పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రసాయన గడియారం

రంగులేని ద్రావణాలను ఉపయోగించి గడియారం తయారుచేద్దాము.

oct11కెమిస్ట్రీ మేజిక్ ఆసక్తికరంగా సాగుతోంది. మెజీషియన్ సుబ్బు చేస్తున్న మేజిక్ లు విధ్యార్థుల్ని బాగా ఆకర్షిస్తుంది. వీటిల్లో దాగివున్న సైన్స్ రహస్యాలను తెలుసుకున్న ప్రతీసారీ విధ్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతోంది.

వేదిక మీద టేబుల్ ఉంది. A, B, C అని స్టిక్కర్ లు అంటించిన మూడు బీకర్లలో రంగులేని ద్రావణాలున్నాయి. ఒక లీటరు గాజు బీకరు ఖాళీగా ఉంది. స్విచ్ఛ్ బోర్డు ఒకదానికి కరెంటు కనెక్షన్ ఇచ్చి టేబుల్ మీద పెట్టారు. ఒక స్టర్రింగ్ ప్లేటును స్విచ్ బోర్డ్ కలిపినట్టుగా స్పష్టంగా కన్పిస్తుంది. మేజిషియన్ సుబ్బు తన రిస్ట్ వాచ్ ని చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ వేదిక మీదకు వచ్చాడు. మెజిషియన్ ను చూస్తూనే విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు.

మనం టైం తెలుసుకోవడానికి గడియారం (watch) ఉపయోగిస్తున్నాం కదా. ఈ టేబుల్ మీద ఉన్న రంగులేని ద్రావణాలను చూశారు కదా. వీటిని కలిపి నేను ఒక గడియారం తయారుచేస్తాను. అదేమిటో మీరే చూడండి అన్నాడు.

ముందుగా ఖాళీగా ఉన్న లీటరు బీకరును స్టర్రింగ్ ప్లేట్ మీద ఉంచి దానిలో ఒక చిన్న కడ్డీని ఉంచాను. A,B బాకర్లలోని ద్రావణాలను ఖాళీబీకరులో పోసి స్విచ్ బోర్డ్ మీద స్విచ్ ని వేశాడు. బీకరులోని చిన్నకడ్డీ దానితోపాటు ద్రావణం వేగంగా కదలడం ప్రారంభించాయి. ద్రావణం మధ్యన ఒక సుడిగుండం మాదిరిగా ఒక గుంట ఏర్పడింది. ఇప్పుడు బీకరు C లోని ద్రావణాన్ని సుడులు తిరుగుతున్న A,B ద్రావణాల మిశ్రమానికి కలిపాడు. మెజీషియన్ తన చేతిలోని మంత్రదండంలాంటి కర్రను బీకరు చుట్టూ తిప్పి అబ్రకదబ్ర అన్నాడు.

ఆశ్చర్యం, బీకరులోని రంగులేని ద్రావణ మిశ్రమం లేత నారింజ ఎరుపు రంగులోకి మారింది. కొన్ని క్షణాల్లో ముదురు నీలం రంగులోకి మారింది. కొన్ని క్షణాల్లో నీలం రంగుపోయి రంగులేని ద్రావణం ఏర్పడింది. మరి కొన్ని క్షణాల్లో నారింజ ఎరుపురంగు, తర్వాత ముదురు నీలం రంగు ఇలా మళ్ళీ రంగు మార్పులు కన్పించాయి.విధ్యార్థులంతా చప్పట్లు కొట్టారు.

ఈ రంగు మార్పులు మీరంతా చూశారు కదా. ఈ రంగు మార్పుల మధ్య కాలవ్యవధి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఏ రెండు రంగుల మధ్యనైనా మార్పు పదేపదే వస్తున్నప్పుడు ఆ కాలవ్యవధి ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది. అంటే ఒక గడియారం అన్నమాట అన్నాడు మెజిషియన్. ఒకరితర్వాత ఒకరుగా స్టేజిమీదికి వెళ్ళి రంగుమార్పుల్ని దగ్గరగా పరిశీలించారు విధ్యార్థులు. ఆ రోజు మేజిక్ షో ముగిసింది.

విద్యార్థులంగా సైన్స్ టీచర్ లక్ష్మిని చుట్టుముట్టారు. సాకేత్, అనీష్, కార్తిక్, ఆశ్రిత, పవన్, సిస్మిత తో సహా విద్యార్థులంతా ఎన్నో ప్రశ్నలు వేశారు. మేడమ్, మెజీషియన్ ఉపయోగించిన రంగులేని ద్రావణాలేమిటి? రంగుమార్పులు మళ్లీ మళ్లీ ఒకే కాలవ్యవధుల్లో ఎందుకు వస్తున్నాయి? మెజీషియన్ ఏదైనా మంత్రం వేశాడా? ఇలా ఎన్నో ప్రశ్నలతో టీచర్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు.

“ఈ మేజిక్ మీకు బాగా నచ్చినందుకు చాలా సంతోషం. దీన్నే రసాయన గడియారం అంటారు. నిజానికి ఇదొక బాగా పరిచయమైన రసాయన చర్య. ఈ మేజిక్ ను మనం చెయ్యగలం. ఎలాగో చెబుతాను వినండి.“ అంటూ చెప్పింది లక్ష్మీ టీచర్.

ఇందుకు కావలసినవి: పొటాషియం అయోడేట్, మెలోనిక్ ఆమ్లం, మాంగనీస్ సల్ఫేట్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్, కరిగే స్టార్చ్ (విటిక్స్ స్టార్చ్), గాజు బీకర్లు, స్టర్రింగ్ ప్లేట్, అయస్కాంత కడ్డీ, సల్ఫ్యూరిక్ ఆమ్లం.

ముందుగా మూడు రంగులేని ద్రావణాలను తయారు చేసుకోవాలి. వీటిని A, B, C అనుకుందాం. మూడు గాజు బీకర్లకు A, B, C స్టిక్కర్లు అంటించాలి.

ద్రావణం A : 21.5 గ్రా. పొటాషియం అయోడేట్ ను 400 మి.లీ. స్వేదన జలంలో కరిగించాలి. దీనికి 2.5 మి.లీ. సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపి, పొటాషియం అయోడేట్ కరిగిపోయే దాకా గాజుకడ్డీతో కలియబెట్టాలి. స్వేదన జలంతో 500 మి.లీ.కు విలీనం చెయ్యాలి.

ద్రావణం B : 7.8 గ్రా. మెలోనిక్ ఆమ్లం, 1.7 గ్రా. మాంగనీస్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ లను 400 మి.లీ. స్వేదన జలంతో కరిగించాలి. దీనిని 2 గ్రా. కరిగే స్టార్చ్ (vitex starch) కలిపి కరిగేదాకా కలియబెట్టాలి. తర్వాత 500 మి.లీ.కు విలీనం చెయ్యాలి. సాధారణ స్టార్చ్ పౌడరయితే ముందుగా కౌంచెం వేడినీటిలో కరగబెట్టి వాడుకోవాలి.

ద్రావణం C : 200 మి.లీ. 30% హైడ్రోజన్ పెరాక్సైడ్ ను 400 మి.లీ.కు విలీనం చెయ్యాలి.

మెజీషియన్ చేసినట్లుగానే, స్టర్రింగ్ ప్లేట్ మీద ఒక లీటరు గాజు టీకరును ఉంచి, అయస్కాంత లక్షణం ఉన్న స్టర్రింగ్ బార్ ను బీకరులో ఉంచాలి. 300 మి,లీ. ద్రావణం A, 300 ద్రావణం B లను బీకరులో పోసి స్టర్రింగ్ ప్లేట్ స్విచ్ వేయాలి. ద్రావణ మిశ్రమం వేగంగా కదులుతూ ఒక సుడిగుండం ఏర్పడేలా స్పీడ్ ను సరిచేయాలి. ఈ స్థితిలో ద్రావణం C ని కలపాలి. అంటే గడియారం చర్య (clock reaction) అన్నమాట.

“మరి ఈ రంగు మార్పులు ఎందుకు వస్తున్నాయి మేడమ్?“ సాకేత్ ఆత్రంగా అడిగాడు.

“మంచి ప్రశ్న వేశావ్ సాకేత్. “

నిజానికి ఇందులో చాలా చర్యలు ముందుకు వెనక్కు ఉగిసలాడుతూ మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. ఈ చర్యల్లో భాగగా అయోడిన్ ఏర్పడడం వల్ల లేతనారింజ ఎరుపు () వస్తుంది. ఆయెడిన్ గాఢత తగ్గినప్పుడు ఆ రంగు పోతుంది. అయోడైడ్ అయాన్, అయోడిన్ స్టార్చ్ తో బంధించబడినప్పుడు నీలిరంగు వస్తుంది. ఇలా సుమారు 5 నిమిషాల పాటు జరిగిన తర్వాత బీకరులో కొన్ని హైపో స్ఫటికాలు కలిపి అయోడిన్ ను తటస్థీకరించాలి.

ఆధారం: ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం

3.01492537313
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు