অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నేల నీటిని నిలుపుకునే సామర్ధ్యం లెక్కించుట

నేల నీటిని నిలుపుకునే సామర్ధ్యం లెక్కించుట

feb30.jpgమా పేర్లు మౌనిక, లక్ష్మిదేవి, జాహ్నవి. మేము 7వ తరగతి చదువుతున్నాము. మా పేర్లు విద్యచరణ్ ,శ్రీకాంత్ మేము 6వ తరగతి చదువుతున్నాము. మేమంతా నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, భట్టువారి పాళెం ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్ధులము.

feb31.jpgమా సైన్స్ టిచర్ సహాయంతో ఈ చిన్న పరిశోధనను చేపట్టాం. మా స్కూల్ లో నేలకు త్వరగా నీరు ఇంకిపోయే స్వభావం ఉంది. అందుకని అసలు ఎర్రనేలలు ఎంత నీటిని పీల్చుకుని నిలుపుకుంటాయి/ మన నేల ఎంత నీటిని పీల్చుకుంటుంది. ఒకవేళ నీటిని ఎక్కువగా నిలుపుకునేందుకు మనమేం చెయ్యొచ్చు? అనే దిశలో ఆలోచించాం!

feb32.jpgముందుగా 100 గ్రా మట్టిని (మెత్తటి జల్లించిన పోదిమట్టి) సున్నితపు త్రాసుతో బరువు లెక్కించి ఒక ప్లాస్టిక్ గ్లాసులో వేసి దానికి 130 మి.లీ నీటిని కలపడం జరిగింది. రెండు గంటలు అలానే ఉంచి పై నీటిని జాగ్రత్తగా వంచి పారబోశాము. ఇప్పుడు గ్లాసు అడుగున గుండుసూదితో 8 రంధ్రాలు చేసాము. తర్వాత రోజు ఉదయాన్నే చూసేసరికి మట్టి నీటిని పీల్చుకోగా, మిగిలిన నీరు అంతా ఆ రంధ్రాల ద్వారా కారిపోయింది. ఇప్పుడు మరలా బరువు లెక్కించాం. 129గ్రా 250 మి.గ్రా వచ్చింది.

మట్టి+గ్లాసు బరువు

=100 గ్రా+ 1గ్రా 100మి.గ్రా

=101 గ్రా 100 మి.గ్రా

ఇది వాస్తవంగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 100 గ్రా. ఎర్రమట్టి నిలుపుకునే నీటి బరువు (41గ్రా. 500 మి.గ్రా.) కంటే చాలా తక్కువగా ఉంది.

అందుకని మా పాఠశాల పరిసరాల్లో దొరికే రకరకాల పదార్ధాలను అంటే ఎండిన ఆకుల పొడి, ఎండిన పేడ, కొబ్బరి పీచు, బొగ్గుపొడి, వరిపొట్టు వంటి వాటిని క్రింద చూపిన నిష్పత్తిలో మట్టికి కలిపి, మరలా నీటితో నింపి పై విధంగా ప్రయోగం చేసి నీటిని నిలుపుకునే సామర్ధ్యన్ని లెక్కించి చూశాము.

నెం

తొలిబరువు

తుదిబరువు

నికరనీటి బరువు

101.100గ్రా.

129.250 గ్రా.

28.150 గ్రా.

బి

101.100గ్రా.

148.550 గ్రా.

47.450 గ్రా.

సి

101.100గ్రా.

136.300 గ్రా.

35.200 గ్రా.

డి

101.100గ్రా.

135.250 గ్రా.

34.150 గ్రా.

101.100గ్రా.

189.750 గ్రా.

83.650 గ్రా.

ఎప్

101.100గ్రా.

149.100 గ్రా.

48.000 గ్రా.

పై పట్టిక ఆధారంగా కొబ్బరి పీచు మట్టికి కలపడంfeb37.jpg ద్వారా నీటిని పట్టి ఉంచుకునే సామర్ధ్యం పెరుగుతుందని తెలుసుకున్నాం. అలాగే పేడ, ఆకుల పొడి నీటినిల్వ సామర్ధ్యం పెరుగుతుందని తెలుసుకున్నాం.

రోజులు జరిగేకొద్దీ కొబ్బరిపీచు కుళ్ళి పోయి కంపోస్టు feb36.jpgఎరువుగా కూడా మారిపోతుంది. కదా! ఈ విధంగా కూడా లాభమే!

ఇప్పుడు మా స్కూల్లో ఫెన్సింగ్ మొక్కలు నాటాము. వాటి చుట్టూ కొబ్బరి పీచు వేయడం ద్వారా ఎప్పుడూ నేలను తfeb35.jpgడిగా ఉంచుతూ త్వరగా మొక్కలు పెరిగేలా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిట్టి పరిశోధనను జాతీయ సైన్స్ కాంగ్రెస్ 2010 మా జిల్లా స్ధాయి పోటిలలో సమర్పించాం.

feb33.jpgఇప్పటి వరకు పూలు అందానికీ కాయలు ఆహారానికి కలప వివిధ రకాల ఉపయోగానికి పనికివచ్చే చెట్లు గురించి తెలుసుకున్నాం. కాని ఈ నేలలో తియ్యని తేనెలాగా మధురంగా ఉండి తినటానికి పనికివచ్చే పూలనందించే చెట్టు గురించి తెలుసుకుందాం! పంచదార లేని చోట ఇప్ప పూలే పంచదార దీని పూలు రుచిగా ఉంటాయి కనుక సంస్కృతంలో మధుక , మధుధ్రుమ , మధుపుష్చ , మధుసఖ , మధుస్రవ , గుడపుష్చ అని అనేక పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో మధువు అంటే తేనే. గుడ అంటే తీపి అని అర్ధం.

దీని శాస్త్రీయనామం మధుకా లతిఫోలియా ఇంగ్లీషులో హనీ ట్రీ లేక ఇండియన్ బట్టర్ ట్రీ అంటారు, ఫ్రెంచి భాషలో ఐలిప్feb34.jpg అని బెంగాలీ మరాఠి లో మహువా అని గుజరాతిలో మహుడ అని తమిళంలో ఐలిపి అని కన్నడంలో హిప్పి అని సింహళం లో మి అని అంటారు. సంస్కృతంలో పేరును తర్జుమా చేసి శాస్త్రీయంగా ఉంచేశారు. దీనిని ముందు శాస్త్రీయంగా బసియా అనేవారు. ఈ చెట్టు గురించి వాల్మీకి రామాయణంలో కూడా వర్ణించబడింది. అలాగే ఆయుర్వేదంలోనూ.

ఈ చెట్టు భారతదేశ అడవులలో సహజంగా పెరుగుతుంది. ఉష్ణమండల ఆకురాలే అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ కనుమలు, హిమాలయ అడవులలో పెరుగుతుంది. మన రాష్ట్రంలో తూర్పుకనుమలు, ఉత్తరాంధ్ర, అదిలాబాద్ అటవీ ప్రాంతాలలో చూడవచ్చు. ఇది భారతదేశ వనసంపదలో చాలా ముఖ్యమైనది. విలువైన కలప, దీని నుండి లభించిన కూడా ఎవరూ ఈ చెట్టును కలప కోసం కొట్టివేయారు. అతి మధురమైన పోషక పదార్ధాలు గల పూలే ఇందుకు కారణం. అందుకని పశువులకు, మృగాలకు, పక్షులకు, మనుషులకు ఈ పూలు చాలా అందంగా కూడా ఉంటాయి. కొండజాతి ప్రజలు దీని నుండి తయారు చేసే నాటుసారాకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ చెట్టు సపోటేసియా కుటుంబానికి చెందినది.

feb40.jpgమాసంలో ఆకులు రాల్చి వెనువెంటనే పూలు పూసే ఈ చెట్టు 70 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. మధ్యస్ధంగా గుండ్రని కైవరంతో దట్టమైన కొమ్మలతో, పొట్టి కాండం మొదలుతో ముదురు రంగుతో ముడతలు కలిగిన బెరడుతో అందంగా కనబడుతుంది,. దీని పచ్చటి ఆకులు పడి-ఇరవై సెం.మీ పొడవు కలిగిన కొమ్మల చివర గుంపులుగా ఉంటాయి. సరళ పత్రాలు మందంగా, తోలువలె, కోలగా 2.5-3.5 సెం.మీ పొడవు ఉంటాయి. మధ్య ఈనె చాలా ప్రస్పుటంగా ఉంటుంది. చిగురుటాకులు మాత్రం ఎర్రగా ఉంటాయి,. ముదురు ఆకులలో లేటేక్స్ ఉంటుంది.

feb41.jpgచెట్టు 8-15 సంవత్సరంలో పూత పూస్తుంది. 60 సంవత్సరాల దాకా పూస్తుంది. మన రాష్టంలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పూస్తాయి. క్రీమ్ రంగులో చిన్న పూలు గుంపులుగా నూగు గల పొడవాటి 5 సెం.మీ ఆకుపచ్చ కాడలతో , కొమ్మల చివర పుష్పిస్తాయి. ఆ పూలు రాత్రి పూసి తెల్లారే సరికి రాలిపోతాయి. పూలు నాలుగు ఎర్రని రక్షక పత్రాలతో , తెలుపు లేక క్రీమ్ రంగు గల 8-9 గుండ్రని రేకులు మందంగా,. రసంతో వేలాడుతూ కనపడతాయి. ఆకర్షణ పత్రాలన్నీ కలిపి కప్పు ఆకారం గల గొట్టం వంటి నిర్మాణం కలిగి ఉంటాయి. పూవు మధ్యలో 24-26 కేసరాలు, చిన్న కేసర దండాలతో, రెండు వరుసలలో, పొడవాటి అండకోశం, వంకర కీలకంతో ఉంటాయి. కీలకం రేకులు బయటకు కనపడుతూ ఉంటుంది.

దక్షిణాన మే, జూన్ నెలలలో ఉత్తర భారతదేశంలో ఆగష్టు,సెప్టెంబరు నెలలలో పూలు కాయలుగా మారుతాయి. మృదు ఫలాలు ఆకుపచ్చ రంగునుండి పండే సమయానికి పసుపు, కాషాయ రంగుకు మారుతాయి. పండులో 2.5-5 సెంమీ పొడవు గల నాలుగు మెరిసే విత్తనాలు ఉంటాయి. పళ్ళకు ఒక విధమైన వెగటు వాసన ఉంటుంది. పూలు రాలటం 15-30 రోజుల వరకు ఉంటుంది. ఆ సమయంలో అటవీ జాతుల వాళ్ళు పూలను పోగు చేయడంలో నిమగ్నమై ఉంటారు. పూలను పల్చగా ఆరబోసి, బాగా ఎండిన తరువాత గోనె సంచులలో ఒక సంవత్సరం వరకు నిల్వ చేస్తారు. ఒక చెట్టునుండి ఒక క్వింటాల్ పూలు వస్తాయి.

కొండజాతులకు ఈ పూల సేకరణ చాలా ముఖ్యమైన వ్యాసంగం. వారి ఆర్ధిక పరిస్ధితి ఈ పూల దిగుబడి పై ఆధారపడి ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లలో ఈ ఇప్పపూల సేకరణకు ప్రాముఖ్యత ఉంది. అభయారణ్యాలలో దాదాపు 50,000 ల చెట్ల వరకు ఉంటాయని అంచనా . సంవత్సరానికి సుమారు 1000 టన్నుల పూలు 10000 టన్నుల కాయలు ఉత్పత్తి అవుతాయి. గోండు కొలను జాతుల వాళ్ళు హోలీ పండుగ జరుపుకున్న తరువాతే ఈ పూల సేకరణ మొదలు పెడాతారు. ఈ పూలు మన జాతీయ వన సంపదకు గుర్తు.

feb38.jpgఈ చెట్టు అన్ని భాగాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పూలు పచ్చిగా కానీ, తింటారు. ఎండిన పళ్లను అత్తి పళ్ళ లాగా బిళ్ళలు చేసి తింటారు. మిఠాయి తయారీలో వాడుతారు. ఎండిన పూలను నీటిలో నానబెట్టి పులిసిన తరువాత డిస్టిల్ చేసి స్పిరిట్ తయారు చేస్తారు. పూల వెగటు వాసన స్పిరిట్ కు కొంత ఉంటుంది. ఇప్పసారా మన దేశంలో చాలా ప్రసిద్ధి.

పక్షులు ఇష్టంగా తినే ఆహారం, దీని పూలు నక్కలు అడవిపంది జింకలు మొదలైన జంతువులు ఈ పూలను చాలా ఇష్టపడతాయి.

ముఖ్యంగా ఎలుగుబంట్లకు వీటిని తిన్న తరువాత కడుపులో పులియడం మొదలు పెడతాయి. ఆ విధంగా ఇప్పసారా దాని కడుపులోనే తయారవుతుంది. ఇక అంటే ఎలుగుబంటు తాగినట్లుగా ప్రవర్తిస్తుంది. ఇప్పపూలు తిన్న పక్షులు కూడా ఎక్కువగా కూస్తాయి అంటారు.

మహావ అనేపేరుతో చత్తీస్ ఘర్, ఒరిస్సా, జార్ఖండ్, ఆంధ్ర ప్రదేశ్ కొండజాతి వాళ్ళు ఇప్ప సారాను పవిత్రంగా వారి సంస్కృతికి గుర్తుగా భావిస్తారు. ఇప్పసారా లేకుండా వీరి పండుగలు ఏవీ జరుగవు. పూలను ఆహారంగా వాడడం సామాన్యం పండు గుజ్జును ఎండబెట్టి పిండిని తయారుచేసి నిల్వ చేసుకుంటారు. గింజల నుండి చిక్కటి నూనె తీస్తారు. ఇది పసుపు రంగులో ఉండి గడ్డకట్టే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఇండియన్ బటర్ ట్రీ అని అంటారు. నూనెను దీపాలకు వంటలలో నెయ్యికి బదులుగా వాడుతారు. ఎక్కువ శాతం నూనె సోపులు, క్రోవ్వోత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. తలనూనెకు, ఆయింట్ మెంట్ తయారికి కూడా ఉపయోగిస్తారు. ఈ నూనె శరీరాన్ని వేడిగా ఉంచి మెరుపునిస్తుంది.

feb39.jpgనూనె తీసిన పిప్పిని పశువుల దాణాగా, పొలాల ఎరువుగా వాడుతారు. సోపోనేన్ అధికంగా ఉండడం వల్ల దీని చేదుకు కీటకాలను నివారించే గుణం వుంది. మైదానాలలో పురుగుల నివారణకు విదేశాలలో మంచి గిరాకి ఉంది. కీళ్ల నొప్పుల నివారణకు గింజల పేస్టును మందు గా వాడతారు కూడా. బెరడు నుండి తీసిన కాషాయం పంటినొప్పుల నివారణకు వాడతారు. ఫైల్స్ , మలబద్ధకం నివారిస్తుంది అని , ఆకులు గజ్జి నివారణలో శ్రేష్టమని, దీని ఔషద గుణాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

feb42.jpgఆకులు ధస్సార్ పట్టు ను ఉత్పత్తి చేసే పురుగులకు ఆహారంగా పనికి వస్తాయి. ఇళ్లలో పెరటిచెట్టు పంటపొలాల గట్టుమీద సరిహద్దులుగా నాటుతారు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. నీరు నిల్వ ఉంటె పెరగదు. రాళ్ళమీద పగుళ్ల మధ్యలోని మట్టిలోనూ పెరుగుతుంది. అందుకని అడవులను పెంచడానికి ఈ మొక్కలను నాటుతారు. కలప కూడా చాలా నాణ్యమైంది. ఎర్రటి మట్టిరంగులో చాలా మన్నిక కలిగి ఉంటుంది. చాలా బరువు కూడా. కిటికీలకు గుమ్మాలకు బండి చక్రాలకు పడవలకు వంతెనలకు సంగీత వాద్యాల తయారికి ఉపయోగపడుతుంది.

అన్నిటికి మించి ఈ మొక్కలు పెంచడం చాలా తేలిక. విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాని అంటు కట్టిన చెట్లు తొందరగా పుట్టుకు వస్తాయి. గింజలు తయారయిన వెంటనే మొలకెత్తుతాయి. వాటికి సుప్తావస్ధ ఉండదు కాబట్టి, పండిన పళ్లను వెంటనే ఎండబెట్టి నూనె తయారికి వాడతారు. 460 వేడిలో కూడా పెరుగుతాయి. వర్షపాతం 550-1500 మి.మీ ఉండే అనుకూలం. 1200మీ. ఎత్తు ప్రాంతాల వరకు తేలిగ్గా పెరుగుతాయి. ఈ వాతావరణం మన రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు మన అడవులలో పెరుగుతుంది.

ఈనెల అంటే ఫిబ్రవరి, వచ్చేనెల మార్చి రెండు నెలలను కలిపి తెలుగులో శిశిర ఋతువు అంటారు. (మాఘ, ఫాల్గుణ మాసాలు) ఈ కాలంలో చెట్లు ఆకులు రాలి చిగురిస్తాయి. చాలా చెట్లు పెరుగుదలకు అనుకూలమైనది. చలి, తేమ తగ్గి అప్పుడప్పుడే పగటి ఉష్ణోగ్రత పెరిగే వాతావరణ లక్షణాలు గల ఫిబ్రవరి నుండి ఎక్కువ శాతం పూలను అందించడం చూస్తాము. సంవత్సరం మొత్తం మీద శిశిర ఋతువు తరువాత వసంత ఋతువులో అధికంగా చెట్లు పూలు పూస్తాయి. ఇప్పచేట్టే కాకుండా మీ ప్రాంతాలలో ఈ నెలలో చాలా రకాల చెట్లు పూలు పూసి ఉంటాయి. అది ఏమిటో ఆసక్తి తో గమనించి కొన్ని రకాల చెట్ల బొమ్మలు ప్రక్కన గమనించండి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate