অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాగితముతో హెలికాప్టర్

కాగితముతో హెలికాప్టర్

honeకాగితపు హెలికాప్టర్ చేయడమూ, ఎగరెయ్యడమూ కూడా ఎంతో సరదాగా వుంటాయి. ఇందుకు మీరు చేయాల్సిందేమిటంటే ....

 

htwoముందుగా ఒకపాత పోస్టుకార్డుని గాని, లేదా ఓ దళసరి కాగితాన్ని గాని తీసుకోండి. దానిలో సుమారు 3 సెంటీమీటర్లు వెడల్పుతో వుండే ఒక పొడవాటి ముక్కను కత్తిరించుకోండి.

 

hthreeఇప్పుడు పటం నెంబర్ - 3 లో చూపిన విధంగా చుక్కల గీతల వెంబడి కార్డుని కత్తిరించండి. అయితే ఇలా కత్తిరించేటప్పుడు కార్డు ఈ చివరి నుంచి ఆ చివరకు పూర్తిగా కాకుండా. మొత్తం పొడవులో కేవలం మూడింట రెండు వంతుల భాగాన్ని మాత్రమే కత్తిరించవలసి వుంటుంది. ఒక చుక్కల గీత వెంబడి ఈ వైపు నుంచి కత్తిరిస్తే, రెండో గీత వెంబడి ఆ (వెడల్పుగా ఉన్న ) వైపు నుంచి కత్తిరించాల్ని వుంటుంది. ఇప్పుడు పటం నెంబర్ - 4 లో చూపించిన ఆకారం వస్తుంది.

hfourఇక ఇప్పుడు పటం నెంబర్లు, 4,5,6 లలో చూపిన విధంగా కార్డు ముక్కల రెండు అంచులనీ ఈ చేతివేళ్ళతో పట్టుకొని వాటిని ఒక చోటికి చేర్చి, ఓ చిన్న పేపర్ క్లిప్పుతో (జమ్ క్లిప్) వాటిని కలపండి. ఒకవేళ పేపరు క్లిప్పు లేకపోతే, మెత్తని పిండిముద్ద కొంచెం తీసుకుని దాని సాయంతో అతికించండి.

hfiveఈ అంచుల్ని గమ్ముతో (జిగురుతో) అతికించకూడదు అన్న విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తించవలసి వుంటుంది. ఎందుకంటే... మీ హెలికాప్టర్ కి కింది భాగంలో కొంచెం కొంచెం బరువుండాలి. అందుకే పేపరు క్లిప్పునిగాని, పిండిని గాని వాడమని చెప్పడం. ఈ బరువు కారణంగా అది గాల్ల కిందికి పడేటప్పుడు సక్రమంగా వుంటుంది. అదీ అసలు విషయం. అర్థమయ్యిందిగా.hsix

ఇలా తయారు చేసిన హెలికాప్టర్ ని ఓ ఎతైన ప్రదేశం నుంచి కిందికి వదిలి చూడండి. అది ఎంతో అందంగా, గిరగిరా తిరుగుతూ కిందికి దిగుతుంది. చూడ్డానికి ఇది భలే సరదాగా వుంటుంది. అసలు విషయం తెలిసిందిగా... ఇక వెంటనే ఓ పోస్టుకార్డు తీసుకుని మీ సొంత హెలికాప్టర్ తయారు చేసుకొండి. ఆల్ ది బెస్ట్.....hseven



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate