పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జపాను టోపీ

కాగితంతో జపాను టోపీ తయారు

joneకాగితంతో రకరకాల వస్తువును తయారు చేయడంతోపాటు ఒక మామూలు టోపీని ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా మనం గతంలో తెలుసుకున్నాం. ఇక ఈసారి కాగితంతో జపాను టోపీని ఎలా చేయవచ్చో తెలుసుకుందాం. ఇందుకై మీకు నచ్చిన రంగులో వుండే ఒక పెద్ద చతురస్రాకారపు కాగితాన్ని తీసుకోండి. చాలు. ఇంకేమీ అవసరం లేదు. అయితే రంగు కాగితంతో చేయడానికి ముందుగా ఓ పాత న్యూస్ పేపర్ తో ఒకసారి ప్రయత్నించి చూసుకోండి.

 

 

jtwo1. పటంలో చూపిన చుక్కల గీతల వెంబడి మీ కాగితాన్నిమొత్తం 4 వేరు వేరు పద్ధతుల్లో మడిచి తిరిగి తెరవండి ఆ తరువాత ఏదైనా ఒక శీర్ష భాగాన్ని పట్టుకుని అది రేఖల కేంద్ర బిందువుని కలిపేలా మడత పెట్టండి.

 

 

jthree2.అప్పడది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్న శీర్ష భాగాన్ని పట్టుకొని దాన్ని అడ్డంగా కన్పిస్తున్న చుక్కల గీతల వెంబడి కింది వైపుకి మడవండి.

 

 

jfour3. ఇలా ఒక త్రికోణాకృతిలో కన్పిస్తున్న కాగితపు కుడి ఎడమల శీర్షాలు కింది శీర్షాన్ని తాకేలా, ఆ రెండు వైపుల భాగాలను క్రిందికి మడవాల్సి వుంటుంది. ముందుగా కుడివైపున ఉన్న భాగాన్ని మడత పెట్టండి.

 

 

jfive4. ఆ తరువాత ఎడమ వైపున ఉన్న భాగాన్ని మడత పెట్టండి. మీ కాగితం ఇప్పుడు మళ్ళీ ఒక చతురస్రాకారంలో కనిపిస్తుంది.

 

 

jsix5. ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా ఆకృతిలో ఉన్న పై పొరలోని రెండు భాగాలను పైవైపుకి మడత పెట్టండి. ఈ పొరలను పై వైపుకి సరిగ్గా సగానికి మడత పెట్టాల్సి వుంటుంది.

 

 

jseven6. అలా మడత పెట్టాక మీకు ఈ రకమైన ఆకారంలో కనిపిస్తుంది.

 

 

jeight7. ఈ ఆకారంలో పై భాగాన ఉన్న రెండు త్రికోణాకృతులనూ మరోసారి మడత పెట్టి పైకి లాగండి. అలా చేయడం వలన ఓ రెండు కొమ్ముల్లాంటి నిర్మాణాలు తయారవుతాయి.

 

 

jnine8. ముందుగా కుడివైపు భాగాన్ని మడత పెట్టి పైకి లాగి, ఆ తరువాత ఎడమవైపు కూడా అదే పని చేయండి. ఆ తరువాత ఈ మొత్తం ఆకృతిని వెనుక వైపుకి తిప్పుండి.

 

 

jten9. అప్పుడు మీకు ఇలాంటి ఆకారం కన్పిస్తుంది. ఇప్పుడిక క్రింది వైపున ఉన్న శీర్ష భాగాన్ని పట్టుకొని అది కాగితం మధ్యలోని రేఖను తాకేలా మడత పెట్టండి.

 

 

jeleven10. ఆ ఆకారాన్ని మళ్ళీ తిరగేస్తే అప్పడది ఇలా కన్పిస్తుంది. ఇప్పుడు ఈ ఆకృతిలోని క్రింది భాగాన్ని పట్టుకొని, ఆ అంచు మధ్యలో ఉన్న రేఖను తాకేలా దానిని మడవండి.

 

 

jthirteen11. ఇంతకు ముందు మీరు (వెనుక వైపున) మడత పెట్టిన త్రికోణం ఈ వైపుకి వచ్చి, మొత్తం ఆకృతి ఈ విధంగా కనిపిస్తుంది.

 

 

jfourteen12. ఇప్పుడు పటంలో కనిపిస్తున్న కింది అంచు మరోసారి మధ్యభాగంలోని రేఖను తాకేలా (త్రికోణభాగంతో సహా) దానిని పైకి మడవండి. అంతే, దాంతో మీ జపాను టోపీ తయారైపోతుంది.

 

 

jfifteen13. టోపీని మొత్తం మడతలను మరోసారి చేతివేళ్ళతో గట్టిగా ఒత్తండి. దాంతో మీ నెత్తిన పెట్టుకోవడానికి అది సంసిద్ధంగా మారుతుంది. ఈ టోపీ అంచుల్ని మీరు రకరకాలుగా మడతపెట్టి మరికొన్ని కొత్త హంగులు వచ్చేలా కూడా చేసుకోవచ్చు.

 

 

jsixteenజపాను టోపీ తయారు చేశారుగా ఇప్పుడిక దాన్ని మీ నెత్తి మీద పెట్టుకొని ఒకసారి అద్దంలో చూసుకోండి. మీకు మీరే ఎంతో ముద్దొస్తారు.

2.99509803922
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు