অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పేపరు పాత్రలో నీటిని మరిగించడం

పేపరు పాత్రలో నీటిని మరిగించడం

dec19ఉద్దేశ్యం: పేపరుతో తయారు చేసిన పాత్రలో నీటిని తీసుకొని పేపరును వేడిచేసి నీటిని మరిగించడం.

కావలసిన సామగ్రి: త్రిపాది స్టాండు, పేపరు, క్లిపులు క్యాండిలు.

ప్రయోగ విధానం: పేపరును పడవ ఆకారంలో పాత్రలాగా తయారు చేసుకొని, క్లిపులు అమర్చాలి. దాని నిండ నీటిని నింపాలి. నీటితో నింపిన పేపరు పాత్రను త్రిపాది స్టాండుపై ఉంచాలి. క్యాండిలు సహాయంతో నీటిని వేడిచేయాలి. పేపరు కాలకుండా నీరు మరగడాన్ని గమనించండి.

పరిశీలనలు: పేపరు కాలకుండా నీరు మరగడానికి గల కారణము పేపరు పాత్ర వేడి చేస్తున్నప్పుడు ఆ ఉష్ణోగ్రతను నీరు స్వీకరిస్తుంది. ఎందుకంటే పేపరుకున్న నీరు మంచి ఉష్ణవాహకము. కాబట్టి నీరు ఉష్ణాన్ని గ్రహిస్తూ 100oC వద్ద మరుగుతుంది.

నీరు మొత్తం మరిగే వరకు పేపరు కాలదు, ఎందుకనగా అది కాలాలంటే 400oC పైచిలుకు ఉష్ణోగ్రత అవసరం. అంటే పేపరుకు ఆ ఉష్ణోగ్రత లభించదు.

ఉపయోగాలు: నీటిని వేడిచేయడానికి పేపరు పాత్రను ఉపయోగించిన ఎక్కువ శక్తి వృధా కాకుండా యుంటుంది. తద్వారా ఇంధనాన్ని పొదుపు చేసుకోవచ్చు.

మీకు తెలుసా? లోహాలు మంచి ఊష్ణ వాహకాలు.

ఆధారం: కె. లక్ష్మారెడ్డి



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate