অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీటిని చల్లి మంటలను ఎక్కువ చేయడం

నీటిని చల్లి మంటలను ఎక్కువ చేయడం

oct13ఉద్దేశ్యం: కాల్షియం కార్బైడ్ కు నీటిని కలిపి, ఎసిటలీన్ వాయువును తయారుచేసి తద్వారా మంటలను ఎక్కువ చేయడం.

కావలసిన పరికరాలు: చిన్న ప్లాస్టిక్ లేదా స్టీలు పళ్ళెము, పేపరు ముక్కలు, అగ్గిపెట్టె.

కావలసిన రసాయనాలు: ఇసుక, కాల్షియం కార్బైడ్ (CaC2)

ప్రయోగ విధానం:

  • ప్లేటులో ఇసుకను తీసుకొని, పైభాగంలో కొంచెం కాల్షియం కార్బైడ్ ను చల్లి (CaC2) దానిపై పేపరు ముక్కలను వేసి అగ్గిపుల్లతో మండించాలి.
  • తర్వాత కొంచెం కొంచెం నీటిని చల్లుతూ వుంటే మంటలు ఎక్కువవుతుంటాయి.

పరిశీలనలు:

  • కాల్షియం కార్బైడ్ నీటిలో చర్య జరిపి ఎసిటలిన్ వాయువును విడుదల చేయును.
  • CaC2+2H2O→C2H2+Ca(OH)2

  • ఎసిటలీన్ వాయువు ఇంధనం కాబట్టి మంటలను ఏర్పరుచును. ఇది గాలిలోని ఆక్సీజన్ తో చర్యనొంది కార్బన్ డై ఆక్సైడ్, నీరును ఏర్పరుస్తుంది.
  • నీటిని చల్లుతూవుంటే ఎసిటలీన్ వాయువు మరింత ఉధ్భవించి మంటలను ఎక్కువ చేస్తుంది.

మీకు తెలుసా?

  • నీటిలో మంటలు ఆర్పడం సైన్స్ చెబుతుంది. అదే సైన్స్ నీటిని చల్లడం ద్వారా మంటలను ఎక్కువ చేయవచ్చు. కాని ఈ రహస్యం తెలియని వారికి ఇది ఏదో మాయో, మంత్రమో అని భావించి మంత్రగాళ్ళ చేతిలో చిక్కి మోసపోతారు.

ఉపయోగాలు:

  • ఎసిటలీన్ వాయువును లోహాలను అతకడానికి ఉపయోగిస్తారు.
  • పరిశ్రమలలో ఎసిటలీన్ వాయువును ఉపయోగించి అనేక కర్బన పదార్థాలు తయారుచేస్తారు.

ఆధారం: కె. లక్ష్మారెడ్డి



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate