অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చీమలు – ఆమ్లాలు

handబలవంతుడ నాకేమని

పలువురితో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!

ఈ పద్యం మీలో చాలా వుంది చదివేవుంటారు. కంఠస్థం చేసి వుంటారు. ఈ మధ్య ప్రభుత్వం నెలకో పద్యం నేర్చుకోవాలని చెప్పిందట కదా. ఈ పద్యానికి అర్థం మీకు తెలుసుకదా. ఎప్పడు కూడా నేనే గొప్ప నాకే బలం వుంది. నన్నెవరూ ఏమి చేయలేరు అని విర్రవీగ కూడదు. అది గర్వపడడం అవుతుంది. పెద్ద పాము ఎంతో బలముకలదైనా చీమలన్నీ చుట్టుముట్టితే వాటి చేతిలో చిక్కి చనిపోతుంది కదా. అని భావం కాబట్టి “మౌనంగానే ఎదగమనీ అర్థం అందులో వుంది" అదన్నమాట. సరే, ఈ చీమలతో ఓ చిన్న ప్రయోగం చేద్దాం రండి, చేసి చూద్దాం.

ఈ ప్రయోగం చేయడానికి మనం అడవిలోనికి వెళదాం. ఆగండి! దీనికోసమే అడవికి వెళ్ళకండి. ఎపుడైనా పెద్దవారితో కలసి అడవికి వెళ్ళినపుడు చేయండి. జాగ్రత్త సుమా! ఏ పుట్టలో ఏ పామవుందో, పెద్దల సహాయంతో మాత్రమే ఈ ప్రయోగం చేయాలి సరేనా!

కావలసిన వస్తువులు:

చీమల పట్ట (పెద్ద నల్లచీమలు లోదా ఎర్రచీమలు) శంకపూలు (Blue Bell)

చేయు విధానము:

పెద్ద చీమల పుట్టను వెదికి చూసుకోండి. పుట్టపై చీమలు ప్రాకుతూ వుండాలి. చీమలు హడావుడిగా పుట్టలోపలికీ, పుట్ట బయటకూ పాకుతూ ఒక క్రమ పద్దతిలో తిరుగుతూ వుంటాయి కదా. ఇపుడు మీరు జాగ్రత్తగా శంకుపూల కొమ్మను పుట్టపై, పుట్టను తాకుతూ పట్లుకోండి. జాగ్రత్త సుమా! చీమలు పూలకొయ్య పైకి ప్రాకి చేతిపైకి రాకుండా చూసుకోవాలి. చీమలు ఎక్కువైతే పూల కొమ్మను విదిలించండి. ఇలా కాసేపు కొమ్మను పుట్టపై వుంచి తీసివేసి గమనించండి.

నీలం రంగుపూల మీద అక్కడక్కడ ఎరుపురంగు చుక్కలు మరకలు మరకలుగా ఏర్పడి వుంటాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయి? అసలేం జరిగింది?

వివరణ:

మీరు శంకుపూలను పుట్టపై వుంచగానే చీమలు పూలను గమనించి శత్రువుల దాడి అని భ్రమిస్తాయి. ఆత్మ రక్షణ కోసం ఒకరకమైన వాసనగల ద్రవాన్ని పూలపైకి చిమ్ముతాయి. ఈ ద్రవం క్షయకారిణి. చీమలు తమరక్షణ కోసం ఈ ద్రవాన్ని తమ శరీరం ముందు భాగంలో తయారు చేస్తాయి. ఈ ద్రవాన్ని లాటిన్ భాషలో ఫార్మిక్ e933) (Formic acid) e9o&Jeó). నీలం రంగు పూవుపై ఆమ్లం చుక్కలు పడినచోట ఎర్రటి చుక్కలు ఏర్పడుతాయి. అదన్నమాట!

ఈ ఫార్మిక్ ఆమము సాంకేతిక ఫార్ములా HCOOH / HCO2H. ఈ ఆమ్లాన్ని మృత జీవపదార్ధాలను చాలా కాలం నిల్వవుంచటానికి వాడుతారు. కానీ కొంత మంది ఆహార పదార్థాలు నిల్వ వుంచడానికి కూడా ఈ ద్రవాన్ని వాడుతున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. సరేనా? చీమలు మనల్ని కొరికినపుడు వునకు హాని కలుగకపోయినా ఈ ఆమ్ల లక్షణం వల్ల దురద ఏర్పడి దద్దుర్లు వస్తాయి కదా. మీరు గమనించేవుంటారు!

రచయిత: -యం.యస్. యుగంధర్ బాబు, సెల్: 9394782540



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate