অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చొక్కావిప్పి బాటిల్ లో దూకే అరటిపండు

చొక్కావిప్పి బాటిల్ లో దూకే అరటిపండు

11 మంది ఆడుతుంటే 11 వేల మంది ఫూల్స్ చూస్తుంటారు అని ఓ ఆట గురించి తమాషా సామెత వుంది. ఏ ఆటో... తెలుసా? ... క్రికెట్. సోమరిపోతుల ఆట అని కూడా కొంతమంది అంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ధర్మమా అని ఆటగాళ్ళు అంగడి సరుకై, ఆట ఓ వ్యాపారమూ బెట్టింగ్, ఫిక్సింగ్ ల మయమై క్రీడాస్ఫూర్తి మరుగున పడి పోతోంది. సరే. అది వేరే సంగతి! కాస్త పక్కన పెడదాం. గతంలో ఓ సార్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కెప్టెన్ గా వున్నప్పుడు మన దేశం గెలిచిన సందర్భంలో చొక్కా తీసి గిరాటు వేసి గ్రౌండ్ లో చక్కర్లు కొట్టాడు. గుర్తుందా. అట్లాగే ఓ అరటిపండు చొక్కా తీసి (పై తోలు తీసుకొని) ఎంచక్కా చక్కర్లు కొట్టకపోయినా బాటిల్ లోనికి దూకుతుంది. ఇది సాధ్యమా?.. ఓ సాధ్యమే.. ఎలాగంటారా? రండి చేసి చూద్దాం.

కావలసిన వస్తువులు

  • గాజు బాటిల్
  • మాగిన అరటిపండు
  • కర్పూరం
  • అగ్గిపెట్టె.

చేయు విధానం

june012.jpgఓ అరటిపండు తీసుకోండి. ఓ పొడవాటి గాజు బాటిల్ తీసుకోండి. ఈ బాటిల్ కంఠం (మూతి) ఎలా వుండాలంటే అరటిపండు తోలు తీసేసిన తరువాత వండు సరిగ్గా బాటిల్ మూతిలో ఇమిడి పోయేటట్లు వుండాలన్నమాట. ఇపుడు అరటిపండు తోలు (3 పలుకలుగా వుంటుంది కదా) కాస్త తీసి వుంచుకోండి. కర్పూరంను బాటిల్ లోపల వేయండి. అగ్గి పుల్లతో బాటిల్ లోపల కర్పూరం అంటుకోవాలన్న మాట. (పెద్దల సహకారంతో వీలైతే కర్పూరం అంటించి బాటిల్ లోపల వేయవచ్చు) కర్పూరం అంటుకోగానే వెంటనే అరటిపండును బాటిల్ కంఠం వద్ద నిలువుగా వుంచి తొలు వలిచిన భాగాన్ని బాటిల్ అంచు వద్ద కాస్త లోపలికి నొక్కండి. (పటంలో చూపిన విధంగా) అంతే వెంటనే అరటిపండు తన తోలు తానే వలుచుకుంటూ పండు మాత్రం బాటిల్ లోకి జారుతూ పూర్తిగా బాటిల్ లోనికి పడిపోతుంది. చూసారా. అరటిపండు తన చొక్కా తీసి బాటిల్ లోనికి దూకేసింది. అంతే. ఇంతకీ ఇది ఎలా జరిగింది? తెలుసుకుందామా.

బాటిల్ లోని కర్పూరం వెలిగించగానే అది మండటానికి ఆక్సిజన్ కావాలి. బాటిల్ లోని గాలిలో ఆక్సీజన్ వుంటుంది కదా. దానిని ఉపయోగించుకొని కర్పూరం మండుతుంది. దీనివల్ల బాటిల్ లోపల గాలి తగ్గి పీడనం తగ్గుతుంది. బాటిల్ వెలుపల వున్న గాలిలో పీడనం ఎక్కువ వలన గాలి బాటిల్ లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది. దాంతో బాటిల్ మూత వద్ద గల అరటిపండుపై వత్తిడి పెరుగుతుంది. ఇదివరకే కాస్త వలిచి వున్న అరటిపండులోని పండు మాత్రం బాటిల్లోనికి జారుతుంది. తోలు పక్కలకు విచ్చుకుంటుంది. ఇలా అరటిపండు తోలు పూర్తిగా తొలగి పండు మాత్రం బాటిల్ లోనికి పడుతుంది. అదన్న మాట... ఒకే..

ఆధారం: యుగంధర్ బాబు.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate