অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భూమి ఆకారం - బేస్ లైన్ పరిశోధనలు

భూమి ఆకారం - బేస్ లైన్ పరిశోధనలు

347.jpgసత్యాన్వేషణ శాస్త్రం. ఈ అన్వేషణలో అనేక సమస్యలు ఎదురు కావచ్చు ఇవన్నీ సత్యాన్వేషికి అవరోధాలు కావు. విజ్ఞాన శాస్త్ర చరిత్రలో అనేక ఉద్విగ్న భరిత ఘట్టాలున్నాయి. వాటిలో ఒకానొక ఆసక్తికరవివాదాన్ని గురించి తెలుసుకుందాం.

చరిత్రలో బాగా పేరొందిన నౌకాయానాలు కొలంబస్ , మాజిలాన్ లు చేసినవే... అని గొప్పవే అంతకు ఏ మాత్రం తీసిపోని సముద్రయానాలు. భూమి కొలతలని నిర్దారించేందుకు చేసిన సాహసయాత్రలు. అలాంటి రెండు యాత్రలను గురించి తెలుసుకుందాం.

భూమి గోళాకారంగా ఉంది. అనేది గ్రీకుల విశ్వాసం . అయితే ఆ తరువాత కాలంలో ఆధునిక వైజ్ఞానిక యుగ వైతాళికుడుగా పేరు గాంచిన ఐజాక్ న్యూటన్ మాత్రం, గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల భూమి ఖచ్చితంగా గోళాకారంగా ఉండే అవకాశం లేదు. భూమి ధృవాల వద్ద కొద్దిగా నొక్కినట్లుగా, భూమధ్యరేఖ వద్ద కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందని అనుకొనేవాడు. మీ అందరికీ తెలుసుగా న్యూటన్ ఇంగ్లాండు జాతీయుడు. రీనీడకార్డీ ఊహించినట్టుగా ...

348.jpgఅన్నట్లు రీనీ డకార్టీ గురించి మీరు వినే ఉంటారుగా రెండు బిందువులు మధ్య దూరం , వాలు బిందురూపం. అని ఏనేవో సూత్రాలతో మీ స్కూళ్ళలో మీరు కుస్తీ పడుతుంటారే.. దాని పేరేంటీ... వైశ్లేషిక రేఖాగణితం. దాన్ని రూపొందించిన ఘటికుడు. రేఖాగణితాన్ని బీజగణితాన్ని అనుసంధానం చేసిన ప్రజ్ఞాశాలి. ఇతను ఫ్రెంచి దేశస్తుడు. ఈయన భూమిగోళాకారంగా లేదనీ, పై పెచ్చు ఇది రగ్బీ బంతి అంటే పీచు తీయని కొబ్బరికాయ ఆకారంలో ఉంటుందనీ అభిప్రాయపడినాడు.

దీనికి అతడి అనుచరుడు గియోవాని కాసిని మద్దతుపలికాడు. ఈ వివాదం ఆ ఇద్దరు శాస్త్రవేత్తల మధ్య అంతకంటె ఎక్కువగా ఇంగ్లాండు, ఫ్రాన్స్ దేశాల ఆత్మగౌరవానికీ ప్రతిష్టకు చిహ్నంగా మారింది.

ఫ్రెంచి అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఈ వివాదానికి తెరదించాలని నడుం కట్టింది. ఈ రెండింటిలో ఏది సత్యం.... అన్న విషయాన్ని నిర్ధారించడం దానికి అత్యవసరంగా మారింది. వాణిజ్య రీత్యా కూడా ఇది వెంటనే తేలవల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని బట్టి ఆ కాలంలోని మ్యాపులు కూడా సరైనవో కావో తేల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సముద్రయానానికి అయ్యే ఖర్చు కూడా తగ్గించుకునే వీలుంటుంది.

భూమిని ధృవాలకు అతిదగ్గరగానూ, అలాగే భూమధ్య రేఖతి అతిదగ్గరగానూ కొలవడం ద్వారా నిజం తేటతెల్లమవుతుందని ఫ్రెంచ్ అకాడమీ అభిప్రాయపడింది. 1935 వ సంవత్సరంలో చార్లెస్ కాండమిన్ నాయకత్వంలో ఒక బృందం పెరూ, దక్షిణ అమెరికా దేశానికి బయలుదేరింది. సంవత్సరం తర్వాత అంటే 1936 లో మెపార్టీవ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో ఒక బృందం ఉత్తర ధృవానికి అతి దగ్గరలో ఉండే లాప్ లాండ్ ప్రాంతానికి బయలు దేరింది.

ఉత్తర ధృవం వైపుగా బయలుదేరిన బృందం ప్రయాణిస్తున్న ఓడ బాల్టిక్ సముద్రంలో మునిగిపోయింది. చావుతప్పి కన్నులొట్టబడ్డట్లు, ఈ బృందం ప్రాణాలతో బయటపడింది. ధైర్యాన్ని కోల్పోకుండా ఎముకలు కొరికే చలిలో రెయిన్ డీర్ తోళ్ళను కప్పుకొని, అడవి చెర్రీలు, చేపలు తింటూ ముందుకు సాగారు. పొగమంచు, కీటకాలు, అననుకూల వాతావరణ పరిస్థితులు వీళ్ళకి ఒక సవాలుగా మారాయి. అయినా సరే పట్టువీడలేదు. వెనుకంజవేయలేదు. లక్ష్యమే కళ్ళముందు నిలిచింది. ఒక సంవత్సరంపాటు కృషి చేసి 1937 లో ఆ బృందం వెనుదిరిగి వచ్చింది. భూమి ఖచ్చితమైన గోళమూకాదు. రీనీడకార్డీ అభిప్రాయపడ్డట్టు రగ్బీ బంతిలాగానూ లేదని ఆ బృందం నిర్థారించింది.

ఇక 1935 లో పెరూ వైపుగా వెళ్ళిన బృందం సంగతి చూద్దాం. కొలంబియా, పనామాల మీదుగా ప్రయాణం చేసిన బృందం ఇస్తమన్ ను దాటి ఫోర్ట్ ఆప్ మంటూ చేరింది. అక్కడ ఆ బృందం రెండుగా చీలింది. మొదటి ఉప బృందంలో చార్లెస్ లాకాండమిన్ తోబాటు, పియరీ బ్యూగర్ కూడా ఉన్నాడు. ఇతడు డకార్డీ మద్దతుదారుడు. ఈ ఉపబృందం భూమధ్యరేఖ వెంబడి ఉన్న ప్రాంతాన్ని కొలుచుకుంటూ పోయారు. రెండో ఉపబృందం భూమధ్యరేఖ పై ఉన్న ఆండీస్పర్వతశ్రేణులపై ఎత్తయిన ప్రాంతాన్ని కొలిచారు. రెండూ ఉప బృందాలు మళ్ళీ కలిసిపోయాయి.

పొడవైన ఒక కందకం ద్వారా ప్రయాణిస్తూ ముందుకు సాగుతోంది. ఆ బృందం. దట్టమైన అరణ్యాలలో క్రూరమృగాల నుండి తమను తాము కాపాడుకుంటూ సాగిన ఆ పయనం అపూర్వం. సర్వేలో భాగంగా వారుపాతిన పిరమిడ్ ఆకారంలోని రాళ్ళను చూసి అక్కడి నాయకులకు వెన్నులో చలిపుట్టింది. ఎక్కడ ఈ బృందం ఇన్ కాస్ నాగరికతకు చెందిన అపారమైన సాంస్కృతిక సంపదను కొల్లగొట్టుకుపోతుందోనన్న ఆంధోళన వారిని బెంబేలెత్తించింది. మధ్యలో లాకాండమిన్ పెరూ రాజధాని లిమా వెళ్ళి పరిస్థితిని వివరించి వాళ్ళ సహకారం తీసుకున్నాడు. చిట్టచివరి ఆ బృందం బేస్ లైన్ ని విజయవంతంగా నిర్వహించింది. మిట్ట పల్లాలతో కూడిన ప్రాంతాన్ని ఖచ్చితంగా కొలవాలంటే మైదాన ప్రాంతాల్లో లాగా తిన్నని ఒకలైన్ ని ఆధార చేసుకోవాలి. దాన్ని బేస్ లేన్ అంటారు. 1943 మార్చి నాటికి వారి యాత్ర ముగిసింది. లాప్ ల్యాండ్ ని కొలిచిన బృందం కంటె ఎక్కువ సమయం తీసుకున్నా, చాలా నిర్థిష్టంగా శ్రమించారు. ఖచ్చితమైన లెక్కలు సేకరించారు. భూమి భూమధ్యరేఖ వద్ద ఉబ్బెత్తుగా వుందని నిర్థారించారు. న్యూటన్ సిద్థాంతానికీ , పరిశీలనలకీ అనుగుణంగా ఈ నిర్థారణ వుంది.

ఇక్కడ ఓడింది డెకార్డీ కాదు. గెలిచింది న్యూటనూ కాదు. గెలిచింది శాస్త్రం. వాస్తవాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో ఆ బృందం నిగ్గుదేల్చిన విషయం. ఈ విజయం మానవజాతి అందరిదీ, విజ్ఞాన శాస్త్ర కట్టడానికి పునాది.

రచయిత: జీ.శ్రీనివాసులు పటమట

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate