఉంచండి. మంట సీసాలోని ప్రాణవాయువును హరిస్తుంది. అప్పుడు బయట వుండే ఒత్తిడి గుడ్డును సిసాలోకి నెడుతుంది.

గుడ్డును మళ్ళి బయటకి ఎలా తీస్తారు? మీ మిత్రులు ఎన్నిసార్లు ప్రయత్నించినా వారికది సాధ్యం కాదు. మీరు సీసాను తిరగ వేసి మూతి వద్దకు గుడ్డు జారెలా చెయ్యండి. తదుపరి సీసాను తలక్రిందులు చేసి సిసాలోకి మీరు ఎంత గట్టిగా ఊదగలిగితే అంత గట్టిగా ఊదండి. మీనోటికి వెనుక్క తీసినప్పుడు గుడ్డు ఎంత తటాలున బైటకు వస్తుందంటే దాని వేరొక చేతిలోకి తీసుకునేందుకు మీరు సిద్ధంగా వుండాలి. సీసాలో గాలి ఒత్తిడి బయటవుండే గాలి ఒత్తిడి కన్నా ఎక్కువ అయినందువల్ల ఇలా జరుగుతుంది.

ఆధారం: టి.వి.ఎం.ఎస్. ప్రకాశ్ రావు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు